logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తపాల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద ప్రమాదకర కొమ్మ.. అటవీ శాఖ స్పందించాలంటున్న ప్రజలు జన్నారం–లక్షెట్టిపేట ప్రధాన రహదారిపై తపాల్‌పూర్ చెక్‌పోస్ట్ సమీపంలో విరిగిన భారీ చెట్టు కొమ్మ రోడ్డుపై ప్రమాదకరంగా వేలాడుతోంది. నిత్యం వందలాది వాహనాలు, ఆర్టీసీ, పాఠశాల బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్‌పోస్ట్‌కు సమీపంలోనే ఈ పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. తక్షణమే కొమ్మను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

18 hrs ago
user_తుడుం జితేందర్
తుడుం జితేందర్
Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
18 hrs ago

తపాల్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద ప్రమాదకర కొమ్మ.. అటవీ శాఖ స్పందించాలంటున్న ప్రజలు జన్నారం–లక్షెట్టిపేట ప్రధాన రహదారిపై తపాల్‌పూర్ చెక్‌పోస్ట్ సమీపంలో విరిగిన భారీ చెట్టు కొమ్మ రోడ్డుపై ప్రమాదకరంగా వేలాడుతోంది. నిత్యం వందలాది వాహనాలు, ఆర్టీసీ, పాఠశాల బస్సులు ఈ మార్గంలో ప్రయాణిస్తుండటంతో ఎప్పుడైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చెక్‌పోస్ట్‌కు సమీపంలోనే ఈ పరిస్థితి ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. తక్షణమే కొమ్మను తొలగించి ప్రమాదాన్ని నివారించాలని ప్రజలు కోరుతున్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ సర్వీస్ రావాలి: ఎమ్మెల్యే సూచన ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగే అటవీశాఖ అధికారులలో ఫ్రెండ్లీ సర్వీస్ రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో అటవీశాఖ పనితీరుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలుప్ చేశారు. అడవులు, వన్యప్రాణుల రక్షణకు తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో అడవులలో ఉండే ఆదివాసులతో పాటు ప్రజలతో మంచిగా వ్యవహరించే తీరును నేర్చుకోవాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్పంచులు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తుంటారని, వారికి మర్యాదనిస్తూ అధికారులు సమాధానం చెప్పాలని సూచించారు. అటవీశాఖ శాఖ అధికారుల పనితీరుతో పాటు వ్యవహరించే తీరులోనూ మార్పు వచ్చి ప్రజల మద్దతు పొందాలని ఆయన కోరారు.
    1
    ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఫ్రెండ్లీ సర్వీస్ రావాలి: ఎమ్మెల్యే సూచన
ప్రజలతో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగే అటవీశాఖ అధికారులలో ఫ్రెండ్లీ సర్వీస్ రావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన సాధారణ సమావేశంలో అటవీశాఖ పనితీరుపై ఆయన ఆసక్తికర వ్యాఖ్యలుప్ చేశారు. అడవులు, వన్యప్రాణుల రక్షణకు తమ మద్దతు ఉంటుందన్నారు. అదే సమయంలో అడవులలో ఉండే ఆదివాసులతో పాటు ప్రజలతో మంచిగా వ్యవహరించే తీరును నేర్చుకోవాలన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు సర్పంచులు అటవీశాఖ అధికారులకు ఫోన్ చేస్తుంటారని, వారికి మర్యాదనిస్తూ అధికారులు సమాధానం చెప్పాలని సూచించారు. అటవీశాఖ శాఖ అధికారుల పనితీరుతో పాటు వ్యవహరించే తీరులోనూ మార్పు వచ్చి ప్రజల మద్దతు పొందాలని ఆయన కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    6 hrs ago
  • ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ.. స్థానిక ఉద్యోగాలు, కార్మికుల సమస్యలపై వినతి న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి రామగుండం 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కాలుష్య నివారణ, మాతంగి కాలనీలకు R&R ప్యాకేజీలు, కార్మికుల గ్రేడ్ అప్‌గ్రేడ్, మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనల సడలింపు తదితర అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాలను సానుకూలంగా పరిశీలిస్తామని NTPC ఛైర్మన్ హామీ ఇచ్చారు.
    1
    ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ.. స్థానిక ఉద్యోగాలు, కార్మికుల సమస్యలపై వినతి
న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి రామగుండం 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కాలుష్య నివారణ, మాతంగి కాలనీలకు R&R ప్యాకేజీలు, కార్మికుల గ్రేడ్ అప్‌గ్రేడ్, మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనల సడలింపు తదితర అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాలను సానుకూలంగా పరిశీలిస్తామని NTPC ఛైర్మన్ హామీ ఇచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • మీరు కట్టిన కాళేశ్వరం ఏమైంది జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు నందయ్యా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
    1
    మీరు కట్టిన కాళేశ్వరం ఏమైంది జగిత్యాల జిల్లా డిసిసి అధ్యక్షులు నందయ్యా రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నాయకులు జువ్వడి కృష్ణారావు
    user_MD. YOUSUF ALI KHAN
    MD. YOUSUF ALI KHAN
    కోరుట్ల, జగిత్యాల, తెలంగాణ•
    2 hrs ago
  • ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ మద్దతు | హైదరాబాద్ | ఆగస్టు 04: తెలంగాణ రక్షణ సేన నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ నిరంతరం అండగా నిలిచి, వారి డిమాండ్లు నెరవేరే వరకు పోరాటానికి పూర్తి మద్దతు అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి గణేష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    1
    ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ మద్దతు
| హైదరాబాద్ | ఆగస్టు 04:
తెలంగాణ రక్షణ సేన నాయకురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల ధర్నాకు సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటించింది.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
లేనిపక్షంలో ఆర్టీసీ కార్మికులు, రిటైర్డ్ ఉద్యోగుల హక్కుల కోసం తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ నిరంతరం అండగా నిలిచి, వారి డిమాండ్లు నెరవేరే వరకు పోరాటానికి పూర్తి మద్దతు అందిస్తామని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్, భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎత్తరి గణేష్తో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
    user_Thalapalli Ramesh
    Thalapalli Ramesh
    బెల్లంపల్లె, మంచిర్యాల, తెలంగాణ•
    7 hrs ago
  • ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, విద్యార్థులకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని నిర్వహించారు.
    1
    ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి – బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుల సంధ్యారాణి
భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు, విద్యార్థులకు ప్రభుత్వం పెండింగ్‌లో ఉంచిన ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రామగుండం బీజేవైఎం ఆధ్వర్యంలో గోదావరిఖనిలోని పలు కళాశాలల్లో "ఫీజుల బకాయి – బీజేపీ లడాయి" కార్యక్రమాన్ని నిర్వహించారు.
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    7 hrs ago
  • రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటిని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ప్రత్యేక చొరవతో స్వర్ణ ప్రాజెక్టు నుంచి జౌళి నాలా ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 100 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాల పంట పొలాలకు సాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేశారు. వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమైన నేపథ్యంలో, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో దిగువ ప్రాంతాల్లోని వేల ఎకరాల పంటలకు సాగునీటి అందుబాటు మెరుగుపడి, రైతులు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా, స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను నివారిస్తూ, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రాజెక్టు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో ఈ నీటి విడుదలను పెంచనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి విలాస్,జిలా BJYM అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావు, బడి పోతన్న, వెంకటేష్, జౌళి గ్రామ సర్పంచ్ కొమ్ము సురేందర్, చెన్న రాజేశ్వర్, తిరుమల చారి, విజయ్, నారాయణ, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు అనిల్, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    1
    రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి.
సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటిని
బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ప్రత్యేక చొరవతో స్వర్ణ ప్రాజెక్టు నుంచి జౌళి నాలా ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 100 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాల పంట పొలాలకు సాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేశారు.
వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమైన నేపథ్యంలో, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో దిగువ ప్రాంతాల్లోని వేల ఎకరాల పంటలకు సాగునీటి అందుబాటు మెరుగుపడి, రైతులు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
అదేవిధంగా, స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను నివారిస్తూ, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రాజెక్టు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు.
రైతుల సంక్షేమమే లక్ష్యంగా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో ఈ నీటి విడుదలను పెంచనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో  మండల అధ్యక్షులు నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి విలాస్,జిలా BJYM అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావు, బడి పోతన్న, వెంకటేష్, జౌళి గ్రామ సర్పంచ్ కొమ్ము సురేందర్, చెన్న రాజేశ్వర్,  తిరుమల చారి, విజయ్, నారాయణ, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు అనిల్, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
    user_SIDDU.ASRC
    SIDDU.ASRC
    నిర్మల్, తెలంగాణ•
    7 hrs ago
  • మౌలిక సౌకర్యాలపై సర్పంచులు దృష్టి పెట్టాలని కోరిన ఎమ్మెల్యే గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధన్యత ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. ఆరుతడి పంటలను వేయాలని రైతులను ఎమ్మెల్యే కోరారు
    1
    మౌలిక సౌకర్యాలపై సర్పంచులు దృష్టి పెట్టాలని కోరిన ఎమ్మెల్యే 
గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధన్యత ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. ఆరుతడి పంటలను వేయాలని రైతులను ఎమ్మెల్యే కోరారు
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    12 hrs ago
  • విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనుపరావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భాజపా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీసి అనంతరం ఆర్డిఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అనుప్ రావు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులతో చలగాటమాడుతుందని వెంటనే విడుదల చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు పలువురు నాయకులు పాల్గొన్నారు.
    1
    విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలి
విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనుపరావు డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో భాజపా ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీసి అనంతరం ఆర్డిఓ కార్యాలయ అధికారికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా అనుప్ రావు మాట్లాడుతూ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం విద్యార్థులతో చలగాటమాడుతుందని వెంటనే విడుదల చేయకుంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో భాజపా జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు పలువురు నాయకులు పాల్గొన్నారు.
    user_Vsk
    Vsk
    Metpalli, Jagitial•
    8 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.