Shuru
Apke Nagar Ki App…
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి, పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,700, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర, నాన్ ఏసీ మిర్చి ధర, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని వ్యాపారులు తెలిపారు.
Suresh Kumar
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి, పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,700, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర, నాన్ ఏసీ మిర్చి ధర, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని వ్యాపారులు తెలిపారు.
More news from తెలంగాణ and nearby areas
- ఖమ్మంలో బీఆర్ఎస్ ధర్నా.. కాంగ్రెస్ ప్రభుత్వంపై పువ్వాడ అజయ్ ఫైర్ ఖమ్మం జడ్పీ సెంటర్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ అంటేనే దగా, మోసం అని ఆరోపించిన ఆయన.. కేసీఆర్ ముందే కాంగ్రెస్ వస్తే మోసపోవడం ఖాయమని గతంలో చెప్పారని గుర్తుచేశారు. వాయిస్ ఓవర్: వ్యవసాయాన్ని పండుగ చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ అనేక సంస్కరణలు తీసుకొచ్చారని పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అరకొరగా అమలు చేస్తోందని, రైతు రుణమాఫీ కూడా సక్రమంగా చేయలేదని విమర్శించారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతున్నారని.. రైతాంగం పరిస్థితి ఆందోళనకరంగా మారిందని అన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక ఇబ్బందులు పడుతున్నారని, గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు. మహిళలు, విద్యార్థులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు కూడా న్యాయం చేయకుండా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఘోరంగా విఫలమైందని ఆరోపించిన పువ్వాడ.. కాంగ్రెస్ నేతలు భూ కబ్జాలు, భూ దోపిడీలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో గతంలో ఒక్క మంత్రిగా చేసిన పనులను ప్రస్తుతం ముగ్గురు మంత్రులు ఉండి కూడా చేయలేకపోతున్నారని అన్నారు. సీతారామ ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని, ప్రస్తుత ప్రభుత్వం కనీస నిర్వహణపై కూడా దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. అలాగే ఖమ్మం జర్నలిస్టులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన 23 ఎకరాల భూమిని జర్నలిస్టులకు కేటాయించాలని డిమాండ్ చేశారు.కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావడం ఖాయమని, తెలంగాణలో రామరాజ్యం రావడం పక్కా అని పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఖమ్మం జడ్పీ సెంటర్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ ధర్నాలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో స్థిరంగా కొనసాగుతున్న మిర్చి, పత్తి ధరలు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.22,700, నాన్ ఏసీ మిర్చి ధర రూ.16,500, అటు క్వింటా పత్తి ధర రూ.9,250గా జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటితో పోల్చితే ఏసీ మిర్చి ధర, నాన్ ఏసీ మిర్చి ధర, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయని వ్యాపారులు తెలిపారు.1
- టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతులుపంటలకు నీటిని విడుదల చేయాలని రాస్తారోకో. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ వద్ద ఈరోజు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రైతు ధర్నాను టిఆర్ఎస్ శ్రేణులు రైతులు విజయవంతంగా నిర్వహించారు. సందర్భంగా పాలేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే కందల ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పాలేరు నీటిని తక్షణమే పాలేరు ఆయకట్ట కింద ఉన్న రైతులకు పంట పొలాలకు ఆరుతరులు పంట నిమిత్తమైన అందించాలని శాంతియుత రాస్తారోకోలు చేసినారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని లేని ఇంకా ఉధృతం చేస్తామని రైతులు టిఆర్ఎస్ నాయకులు గట్టిగా హెచ్చరికలు చేసినారు. ఈ కార్యక్రమంలో పాలేరు నియోజకవర్గంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. రైతులు స్వచ్ఛందంగా పాల్గొనినరు.ఈ కార్యక్రమంలో రైతులు ప్రభుత్వంపై విమర్శలతో కూడిన ఫ్లాకార్డులు ప్రదర్శించారు. తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నవాళ్లను తుడిచి వేయడమే లక్ష్యంమా, రైతులను మళ్లీ కూలీలుగా మారుస్తారా అంటూ నేతలు నినాదాలు చేశారు.1
- 1000 రోజులైనా ప్రజా సంక్షేమం శూన్యం:మాజీ MLA కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. పాలేరు రిజర్వాయర్ వద్ద బీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడుతూ.. 100 రోజుల్లో హామీలంటూ ఓట్ల నాటకాలాడారని మండిపడ్డారు. తన తుది శ్వాస వరకు పాలేరు ప్రజల కోసమే జీవిస్తానన్నారు. ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి హామీలు నెరవేర్చకపోతే పాలేరు గడ్డపై పెద్ద ఎత్తున ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.1
- పాలేరు లో కాంగ్రెస్1000 రోజుల వైఫల్య పాలన పై BRS పార్టీ ఏర్పాటు చేసిన సమరభేరీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు లో కాంగ్రెస్1000 రోజుల వైఫల్య పాలన పై BRS పార్టీ ఏర్పాటు చేసిన సమరభేరీ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 1000 రోజులైనా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు.ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేవరకు పోరాటం చేస్తామని ఆయన అన్నారు.పాలేరు రిజర్వాయర్ లో నీళ్లను ఇక్కడ రైతులకు సాగు నీటి కోసం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.త్రాగునీటి కోసం మరోసారి సాగర్ నుంచి నీరు విడుదల చేయాలని ఆయన అన్నారు.ఒక్క పంటకైనా నీరు ఇవ్వకుండా రైతులను అన్యాయం చేయొద్దన్నారు. పాలేరు ప్రజలు మరొకసారి మోసపోవద్దని ఎవరికి అన్యాయం జరిగినా ముందుండి పోరాటం చేస్తానని ఆయన తెలిపారు1
- తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు.. తిర్రి పనులు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రేవంత్ రెడ్డి GO.97 తో పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను నాశనం చేయడం తగదు.. విద్యార్థులు కన్నీళ్లు పెడుతున్నరు..ఇది మంచిది కాదు ఈ పిచ్చి పని బంద్ చేయాలి...GO.97 వెంటనే ఉపసంహరించుకోవాలే *_ టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్*1
- తొలగించాడు.. పోలీసుల ముందు నివాళులర్పించాడు! రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం తొలగింపుపై కాంగ్రెస్ ఆగ్రహం.. పోలీసుల జోక్యంతో వివాదానికి తెర రాజశేఖర్‌రెడ్డి చిత్రపటం తొలగింపుతో దంతాలపల్లిలో ఉద్రిక్తత మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా దంతాలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకున్న ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన రాజశేఖర్‌రెడ్డి చిత్రపటాన్ని మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి తొలగించడంతో ఉద్రిక్తత నెలకొంది. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని కాంగ్రెస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం వద్ద ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి నివాళులర్పించారు. అయితే కొద్దిసేపటికే మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి ఆ చిత్రపటాన్ని తొలగించినట్లు కాంగ్రెస్ నాయకుల దృష్టికి వచ్చింది. దీంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పందించి సదరు వ్యక్తిని తీసుకువచ్చారు. కాంగ్రెస్ నాయకుల డిమాండ్ మేరకు తొలగించిన చిత్రపటాన్ని తిరిగి అదే ప్రదేశంలో ఏర్పాటు చేయించి, అతని చేతుల మీదుగా రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి నివాళులు అర్పించించారు. దీంతో కొంతసేపు నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి.చిత్రపటం తొలగింపు ఘటనపై కాంగ్రెస్ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో పోలీసులు చొరవ తీసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. చిత్రపటం తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు సదరు వ్యక్తితోనే నివాళులు అర్పించడంతో కాంగ్రెస్ నాయకులు శాంతించారు. ఈ ఘటన మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.4
- 2 రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నేలకొండపల్లి వాసులకు వర్షం ఉపశమనం అందించింది 2 రోజులుగా ఎండలతో అల్లాడుతున్న నేలకొండపల్లి వాసులకు వర్షం ఉపశమనం అందించింది.తెల్లవారుజామున పైనంపల్లి, తదితర గ్రామాల్లో అరగంట పాటు వర్షం కురవడంతో వాతావరణం చల్లబడింది. ఉన్నట్టుండి పడిన ఈ వర్షం పంట పొలాలకు ఊపిరిపోసి ప్రాణం పోసిందని, వర్షాభావ పరిస్థితుల నుంచి పైర్లను కాపాడుతుందని రైతులు హర్షం వ్యక్తం చేశారు.1