పిఠాపురానికి చేరుకున్న 'దండి మార్చ్ 2.0' సైకిల్ యాత్ర _ పిఠాపురం, ఏప్రిల్ 19 : మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యంగా 'వైబ్రేంట్స్ ఆఫ్ కలాం' సంస్థ చేపట్టిన 1000 కిలోమీటర్ల భారీ సైకిల్ యాత్ర ఆదివారం పిఠాపురం చేరుకుంది. 'దండి మార్చ్ 2.0' పేరుతో తిరుపతిలో ప్రారంభమైన ఈ యాత్ర, 13వ రోజున స్థానిక రాజకీయ నాయకులను, ప్రజలను కలుసుకుని డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించింది. *డ్రగ్స్ వద్దు.. జీవితం ముద్దు* ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైబ్రేంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ కలాం మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం వల్ల వ్యక్తిగత జీవితాలే కాకుండా కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. "డ్రగ్స్ వద్దు - జీవితం ముద్దు", "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదాలతో యువతలో మార్పు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి నుండి విశాఖపట్నం వరకు కొనసాగే ఈ 1000 కిలోమీటర్ల యాత్రలో భాగంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు విజయ కలాం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని, దానికి యువత అంతా నడుం బిగించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ బొందల రామలక్ష్మి శ్రీనివాస్, కాకినాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ మల్లుల వీరు, వైబ్రేంట్స్ ఆఫ్ కలాం టీమ్ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
పిఠాపురానికి చేరుకున్న 'దండి మార్చ్ 2.0' సైకిల్ యాత్ర _ పిఠాపురం, ఏప్రిల్ 19 : మాదకద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యంగా 'వైబ్రేంట్స్ ఆఫ్ కలాం' సంస్థ చేపట్టిన 1000 కిలోమీటర్ల భారీ సైకిల్ యాత్ర ఆదివారం పిఠాపురం చేరుకుంది. 'దండి మార్చ్ 2.0' పేరుతో తిరుపతిలో ప్రారంభమైన ఈ యాత్ర, 13వ రోజున స్థానిక రాజకీయ నాయకులను, ప్రజలను కలుసుకుని డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన కల్పించింది. *డ్రగ్స్ వద్దు.. జీవితం ముద్దు* ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వైబ్రేంట్స్ ఆఫ్ కలాం ఫౌండర్ విజయ కలాం మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం వల్ల వ్యక్తిగత జీవితాలే కాకుండా కుటుంబాలు చిన్నాభిన్నమవుతాయని ఆవేదన వ్యక్తం
చేశారు. "డ్రగ్స్ వద్దు - జీవితం ముద్దు", "డ్రగ్స్ వద్దు బ్రో" అనే నినాదాలతో యువతలో మార్పు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతి నుండి విశాఖపట్నం వరకు కొనసాగే ఈ 1000 కిలోమీటర్ల యాత్రలో భాగంగా విద్యార్థులకు దిశానిర్దేశం చేస్తున్నట్లు విజయ కలాం తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారని, దానికి యువత అంతా నడుం బిగించి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ బొందల రామలక్ష్మి శ్రీనివాస్, కాకినాడ నియోజకవర్గ కోఆర్డినేటర్ మల్లుల వీరు, వైబ్రేంట్స్ ఆఫ్ కలాం టీమ్ సభ్యులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- 🙏😭1
- 🙏😭1
- Post by Shyam1
- ఫుల్ డీటెయిల్స్ వీడియో కోసం నా యూట్యూబ్ ఛానల్ లో వుంది.must watch 👆👆 id:cryancreations51911
- డుంబ్రిగూడ: మండలంలోని గుంటసీమకు వెళ్లే ప్రధాన రహదారి అంచులు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ వందలాది వాహనాలు ఈ రహదారిపై ప్రయాణిస్తున్నప్పటికీ, ఎక్కడికక్కడ అంచులు కూలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. ప్రత్యేకంగా రాత్రి వేళల్లో పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతోందని వాహనదారులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిని తక్షణమే మరమ్మతులు చేయాలని ప్రజలు కోరుతున్నారు.1
- So light… it floats down! 🪂 Experience feather-light comfort with MGM Vests. #MGMVests #FeatherLight #MensWear #InnerwearIndia #ComfortWear1
- Post by Ramprasad islavath1
- 😭🙏1