రూ. 2.30 కోట్లతో అభివృద్ధి అభి వృద్ధి దశ లో అమ్రాబాద్ మండలం అమ్రాబాద్‌లో రోడ్డు విస్తరణ పనుల పరిశీలన పండుగల నాటికి పనులు పూర్తి చేయాలి – ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ అచ్చంపేట, జనవరి 13,(షురూ ఆప్ న్యూస్ ప్రతినిధి): నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజక వర్గం లోని అమ్రాబాద్ మండల కేంద్రంలోని రోడ్డు విస్తరణ అభివృద్ధి పనులను అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు. వంశీకృష్ణ పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకున్న ఆయన, సంబంధిత కాంట్రాక్టర్‌కు త్వరగా చేయాలని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో రంగాపూర్ గంధోత్సవం, శ్రీ ఉమామహేశ్వరం ప్రభ కార్యక్రమం నిర్వహించనున్న నేపథ్యంలో రోడ్డు పనులను శరవేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పనులు పూర్తి చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రజాపాలన లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని అమ్రాబాద్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో రోడ్డు విస్తరణ పనుల కోసం రూ. 2 కోట్ల 30 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో అమ్రాబాద్ గ్రామపంచాయతీని సుందరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అభివృద్ధి పనుల్లో ఎలాంటి అవకతవకలు సహించేది లేదని స్పష్టం చేసిన ఎమ్మెల్యే , పనుల నాణ్యతపై రాజీ పడకుండా ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. త్వరలోనే అమ్రాబాద్ రూపురేఖలు పూర్తిగా మారుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ఉపాధ్యక్షులు, డీసీసీ అధ్యక్షులు అయిన డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారితో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- నల్గొండ జిల్లా చిట్యాల సమీపంలో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో వాహనాలు కిలోమీటర్ల మేర నత్త నడిపిన కదులుతున్నాయి. చిట్యాల నుంచి వెలిమినేడు సర్వీస్ రోడ్డు నుంచి వాహనాలు వెళుతుండడంతో దాదాపు 6,7 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో స్థానిక వాహనదారులతో పాటు విజయవాడ వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ నియంత్రించడంలో జిల్లా అధికార యంత్రం వైఫల్యం చెందిందని వాహనదారులు ఆరోపిస్తున్నారు.1
- కొత్తపల్లి: అల్లుకున్న నిర్లక్ష్యం నల్గొండ: నల్గొండ మండలం కొత్తపల్లిలోని శివాలయం సమీపంలోని నియంత్రిక, స్తంభంతో పాటు విద్యుత్ తీగలకు పిచ్చి చెట్లు, తీగ జాతి మొక్కలు అల్లుకొని ఉన్నాయి. గృహ విద్యుత్ అవసరాల కోసం ఏర్పాటు చేసిన నియంత్రికకు పిచ్చి మొక్కలు అల్లుకొని ఉండటంతో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని స్థానికులు చెబుతున్నారు. ఏదైనా ప్రమాదాలు జరగకముందే సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.1
- *సీఎం రేవంత్ రెడ్డి,కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తన అభిమానాన్ని చాటుకున్న ఫిషరీస్ కార్పోరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్* *కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ,సీఎం రేవంత్ రెడ్డి,పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఫోటోలతో కూడిన ప్రత్యేకంగా పతంగులను తయారు చేయించిన మెట్టు సాయి కుమార్* *సంక్రాంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రత్యక్ష ఆకర్షణీయంగా మారిన పతంగులు* *గతంలోను కాంగ్రెస్ సంక్షేమ పధకాలను ప్రజలకు తెలియచేసే విధంగా రైజింగ్ తెలంగాణ పేరుతో వినూత్న కార్యక్రమాలు చేసిన మెట్టు సాయి కుమార్* *మెట్టు సాయి కుమార్ ను అభినందించిన పలువురు కాంగ్రెస్ నేతలు,కార్యకర్తలు*3
- మాజీ ముఖ్యమంత్రి జగన్ పై మండిపడ్డ మంత్రి సవితమ్మ1
- Post by Paramesh Ratnagiri1
- ట్రాఫిక్ సిఐ గారి ఆధ్వర్యంలో ఈరోజు వైఎంఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన క్షేమంగా వెళ్లి క్షేమంగా రండి అనే కార్యక్రమంలో యువజన సంఘాల అధ్యక్షుడు డాక్టర్ కోనవేణు గారు ప్రసంగిస్తూ యువతను నిర్దేశించి మాట్లాడడం జరిగింది వాహనాలు స్పీడ్గా డ్రైవ్ చేసి ప్రమాదాల బారిన పడకుండా కిక్కు కోసం యువత ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం వల్ల ఆ కిక్కు దేవుడరు గాని యమధర్మరాజు ఆ యువతను బుక్కు చేసేటువంటి పరిస్థితి ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ట్రాఫిక్ సిఐ రామకృష్ణ గారు రామకృష్ణారెడ్డి సిఐ రమేష్ గారు డాక్టర్ వికాస్ SI సాయిలు ఆర్టీవో నెంబర్ తహర్ పాషా గారు శ్రీ నికిత సౌజన్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు1
- కర్నూలు జిల్లాలో మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కు తప్పిన పెను ప్రమాదం ఎక్కడో తెలవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి..!2
- రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరిని మోసం చేస్తూ కాలయాపన చేస్తుందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం చండూరు పర్యటనలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని రేవంత్ రెడ్డి పరిపాలించడం లేదని చంద్రబాబునాయుడు చేతిలో రాష్ట్రాన్ని పెట్టాడని ధ్వజమెత్తారు. డిపిఆర్లు వాపస్ వచ్చిన అడిగే నాధుడే కరువయ్యారని అన్నారు. ప్రజలందరూ మున్సిపల్ ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలని ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలని కోరారు. ఆయనతోపాటు బిఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.1