ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో కీలకం దేవాపూర్ ఎస్ఐ గంగారం ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని కాసిపేట మండలం దేవాపూర్ ఎస్ఐ గంగారం అన్నారు. శుక్రవారం కాసిపేట మండలంలోని కొండాపూర్ యాపలో స్థానిక సర్పంచ్, వ్యాపారులు సంయుక్తంగా నాలుగు పాత సీసీ కెమెరాలను మరమ్మత్తు చేయించడంతో పాటు మరో మూడు నూతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ గంగారం మాట్లాడుతూ, నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. గ్రామాలు, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందన్నారు. ప్రజల భద్రత కోసం ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టిన స్థానిక సర్పంచ్‌తో పాటు వ్యాపారులను ఎస్ఐ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి గ్రామం, ప్రతి వ్యాపార సంస్థ తమ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసు శాఖకు ప్రజల సహకారం ఉంటే నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని ఎస్ఐ గంగారం పేర్కొన్నారు.
ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో కీలకం దేవాపూర్ ఎస్ఐ గంగారం ప్రజల భద్రతకు సీసీ కెమెరాలు ఎంతో కీలకమని కాసిపేట మండలం దేవాపూర్ ఎస్ఐ గంగారం అన్నారు. శుక్రవారం కాసిపేట మండలంలోని కొండాపూర్ యాపలో స్థానిక సర్పంచ్, వ్యాపారులు సంయుక్తంగా నాలుగు పాత సీసీ కెమెరాలను మరమ్మత్తు చేయించడంతో పాటు మరో మూడు నూతన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న ఎస్ఐ గంగారం మాట్లాడుతూ, నేరాల నివారణ, నేరస్థుల గుర్తింపు, ట్రాఫిక్ నియంత్రణతో పాటు ప్రజల భద్రతలో సీసీ కెమెరాలు
కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. గ్రామాలు, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం వల్ల నేరాల నియంత్రణతో పాటు ప్రజల్లో భద్రతాభావం పెరుగుతుందన్నారు. ప్రజల భద్రత కోసం ముందుకు వచ్చి సీసీ కెమెరాల ఏర్పాటు చేపట్టిన స్థానిక సర్పంచ్‌తో పాటు వ్యాపారులను ఎస్ఐ ప్రత్యేకంగా అభినందించారు. ఇదే స్ఫూర్తితో ప్రతి గ్రామం, ప్రతి వ్యాపార సంస్థ తమ పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పోలీసు శాఖకు ప్రజల సహకారం ఉంటే నేరాలను మరింత సమర్థవంతంగా అరికట్టవచ్చని ఎస్ఐ గంగారం పేర్కొన్నారు.
- సింగరేణి పరిరక్షణకు కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం :BMS గత BRS ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి లో జోక్యం కారణంగా నష్ట పోతుందని bms నాయకులు ఆరోపించారు.1
- వరద పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ హరిత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం 146.65 మీటర్ల వద్ద ఉండగా, దిగువకు 7.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళుతోందని, ఎగువ నుంచి మరో 12 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆందోళనకర పరిస్థితి లేదని, గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు వరద ప్రాంతాలు, నదీ తీరాలు, వంతెనల వద్దకు వెళ్లొద్దని, సెల్ఫీలు, ఈత వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, నీటి అవసరం తక్కువగా ఉండే పత్తి, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట్ వద్ద పెన్‌గంగా వంతెన వద్ద వరద పరిస్థితిని పరిశీలించి, ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. వంతెన వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా ఆరా తీసి, నాణ్యతతో వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌సీ వినయ్ బాబు, డిప్యూటీ ఈఈ వెంకటరమణ, ఏఈ రాజ్‌కుమార్, తుమ్మిడిహెట్టి సర్పంచ్ సూరజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.4
- సౌదీ జైలులో చిక్కుకున్న తెలంగాణ యువకుడు... భర్తను స్వదేశానికి తీసుకురావాలని వికలాంగురాలైన భార్య కన్నీటి విజ్ఞప్తి... రూ.84 లక్షల బ్లడ్‌మనీ కోసం సహాయం కోరుతున్న కుటుంబం." "జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలానికి చెందిన శ్రావణ్‌కుమార్... సౌదీలో రోడ్డు ప్రమాద కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్నాడు. అతని విడుదలకు భారీ మొత్తం అవసరమైంది." **"జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండలం చింతలపేట గ్రామానికి చెందిన మమత, నిజామాబాద్ జిల్లా కుమ్మనపల్లి గ్రామానికి చెందిన శ్రావణ్‌కుమార్‌ను నాలుగేళ్ల క్రితం వివాహం చేసుకుంది. కుటుంబ పోషణ కోసం మూడేళ్ల క్రితం శ్రావణ్‌కుమార్ సౌదీ అరేబియాలోని రియాద్‌కు వెళ్లి అంబులెన్స్ డ్రైవర్‌గా పనిచేస్తుండగా రోడ్డు ప్రమాదానికి సంబంధించిన కేసులో చిక్కుకున్నాడు. కేసు విచారణ అనంతరం బాధిత కుటుంబానికి సుమారు 3.30 లక్షల సౌదీ రియాల్స్, అంటే భారత కరెన్సీలో దాదాపు 84 లక్షల రూపాయలు బ్లడ్‌మనీగా చెల్లించాలని అక్కడి కోర్టు తీర్పు ఇచ్చింది. వికలాంగురాలైన మమత తన చిన్న కుమారుడితో కలిసి భర్తను కాపాడుకునేందుకు అధికారులను, ప్రజాప్రతినిధులను, ప్రవాస సంఘాలను ఆశ్రయిస్తూ ఆర్థిక సహాయం కోసం వేడుకుంటోంది."1
- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి బిసి సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జాతీయ బీసీ సంక్షేమ సంఘం పిలుపు మేరకు ఈరోజు కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ వద్ద బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోసం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించాం. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు అది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు నర్సింగోజు శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని యథాతథంగా అమలు చేయాలని, విద్యార్థులకు సంబంధించిన సుమారు రూ.8,000 కోట్ల ఫీజు బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయకపోవడంతో ఇంజనీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పీజీ తదితర కోర్సులు పూర్తిచేసిన వేలాది మంది విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లు పొందలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు వచ్చినా, విదేశీ ఉన్నత విద్యకు ఎంపికైనా, సర్టిఫికెట్లు లేక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తరచూ జీవోలు జారీ చేస్తూ విద్యార్థుల్లో గందరగోళం సృష్టించడం సరైన విధానం కాదని, గత 18 సంవత్సరాలుగా అమలవుతున్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థులపై అదనపు ఆర్థిక భారం మోపే నిర్ణయాలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడితే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించి, ఫీజు బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం, బీసీ యువజన సంఘం నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- మణుగూరు డీప్ సైడ్ బొగ్గు బ్లాకు లు సింగరేణి సంస్థకే కేటాయించాలి : INTUC సింగరేణి భవిష్యత్ దృష్ట్యా మణుగూరు బొగ్గు బ్లాక్ ను సింగరేణి కి అప్పగించాలని డిమాండ్ తో intuc నాయకులు శనివారం ధర్నా ను విజయవంతం చేయాలని కోరారు.1
- చెరువులోనే విద్యుత్ స్తంభాలు.. వంగిపోతున్న పోల్స్‌తో కవ్వాల్‌లో భయాందోళన జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. చెరువు మధ్యలోనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి స్తంభాల అడుగుభాగం నీటిలో మునిగిపోయింది. దీంతో కొన్ని స్తంభాలు ప్రమాదకరంగా వంగిపోయి ఎప్పుడు కూలిపోతాయోనన్న భయం గ్రామస్తులను వెంటాడుతోంది. స్తంభాలు కూలితే విద్యుత్ తీగలు నీటిలో పడే ప్రమాదం ఉండటంతో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గంలో లైన్ వేయకుండా చెరువు గుండా తీసుకెళ్లడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ఖర్చు తప్పించుకోవడానికే ఇలా నాసిరకంగా పనులు చేశారా? అంటూ విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వంగిపోయిన స్తంభాలను తొలగించి, సురక్షిత మార్గంలో కొత్త లైన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి విషమించేలోపు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.1
- అమాయకుడిపై దారుణ కుట్ర: గంజాయి కేసులో కానిస్టేబుల్ అరెస్ట్ సివిల్ తగాదాలో ప్రత్యర్థిని జైలుకు పంపేందుకు పగతో రగిలిపోయిన ఓ పోలీస్ కానిస్టేబుల్ తీరు కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. పోలీసుల కథనం ప్రకారం..ఈగల్ టీమ్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మేడబోయిన నాగరాజు, తన మిత్రుడైన తోడేటి శ్రీనివాస్‌కు చెందిన భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడు. ఎలాగైనా ప్రత్యర్థి శ్రీనివాస్‌రెడ్డిని క్రిమినల్ కేసులో ఇరికించాలనే ఉద్దేశంతో వరంగల్ నుంచి గంజాయి తెప్పించి అతడి ఫెర్టిలైజర్ షాపులో పెట్టించాడు. అనంతరం పోలీసులకు సమాచారం అందించి శ్రీనివాస్‌రెడ్డిపై కేసు నమోదయ్యేలా చేశాడు. అయితే తెప్పించిన గంజాయిలో మిగిలిన 370 గ్రాములను నాగరాజు సీతారాంపూర్‌లోని తన ఇంట్లో దాచుకున్నాడు. పక్కా సమాచారంతో కొత్తపల్లి పోలీసులు దాడి చేసి,గంజాయితో పాటు 4 ఫోన్లను స్వాధీనం చేసుకుని కానిస్టేబుల్ నాగరాజును అరెస్ట్ చేసినట్లు ఏసిపి విజయ్ కుమార్ తెలిపారు.2
- వర్షానికి నీట మునిగిన నిరుపేద కుటుంబం.. ఇందిరమ్మ ఇల్లు, నష్టపరిహారం ఇవ్వాలని గ్రామస్థుల విజ్ఞప్తి జన్నారం మండలంలోని ఫ్లైట్ స్కూల్ ఎదురుగా నివసిస్తున్న ఓ నిరుపేద కుటుంబం ఇల్లు ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు పూర్తిగా నీట మునిగింది. ఇంట్లోకి భారీగా వరద నీరు చేరడంతో సామాన్లు తడిసి నివాసానికి అనుకూలం కాని పరిస్థితి ఏర్పడింది. కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్థానికుల కథనం ప్రకారం, ఈ కుటుంబం ఊరూరా తిరిగి గాజులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. స్వంతంగా పక్కా ఇల్లు లేకపోవడంతో ప్రతి వర్షాకాలంలో ఇలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం ఈ కుటుంబాన్ని గుర్తించి ఇందిరమ్మ గృహ పథకం కింద ఇల్లు మంజూరు చేయాలని, తక్షణమే రెవెన్యూ అధికారులు, మండల యంత్రాంగం ఘటనాస్థలికి చేరుకుని నష్టం అంచనా వేసి తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్థులు, చుట్టుపక్కల నివాసితులు కోరుతున్నారు. వరుస వర్షాల నేపథ్యంలో ఇలాంటి నిరుపేద కుటుంబాలకు వెంటనే సహాయం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.1