logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ సందర్భంగా, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ విజయ్ ప్రకాశ్ మానవత్వం చాటుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో గాయపడటంతో కౌన్సిలింగ్ కోసం చాంబర్ లోపలికి వెళ్లలేని స్థితిలో బయట వేచి ఉన్న విద్యార్థినులు తేజస్విని, మణిల పరిస్థితిని తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ విజయ్ ప్రకాశ్ స్వయంగా వారి వద్దకు వెళ్లి అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీలను అందజేశారు. ఈ మానవతాపూర్వక చర్యకు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వారికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

4 hrs ago
user_LAKKU SIVA SANKAR reddy
LAKKU SIVA SANKAR reddy
Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
4 hrs ago
ade5e65e-14f3-4183-97e6-07178e461ac5

వేంపల్లి మండలం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో జరుగుతున్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ అడ్మిషన్ల ప్రక్రియ సందర్భంగా, ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ విజయ్ ప్రకాశ్ మానవత్వం చాటుకున్నారు. ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో గాయపడటంతో కౌన్సిలింగ్ కోసం చాంబర్ లోపలికి వెళ్లలేని స్థితిలో బయట వేచి ఉన్న విద్యార్థినులు తేజస్విని, మణిల పరిస్థితిని తెలుసుకున్నారు. విషయం తెలుసుకున్న డైరెక్టర్ విజయ్ ప్రకాశ్ స్వయంగా వారి వద్దకు వెళ్లి అలాట్‌మెంట్ ఆర్డర్ కాపీలను అందజేశారు. ఈ మానవతాపూర్వక చర్యకు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ వారికి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • బద్వేలు నియోజకవర్గంలోని బి. కోడూరు మండల తాసిల్దార్ కార్యాలయం భూ ఆక్రమణలకు, అవినీతికి చిరునామాగా మారిందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్. చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలో మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం తమ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే. జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, ఇతర బృంద సభ్యులతో కలిసి ప్రస్తుత తాసిల్దార్ రమణమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ, బద్వేలు-పోరుమామిళ్ల ప్రధాన రహదారికి ఇరువైపులా దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ఉన్న సుమారు 200 ఎకరాల ఫ్రీహోల్డ్, ప్రభుత్వ భూములను అక్రమంగా పొంది, బినామీ పేర్లతో ఆన్‌లైన్ చేయించుకుని పండ్ల తోటలు వేసి ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. కాసానగరం, వేమకుంట ప్రాంతాలలోని గయాల భూములను సైతం కాజేశారని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సుమారు 20 ఎకరాలకు పైగా ఏటి పోరంబోకు భూమిని రైస్ మిల్ యజమాని బసిరెడ్డి దుగ్గిరెడ్డి ఆక్రమించి పట్టపగలే చదును చేస్తుంటే రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నారా లేక కబ్జాదారులు అందించిన ముడుపుల మత్తులో మునిగి తేలుతున్నారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు. కామకుంట గ్రామ పొలం సర్వే నంబర్లు 160, 170, 171, 202లో రిటైర్డ్ రేంజర్ ఓబుల్ రెడ్డికి 25 ఎకరాల రిజిస్టర్ భూమి ఉండగా, మరో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కంచి వేశాడని ఆరోపించారు. అలాగే సర్వే నంబర్ 218లో 20 ఎకరాలు రాజశేఖర్ రెడ్డి, 202లో 12 ఎకరాలు తిరుపతిరెడ్డి లక్ష్మయ్య, 95, 96లో గోపవరంకు చెందిన గంగిరెడ్డి, 12, 13లో బోర్ రామ సుబ్బారెడ్డి 15 ఎకరాలు, 17లో యోగానంద రెడ్డి, మరియు మున్నెల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 1641లో 18 ఎకరాల ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో అక్రమంగా ఆన్‌లైన్‌లో చేయించుకొని కొంతమంది అమ్ముకుని కోట్లాది రూపాయలు సొమ్ము చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ఆక్రమణల పరంపర అంతా గత ఇన్చార్జి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు. ఈ ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేయించి, దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భూములు రీ-సర్వే చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులు, వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆ భూములను నిజమైన అర్హులైన పేదలకు పంచాలని కోరారు. అలాగే, కాసానగరంలో మోడల్ స్కూల్‌కు కేటాయించిన 5 ఎకరాలు, వసతి గృహానికి కేటాయించిన ఎకరం స్థలంలో ఎస్సీ బాలుర భవన నిర్మాణాలకు తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి పేదలకు ఆ భూములు అందేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున అర్హులతో కూడిన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఎస్. చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, మండల కమిటీ సభ్యులు వెంకట్రామయ్య, మోషే, పుల్లయ్య, బాబు, వెంకటయ్య, వెంగయ్య మరియు విప్లవ యువజన సంఘం (RYA) నాయకులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
    1
    బద్వేలు నియోజకవర్గంలోని బి. కోడూరు మండల తాసిల్దార్ కార్యాలయం భూ ఆక్రమణలకు, అవినీతికి చిరునామాగా మారిందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యులు ఎస్. చంద్రశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. గత తాసిల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలో మండలంలో వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురయ్యాయని, దీనిపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరిపి కబ్జాదారుల చేతుల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకుని అర్హులైన పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. సోమవారం ఉదయం తమ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కే. జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, ఇతర బృంద సభ్యులతో కలిసి ప్రస్తుత తాసిల్దార్ రమణమ్మకు వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఎస్. చంద్రశేఖర్ మాట్లాడుతూ, బద్వేలు-పోరుమామిళ్ల ప్రధాన రహదారికి ఇరువైపులా దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ఉన్న సుమారు 200 ఎకరాల ఫ్రీహోల్డ్, ప్రభుత్వ భూములను అక్రమంగా పొంది, బినామీ పేర్లతో ఆన్‌లైన్ చేయించుకుని పండ్ల తోటలు వేసి ఫామ్‌హౌస్‌లు నిర్మించుకున్నారని ఆరోపించారు. కాసానగరం, వేమకుంట ప్రాంతాలలోని గయాల భూములను సైతం కాజేశారని పేర్కొన్నారు. రెవెన్యూ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే సుమారు 20 ఎకరాలకు పైగా ఏటి పోరంబోకు భూమిని రైస్ మిల్ యజమాని బసిరెడ్డి దుగ్గిరెడ్డి ఆక్రమించి పట్టపగలే చదును చేస్తుంటే రెవెన్యూ అధికారులు కళ్ళు మూసుకున్నారా లేక కబ్జాదారులు అందించిన ముడుపుల మత్తులో మునిగి తేలుతున్నారా అని ఆయన ఘాటుగా ప్రశ్నించారు.

కామకుంట గ్రామ పొలం సర్వే నంబర్లు 160, 170, 171, 202లో రిటైర్డ్ రేంజర్ ఓబుల్ రెడ్డికి 25 ఎకరాల రిజిస్టర్ భూమి ఉండగా, మరో 15 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించి కంచి వేశాడని ఆరోపించారు. అలాగే సర్వే నంబర్ 218లో 20 ఎకరాలు రాజశేఖర్ రెడ్డి, 202లో 12 ఎకరాలు తిరుపతిరెడ్డి లక్ష్మయ్య, 95, 96లో గోపవరంకు చెందిన గంగిరెడ్డి, 12, 13లో బోర్ రామ సుబ్బారెడ్డి 15 ఎకరాలు, 17లో యోగానంద రెడ్డి, మరియు మున్నెల్లి గ్రామ పొలం సర్వే నంబర్ 1641లో 18 ఎకరాల ప్రభుత్వ భూములను బినామీ పేర్లతో అక్రమంగా ఆన్‌లైన్‌లో చేయించుకొని కొంతమంది అమ్ముకుని కోట్లాది రూపాయలు సొమ్ము చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఈ ఆక్రమణల పరంపర అంతా గత ఇన్చార్జి తహసీల్దార్ కిషోర్ కుమార్ రెడ్డి హయాంలోనే జరిగిందని స్పష్టం చేశారు.

ఈ ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేయించి, దప్పిలమ్మ నుండి ఐత్రం పేట వరకు ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న భూములు రీ-సర్వే చేసి ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాదారులు, వారికి సహకరించిన రెవెన్యూ సిబ్బందిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, ఆ భూములను నిజమైన అర్హులైన పేదలకు పంచాలని కోరారు. అలాగే, కాసానగరంలో మోడల్ స్కూల్‌కు కేటాయించిన 5 ఎకరాలు, వసతి గృహానికి కేటాయించిన ఎకరం స్థలంలో ఎస్సీ బాలుర భవన నిర్మాణాలకు తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఉన్నతాధికారులు స్పందించి ఆక్రమణలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టి పేదలకు ఆ భూములు అందేలా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో పెద్ద ఎత్తున అర్హులతో కూడిన ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని ఎస్. చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జకరయ్య, మండల కార్యదర్శి మార్క్, మండల కమిటీ సభ్యులు వెంకట్రామయ్య, మోషే, పుల్లయ్య, బాబు, వెంకటయ్య, వెంగయ్య మరియు విప్లవ యువజన సంఘం (RYA) నాయకులు ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణంలో, ఫుడ్ సేఫ్టీ అధికారి గురులక్ష్మి ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని మటన్, చికెన్ షాపులు, హోటళ్లలో ఈ తనిఖీలు చేపట్టగా, విక్రయానికి సిద్ధంగా ఉంచిన మాంసం పాడైపోయినట్లు అధికారులు గుర్తించారు. గుర్తించిన పాడైపోయిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల విక్రయాలను ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని షాపు యజమానులను ఈ సందర్భంగా హెచ్చరించారు.
    1
    అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు పట్టణంలో, ఫుడ్ సేఫ్టీ అధికారి గురులక్ష్మి ఆధ్వర్యంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందితో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. పట్టణంలోని మటన్, చికెన్ షాపులు, హోటళ్లలో ఈ తనిఖీలు చేపట్టగా, విక్రయానికి సిద్ధంగా ఉంచిన మాంసం పాడైపోయినట్లు అధికారులు గుర్తించారు.

గుర్తించిన పాడైపోయిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహార పదార్థాల విక్రయాలను ఏ పరిస్థితుల్లోనూ సహించబోమని షాపు యజమానులను ఈ సందర్భంగా హెచ్చరించారు.
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Punganur, Chittoor•
    6 hrs ago
  • మహానంది మండలంలోని గాజులపల్లె, తిమ్మాపురం, మహానంది, గోపవరం గ్రామాల్లో సోమవారం రాత్రి సుమారు నాలుగు గంటల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ భీకర గాలివాన ధాటికి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, భారీ చెట్లు నేలకూలగా, డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లాయి. దీని ఫలితంగా గ్రామాల్లో నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. గాజులపల్లె గ్రామంలో ఏకధాటిగా వచ్చిన ఉరుములు, మెరుపులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. గాజులపల్లెలోని మెట్ట, ఎస్సీ, ఓసీ కాలనీలలో డ్రైనేజీ మురుగునీరు బయటకు వెళ్లలేక పొంగిపొర్లి ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అనేక కాలనీలు చిత్తడిగా మారగా, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. మండలంలోని బోయలకుంట్ల మెట్ట సమీపాన ఉన్న నంద్యాల-గిద్దలూరు రహదారిపై ఒక భారీ వృక్షం అడ్డంగా కూలింది. అదే సమయంలో ఈ చెట్టు విద్యుత్ స్తంభంపై పడటంతో తీగలు తెగిపడ్డాయి. దీంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న మహానంది రోడ్డు విభాగం సిబ్బంది, విద్యుత్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, జేసీబీ సహాయంతో కూలిన వృక్షాన్ని తొలగించి మార్గాన్ని సుగమం చేశారు. దీనితో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
    4
    మహానంది మండలంలోని గాజులపల్లె, తిమ్మాపురం, మహానంది, గోపవరం గ్రామాల్లో సోమవారం రాత్రి సుమారు నాలుగు గంటల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఈ భీకర గాలివాన ధాటికి విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్‌లు, భారీ చెట్లు నేలకూలగా, డ్రైనేజీ కాలువలు పొంగిపొర్లాయి. దీని ఫలితంగా గ్రామాల్లో నాలుగు గంటల పాటు విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడి, లోతట్టు ప్రాంతాలు, రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది.

గాజులపల్లె గ్రామంలో ఏకధాటిగా వచ్చిన ఉరుములు, మెరుపులు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేశాయి. గాజులపల్లెలోని మెట్ట, ఎస్సీ, ఓసీ కాలనీలలో డ్రైనేజీ మురుగునీరు బయటకు వెళ్లలేక పొంగిపొర్లి ఇళ్లల్లోకి చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. అనేక కాలనీలు చిత్తడిగా మారగా, లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి.

మండలంలోని బోయలకుంట్ల మెట్ట సమీపాన ఉన్న నంద్యాల-గిద్దలూరు రహదారిపై ఒక భారీ వృక్షం అడ్డంగా కూలింది. అదే సమయంలో ఈ చెట్టు విద్యుత్ స్తంభంపై పడటంతో తీగలు తెగిపడ్డాయి. దీంతో సుమారు రెండు గంటల పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడి, ఆరు కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. సమాచారం అందుకున్న మహానంది రోడ్డు విభాగం సిబ్బంది, విద్యుత్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, జేసీబీ సహాయంతో కూలిన వృక్షాన్ని తొలగించి మార్గాన్ని సుగమం చేశారు. దీనితో వాహనాల రాకపోకలు తిరిగి ప్రారంభం కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
    user_Syed Rafi
    Syed Rafi
    Photographer మహానంది, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలు మరియు ఏఎన్ఎంలపై పెరుగుతున్న పని ఒత్తిడి భారాన్ని ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని ఏఐటీయూసీ నేత రమేశ్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూపాడు బంగ్లా పీజీఆర్ఎస్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రజా ఆరోగ్య సేవలు అందించాల్సిన వారిచే ఇంటి సర్వేలు, ఓటర్ల జాబితాల తయారీ, ఇతర శాఖలకు సంబంధించిన పనులు చేయించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పేర్కొన్నారు.
    1
    రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలలో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీలు మరియు ఏఎన్ఎంలపై పెరుగుతున్న పని ఒత్తిడి భారాన్ని ప్రభుత్వం తక్షణమే తగ్గించాలని ఏఐటీయూసీ నేత రమేశ్ బాబు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూపాడు బంగ్లా పీజీఆర్ఎస్‌లో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రజా ఆరోగ్య సేవలు అందించాల్సిన వారిచే ఇంటి సర్వేలు, ఓటర్ల జాబితాల తయారీ, ఇతర శాఖలకు సంబంధించిన పనులు చేయించడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి పేర్కొన్నారు.
    user_Romanti Romeo
    Romanti Romeo
    News Anchor జూపాడు బంగ్లా, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
  • నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో స్వల్ప వర్షం కురిసినా ప్రధాన రహదారి చిత్తడిచిత్తడిగా మారిందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై వర్షపు నీరుతో పాటు మురుగునీరు నిల్వ ఉండి, రోడ్డు బురదమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు వాపోయారు. ఈ సమస్యపై పంచాయతీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, రోడ్డుపై మురుగు నీరు నిల్వ ఉండకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
    1
    నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం లింగాపురం గ్రామంలో స్వల్ప వర్షం కురిసినా ప్రధాన రహదారి చిత్తడిచిత్తడిగా మారిందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై వర్షపు నీరుతో పాటు మురుగునీరు నిల్వ ఉండి, రోడ్డు బురదమయంగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు వాపోయారు.

ఈ సమస్యపై పంచాయతీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపించారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి, రోడ్డుపై మురుగు నీరు నిల్వ ఉండకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.
    user_Naga kanth
    Naga kanth
    బండి ఆత్మకూరు, నంద్యాల, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • వైయస్ఆర్ సీపీ బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏ విషయం అడిగినా తనకు అనుభవం లేదని, తనకు చేతకాదని పవన్ కళ్యాణ్ తప్పించుకుంటారని రమేష్ గౌడ్ ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిని ఇష్టానుసారం తిట్టడం మాత్రమే పవన్ కళ్యాణ్ కు చేతనవుతుందని ఆయన పేర్కొన్నారు. హామీలు అమలు చేయకపోయినా, ఇన్ని ఘోరాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన గొంతు విప్పింది లేదని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు.
    1
    వైయస్ఆర్ సీపీ బీసీ సెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఏ విషయం అడిగినా తనకు అనుభవం లేదని, తనకు చేతకాదని పవన్ కళ్యాణ్ తప్పించుకుంటారని రమేష్ గౌడ్ ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డిని ఇష్టానుసారం తిట్టడం మాత్రమే పవన్ కళ్యాణ్ కు చేతనవుతుందని ఆయన పేర్కొన్నారు. హామీలు అమలు చేయకపోయినా, ఇన్ని ఘోరాలు జరుగుతున్నా పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన గొంతు విప్పింది లేదని రమేష్ గౌడ్ స్పష్టం చేశారు.
    user_Stv9 Press
    Stv9 Press
    తిరుపతి (గ్రామీణ), తిరుపతి, ఆంధ్రప్రదేశ్•
    22 min ago
  • వై.ఎస్.ఆర్. కడప జిల్లాలోని రాజంపేట పట్టణ పరిధిలో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరా నిఘా నిర్వహించారు. రాజంపేట ఎ.ఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో, రాజంపేట పట్టణ ఇన్స్పెక్టర్ బి. నాగార్జున మరియు ఎస్.ఐ వెంకటేష్ గార్లు భువనగిరి పల్లె 'Y' జంక్షన్ సమీపంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని డ్రోన్ కెమెరా సహాయంతో గుర్తించారు. ఈ చర్యలో భాగంగా 6 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని రాజంపేట పట్టణ సి.ఐ నాగార్జున ఈ సందర్భంగా హెచ్చరించారు.
    1
    వై.ఎస్.ఆర్. కడప జిల్లాలోని రాజంపేట పట్టణ పరిధిలో జిల్లా ఎస్పీ శ్రీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఐ.పి.ఎస్. ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరా నిఘా నిర్వహించారు. రాజంపేట ఎ.ఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే ఐ.పి.ఎస్. పర్యవేక్షణలో, రాజంపేట పట్టణ ఇన్స్పెక్టర్ బి. నాగార్జున మరియు ఎస్.ఐ వెంకటేష్ గార్లు భువనగిరి పల్లె 'Y' జంక్షన్ సమీపంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిని డ్రోన్ కెమెరా సహాయంతో గుర్తించారు. ఈ చర్యలో భాగంగా 6 మందిని అదుపులోకి తీసుకొని వారిపై కేసులు నమోదు చేశారు.

అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని రాజంపేట పట్టణ సి.ఐ నాగార్జున ఈ సందర్భంగా హెచ్చరించారు.
    user_ఆకుల చంద్రమోహన్
    ఆకుల చంద్రమోహన్
    సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    15 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.