చెరువులోనే విద్యుత్ స్తంభాలు.. వంగిపోతున్న పోల్స్‌తో కవ్వాల్‌లో భయాందోళన జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. చెరువు మధ్యలోనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి స్తంభాల అడుగుభాగం నీటిలో మునిగిపోయింది. దీంతో కొన్ని స్తంభాలు ప్రమాదకరంగా వంగిపోయి ఎప్పుడు కూలిపోతాయోనన్న భయం గ్రామస్తులను వెంటాడుతోంది. స్తంభాలు కూలితే విద్యుత్ తీగలు నీటిలో పడే ప్రమాదం ఉండటంతో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గంలో లైన్ వేయకుండా చెరువు గుండా తీసుకెళ్లడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ఖర్చు తప్పించుకోవడానికే ఇలా నాసిరకంగా పనులు చేశారా? అంటూ విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వంగిపోయిన స్తంభాలను తొలగించి, సురక్షిత మార్గంలో కొత్త లైన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి విషమించేలోపు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
చెరువులోనే విద్యుత్ స్తంభాలు.. వంగిపోతున్న పోల్స్‌తో కవ్వాల్‌లో భయాందోళన జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. చెరువు మధ్యలోనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి స్తంభాల అడుగుభాగం నీటిలో మునిగిపోయింది. దీంతో కొన్ని స్తంభాలు ప్రమాదకరంగా వంగిపోయి ఎప్పుడు కూలిపోతాయోనన్న భయం గ్రామస్తులను వెంటాడుతోంది. స్తంభాలు కూలితే విద్యుత్ తీగలు నీటిలో పడే ప్రమాదం ఉండటంతో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గంలో లైన్ వేయకుండా చెరువు గుండా తీసుకెళ్లడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ఖర్చు తప్పించుకోవడానికే ఇలా నాసిరకంగా పనులు చేశారా? అంటూ విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వంగిపోయిన స్తంభాలను తొలగించి, సురక్షిత మార్గంలో కొత్త లైన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి విషమించేలోపు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
- వరద పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి కలెక్టర్ హరిత కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత నది వరద పరిస్థితిని కలెక్టర్ కె. హరిత శుక్రవారం ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రస్తుతం నదిలో నీటి మట్టం 146.65 మీటర్ల వద్ద ఉండగా, దిగువకు 7.75 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వెళుతోందని, ఎగువ నుంచి మరో 12 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆందోళనకర పరిస్థితి లేదని, గ్రామాలు ముంపునకు గురయ్యే అవకాశం లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ ఇరిగేషన్, రెవెన్యూ, పోలీసు శాఖలు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు వరద ప్రాంతాలు, నదీ తీరాలు, వంతెనల వద్దకు వెళ్లొద్దని, సెల్ఫీలు, ఈత వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని, తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.భారీ వర్షాల నేపథ్యంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని, నీటి అవసరం తక్కువగా ఉండే పత్తి, పప్పుధాన్యాలు వంటి ప్రత్యామ్నాయ పంటలవైపు మళ్లాలని కలెక్టర్ సూచించారు. అనంతరం సిర్పూర్(టి) మండలం వెంకట్రావుపేట్ వద్ద పెన్‌గంగా వంతెన వద్ద వరద పరిస్థితిని పరిశీలించి, ఓవర్‌లోడ్ వాహనాల రాకపోకలపై ఆరా తీశారు. వంతెన వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి వరద ప్రభావిత ప్రాంతంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిని కూడా ఆరా తీసి, నాణ్యతతో వేగవంతం చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌సీ వినయ్ బాబు, డిప్యూటీ ఈఈ వెంకటరమణ, ఏఈ రాజ్‌కుమార్, తుమ్మిడిహెట్టి సర్పంచ్ సూరజ్, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.4
- బహిరంగ మద్యం సేవనంపై నిషేధాజ్ఞలు : రామగుండం సిపి అంబర్ కిషోర్ ఝా ప్రజలు మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని బహిరంగ మద్యం సేవించడంపై నిషేధాజ్ఞలు కొనసాగిస్తున్నట్లు సిపి తెలిపారు.1
- మోకాళ్ల లోతు వాగు దాటి.. గిరిజన గూడెంలోకి శ్రీహరి రావు. * ఇల్లు కోల్పోయిన బాధితురాలిని పరామర్శించి.. 11 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి హామీ. మామడ మండలం తోటిగూడ గ్రామపంచాయతీ పరిధిలోని మల్కాపూర్ ఆదివాసీ గిరిజన గూడెం.. అక్కడికి చేరుకోవాలంటే వాహనాలు వెళ్లవు. వాగులు, ఒర్రెలు దాటి దాదాపు ఐదు కిలోమీటర్లు కాలినడకన ప్రయాణించాల్సిందే. అనారోగ్యం వచ్చినా.. అత్యవసరం వచ్చినా ఆ గూడెం ప్రజలు ప్రపంచానికి దూరంగా ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గిరిజన మహిళ సీడం గంగుబాయి ఇల్లు కూలిపోయింది. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శుక్రవారం ఎలాంటి హడావుడి లేకుండా కాలినడకన బయలుదేరి, మోకాళ్ల లోతు వాగులు, ఒర్రెలను దాటి మల్కాపూర్ గూడెంకు చేరుకున్నారు. ఇల్లు కోల్పోయిన గంగుబాయిని పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడెంలోని 11 ఆదివాసీ గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యేలా కృషి చేస్తానని, గూడెంలో త్రీఫేస్ విద్యుత్తు కోసం జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడుతానని హామీ ఇచ్చారు. శ్రీహరి రావును చూసిన గూడెం ప్రజలు భావోద్వేగానికి గురయ్యారు. "ఇప్పటివరకు మా గూడెం వైపు ఏ నాయకుడు కూడా రాలేదని ఇంత కష్టపడి మమ్మల్ని చూసేందుకు వచ్చిన మొదటి నాయకుడు మీరు" అంటూ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తోటి గూడ సర్పంచ్ మోతీబాయి భీమ్రావు, గాయిద్ పల్లి సర్పంచ్ రాథోడ్ సోనియా, వాస్తాపూర్ సర్పంచ్ భూమ్ రెడ్డి, మొండిగుట్ట సర్పంచ్ భీమేష్, మాజీ ఎంపీపీ జై సింగ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాథోడ్ సంతోష్ తో పాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.1
- చెరువులోనే విద్యుత్ స్తంభాలు.. వంగిపోతున్న పోల్స్‌తో కవ్వాల్‌లో భయాందోళన జన్నారం మండలంలోని కవ్వాల్ గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. చెరువు మధ్యలోనే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు చెరువు పూర్తిగా నిండిపోయి స్తంభాల అడుగుభాగం నీటిలో మునిగిపోయింది. దీంతో కొన్ని స్తంభాలు ప్రమాదకరంగా వంగిపోయి ఎప్పుడు కూలిపోతాయోనన్న భయం గ్రామస్తులను వెంటాడుతోంది. స్తంభాలు కూలితే విద్యుత్ తీగలు నీటిలో పడే ప్రమాదం ఉండటంతో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన మార్గంలో లైన్ వేయకుండా చెరువు గుండా తీసుకెళ్లడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువ ఖర్చు తప్పించుకోవడానికే ఇలా నాసిరకంగా పనులు చేశారా? అంటూ విద్యుత్ శాఖ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి వంగిపోయిన స్తంభాలను తొలగించి, సురక్షిత మార్గంలో కొత్త లైన్ ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. పరిస్థితి విషమించేలోపు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.1
- సింగరేణి పరిరక్షణకు కార్మికులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం :BMS గత BRS ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు సింగరేణి లో జోక్యం కారణంగా నష్ట పోతుందని bms నాయకులు ఆరోపించారు.1
- సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎస్పీ శ్రీనివాస్ ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నిర్మల్ డీఎస్పీ శ్రీనివాస్ అన్నారు. జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఆదేశాల మేరకు శుక్రవారం సోన్ మండలం కడ్తాల్ గ్రామంలో పోలీసులు విస్తృతంగా కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 51 ద్విచక్ర వాహనాలు, 2 కార్లు స్వాధీనం చేసుకుని, పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను వసూలు చేశారు. అనంతరం గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గుర్తు తెలియని వ్యక్తుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకు వివరాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. యువత మాదకద్రవ్యాలు, ఇతర చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుర్రం రాము, సోన్ సీఐ గోవర్ధన్, ఎస్సైలు గోపి, శ్రావణి హన్మండ్లుతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.1
- శ్రీలంక కాలనీలో విష సర్పాల సంచారం, ఆందోళన చెందుతున్న స్థానికులు జన్నారం పట్టణంలోని శ్రీలంక కాలనీలో వరద నీటి ప్రవాహం ఇంకా తగ్గలేదు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కాలనీలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గడంతో కొంత అనుకూల పరిస్థితులు ఏర్పడిన విశేషాలు బాధ ఎక్కువగా ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వరద నీటిలో పాములు వస్తుండడంతో బయటకు వెళ్లడానికి భయపడుతున్నామని, వరద నీటిని తీసి వేయించాలని కోరారు.1