Shuru
Apke Nagar Ki App…
పరకాలలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులపై ఎమ్మెల్యే సమీక్ష హన్మకొండ జిల్లా:పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో కొనసాగుతున్నాయా అనే విషయంపై ప్రత్యేకంగా ఆరా తీసిన ఆయన, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రజలకు త్వరగా వైద్య సేవలు అందేలా పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఆసుపత్రి పూర్తి అయితే పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు
M D Azizuddin
పరకాలలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులపై ఎమ్మెల్యే సమీక్ష హన్మకొండ జిల్లా:పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో కొనసాగుతున్నాయా అనే విషయంపై ప్రత్యేకంగా ఆరా తీసిన ఆయన, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రజలకు త్వరగా వైద్య సేవలు అందేలా పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఆసుపత్రి పూర్తి అయితే పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ జిల్లా:పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో కొనసాగుతున్నాయా అనే విషయంపై ప్రత్యేకంగా ఆరా తీసిన ఆయన, ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా ప్రమాణాలకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. అలాగే ప్రజలకు త్వరగా వైద్య సేవలు అందేలా పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ ఆసుపత్రి పూర్తి అయితే పరిసర ప్రాంతాల ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు1
- శాసన మండలిలో సొంత ప్రభుత్వంపై మండిపడ్డ ఎమ్మెల్సీ విజయ శాంతి ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారి కుటుంబాలలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం, నెలకు అమరవీరుల గౌరవ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చాం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది.. ఉద్యమకారులకు ఇంకా ఒక్క హామీ నెరవేర్చలేదు మాకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఉద్యమకారులు అడుగుతున్నారు. జూన్ 2న తెలంగాణ ఉద్యమకారులుగా ప్రభుత్వ గుర్తింపు కార్డు ఇస్తామని హామీ ఇచ్చాం అది ఇంకా ఇవ్వలేదు ఉద్యమకారులకు ఇచ్చిన వాగ్దానాలు వెంటనే నెరవేర్చాలి - కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి1
- కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయంలో అపశృతి ఆలయం వద్ద వేసిన చలువ పందిరి కూలి 15 మంది భక్తులకు తీవ్ర గాయాలు హనుమాన్ విజయోత్సవ దినం కోసం తరలివచ్చిన భక్తులు నాసిరకంగా ఏర్పాట్లు చేయడం వల్లనే ఈ దుర్ఘటన జరిగిందని భక్తుల ఆగ్రహం1
- 4,000 కిలోగ్రాములకు పైగా కల్తీ పేస్ట్ మరియు 6,000 కిలోగ్రాముల ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. హసన్ అలీ (55) అనే వ్యక్తిని టాస్క్ ఫోర్స్ మరియు హెచ్-ఫాస్ట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఉత్పత్తి కేంద్రం అత్యంత అపరిశుభ్రంగా ఉందని నివేదించబడటంతో, దుకాణాల్లో అమ్మే పేస్ట్‌ను కొనుగోలు చేయడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు••£1
- జగిత్యాల జిల్లా మెట్ పల్లి లో కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. వాసవి గార్డెన్ సమీపంలో కుక్కల దాడితో ముగ్గురు గాయపడ్డారు. కుక్కల బెడద తో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన పరువురిని గాయపరచడం తీవ్ర కలకలం రేపుతోంది. ఉదయం ఆడుకుంటున్న ఓ బాలుడి పై దాడి చేసిన కుక్కలు.. మధ్యాహ్నం సమయంలో అదే బాధితుడి తాత పై దాడి చేసి గాయపరిచింది. ఆ బాలుడిని నెల రోజుల్లో కుక్కలు కరవడం రెండోసారి. అక్కడితో ఆగకుండా, మరో చిన్నారిని, అతని కుటుంబీకులను కూడా కుక్కలు వేటాడి కరిచాయి. వరుస ఘటనలు జరుగుతున్నా మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని దక్షిణ కాశిగా పేరుగాంచిన తెలంగాణ అతిపెద్ద దేవాలయం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం నూతన డీఈఓగా భాస్కర్ బాధ్యతలు స్వీకరించారు.దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాజన్న ఆలయంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత స్వామి వారి మండపంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వారికి ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో రమాదేవి స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఉద్యోగులు, అర్చకులు, వేద పండితులు పాల్గొన్నారు.1
- కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల స్థానంలో తీసుకువచ్చిన నాలుగు నూతన లేబర్ కోడ్ లను నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న బ్లాక్ డే పిలుపులో భాగంగా సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఇల్లందు బంగ్లోస్ వద్ద కాంట్రాక్ట్ కార్మికులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా నల్ల బ్యాడ్జీలను ధరించి లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా, నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ కొత్తగూడెం రీజియన్ కార్యదర్శి యర్రగాని కృష్ణయ్య, టియుసిఐ నాయకులు పి సతీష్ లు మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం అత్యంత నియంతృత్వ పరిపాలన సాగుతున్నదని విమర్శించారు.ఎన్నో త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చివేసి పెట్టుబడిదారీ వర్గానికి అనుకూలంగా, విదేశీ బహుళ జాతి సంస్థలకు ఉపయోగపడే నాలుగు లేబర్ కోడులను 2019 నుంచి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకిస్తూ పోరాడుతూ వస్తున్నప్పటికీ ఈ రోజు నుండి అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం అత్యంత దుర్మార్గమైన చర్య అని విమర్శించారు.ఈ నాలుగు లేబర్ కోడ్ లు వల్ల పని గంటలు పెరుగుతాయని,ఉద్యోగ భద్రత ఉండదని, వేతనాల చెల్లింపుకు గ్యారెంటీ ఉండదని అన్నారు. కార్మిక సంఘాలను, సమస్యల పరిష్కారానికి పోరాడే హక్కులను పరిమితం చేయడమే ఈ లేబర్ కోడల ఉద్దేశమని అన్నారు.ఈ నేపథ్యంలో కార్మిక వర్గం మరింత సంఘటితంగా పోరాడే తమ హక్కులను కాపాడుకోవడమే ఏకైక మార్గమని పిలుపునిచ్చారు.1
- హన్మకొండ జిల్లా కాజీపేట బాపూజీ నగర్‌లోని కారుణ్య క్లీనిక్ సమీపంలో గొలుసు దొంగతనం జరిగింది. పని ముగించుకొని ఇంటికి వెళ్తున్న మహిళపై బైక్‌పై వచ్చిన గుర్తు తెలియని దుండగులు దాడి చేసి, ఆమె మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దుండగుల కోసం గాలిస్తున్నారు.3