logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

దొంగతనాల నివారణకు.. అప్రమత్తమైన భద్రత ఉండాలి..ఎస్ ఐ సోమేశ్వరి వెసవి కాలంలో పాఠశాలల సెలవులు, పెళ్లిలా పర్యటనలు, కుటుంబ సభ్యులతో ప్రయాణాలు జరుగుతాయని, ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని దొంగతనాలకు పాల్పడే అవకాశం ఉంటుందని, అప్రమత్తమైన భద్రత ఉండాలని ఎస్ ఐ సోమేశ్వరి మంగళవారం ఒక ప్రకటనలో జాగ్రత్తలపై సూచించారు. ప్రజలు, పోలీసులు అనుసంధానంతో , దొంగతనాలను నియంత్రించడానికి వీలు ఉంటుందని తెలిపారు. ముందస్తు జాగ్రత్తలతో పోలీసులకు సహకరించి సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. ఇంటి బయట,డాబాలపై నిద్రించేవారు మెడలోని బంగారు ఆభరణాలపై జాగ్రత్తగా , అధిక మొత్తంలో బంగారం, నగదు ఉంచకుండా బ్యాంక్ లాకర్లలో భద్రపరచడం మంచిదన్నారు. ! బస్సుల్లో, ప్రయాణంలో మీ వస్తువులు పట్టుకుని,అపరిచితులిచ్చే ఆహారా,పానీయాలు స్వీకరించవద్దన్నారు. ! బయటకు వెళ్తున్నప్పుడు విలువైన వస్తువులు ఇంట్లో ఉంచకుండా భద్రంగా దాచుకోవాలన్నారు ! బీరువాలకు,ఇంటి తలుపులకు నాణ్యమైన తాళాలు ఉపయోగించాలన్నారు. ఇంటి ముందు చెప్పులు, లైట్లు వేసి ఉంచడంతో ఇంట్లో ఎవరైనా ఉన్నట్టు భావన కలుగుతుందన్నారు. ! పేపర్, పాలు వేసే వారికి ముందస్తుగా తెలిపి,విశ్వసనీయమైన వాచ్‌మెన్‌లను మాత్రమే నియమించుకోవాలన్నారు. ! ఊరికి వెళ్లే ముందు స్థానిక పోలీసులకు, నమ్మకమైన పొరుగువారికి సమాచారం ఇవ్వాలనీ,ఇంటి పరిస్థితి గురించి పొరుగువారిని సంప్రదించాలన్నారు. ! బయటకు వెళ్తున్న విషయాన్ని సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లో పెట్టవద్దని, ఇంటి పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుతో భద్రతను పెంచుకోవచ్చు అన్నారు. ! సీసీ కెమెరా డీవీఆర్ లను రహస్య ప్రదేశాల్లో ఉంచి, మొబైల్ యాప్ ద్వారా పర్యవేక్షణ కొనసాగించాలన్నారు. ! బయట, ప్రయాణంలో, ముగ్గులు వేస్తున్నప్పుడు మెడలోని ఆభరణాలను జాగ్రత్తగా కవర్ చేసుకోవాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి పోలీసులకు సమాచారం చేరవేయాలన్నారు. మండలంలోని ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే దొంగతనాలను అరికట్టడం సాధ్యమవుతుందని ఎస్ ఐ సోమేశ్వరి పేర్కొన్నారు.

19 hrs ago
user_Yahia Ahmed
Yahia Ahmed
కొండపూర్, సంగారెడ్డి, తెలంగాణ•
19 hrs ago
35402f29-eb79-409e-a568-12c8f5dc4a61

More news from తెలంగాణ and nearby areas
  • సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం) గా చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయ సిబ్బంది నూతన అదనపు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ తన విధులను సమర్ధవంతంగా నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు.
    2
    సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్ విభాగం) గా చైతన్య రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఎస్పీ పరితోష్ పంకజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యాలయ సిబ్బంది నూతన అదనపు ఎస్పీని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆమె మాట్లాడుతూ తన విధులను సమర్ధవంతంగా నిర్వహించేలా కృషి చేస్తానని చెప్పారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
  • వికారాబాద్, నవాబ్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లను అందజేసింది. అందులో భాగంగా నూతనంగా నవాబుపేట మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టీచర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు గ్రామీణ స్థాయిలో చిన్నారుల అభివృద్ధికి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వం అందజేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వారి పనితీరును మరింత సులభతరం చేస్తాయని టెక్నాలజీ సహాయంతో సేవలను వేగవంతంగా పారదర్శకంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
    1
    వికారాబాద్, నవాబ్ పేట్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేసేందుకు అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ఫోన్లను అందజేసింది. అందులో భాగంగా నూతనంగా నవాబుపేట మండల పరిధిలోని అంగన్వాడీ టీచర్లకు మంగళవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య టీచర్లకు స్మార్ట్ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడి టీచర్లు గ్రామీణ స్థాయిలో చిన్నారుల అభివృద్ధికి గర్భిణీ స్త్రీల ఆరోగ్యానికి కీలకపాత్ర పోషిస్తున్నారని ప్రభుత్వం అందజేస్తున్న ఈ స్మార్ట్ ఫోన్లు వారి పనితీరును మరింత సులభతరం చేస్తాయని టెక్నాలజీ సహాయంతో సేవలను వేగవంతంగా పారదర్శకంగా ప్రజలకు చేరవేయడం సాధ్యమవుతుందని తెలిపారు.
    user_Thanmai Sri
    Thanmai Sri
    Vikarabad, Telangana•
    22 hrs ago
  • ఆర్టీసీ సమ్మె బీఆర్ఎస్ నాయకుల కుట్ర కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు ఈ కుట్ర చేస్తున్నాడు – మంత్రి పొన్నం ప్రభాకర్
    1
    ఆర్టీసీ సమ్మె బీఆర్ఎస్ నాయకుల కుట్ర 
కేసీఆర్ ఆదేశాల మేరకు హరీష్ రావు ఈ కుట్ర చేస్తున్నాడు – మంత్రి పొన్నం ప్రభాకర్
    user_TGN BHARAT NEWS
    TGN BHARAT NEWS
    కూకట్‌పల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    3 hrs ago
  • సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి, డబ్బులు లేక ఇంటి డాబాపై గంజాయి మొక్కలు పెంచుతున్న టెక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా నాగారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సి. శశిధర్ అనే వ్యక్తి, తన ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఈ పనికి ఒడిగట్టినట్లు తెలిపారు. పోలీసులు సుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
    1
    సాఫ్ట్‌వేర్ ఉద్యోగం మానేసి, డబ్బులు లేక ఇంటి డాబాపై గంజాయి మొక్కలు పెంచుతున్న టెక్కీని పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ జిల్లా నాగారంలోని తూర్పు గాంధీనగర్‌కు చెందిన సి. శశిధర్ అనే వ్యక్తి, తన ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత గంజాయి కొనడానికి డబ్బులు లేకపోవడంతో ఈ పనికి ఒడిగట్టినట్లు తెలిపారు. పోలీసులు సుమారు 10 కేజీల గంజాయిని, 17 గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
    user_Telangana news
    Telangana news
    మేడ్చల్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, తెలంగాణ•
    10 hrs ago
  • ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్
    1
    ఆర్టీసీ కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకోండి: మంత్రి పొన్నం ప్రభాకర్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    23 hrs ago
  • మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా లో మెదక్ డిపో నుంచి 100 బస్సులు, నర్సాపూర్ డిపో 27 బస్సులను నడుపుతున్నట్లు, ఇందులో ఆర్టీసీ లో నడుపుతున్న ప్రైవేట్ 35 నుంచి 40 బస్సులను మెదక్ నుంచి, నర్సాపూర్ నుంచి 03 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక కండక్టర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్స్ గా పని చేసిన వారిని సైతం తీసుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ సర్వీస్ బస్సులను కూడా ఎంగేజ్ చేసుకుని నడపనున్నట్లు ఆమె వివరించారు.
    1
    మెదక్ జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మెదక్ జిల్లా లో మెదక్ డిపో నుంచి 100 బస్సులు, నర్సాపూర్ డిపో 27 బస్సులను నడుపుతున్నట్లు, ఇందులో ఆర్టీసీ లో నడుపుతున్న ప్రైవేట్ 35 నుంచి 40 బస్సులను మెదక్ నుంచి, నర్సాపూర్ నుంచి 03 బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తాత్కాలిక కండక్టర్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఆర్టీసీ డ్రైవర్స్ గా పని చేసిన వారిని సైతం తీసుకుని ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రైవేట్ సర్వీస్ బస్సులను కూడా ఎంగేజ్ చేసుకుని నడపనున్నట్లు ఆమె వివరించారు.
    user_MERCY
    MERCY
    Local News Reporter మెదక్, మెదక్, తెలంగాణ•
    3 hrs ago
  • ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రయాణికులు అత్యవసరంగా ఉంటే తప్ప ప్రయాణాలు చేయొద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు అంత్యక్రియలకు వెళ్లేవారికి ఆసుపత్రులకు వెళ్లే వారికోసం అత్యవసర సర్వీసులకు సందర్భంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని ప్రజలు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ప్రైవేట్ బస్సులు తాత్కాలిక సిబ్బందితో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రెవెన్యూ పోలీస్ సమన్వయంతో బస్సుల నిర్వహిస్తామని తెలిపారు ఎవరికైనా అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పారు కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్9391942254కు పది నిమిషాలలో రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు .
    1
    ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రయాణికులు అత్యవసరంగా ఉంటే తప్ప ప్రయాణాలు చేయొద్దని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు బుధవారం ఉదయం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించారు అంత్యక్రియలకు వెళ్లేవారికి ఆసుపత్రులకు వెళ్లే వారికోసం అత్యవసర సర్వీసులకు సందర్భంగా రవాణా సౌకర్యం కల్పిస్తామని ప్రజలు ఇబ్బందులు లేకుండా చూస్తామని అన్నారు ప్రైవేట్ బస్సులు తాత్కాలిక సిబ్బందితో నడిపేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు రెవెన్యూ పోలీస్ సమన్వయంతో బస్సుల నిర్వహిస్తామని తెలిపారు ఎవరికైనా అత్యవసరమైతే కంట్రోల్ రూమ్ నెంబర్ కు ఫోన్ చేయాలని చెప్పారు కంట్రోల్ రూమ్ సెల్ నెంబర్9391942254కు పది నిమిషాలలో రవాణా సదుపాయం ఏర్పాటు చేస్తామన్నారు
.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    Medak, Telangana•
    3 hrs ago
  • ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం పాల్గొన్నారు.
    1
    ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా సీపీఎం ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్ ముందు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జిల్లా కార్యదర్శి జయరాజ్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల ముందు ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాణిక్యం పాల్గొన్నారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.