logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండించండి* _జీతాలు పెంచమంటే అంగన్వాడీ మహిళలను పోలీసు స్టేషన్ లో నిర్బంధించడం సాధికారిత...?_ *ఇబ్రహీంపట్నం, మార్చి 3, (గళమ్ న్యూస్)* అంగన్వాడీలకు జీతాలు పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం కర్కాశంగా నిర్బంధించి అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇబ్రహీంపట్నం రామ విలాస్ కూడలిలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ మాట్లాడుతూ అంగన్వాడీ లకు జీతాలు పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులో చేయడం అత్యంత దుర్మార్గమని తక్షణమే అరెస్టు చేసిన అంగన్వాడీ కార్యకర్తలను నాయకులను విడుదల చేయాలని అంగన్వాడీల న్యాయమైన కోరికలో భాగంగా జీతాల పెంపు రాష్ట్ర ప్రభుత్వం విషయంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.ఇబ్రహీంపట్నం సిఐటి ఆఫీసు నుంచి రామ విలాస్ సెంటర్ వరకి ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేయడం జరిగింది.అంగన్వాడీలను నిర్బంధించడం అత్యంత పాసవిక చర్యని మహిళా సాధికారత అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం అంగన్వాడి మహిళలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సాధికారత ఎలా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే పెరిగిన ధరలు పెరుగుతున్న ఖర్చులు ఇంటి అద్దెలు కరెంటు చార్జీలు పిల్లల స్కూల్ ఫీజులు నిత్యవసర వస్తువుల పెరుగుదల రీత్యా 9 సంవత్సరాల నుంచి ఎలాంటి జీతాలు పెంచకుండా వెట్టి చాకిరి చేస్తున్న అంగన్వాడీలకు తక్షణమే జీతాలు పెంచాలని లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు మండల అధ్యక్షురాలు కే బుల్లెమ్మ,కార్యదర్శి ఎస్ నిర్మల,ఉపాధ్యక్షురాలు ఎస్.కె రబ్బాని,కమిటీ నాయకులు సురేఖ,ముంతాజు,విజయలక్ష్మి అలివేలు కృష్ణకుమారి రజిని ప్రియదర్శిని,కృష్ణవేణి,రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

3 hrs ago
user_వేముల నాగరాజు
వేముల నాగరాజు
ఇబ్రహీంపట్నం, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

*అంగన్వాడీల అక్రమ అరెస్టులను ఖండించండి* _జీతాలు పెంచమంటే అంగన్వాడీ మహిళలను పోలీసు స్టేషన్ లో నిర్బంధించడం సాధికారిత...?_ *ఇబ్రహీంపట్నం, మార్చి 3, (గళమ్ న్యూస్)* అంగన్వాడీలకు జీతాలు పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం కర్కాశంగా నిర్బంధించి అక్రమ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇబ్రహీంపట్నం రామ విలాస్ కూడలిలో సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది.ఈ సందర్భంగా సిఐటియు ఇబ్రహీంపట్నం మండల కార్యదర్శి యం మహేష్ మాట్లాడుతూ అంగన్వాడీ లకు జీతాలు పెంచమంటే రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులో చేయడం అత్యంత దుర్మార్గమని తక్షణమే అరెస్టు చేసిన అంగన్వాడీ కార్యకర్తలను నాయకులను విడుదల చేయాలని అంగన్వాడీల న్యాయమైన కోరికలో భాగంగా జీతాల పెంపు రాష్ట్ర ప్రభుత్వం విషయంపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.ఇబ్రహీంపట్నం సిఐటి ఆఫీసు నుంచి రామ విలాస్ సెంటర్ వరకి ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేయడం జరిగింది.అంగన్వాడీలను నిర్బంధించడం అత్యంత పాసవిక చర్యని మహిళా సాధికారత అని చెప్పుకునే కూటమి ప్రభుత్వం అంగన్వాడి మహిళలను పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం సాధికారత ఎలా అవుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.తక్షణమే పెరిగిన ధరలు పెరుగుతున్న ఖర్చులు ఇంటి అద్దెలు కరెంటు చార్జీలు పిల్లల స్కూల్ ఫీజులు నిత్యవసర వస్తువుల పెరుగుదల రీత్యా 9 సంవత్సరాల నుంచి ఎలాంటి జీతాలు పెంచకుండా వెట్టి చాకిరి చేస్తున్న అంగన్వాడీలకు తక్షణమే జీతాలు పెంచాలని లేనిపక్షంలో ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు మండల అధ్యక్షురాలు కే బుల్లెమ్మ,కార్యదర్శి ఎస్ నిర్మల,ఉపాధ్యక్షురాలు ఎస్.కె రబ్బాని,కమిటీ నాయకులు సురేఖ,ముంతాజు,విజయలక్ష్మి అలివేలు కృష్ణకుమారి రజిని ప్రియదర్శిని,కృష్ణవేణి,రంగమ్మ తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి టిజి ఎస్పీడిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు జిల్లా ఉద్యోగ సంఘాలు, రెవిన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈయొక్క సభకు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, జిల్లా జడ్జి వసంత్ పాటిల్, నూతన కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తదితరులు హాజరై కలెక్టర్ కు ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... జిల్లాకు చాలా మంది కలెక్టర్ లు వచ్చారు కానీ అన్ని విభాగాల్లో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు, గిరిజనుల అభివృద్ధి కొరకు కలెక్టర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. వరదల సమయంలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో గొప్పగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ... ఒక కుటుంబ పెద్దగా కలెక్టర్ వ్యవహరించారని, విధి నిర్వహణలో చక్కని సలహాలు ఇచ్చి పని చేయించారని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... ఒక అందమైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అన్నారు. ఇక్కడ మనుషులు స్వచ్ఛమైన వారని, చాలా మంచి వారని అన్నారు. పలు విషయాల్లో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. జిల్లా సీతమ్మ తల్లి లాంటిది అని అన్నారు. నాకు రెండవ బిడ్డ కు ఇదే గడ్డపై జన్మించిందని, ఇది ఆ సీతారాముల వరమని అన్నారు. జిల్లాను అన్ని విభాగాల్లో అగ్రస్థానాన నిలబెట్టడానికి మంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజల సహకారమే కారణం అని అన్నారు. చాలా బాధగా ఉందని లోపల ఉన్న భావోద్వేగానిని ఆపుకుంటున్నానని అన్నారు.
    4
    జిల్లాలో కలెక్టర్ గా విధులు నిర్వహించి టిజి ఎస్పీడిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ కు జిల్లా ఉద్యోగ సంఘాలు, రెవిన్యూ ఉద్యోగుల ఆధ్వర్యంలో కొత్తగూడెం ఐడివోసి కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించారు. ఈయొక్క సభకు ఎమ్మెల్యేలు జారే ఆదినారాయణ, కూనంనేని సాంబశివరావు, జిల్లా జడ్జి వసంత్ పాటిల్, నూతన కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్, ఉద్యోగ సంఘాల రాష్ట్ర నాయకులు తదితరులు హాజరై కలెక్టర్ కు ఘనంగా సన్మానం చేశారు. ఈసందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ... జిల్లాకు చాలా మంది కలెక్టర్ లు వచ్చారు కానీ అన్ని విభాగాల్లో జిల్లాను అభివృద్ధి పధంలో నడిపిన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు, గిరిజనుల అభివృద్ధి కొరకు కలెక్టర్ ఎనలేని కృషి చేశారని అన్నారు. వరదల సమయంలో ఇతర ప్రభుత్వ కార్యక్రమాల సమయంలో గొప్పగా వ్యవహరించారని అన్నారు. ఉద్యోగులు మాట్లాడుతూ... ఒక కుటుంబ పెద్దగా కలెక్టర్ వ్యవహరించారని, విధి నిర్వహణలో చక్కని సలహాలు ఇచ్చి పని చేయించారని భావోద్వేగానికి గురయ్యారు. అనంతరం కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడుతూ... ఒక అందమైన జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అని అన్నారు. ఇక్కడ మనుషులు స్వచ్ఛమైన వారని, చాలా మంచి వారని అన్నారు. పలు విషయాల్లో ప్రజలు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు. జిల్లా సీతమ్మ తల్లి లాంటిది అని అన్నారు. నాకు రెండవ బిడ్డ కు ఇదే గడ్డపై జన్మించిందని, ఇది ఆ సీతారాముల వరమని అన్నారు. జిల్లాను అన్ని విభాగాల్లో అగ్రస్థానాన నిలబెట్టడానికి మంచి ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ప్రజల సహకారమే కారణం అని అన్నారు. చాలా బాధగా ఉందని లోపల ఉన్న భావోద్వేగానిని ఆపుకుంటున్నానని అన్నారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    3 hrs ago
  • హోళీ పండుగను ఆనందోత్సాహాలతో పాటు బాధ్యతతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు. పండుగ వేళ సహజసిద్ధమైన, పర్యావరణ హిత రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనాలతో కూడిన హానికర రంగులను పూర్తిగా నివారించాలని సూచించారు. ఇతరుల అభిమతానికి విరుద్ధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు, ప్రధాన రహదారులు మరియు ప్రజా ప్రదేశాలలో ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని తెలిపారు. హోలీ పండుగ చందా పేరుతో రహదారులపై బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోబడతాయని తెలిపారు డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు పండుగ రోజు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచిస్తూ, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. నీటి ప్రాంతాల వద్ద జాగ్రత్తలు ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లరాదని, తల్లిదండ్రులు చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మహబూబాబాద్ జిల్లా ప్రజలందరూ శాంతి, సౌహార్ద్ర వాతావరణంలో, పరస్పర గౌరవంతో హోళీ పండుగను సురక్షితంగా జరుపుకొని పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ కోరారు.
    1
    హోళీ పండుగను ఆనందోత్సాహాలతో పాటు బాధ్యతతో, పరస్పర గౌరవంతో జరుపుకోవాలని  జిల్లా ఎస్పీ ప్రజలను కోరారు.
పండుగ వేళ సహజసిద్ధమైన, పర్యావరణ హిత రంగులను మాత్రమే వినియోగించాలని, రసాయనాలతో కూడిన హానికర రంగులను పూర్తిగా నివారించాలని సూచించారు. ఇతరుల అభిమతానికి విరుద్ధంగా బలవంతంగా రంగులు చల్లడం, నీటి బెలూన్లు విసరడం వంటి చర్యలు చేయరాదని స్పష్టం చేశారు. ప్రార్థనా స్థలాలు, ఆసుపత్రులు, ప్రధాన రహదారులు మరియు ప్రజా ప్రదేశాలలో ఎటువంటి అసౌకర్యం కలిగించకూడదని తెలిపారు.
హోలీ పండుగ చందా పేరుతో రహదారులపై బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠినచర్యలు తీసుకోబడతాయని తెలిపారు 
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు
పండుగ రోజు మద్యం సేవించి వాహనాలు నడపరాదని సూచిస్తూ, జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. యువత అతివేగంగా వాహనాలు నడపకుండా జాగ్రత్తగా ఉండాలని, రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
నీటి ప్రాంతాల వద్ద జాగ్రత్తలు
ఈత రాని వారు చెరువులు, కుంటలు, కాలువల వద్దకు వెళ్లరాదని, తల్లిదండ్రులు చిన్నపిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని విజ్ఞప్తి చేశారు. లోతైన నీటిలోకి వెళ్లి ప్రమాదాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
మహబూబాబాద్ జిల్లా ప్రజలందరూ శాంతి, సౌహార్ద్ర వాతావరణంలో, పరస్పర గౌరవంతో హోళీ పండుగను సురక్షితంగా జరుపుకొని పోలీసు శాఖకు సహకరించాలని జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్  కోరారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    21 hrs ago
  • నల్లగొండ జిల్లా, నకిరేకల్ లో.. హోళీ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే "వేముల వీరేశం".. పార్టీ కార్యకర్తల తో పాటు ప్రజలతో కలిసి డాన్స్ వేస్తూ జోష్ నింపిన వేముల ప్రతి ఒక్కరు ఆయురు ఆరోగ్యలతో సంతోష ఉండాలని ఆయన ఆకాక్షించారు
    1
    నల్లగొండ జిల్లా, నకిరేకల్ లో.. హోళీ సంబరాల్లో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే "వేముల వీరేశం".. పార్టీ కార్యకర్తల తో పాటు ప్రజలతో కలిసి డాన్స్ వేస్తూ జోష్ నింపిన వేముల ప్రతి ఒక్కరు ఆయురు ఆరోగ్యలతో సంతోష ఉండాలని ఆయన ఆకాక్షించారు
    user_Nagesh Kothapalli
    Nagesh Kothapalli
    Local News Reporter నక్రేకల్, నల్గొండ, తెలంగాణ•
    3 hrs ago
  • నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – *బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి* *నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లకు ఘన సన్మానం..* 13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి సహా యామ కవితా దయాకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, మారగోని నవీన్ కుమార్ గౌడ్‌కు సత్కారం... *మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సహకారంతో గ్రీన్ సిటీగా నల్గొండ అభివృద్ధి – మేయర్... ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి... *నల్లగొండ కార్పొరేషన్ మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*☝️ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు...
    1
    నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్‌ను అందరి సహకారంతో సూపర్ స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేస్తాం – *బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*
*నల్గొండ క్లబ్ ఆధ్వర్యంలో మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లకు ఘన సన్మానం..*
13వ డివిజన్ కార్పొరేటర్ గుమ్ముల జానకి మోహన్ రెడ్డి సహా యామ కవితా దయాకర్, ఏదుళ్ల శ్రీధర్ రెడ్డి, గంట్ల అనంతరెడ్డి, మారగోని నవీన్ కుమార్ గౌడ్‌కు సత్కారం...
*మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి* సహకారంతో గ్రీన్ సిటీగా నల్గొండ అభివృద్ధి – మేయర్...
ఇప్పటికే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడి...
*నల్లగొండ కార్పొరేషన్ మేయర్–బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి*☝️
కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, క్లబ్ వైస్ ప్రెసిడెంట్ గోలి అమరేందర్ రెడ్డి తదితరుల పాల్గొన్నారు...
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    3 hrs ago
  • 🙏😭
    1
    🙏😭
    user_Adimlamganash
    Adimlamganash
    Farmer Ambajipeta, Konaseema•
    7 hrs ago
  • మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనకు నిరసనగా మంగళవారం పాఠశాల ఎదుట బాధితుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    1
    మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో జూనియర్ విద్యార్థులపై సీనియర్ విద్యార్థులు దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడిలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
ఘటనకు నిరసనగా మంగళవారం పాఠశాల ఎదుట బాధితుల తల్లిదండ్రులు ధర్నా నిర్వహించారు. దాడికి పాల్పడ్డ విద్యార్థులపై తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
    user_M D Azizuddin
    M D Azizuddin
    జర్నలిస్ట్ వర్ధన్నపేట, వరంగల్, తెలంగాణ•
    1 hr ago
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ (పెద్దమ్మ తల్లి) ఆలయం మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మూతపడింది. భక్తుల కొంగుబంగారంగా వెలసిన ఈ క్షేత్రంలో గ్రహణ నియమాల దృష్ట్యా ప్రత్యేక మార్పులు చేపట్టారు. నేడు తెల్లవారుజామున 5 గంటలకే ఆలయ తలుపులు తెరిచి, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు కొద్దిసేపు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, గరికతో ఆలయమంతా ప్రోక్షణ చేశారు. ఉదయం 7:30 గంటలకు ఆలయ అర్చకులు, పాలకమండలి చైర్మన్ సమక్షంలో ఆలయ ద్వారబంధనం(తలుపులు మూసివేత) చేశారు. గ్రహణ సమయం ముగిసే వరకు భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. మరల రేపు (బుధవారం) తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ తలుపులు తీసి, సంప్రోక్షణ మరియు ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు యధావిధిగా దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ తెలిపారు.
    1
    ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాక రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలం, జగన్నాధపురం గ్రామంలోని శ్రీ కనకదుర్గ (పెద్దమ్మ తల్లి) ఆలయం మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా మూతపడింది. భక్తుల కొంగుబంగారంగా వెలసిన ఈ క్షేత్రంలో గ్రహణ నియమాల దృష్ట్యా ప్రత్యేక మార్పులు చేపట్టారు.
నేడు తెల్లవారుజామున 5 గంటలకే ఆలయ తలుపులు తెరిచి, అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు కొద్దిసేపు దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ శుద్ధి కార్యక్రమాలు చేపట్టి, గరికతో ఆలయమంతా ప్రోక్షణ చేశారు. ఉదయం 7:30 గంటలకు ఆలయ అర్చకులు, పాలకమండలి చైర్మన్ సమక్షంలో ఆలయ ద్వారబంధనం(తలుపులు మూసివేత) చేశారు. గ్రహణ సమయం ముగిసే వరకు భక్తులకు అమ్మవారి దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.
మరల రేపు (బుధవారం) తెల్లవారుజామున 5 గంటలకు ఆలయ తలుపులు తీసి, సంప్రోక్షణ మరియు ప్రత్యేక శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 6 గంటల నుండి భక్తులకు యధావిధిగా దర్శనం కల్పించనున్నట్లు ఆలయ అర్చకులు రవికుమార్ శర్మ తెలిపారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    4 hrs ago
  • మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం లో విషాద ఘటన చోటుచేసుకుంది.. సిరోలు మండలం అంధనాలపాడు గ్రామ పరిధిలోని శీతల తండాకు చెందిన ధరంసోత్ సురేష్ (23) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. సురేష్‌కు ఏడాది క్రితం అనితతో వివాహం జరిగింది. అయితే భార్య అనితకు ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఆంగోత్ సాయితో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. భార్య ప్రవర్తనతో మనస్థాపానికి గురైన సురేష్ ఆత్మ హత్య కు పాల్పడినట్లు మృతుడి తండ్రి శ్రీను ఆరోపించారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో వాలని ఆందోళన చేపట్టారు పోలీస్ సిబ్బంది, ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    1
    మహబూబాబాద్ జిల్లా సిరోల్ మండలం లో విషాద ఘటన చోటుచేసుకుంది..
సిరోలు మండలం అంధనాలపాడు గ్రామ పరిధిలోని శీతల తండాకు చెందిన ధరంసోత్ సురేష్ (23) తన ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు..
సురేష్‌కు ఏడాది క్రితం అనితతో వివాహం జరిగింది. అయితే భార్య అనితకు ఇంటి ఎదురుగా నివసిస్తున్న ఆంగోత్ సాయితో అక్రమ సంబంధం ఉందని, ఈ విషయమై పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీలు కూడా నిర్వహించినట్లు తెలిపారు. భార్య ప్రవర్తనతో మనస్థాపానికి గురైన సురేష్ ఆత్మ హత్య కు పాల్పడినట్లు మృతుడి తండ్రి శ్రీను ఆరోపించారు.
తన కుమారుడి మరణానికి కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకో వాలని ఆందోళన చేపట్టారు 
పోలీస్  సిబ్బంది, ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
    user_Mogulagani Mahendar Mogulagani Mahendar
    Mogulagani Mahendar Mogulagani Mahendar
    మహబూబాబాద్, మహబూబాబాద్, తెలంగాణ•
    22 hrs ago
  • నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ పట్టణ కేంద్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు... జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ *ఎమీరెడ్డి రాజశేఖర్ రెడ్డి* ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్... మైనర్ పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం... బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే కఠిన శిక్షలు తప్పవు.! చట్ట విరుద్ధంగా సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా విక్రయిస్తే కేసులు నమోదు చేసి షాపులు సీజ్ చేస్తామని హెచ్చరిక... పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు మరియు ఇతర ప్రజా ప్రాంగణాల నుంచి 100 మీటర్ల దూరంలోనే పాన్ షాపులు ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ... నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులు రద్దు చేసి చర్యలు... మైనర్ బాలురు, బాలికలకు పొగాకు అమ్మడం నేరం.. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా పెట్టాలి... అలవాట్లు చిన్న వయసులో మొదలైతే భవిష్యత్ అంధకారం అవుతుంది... పాన్ షాప్ యాజమాన్యాలకు చివరి హెచ్చరిక జారీ చేస్తూ – ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని, ప్రత్యేక బృందాలు అకస్మాత్తుగా తనిఖీలు కొనసాగిస్తాయని స్పష్టం...
    1
    నల్లగొండ బ్రేకింగ్:
నల్లగొండ పట్టణ కేంద్రంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాన్ షాపులపై విస్తృత తనిఖీలు నిర్వహించిన పోలీసులు...
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు వన్ టౌన్ సీఐ *ఎమీరెడ్డి రాజశేఖర్ రెడ్డి* ఆధ్వర్యంలో ప్రత్యేక డ్రైవ్...
మైనర్ పిల్లలకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం... 
బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే కఠిన శిక్షలు తప్పవు.!
చట్ట విరుద్ధంగా సిగరెట్లు, గుట్కా, పాన్ మసాలా విక్రయిస్తే కేసులు నమోదు చేసి షాపులు సీజ్ చేస్తామని  హెచ్చరిక...
పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాలు మరియు ఇతర ప్రజా ప్రాంగణాల నుంచి 100 మీటర్ల దూరంలోనే పాన్ షాపులు ఉండాలని స్పష్టమైన ఆదేశాలు జారీ... 
నిబంధనలు ఉల్లంఘించిన యాజమాన్యాలపై భారీ జరిమానాలు విధించడంతో పాటు లైసెన్సులు రద్దు చేసి చర్యలు...
మైనర్ బాలురు, బాలికలకు పొగాకు అమ్మడం నేరం.. 
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలపై నిఘా పెట్టాలి...
అలవాట్లు చిన్న వయసులో మొదలైతే భవిష్యత్ అంధకారం అవుతుంది...
పాన్ షాప్ యాజమాన్యాలకు చివరి హెచ్చరిక జారీ చేస్తూ – ఇకపై ఎలాంటి సడలింపులు ఉండవని, ప్రత్యేక బృందాలు అకస్మాత్తుగా తనిఖీలు కొనసాగిస్తాయని స్పష్టం...
    user_Journalist pk
    Journalist pk
    Journalist Nalgonda, Telangana•
    3 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.