logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటిని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ప్రత్యేక చొరవతో స్వర్ణ ప్రాజెక్టు నుంచి జౌళి నాలా ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 100 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాల పంట పొలాలకు సాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేశారు. వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమైన నేపథ్యంలో, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో దిగువ ప్రాంతాల్లోని వేల ఎకరాల పంటలకు సాగునీటి అందుబాటు మెరుగుపడి, రైతులు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా, స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను నివారిస్తూ, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రాజెక్టు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో ఈ నీటి విడుదలను పెంచనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి విలాస్,జిలా BJYM అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావు, బడి పోతన్న, వెంకటేష్, జౌళి గ్రామ సర్పంచ్ కొమ్ము సురేందర్, చెన్న రాజేశ్వర్, తిరుమల చారి, విజయ్, నారాయణ, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు అనిల్, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

5 hrs ago
user_SIDDU.ASRC
SIDDU.ASRC
నిర్మల్, తెలంగాణ•
5 hrs ago

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సాగునీరు విడుదల చేసిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టు నుంచి దిగువ ప్రాంతాల రైతులకు సాగునీటిని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విడుదల చేశారు. ప్రత్యేక చొరవతో స్వర్ణ ప్రాజెక్టు నుంచి జౌళి నాలా ద్వారా 80 క్యూసెక్కులు, లెఫ్ట్ కెనాల్ ద్వారా 20 క్యూసెక్కుల నీటిని మొత్తంగా 100 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతాల పంట పొలాలకు సాగునీటి అవసరాల నిమిత్తం విడుదల చేశారు. వ్యవసాయానికి సాగునీరు అత్యంత కీలకమైన నేపథ్యంలో, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ నీటి విడుదలతో దిగువ ప్రాంతాల్లోని వేల ఎకరాల పంటలకు సాగునీటి అందుబాటు మెరుగుపడి, రైతులు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. అదేవిధంగా, స్వర్ణ ప్రాజెక్టు గేట్ల లీకేజీలను క్షుణ్ణంగా పరిశీలించి, అవసరమైన మరమ్మత్తు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశించారు. నీటి వృథాను నివారిస్తూ, సాగునీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రాజెక్టు నిర్వహణను సమర్థవంతంగా చేపట్టాలని అధికారులకు సూచించారు. రైతుల సంక్షేమమే లక్ష్యంగా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతులు కల్పించడంలో మరియు సాగునీటి సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తూ రైతులకు అండగా నిలుస్తున్నామని, రైతుల అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో ఈ నీటి విడుదలను పెంచనున్నట్లు ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, ప్రధాన కార్యదర్శి విలాస్,జిలా BJYM అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, బీజేపీ నాయకులు రాంశంకర్ రెడ్డి, సాహెబ్ రావు, బడి పోతన్న, వెంకటేష్, జౌళి గ్రామ సర్పంచ్ కొమ్ము సురేందర్, చెన్న రాజేశ్వర్, తిరుమల చారి, విజయ్, నారాయణ, కోరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, కార్యకర్తలు ఇరిగేషన్ శాఖ అధికారులు అనిల్, రైతులు, పరిసర గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • ఖానాపూర్ పొడి వడ్ల చల్లుతూ నరు మడి సిద్ధం చేసుకుంటున్న మహిళ రైతు ఖానపూర్ ‌సదర్ మార్ట్ అయీ కిందా పోయినవా నా కలం మొన్న టి యాసంగి పెట్టిన పెట్టుబడి రాలేక పోయమని ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని తొందరగా నీటిని వదులుతే దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే గారిని నీటి శాఖ అధికారులను మహిళా రైతు కోరుకుంటున్నారు
    1
    ఖానాపూర్      పొడి వడ్ల చల్లుతూ నరు  మడి సిద్ధం చేసుకుంటున్న మహిళ రైతు 
ఖానపూర్  ‌సదర్ మార్ట్  అయీ కిందా   పోయినవా నా కలం మొన్న టి యాసంగి  పెట్టిన పెట్టుబడి రాలేక  పోయమని  ఇప్పుడైనా సదర్ మార్ట్  కెనాల్  ద్వారా నీటిని విడుదల చేయాలని  తొందరగా నీటిని వదులుతే దిగుబడి వచ్చే అవకాశం ఉందని    ఎమ్మెల్యే గారిని  నీటి  శాఖ అధికారులను మహిళా రైతు కోరుకుంటున్నారు
    user_ఆకుల  శ్రీనివాస్
    ఆకుల శ్రీనివాస్
    Farmer ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    12 hrs ago
  • ఖానాపూర్ లో వర్షం పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో రాత్రి నుండి మోస్తారుగా కురిసిన వర్షం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో రాత్రి నుండి మోస్తారు వర్షం కురుస్తుంది ఆకాశమంత మెగవృతమై నల్లటి మబ్బులతో కమ్ముకొని వర్షం కురుస్తుంది దీనితో రోడ్లపై డ్రైనేజీలలో వరద నీరు ప్రవహిస్తుంది
    1
    ఖానాపూర్ లో వర్షం 
పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో రాత్రి నుండి మోస్తారుగా కురిసిన వర్షం
నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో రాత్రి నుండి మోస్తారు వర్షం కురుస్తుంది ఆకాశమంత మెగవృతమై నల్లటి మబ్బులతో కమ్ముకొని వర్షం కురుస్తుంది దీనితో రోడ్లపై డ్రైనేజీలలో వరద నీరు ప్రవహిస్తుంది
    user_Dasari krishna murthy
    Dasari krishna murthy
    ఖానాపూర్, నిర్మల్, తెలంగాణ•
    14 hrs ago
  • Think big. 🎯 Lead bold. 💪 Put India first. 🇮🇳 𝐓𝐡𝐚𝐭’𝐬 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢. 𝐁𝐨𝐬𝐬 𝐌𝐨𝐝𝐞, 𝟐𝟒×𝟕. 😎 Think big. 🎯 Lead bold. 💪 Put India first. 🇮🇳 𝐓𝐡𝐚𝐭’𝐬 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢. 𝐁𝐨𝐬𝐬 𝐌𝐨𝐝𝐞, 𝟐𝟒×𝟕. 😎
    1
    Think big. 🎯
Lead bold. 💪
Put India first. 🇮🇳
𝐓𝐡𝐚𝐭’𝐬 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢. 𝐁𝐨𝐬𝐬 𝐌𝐨𝐝𝐞, 𝟐𝟒×𝟕. 😎
Think big. 🎯
Lead bold. 💪
Put India first. 🇮🇳
𝐓𝐡𝐚𝐭’𝐬 𝐏𝐌 𝐌𝐨𝐝𝐢. 𝐁𝐨𝐬𝐬 𝐌𝐨𝐝𝐞, 𝟐𝟒×𝟕. 😎
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ.. స్థానిక ఉద్యోగాలు, కార్మికుల సమస్యలపై వినతి న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి రామగుండం 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కాలుష్య నివారణ, మాతంగి కాలనీలకు R&R ప్యాకేజీలు, కార్మికుల గ్రేడ్ అప్‌గ్రేడ్, మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనల సడలింపు తదితర అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాలను సానుకూలంగా పరిశీలిస్తామని NTPC ఛైర్మన్ హామీ ఇచ్చారు.
    1
    ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ.. స్థానిక ఉద్యోగాలు, కార్మికుల సమస్యలపై వినతి
న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి రామగుండం 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కాలుష్య నివారణ, మాతంగి కాలనీలకు R&R ప్యాకేజీలు, కార్మికుల గ్రేడ్ అప్‌గ్రేడ్, మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనల సడలింపు తదితర అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాలను సానుకూలంగా పరిశీలిస్తామని NTPC ఛైర్మన్ హామీ ఇచ్చారు.
    user_తుడుం జితేందర్
    తుడుం జితేందర్
    Local News Reporter జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలు మంజూరు చేయాలి: గణేష్ మహారాజ్ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, స్థలమున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని దళిత శక్తి ప్రోగ్రామ్ రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల్ల గణేష్ మహారాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందించారు. గత పాతికేళ్లుగా అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేదలను గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
    1
    అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలు మంజూరు చేయాలి: గణేష్ మహారాజ్
అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, స్థలమున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని దళిత శక్తి ప్రోగ్రామ్ రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల్ల గణేష్ మహారాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందించారు. గత పాతికేళ్లుగా అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేదలను గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    7 hrs ago
  • మౌలిక సౌకర్యాలపై సర్పంచులు దృష్టి పెట్టాలని కోరిన ఎమ్మెల్యే గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధన్యత ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. ఆరుతడి పంటలను వేయాలని రైతులను ఎమ్మెల్యే కోరారు
    1
    మౌలిక సౌకర్యాలపై సర్పంచులు దృష్టి పెట్టాలని కోరిన ఎమ్మెల్యే 
గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధన్యత ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. ఆరుతడి పంటలను వేయాలని రైతులను ఎమ్మెల్యే కోరారు
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    9 hrs ago
  • మాజీ ఎంపీ సోయం బాపూరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు గుడిహత్నూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరారు. వారికి మాజీ ఎంపీ సోయం బాపూరావు, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్, భోజ రెడ్డి తదితరులున్నారు.
    1
    మాజీ ఎంపీ సోయం బాపూరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
గుడిహత్నూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరారు. వారికి మాజీ ఎంపీ సోయం బాపూరావు, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్, భోజ రెడ్డి తదితరులున్నారు.
    user_Mallaiah Potta
    Mallaiah Potta
    Local News Reporter ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    9 hrs ago
  • ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన సర్పంచులు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక సమస్యను పరిష్కరించాలని జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామ సర్పంచ్ దినేష్ నాయక్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన సమస్యలు తెలిపారు. వాగులు నుండి ఇసుకను అటవీ అధికారులు తెనీయడం లేదని, దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను పలువురు సర్పంచులు కోరారు.
    1
    ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన సర్పంచులు
గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక సమస్యను పరిష్కరించాలని జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామ సర్పంచ్ దినేష్ నాయక్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన సమస్యలు తెలిపారు. వాగులు నుండి ఇసుకను అటవీ అధికారులు తెనీయడం లేదని, దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను పలువురు సర్పంచులు కోరారు.
    user_P.G. Murthy
    P.G. Murthy
    జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
    10 hrs ago
  • ఆదిలాబాద్ జిల్లా ఆగస్టు 04 :- *14 గంజాయి మొక్కలు, 10 గ్రాముల ఎండిన గంజాయి స్వాధీనం *పత్రికా ప్రకటన* * *మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్.. బేల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు* *మహారాష్ట్రలోని వ్యవసాయ భూమిలో గంజాయి సాగు* *జైనథ్ సీఐ జి శ్రావణ్.* జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా బేల పోలీస్ స్టేషన్ పరిధిలో జైనథ్ సీఐ జి. శ్రావణ్ పర్యవేక్షణలో, బేల ఎస్సై మధు కృష్ణకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బేల మార్కెట్ యార్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. పోలీసు వాహనాన్ని గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని, నిబంధనల ప్రకారం సోదా నిర్వహించగా అతని వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్‌లో 10 గ్రాముల ఎండిన గంజాయి లభించింది. అనంతరం నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మహారాష్ట్రలోని అతని వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న 14 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు తన పేరు *భీమా గోవింద్ ఆత్రం (61), s/o గోవింద్ ఆత్రం,* తిప్ప గ్రామం, కోర్పన తాలూకా, చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర అని తెలిపాడు. తన వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్య గంజాయి మొక్కలను పెంచుతూ, వాటిని ఎండబెట్టి మహారాష్ట్రతో పాటు తెలంగాణలో విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అతని సమాచారంతో మహారాష్ట్రలోని వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న 14 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై బేల పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ జి. శ్రావణ్, బేల ఎస్సై మధు కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    1
    ఆదిలాబాద్ జిల్లా
ఆగస్టు 04 :-

*14 గంజాయి మొక్కలు, 10 గ్రాముల ఎండిన గంజాయి స్వాధీనం
*పత్రికా ప్రకటన*
*
*మహారాష్ట్రకు చెందిన నిందితుడి అరెస్ట్.. బేల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు*
*మహారాష్ట్రలోని వ్యవసాయ భూమిలో గంజాయి సాగు*
*జైనథ్ సీఐ జి శ్రావణ్.*
జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు చేపడుతున్న ప్రత్యేక చర్యల్లో భాగంగా బేల పోలీస్ స్టేషన్ పరిధిలో 
జైనథ్ సీఐ జి. శ్రావణ్ పర్యవేక్షణలో, బేల ఎస్సై మధు కృష్ణకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు బేల మార్కెట్ యార్డు వద్ద తనిఖీలు నిర్వహించారు. పోలీసు వాహనాన్ని గమనించి పారిపోవడానికి ప్రయత్నించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని, నిబంధనల ప్రకారం సోదా నిర్వహించగా అతని వద్ద ఉన్న ప్లాస్టిక్ కవర్‌లో 10 గ్రాముల ఎండిన గంజాయి లభించింది. అనంతరం నిందితుడు ఇచ్చిన సమాచారం మేరకు మహారాష్ట్రలోని అతని వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న 14 గంజాయి మొక్కలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు తన పేరు *భీమా గోవింద్ ఆత్రం (61), s/o గోవింద్ ఆత్రం,*  తిప్ప గ్రామం, కోర్పన తాలూకా, చంద్రపూర్ జిల్లా, మహారాష్ట్ర అని తెలిపాడు. తన వ్యవసాయ భూమిలో పత్తి పంట మధ్య గంజాయి మొక్కలను పెంచుతూ, వాటిని ఎండబెట్టి మహారాష్ట్రతో పాటు తెలంగాణలో విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు. అతని సమాచారంతో మహారాష్ట్రలోని వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్న 14 గంజాయి మొక్కలను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడిపై బేల పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో జైనథ్ సీఐ జి. శ్రావణ్, బేల ఎస్సై మధు కృష్ణ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
    user_Musku Rajkiran Reddy
    Musku Rajkiran Reddy
    ఆదిలాబాద్ అర్బన్, ఆదిలాబాద్, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.