Shuru
Apke Nagar Ki App…
అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలు మంజూరు చేయాలి: గణేష్ మహారాజ్ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, స్థలమున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని దళిత శక్తి ప్రోగ్రామ్ రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల్ల గణేష్ మహారాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందించారు. గత పాతికేళ్లుగా అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేదలను గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
Mallaiah Potta
అర్హులైన పేదలకు ఇండ్లు, స్థలాలు మంజూరు చేయాలి: గణేష్ మహారాజ్ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు, స్థలమున్న వారికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని దళిత శక్తి ప్రోగ్రామ్ రాష్ట్ర కన్వీనర్ అగ్గిమల్ల గణేష్ మహారాజ్ డిమాండ్ చేశారు. మంగళవారం ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందించారు. గత పాతికేళ్లుగా అద్దె ఇళ్లల్లో ఉంటూ ఇబ్బందులు పడుతున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ పేదలను గుర్తించి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
More news from తెలంగాణ and nearby areas
- మాజీ ఎంపీ సోయం బాపూరావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు గుడిహత్నూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో మంగళవారం చేరారు. వారికి మాజీ ఎంపీ సోయం బాపూరావు, DCC అధ్యక్షుడు నరేష్ జాదవ్ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమానికి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు నాయకులు పేర్కొన్నారు. బోథ్ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ ఆడే గజేందర్, భోజ రెడ్డి తదితరులున్నారు.1
- నిర్మల్‌లో రహదారి ప్రమాదాల నివారణకు మున్సిపల్ చర్యలు.... నిర్మల్ పట్టణంలో రహదారి ప్రమాదాలను నివారించేందుకు నిర్మల్ మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రహదారులపై సంచరిస్తున్న పశువులను తొలగించే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. రహదారులపై పశువులు వదలకుండా ఉండాలని పశువుల యజమానులకు గతంలోనే పలుమార్లు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు. అయినప్పటికీ పశువులను రోడ్లపైకి వదులుతున్న యజమానులపై చర్యలు తీసుకుంటున్నారు. రహదారిపై పశువులను వదిలిన ప్రతి యజమానికి రూ.500 చొప్పున జరిమానా విధించారు. ఇకపై పశువులు రహదారులపైకి వస్తే వాటిని స్వాధీనం చేసుకుని గోశాలకు తరలిస్తామని యజమానులను హెచ్చరించారు. ప్రజల భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ సహకరించాలని మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేశారు.1
- ఖానాపూర్ పొడి వడ్ల చల్లుతూ నరు మడి సిద్ధం చేసుకుంటున్న మహిళ రైతు ఖానపూర్ సదర్ మార్ట్ అయీ కిందా పోయినవా నా కలం మొన్న టి యాసంగి పెట్టిన పెట్టుబడి రాలేక పోయమని ఇప్పుడైనా సదర్ మార్ట్ కెనాల్ ద్వారా నీటిని విడుదల చేయాలని తొందరగా నీటిని వదులుతే దిగుబడి వచ్చే అవకాశం ఉందని ఎమ్మెల్యే గారిని నీటి శాఖ అధికారులను మహిళా రైతు కోరుకుంటున్నారు1
- ఖానాపూర్ లో వర్షం పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో రాత్రి నుండి మోస్తారుగా కురిసిన వర్షం నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాలలో రాత్రి నుండి మోస్తారు వర్షం కురుస్తుంది ఆకాశమంత మెగవృతమై నల్లటి మబ్బులతో కమ్ముకొని వర్షం కురుస్తుంది దీనితో రోడ్లపై డ్రైనేజీలలో వరద నీరు ప్రవహిస్తుంది1
- ఛైర్మన్‌తో ఎంపీ గడ్డం వంశీకృష్ణ భేటీ.. స్థానిక ఉద్యోగాలు, కార్మికుల సమస్యలపై వినతి న్యూఢిల్లీలో NTPC ఛైర్మన్ గురుదీప్ సింగ్‌ను పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ కలిసి రామగుండం 800×3 మెగావాట్ల విస్తరణ ప్రాజెక్టులో స్థానిక యువతకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని కోరారు. కాలుష్య నివారణ, మాతంగి కాలనీలకు R&R ప్యాకేజీలు, కార్మికుల గ్రేడ్ అప్‌గ్రేడ్, మెడికల్ ఫిట్‌నెస్ నిబంధనల సడలింపు తదితర అంశాలను ప్రస్తావించారు. అన్ని విషయాలను సానుకూలంగా పరిశీలిస్తామని NTPC ఛైర్మన్ హామీ ఇచ్చారు.1
- మౌలిక సౌకర్యాలపై సర్పంచులు దృష్టి పెట్టాలని కోరిన ఎమ్మెల్యే గ్రామాల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రాధన్యత ఇవ్వాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు సూచించారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశం ఆయన పాల్గొన్నారు. గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీలు తదితర మౌలిక సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాలన్నారు. ఆరుతడి పంటలను వేయాలని రైతులను ఎమ్మెల్యే కోరారు1
- दिल्ली के पूर्व मुख्यमंत्री (अरविंद केजरीवाल), जो अपनी राजनीतिक विफलताओं के बोझ तले दबे हुए हैं, एक बार फिर अपने समर्थकों की मुट्ठी भर भीड़ के साथ अपना पुराना नाटक रचाते और अपने चिर-परिचित अंदाज में बेबुनियाद व गैर-जिम्मेदाराना आरोप लगाते नजर आए। वह खुद को एक उच्च शिक्षित नेता और IIT स्नातक होने का दावा करते हैं, फिर भी बिना किसी तथ्यात्मक आधार के गंभीर मुद्दों पर बोलने की उनकी आदत रही है। मैं सभी को याद दिलाना चाहूंगा कि कोविड-19 महामारी के दौरान उन्होंने सवाल उठाया था कि वैक्सीन का फॉर्मूला सभी के साथ साझा क्यों नहीं किया जा रहा है? ध्यान देने योग्य बात यह है कि वह मैकेनिकल इंजीनियरिंग में स्नातक हैं। इसके बावजूद, E20 ईंधन के मुद्दे पर उन्होंने बिना किसी शोध या तथ्यात्मक साक्ष्य के दावे किए हैं और एक बार फिर छोटी सी सभा के सामने नाटक का सहारा लिया है। इससे यह साफ पता चलता है कि वह एक बार फिर भ्रम पैदा करने की कोशिश कर रहे हैं। - डॉ. सुधांशु त्रिवेदी1
- ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు రాక లబ్ధిదారుల అవస్థలు......... ADB: ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకొని నాలుగు నెలలు గడుస్తున్న ప్రభుత్వం తమ ఖాతాలో డబ్బులు జమ చేయడం లేదని తాంసి మండలంలోని కప్పర్ల గ్రామానికి చెందిన లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంకా తమకు 1 లక్ష 60 వేల బిల్లు రావాల్సి ఉందని లబ్ధిదారులు వాపోయారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమ ఖాతాలలో డబ్బులు జమచేసి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలిగించాలని కోరారు.1
- ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను కోరిన సర్పంచులు గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఇసుక సమస్యను పరిష్కరించాలని జన్నారం మండలంలోని కొత్తపేట గ్రామ సర్పంచ్ దినేష్ నాయక్ కోరారు. మంగళవారం మధ్యాహ్నం జన్నారం ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సాధారణ సమావేశంలో ఆయన సమస్యలు తెలిపారు. వాగులు నుండి ఇసుకను అటవీ అధికారులు తెనీయడం లేదని, దీంతో ఇళ్ల నిర్మాణం ఆగిపోయిందని తెలిపారు. ఇసుక సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యేను పలువురు సర్పంచులు కోరారు.1