*ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు* *జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన కలెక్టర్* వివిధ ప్రభుత్వ పథకాల. శకటాలు ప్రదర్శన వివిధ పాఠశాల విద్యార్థనీ విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి మెదక్, జనవరి 26 : భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో 77 రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా పాలనాధికారి కలెక్టరేట్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా విచ్చేసి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. వివిధ శాఖల ద్వారా జిల్లాలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, సాధించిన ప్రగతి గురించి తన ప్రసంగం ద్వారా తెలియజేశారు. మెదక్ నియోజక వర్గ శాసన సభ్యులు మైనంపల్లి రోహిత్ రావు, ఎస్పీ డి. వి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్ నగేష్, అదనపు ఎస్పీ మహేందర్, ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. అంతకుముందు కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో, జిల్లా పాలనాధికారి కలెక్టర్ మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశం గణతంత్ర దేశముగా ఏర్పడి నేటికి 76 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా విచ్చేసిన స్వాతంత్ర సమరయోధులకు, ప్రజాప్రతినిధులకు, జిల్లా పౌరులకు, అధికారులకు మరియు విద్యార్థిని విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు నా నమస్కారాలు మరియు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. తెలిపారు.ఎందరో మహనీయుల త్యాగఫలంగా సిద్దించిన స్వాతంత్య్ర ఫలాలు అందరికీ అందాలని డా|| బాబా సాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే పెద్దదైన, గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రచించి 26-01-1950 రోజున మనకు అందించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాతలైన ఆ మహానీయులను గుర్తుచేసుకొనుట మన భాద్యత. అని గుర్తు చేశారు. తెలంగాణా రాష్ట్ర సాధనలో ఎందరో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైనారు, వారి త్యాగాలను ఈ రాష్ట్రము ఎప్పటికి మరువదు. సాధించిన ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని గౌరవ ప్రజా ప్రతినిధుల, అధికారుల, ప్రజల సహకారంతో ప్రభుత్వ పథకాల అమలులో మెదక్ జిల్లా ఎప్పుడు ముందడుగులోనే ఉంటుందని తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను.అని అన్నారు .ఈ సందర్భముగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో జిల్లా ప్రగతిని, సంక్షేమ పథకాలను మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను.అని తెలిపారు. మహాలక్ష్మి (RTC) మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 3 కోట్ల 62 లక్షల సార్లు మహిళలు ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు. దీని ద్వారా మహిళలకు 126 కోట్ల 57 లక్షల రూపాయల లబ్ది చేకూరింది.అని అన్నారు. గృహజ్యోతి గృహజ్యోతి కార్యక్రమం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించుకుంటున్న అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తుంది. మెదక్ జిల్లాలో ఇప్పటివరకు 1 లక్ష 28 వేల 811 మంది వినియోగదారులకు జీరో బిల్లు జారి చేయడం జరిగింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వం మన జిల్లాలో ఇప్పటివరకు 84 కోట్ల 58 లక్షల సబ్సిడి అందచేసింది. అన్నారు. రైతు భరోసా రైతు భరోసా పథకం కింద ప్రతి ఒక్క రైతుకు ఎకరాకు ఆరు వేల రూపాయల చొప్పున, వానాకాలం 2025-26 సంవత్సరమునకు గాను మొత్తం 2,62,043 మంది రైతుల ఖాతాల్లో 220 కోట్ల 84 లక్షల రూపాయలు జమ కావడం జరిగింది. ఈ పథకం ద్వారా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు సంవత్సరానికి ప్రతి ఎకరాకు 12000/- రూపాయల చొప్పున, అంటే ప్రతి సీజన్ కు 6000/- రూపాయల చొప్పున ఇవ్వడం జరుగుతుంది. అని తెలిపారు. రైతు రుణమాఫీ దేశంలో ఎన్నడు జరగని రీతిలో ఇచ్చిన హామీ మేరకు 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణమాఫీ చేసి రాష్ట్ర ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. 2 లక్షల రూపాయలు వరకు ఏకకాలంలో ఋణ మాఫీ చేయడంతో రాష్ట్రం లోని రైతాంగం నేడు పండగ జరుపుకుంటుంది. మెదక్ జిల్లాలో రైతు రుణమాఫీ పథకం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 87 వేల 491 మంది రైతన్నలకు 645 కోట్ల 41 లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరిగింది అని అన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలుచేయడంతో పాటు, ఈ పథకం ద్వారా పేదలకు కార్పోరేట్ వైద్యాన్ని అందించాలన్న లక్ష్యంతో రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య పరిమితిని 5 లక్షల రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచి అమలు చేస్తున్నాము. ఈ పథకం ద్వారా మెదక్ జిల్లాలో 31 వేల 041 మంది పేదలు చికిత్సలు పొందగలిగారు, అందుకు గాను ప్రభుత్వం 85 కోట్ల 18 లక్షల 47 వేల రూపాయల ప్రభుత్వ ఖర్చుతో నెట్వర్క్ ఆస్పత్రులలో శస్త్ర చికిత్సలు చేయించబడినవి.అని వివరించారు. 500 రూపాయలకే వంట గ్యాస్ ఈ పథకం లో భాగంగా ఇప్పటి వరకు 1,26,961 మంది లబ్దిదారులకు 4,68,195 గ్యాస్ సిలిండర్లు రూ.500/- లకే సప్లై చేయడం జరిగింది మరియు దీనికి గాను ఇప్పటి వరకు 13.18 కోట్ల రూపాయలు సబ్సిసిడి క్రింద ప్రభుత్వం ఖర్చుచేసినది. తెలిపారు. ధాన్యం కొనుగోలు మరియు సన్నాలకు రూ.500 బోనస్ 2 2025-26 ລ້ 1,04,371 ລ້ ລ້ 3,77,914.880 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేసి 902.84 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలలో జమ చేయటం జరిగింది. సన్న ధాన్యం 1,43,212.240 మెట్రిక్ టన్నులు 37,416 మంది రైతుల నుండి సేకరించటం జరిగింది. మరియు క్వింటాలుకు రూ. 500/-ప్రకారం బోనస్ కింద 32,193 రైతుల ఖాతాలలో 61.53 కోట్ల రూపాయలను నేరుగా రైతుల ఖాతాలలో జమచేయటం జరిగింది. అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ఈ పథకము కింద ఇల్లు లేని నిరుపేదలకు 5 లక్షల సబ్సిడి పై రూ.460.45 కోట్లతో మొదటి విడతలో (9209) ఇండ్లు మంజూరి చేయడం అయినది, ఇప్పటికే (6377) ఇండ్ల నిర్మాణ పనులు మొదలయ్యాయి, అందులో భాగంగా నిర్మాణ ప్రగతిని బట్టి (4796) మంది లబ్ది దారులకు వారి ఖాతాలలో రూ.101.29 కోట్లు జమ చేయడం జరిగినది. చెప్పారు. ఉద్యానవన మరియు పట్టు పరిశ్రమ శాఖ ఈ ఆర్థిక సంవత్సరంలో ఆయిల్ పామ్ సాగుకు ఇప్పటి వరకు 371 మంది రైతులచే 1629 ఎకరాల విస్తీర్ణములో 457 లక్షల రూపాయల సబ్సిడీతో ఆయిల్ పామ్ తోటల సాగు చేపట్టడం జరిగినది. మైక్రో ఇరిగేషన్ పథకం ద్వారా 476 మంది రైతులకు 1156 ఎకరాల విస్తీర్ణములో బిందు మరియు తుంపర సేద్య పరికరాలకు 381.64 లక్షల సబ్సిడీ అందించడం జరిగింది. వివరించారు. విద్య మెదక్ జిల్లా లోని రామాయంపేట్ మండలంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్సిషియల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు 200 కోట్ల రూపాయలతో ప్రారంభించడం జరిగిందని తెలుపుటకు సంతోషిస్తున్నాను. అని వెల్లడించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ జిల్లాలో చేయూత పించండ్ల పథకం ద్వారా 1 లక్ష 09 వేల 572 ລ້ లబ్దిదారులకు 24 కోట్ల 52 లక్షల రూపాయలు పించనులు పంపిణి చేయడం జరిగింది.అని అన్నారు. ఈ ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకు లింకేజి ద్వారా 5 వేల 683 సంఘాలకు రూ. 564 కోట్ల 40 లక్షల ఋణాలు అందించడం జరిగింది. 2025-26 సంవత్సరములో 2023-24 మరియు 2024-25 ఆర్థిక సంవత్సరమునకు సంబంధించి వడ్డీ లేని ఋణాలు (VLR) క్రింద 10,574 సంఘాలకు గాను రూ.21.68 కోట్ల వడ్డీ డబ్బులు మంజూరు చేయడం జరిగినది. అని తెలిపారు ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద మెదక్ జిల్లలో 1 లక్ష 94 వేల 322 మహిళలకు ఇందిరా మహిళాశక్తి చీరలు పంపిణీ చేయడం జరిగినది.అని తెలిపారు. మెప్మా ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 450 స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజి ద్వారా 57 కోట్ల 73 లక్షల రూపాయల రుణాన్ని మంజూరి చేయడం జరిగింది. 2023-24 మరియు 2024-25 సంవత్సరమునకు వడ్డీలేని రుణాల పంపకం ద్వారా 854 మహిళా సంఘాలకు 3 కోట్ల 9 లక్షల రూపాయల వడ్డీ డబ్బులు మంజూరి చేయడంజరిగింది. స్త్రీ నిధి పథకం ద్వారా ఇప్పటి వరకు 473 స్వయం సహాయక సంఘ సభ్యులకు 13 కోట్ల 48 లక్షల రూపాయలు ఋణాలు ఇప్పించడం జరిగిందని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన "ఇందిరా మహిళా శక్తి" లో భాగంగా 2025-26 సంవత్సరములో నుండి ఇప్పటి వరకు 152 వ్యక్తిగత యూనిట్ల లక్ష్యం కు 5కోట్ల 38 లక్షల 70 వేల రూపాయలు ఇప్పించడం జరిగింది. ఇందిరా మహిళా శక్తి పధకంలో భాగంగా జిల్లాలో 03 క్యాంటీన్ లు మహిళా సంఘాల ద్వారా నిర్వహించడం జరుగుతుంది. రామాయంపేట్, నర్సాపూర్ మరియు తూప్రాన్ మునిసిపాలిటీలలో 18,480 ఇందిరమ్మ మహిళా శక్తి చీరలు పంపిణి చేయడం అలాగే అటవీ శాఖ జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమం ద్వారా 37 లక్షల 10 వేల మొక్కలు నాటుట లక్ష్యం కాగా ఇప్పటివరకు 38 లక్షల 33 వేల మొక్కలు నాటడం జరిగింది. మత్స్య శాఖ 2025-26 సంవత్సరానికి గాను 100% రాయితీ ఉచిత చేప పిల్లల పంపకం లో బాగముగా (913) చెరువులలో 345.54 లక్షల చేప పిల్లలు రూ.358.168 లక్షల ఖర్చుతో విడుదల చేయడం జరిగినది. దీని వలన 15761 మంది మత్స్య కారులు ప్రత్యక్షముగా జీవనోపాదిని పొందుచున్నారు. సాగు నీటి పారుదల మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ మధ్య తరహా ప్రాజెక్ట్ :- ఘనపూర్ ఆనకట్ట మధ్య తరహా ప్రాజెక్ట్, కొల్చారం మం. చిన్న ఘనాపూర్ దాని ఆనకట్ట ఎత్తు పెంచుటకై మరియు పునరుద్ధరణకై ప్రభుత్వము రూ.4364.00 లక్షలు మంజూరు చేసినది మరియు వాటి పునరుద్ధరణ పనులు 57.28% పూర్తి అయినవి. ఎత్తు పెంచుట పనులు పురోగతిలో ఉన్నది. వీటీ ద్వార 21625 ఎకరాల నుండి 26625 ఎకరాల వరకు సాగులోకి వస్తాయి. వనదుర్గా ప్రాజెక్ట్ (ఘన్పూర్ ఆనికట్) కెనాల్ సిస్టమ్, చిన్నఘన్పూర్ (గ్రామం), కుల్చారం (మం) మెదక్ (జిల్లా)లో కాలువ బ్యాలెన్స్సనుల ఆధునికీకరణకై ప్రభుత్వము రూ.5032.50 లక్షలు మంజూరు చేసినది మరియు వాటి పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. 56 % శాతం పనులు పూర్తియైనవి. విద్య, వైద్యం, ఉపాధి, వ్యవసాయం, రోడ్లు, ఇరిగేషన్, రెవెన్యూ, పంచాయతీలు, మునిసిపాలిటీలు, వాటర్ సప్లై, వెటర్నరీ మరియు ఇతర అన్ని శాఖలలో విప్లవాత్మ కమైన అభివృద్ధి సాదించడం జరగిందని చెప్పడానికి ఆనందిస్తున్నాను. శాంతిభద్రతల పరిరక్షణలో, నేరాలు నిరోధించడంలో, రహదారుల ప్రమాదాల నివారణలో, మత్తు పదార్థాల మరియు సైబర్ నేరాల నియంత్రణ కొరకు కృషి చేస్తున్న పోలిస్ యంత్రాంగానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లి విజయవంతం చేస్తున్న అధికారులకు, ఉద్యోగులకు అభినందనలు. జిల్లాను అన్ని రంగాలలో మొదటి స్థానంలో నిలుపుటలో ప్రజలు, ఉద్యోగులు, ప్రతి ఒక్కరు పనిచేయాలనీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ సందర్భంగా ఇక్కడకు విచ్చేసిన ప్రజాప్రతినిధులకు అధికారులకు, సిబ్బందికి, మీడియా ప్రతినిధులకు, ప్రజలకు మరొక్కసారి 77 వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనిముగించారు.

- మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు అందజేత. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి. మెదక్ పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం మాజీమంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి సహకారంతో ,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ లు 6 ఫ్రీజర్ లను అందజేశారు.ఇందులో ముస్లిం మైనార్టీలకు 2, క్రిస్టియన్ లకు 1, పట్టణంలోని ఇతర కులస్తులందరికీ 3 ఫ్రీజర్లను అంద చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మెదక్ మున్సిపల్ కు ఒక వైకుంఠ రథం,రెండు ఫ్రీజర్లు అందజేశానని గుర్తు చేశారు. ఫ్రీజర్ లు చెడిపోవడంతో మరమ్మతుకు నోచుకోక మూలన పడ్డాయి అన్నారు. ఫలితంగా మెదక్ పట్టణంలో ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ దొరకని పరిస్థితి నెలకొందనీ చెప్పారు.పట్టణంలో ఫ్రీజర్లు దొరికాక ప్రజల ఇబ్బందులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, తన్నీరు హరీష్ రావు గారి దృష్టికి తీసుక వెళ్లినట్లు చెప్పారు. వెంటనే స్పందించిన ఆయన మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు మంజూరు చేశారాని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఎవరైనా సరే అవసరం ఉన్నవాళ్లు ఫ్రీజర్లు తీసుకువెళ్లి వినియోగించుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ పంపిణి ఎన్నికల ప్రయోజనం కోసం కాదు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పంపిణి చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మండలాల వారిగా కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి మాజీ ఎమ్మెల్సీ వారు హుస్సేన్ గారికి పద్మ దేవేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల. మల్లికార్జున్ గౌడ్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు,మాజీ కౌన్సిలర్లు వంజరి. జయరాజ్, సోహెల్,ఆర్కే శ్రీనివాస్,జ్యోతి కృష్ణ,నాయకులు సురేందర్ గౌడ్,జుబెర్ అహ్మద్, ఫాజిల్, షాకీర్,సాదిక్,సునీల్, సంతోష్,ఇమాదాడ్, ఇస్మాయిల్, శ్రీనివాస్,ఓమర్ ఫరూక్,మధు, అమీర్,కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.1
- బాన్సువాడ: విద్యార్థిని మృతి దురదృష్టకరం: పోచారం బొర్లం గురుకుల పాఠశాల ఆటో ప్రమాదంలో విద్యార్థిని సంగీత మృతి చెందడం పట్ల MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశామని, పోలీసు విచారణ వేగవంతం చేసి, బాధ్యులపై FIR నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.1
- సదాశివపేట పట్టణ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు ఒక్కడికక్కడే మృతి1
- *సూరారంలో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ* కుత్బుల్లాపూర్ జనవరి 26. సూరారం లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సూరారంలో భారీ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సూరారంకు చెందిన కోల శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి వాతావరణంలో సాగింది. దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీలో 100 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను మోస్తూ ఊరేగింపు చేపట్టారు. విద్యార్థులతో పాటు యువత, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్నవారు దేశ స్వాతంత్ర్య విలువలు, రాజ్యాంగ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. సూరారం ప్రాంతమంతా జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఈ తిరంగా ర్యాలీ స్థానిక ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచిందని నిర్వాహకులు తెలిపారు.1
- హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి మేడారం కి జెండా ఊపి బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మేడారం వెళ్తున్న ప్రయాణికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. మేడారం కి మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు,ఆర్టీసీ డిఎం వెంకన్న , ఆర్ఎం రాజు ,ఇతర ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు..1
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆకట్టుకున్న మత్స్యశాఖ శకటం1
- భారత్ మాత కి జై 🇮🇳1
- మెదక్ పట్టణంలో సోమవారం ఉదయం మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు రాందాస్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం వద్ద కాకతీయ ఖిల్లా పై జాతీయ పతాగలన ఆవిష్కరించి సెల్యూట్ చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్ గూడూరు కృష్ణ మాజీ కౌన్సిలర్లు బొద్దుల కృష్ణ ఏఎంసీ మాజీ చైర్మన్ మేడి మధు సూదన్ రావు మాజీ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ పట్టణ అధ్యక్షులు గంగాధర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు1