అంబేద్కర్ భవన స్థలాన్ని వెంటనే పరిష్కరించాలి. ఏఐబిఎస్పి. పలమనేరు డిసెంబర్ 16( ప్రజా ప్రతిభ) గంగవరం మండలంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంకు సంబంధించిన స్థలాన్ని అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం కోరారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు మణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి. మునిరత్నం, అమానుల్లా,వాణి, గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి, మాట్లాడుతూ గత వారం రోజుల నుండి అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలాన్ని అక్కడే నివాసముంటున్న శ్రీలంక కాలనీవాసులు ఆక్రమించుకోవాలనే ప్రయత్నాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. నిత్యం తహసిల్దార్ , ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ మార్గంలోనే వెళ్తున్నప్పటికీ శ్రీలంక వాసులు ఆక్రమిస్తున్న స్థలం కనపడినా ప్రశ్నించ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీలంక శరణార్థులు రోజుకో దేవాలయం పేరు చెప్పుకొని ఉన్నత అధికారులకు అర్జీలతో పాటు ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ భవన ఆవరణలో శరణార్థులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇతరులకు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటిని నివారించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. లంక వాసులు ఆ స్థలములో చేస్తున్న వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలను చూసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేయక చాలా ఏళ్ల నుండి చేతగాని వారిగా మిగిలిపోతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్థల వివాదంలో శ్రీలంక వాసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళితే, ఓ అధికారి సమన్వయం పాటించండని, ఇంకొక అధికారి శ్రీలంక వాసులు రెచ్చగొట్టిన మీరు రెచ్చిపోవద్దని ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతవరకు ఆక్రమణదారులను అధికారులు పిలిపించి విచారించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంబేద్కర్ స్థలాన్ని ఆక్రమించి, విద్వేషాలను రెచ్చగొడుతున్న వ్యక్తులను విచారించి నివారించాలని , అంబేద్కర్ భవనం స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. మంజునాథ్, సూర శ్రీనివాసులు, శివ, ఆనంద, శాంతమ్మ, మునెయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

- SrinivasuluThavanampalle, Chittoor👏on 7 January
- User4674Palamaner, Chittoor🙏on 17 December
- బొమ్మనహల్ మండలంలో సిఐ వెంకటరమణ ఆదేశాల మేరకు ఎస్సై నబీ రసూల్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సైకిల్ ర్యాలీ చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విద్యార్థినులతో పెద్ద ఎత్తున సైకిల్ ర్యాలీ నిర్వహించారు. పోలీసు సిబ్బంది, విద్యార్థినిలు పాల్గొన్నారు.1
- కర్నూలు జిల్లా ఆలూరు నియోజవర్గంలో టిడిపి ఇన్చార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆలూరు బెల్లగుండు అంజినేయ స్వామి దేవాలయం దగ్గర ఎంపీ నిధులతో 70 లక్షలు విలువచేసే కమ్యూనిటీ హాల్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యఅతిథిలుగా కర్నూల్ ఎంపీ బస్తిపాటి నాగరాజు, జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ , టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వైకుంఠం ప్రసాదు నాయకులు తదితరు నాయకులు కలిసి భూమి పూజ ఘనంగా నిర్వహించారు. అనంతరం పెద్ద హోతుర్ సిసి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే చిన్నహోతురు ప్రభుత్వ బీసీ బాలుర హాస్టల్ డైనింగ్ హాల్ కొరకు రేకుల షెడ్డును ప్రారంభించారు, బీసీ వెల్ఫేర్ డిడి ప్రసూన్న కుమారి సిబ్బందితో కలిసి ఎంపీ, నాగరాజు , టిడిపి ఇంచార్జ్ జ్యోతి లకు పూలు మాల, సాలవులతో సన్మానించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్నూలు జిల్లాలోని ఆలూరు వెనుకబడిందని ఉద్దేశంతో దాదాపు ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలలకే 120 కోట్లు మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు ఇచ్చారని, అలాగే వేదవతి ప్రాజెక్టు కూడా మూడేళ్లలోపే పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు తెలుపారని, ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటామంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఆలూరు నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టారని తెలియజేశారు. త్వరలోనే స్థానిక ఎన్నికలు వస్తున్నాయి అని మనమందరం కలిసి నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఎంపీటీసీలు సర్పంచులు జడ్పిటిసి లను గెలిపించుకోవాలని నాయకులను కార్యకర్తలను కోరారు...1
- Post by Anji Raju1
- జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని నాగసాల గ్రామానికి చెందిన భీమేష్ అనే వ్యక్తి చెరువులో పడి దురదృష్టవశాత్తు మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని పోలీసులు జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో కనీస సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో భీమేష్ మృతదేహం కుక్కలకు ఆహారంగా మారడం అత్యంత దురదృష్టకరమైన మరియు అమానుష ఘటన.మరణించిన వ్యక్తి పట్ల కనీస గౌరవం చూపకుండా, మృతదేహాన్ని నిర్లక్ష్యంగా వదిలేయడం ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. ఇది మానవత్వాన్ని అవమానించే చర్య. ఈ ఘటనకు పూర్తి బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే.ప్రభుత్వం వెంటనే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆసుపత్రిలో భద్రతా వ్యవస్థలను బలోపేతం చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ డిమాండ్ చేస్తోంది. ఈ సంఘటనను భారతీయ జనతా పార్టీ జడ్చర్ల పట్టణ శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాము.ఎడ్ల అమర్ నాథ్ గౌడ్* బిజెపి జడ్చర్ల పట్టణ అధ్యక్షులు2
- Post by Arja Durga Prasad1
- వీరులపాడు మండలం జయంతి గ్రామంలో అక్రమ రేషన్ స్వాధీనం చేసుకున్న అనంతరం తహసిల్దార్ రవికుమార్ మాట్లాడుతూ పౌరసరఫరాల మరియు రెవెన్యూ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆకస్మికంగా దాడులు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ దాడిలో 295 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎనిమిది వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.1
- వైయస్సార్ జిల్లా....కాసినాయన యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు.. గంగన్న పల్లె హరిజవాడ కు చెందిన కందుల దిలీప్ (24).. ఫ్లిప్ కార్ట్ ,అమెజాన్ లో డెలివరీ బాయ్ గా పని చెస్తున్న దిలీప్.. నాయనపల్లె గ్రామానికి చెందిన యువతికి పార్సిల్ డెలివరీ విషయంలో దిలీప్ పైన అనుమానం పడిన తల్లిదండ్రులు.. కలసపాడు మండలం పుల్లా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన బంధువుల సహకారంతో నా పైన పెట్రోల్ పోసి నిప్పటించినారు అని తెలిపిన దిలీప్.. తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి ఇంతవరకు కేసును ఛేదించలేదని పోరుమామిళ్ళ స్టేషన్ దగ్గర రోడ్డు పై శవాన్ని ఉంచి పోరుమామిళ్ళ సిఐ, కాసినాయన ఎస్సై డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తున్న మృతుని బంధువులు1
- Post by Arja Durga Prasad1
- Post by వేముల నాగరాజు1