Shuru
Apke Nagar Ki App…
Nagalancha cheruvu murthu dheham
Kantu jagadeesh
Nagalancha cheruvu murthu dheham
More news from Siddipet and nearby areas
- Post by Katravath Hathiram1
- Post by Ravi Poreddy1
- Post by KLakshmi Devi1
- అంబేద్కర్ భవన స్థలాన్ని వెంటనే పరిష్కరించాలి. ఏఐబిఎస్పి. పలమనేరు డిసెంబర్ 16( ప్రజా ప్రతిభ) గంగవరం మండలంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంకు సంబంధించిన స్థలాన్ని అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం కోరారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు మణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి. మునిరత్నం, అమానుల్లా,వాణి, గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి, మాట్లాడుతూ గత వారం రోజుల నుండి అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలాన్ని అక్కడే నివాసముంటున్న శ్రీలంక కాలనీవాసులు ఆక్రమించుకోవాలనే ప్రయత్నాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. నిత్యం తహసిల్దార్ , ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ మార్గంలోనే వెళ్తున్నప్పటికీ శ్రీలంక వాసులు ఆక్రమిస్తున్న స్థలం కనపడినా ప్రశ్నించ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీలంక శరణార్థులు రోజుకో దేవాలయం పేరు చెప్పుకొని ఉన్నత అధికారులకు అర్జీలతో పాటు ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ భవన ఆవరణలో శరణార్థులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇతరులకు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటిని నివారించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. లంక వాసులు ఆ స్థలములో చేస్తున్న వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలను చూసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేయక చాలా ఏళ్ల నుండి చేతగాని వారిగా మిగిలిపోతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్థల వివాదంలో శ్రీలంక వాసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళితే, ఓ అధికారి సమన్వయం పాటించండని, ఇంకొక అధికారి శ్రీలంక వాసులు రెచ్చగొట్టిన మీరు రెచ్చిపోవద్దని ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతవరకు ఆక్రమణదారులను అధికారులు పిలిపించి విచారించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంబేద్కర్ స్థలాన్ని ఆక్రమించి, విద్వేషాలను రెచ్చగొడుతున్న వ్యక్తులను విచారించి నివారించాలని , అంబేద్కర్ భవనం స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. మంజునాథ్, సూర శ్రీనివాసులు, శివ, ఆనంద, శాంతమ్మ, మునెయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.1