logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

*సూరారం‌లో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ* కుత్బుల్లాపూర్ జనవరి 26. సూరారం లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సూరారం‌లో భారీ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సూరారం‌కు చెందిన కోల శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి వాతావరణంలో సాగింది. దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీలో 100 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను మోస్తూ ఊరేగింపు చేపట్టారు. విద్యార్థులతో పాటు యువత, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్నవారు దేశ స్వాతంత్ర్య విలువలు, రాజ్యాంగ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. సూరారం ప్రాంతమంతా జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఈ తిరంగా ర్యాలీ స్థానిక ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచిందని నిర్వాహకులు తెలిపారు.

16 hrs ago
user_NAVEEN Kumar
NAVEEN Kumar
Journalist Gandimaisamma Dundigal, Medchal Malkajgiri•
16 hrs ago

*సూరారం‌లో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ* కుత్బుల్లాపూర్ జనవరి 26. సూరారం లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సూరారం‌లో భారీ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సూరారం‌కు చెందిన కోల శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి వాతావరణంలో సాగింది. దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీలో 100 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను మోస్తూ ఊరేగింపు చేపట్టారు. విద్యార్థులతో పాటు యువత, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్నవారు దేశ స్వాతంత్ర్య విలువలు, రాజ్యాంగ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. సూరారం ప్రాంతమంతా జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఈ తిరంగా ర్యాలీ స్థానిక ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచిందని నిర్వాహకులు తెలిపారు.

More news from Medchal Malkajgiri and nearby areas
  • *సూరారం‌లో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ* కుత్బుల్లాపూర్ జనవరి 26. సూరారం లో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సూరారం‌లో భారీ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సూరారం‌కు చెందిన కోల శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి వాతావరణంలో సాగింది. దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీలో 100 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను మోస్తూ ఊరేగింపు చేపట్టారు. విద్యార్థులతో పాటు యువత, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా పాల్గొన్నవారు దేశ స్వాతంత్ర్య విలువలు, రాజ్యాంగ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. సూరారం ప్రాంతమంతా జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఈ తిరంగా ర్యాలీ స్థానిక ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచిందని నిర్వాహకులు తెలిపారు.
    1
    *సూరారం‌లో 100 మీటర్ల జాతీయ జెండాతో భారీ తిరంగా ర్యాలీ*
కుత్బుల్లాపూర్ జనవరి 26. సూరారం లో
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ మండల పరిధిలోని సూరారం‌లో భారీ తిరంగా ర్యాలీని ఘనంగా నిర్వహించారు. సూరారం‌కు చెందిన కోల శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ దేశభక్తి వాతావరణంలో సాగింది.
దాదాపు 2 వేల మంది విద్యార్థులు పాల్గొన్న ఈ ర్యాలీలో 100 మీటర్ల పొడవైన భారీ జాతీయ జెండాను మోస్తూ ఊరేగింపు చేపట్టారు. విద్యార్థులతో పాటు యువత, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా పాల్గొన్నవారు దేశ స్వాతంత్ర్య విలువలు, రాజ్యాంగ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. సూరారం ప్రాంతమంతా జాతీయ జెండాలతో, దేశభక్తి నినాదాలతో మార్మోగింది. ఈ తిరంగా ర్యాలీ స్థానిక ప్రజల్లో దేశభక్తిని మరింత పెంచిందని నిర్వాహకులు తెలిపారు.
    user_NAVEEN Kumar
    NAVEEN Kumar
    Journalist Gandimaisamma Dundigal, Medchal Malkajgiri•
    16 hrs ago
  • భారత్ మాత కి జై 🇮🇳
    1
    భారత్ మాత కి జై 🇮🇳
    user_Shyam sunder Yadav Pulapally
    Shyam sunder Yadav Pulapally
    Malkajgiri, Medchal Malkajgiri•
    20 hrs ago
  • సదాశివపేట పట్టణ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు ఒక్కడికక్కడే మృతి
    1
    సదాశివపేట పట్టణ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం ఒకరు ఒక్కడికక్కడే మృతి
    user_Sangareddy News
    Sangareddy News
    Journalist రామచంద్రాపురం, సంగారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు అందజేత. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి. మెదక్ పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం మాజీమంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి సహకారంతో ,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ లు 6 ఫ్రీజర్ లను అందజేశారు.ఇందులో ముస్లిం మైనార్టీలకు 2, క్రిస్టియన్ లకు 1, పట్టణంలోని ఇతర కులస్తులందరికీ 3 ఫ్రీజర్లను అంద చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మెదక్ మున్సిపల్ కు ఒక వైకుంఠ రథం,రెండు ఫ్రీజర్లు అందజేశానని గుర్తు చేశారు. ఫ్రీజర్ లు చెడిపోవడంతో మరమ్మతుకు నోచుకోక మూలన పడ్డాయి అన్నారు. ఫలితంగా మెదక్ పట్టణంలో ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ దొరకని పరిస్థితి నెలకొందనీ చెప్పారు.పట్టణంలో ఫ్రీజర్లు దొరికాక ప్రజల ఇబ్బందులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, తన్నీరు హరీష్ రావు గారి దృష్టికి తీసుక వెళ్లినట్లు చెప్పారు. వెంటనే స్పందించిన ఆయన మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు మంజూరు చేశారాని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఎవరైనా సరే అవసరం ఉన్నవాళ్లు ఫ్రీజర్లు తీసుకువెళ్లి వినియోగించుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ పంపిణి ఎన్నికల ప్రయోజనం కోసం కాదు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పంపిణి చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మండలాల వారిగా కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి మాజీ ఎమ్మెల్సీ వారు హుస్సేన్ గారికి పద్మ దేవేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల. మల్లికార్జున్ గౌడ్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు,మాజీ కౌన్సిలర్లు వంజరి. జయరాజ్, సోహెల్,ఆర్కే శ్రీనివాస్,జ్యోతి కృష్ణ,నాయకులు సురేందర్ గౌడ్,జుబెర్ అహ్మద్, ఫాజిల్, షాకీర్,సాదిక్,సునీల్, సంతోష్,ఇమాదాడ్, ఇస్మాయిల్, శ్రీనివాస్,ఓమర్ ఫరూక్,మధు, అమీర్,కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
    1
    మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు అందజేత.
బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి. 
మెదక్ పట్టణ ప్రజల సౌకర్యార్థం కోసం మాజీమంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు గారి సహకారంతో ,బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఏం పద్మ దేవేందర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్సీ ఫరూక్ హుస్సేన్ లు 6 ఫ్రీజర్ లను అందజేశారు.ఇందులో ముస్లిం మైనార్టీలకు 2, క్రిస్టియన్ లకు 1, పట్టణంలోని ఇతర కులస్తులందరికీ 3  ఫ్రీజర్లను అంద చేస్తున్నట్లు తెలిపారు.ఈ సందర్బంగా పద్మ దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ. గతంలో ఎమ్మెల్యే ఉన్నప్పుడు మెదక్ మున్సిపల్ కు ఒక వైకుంఠ రథం,రెండు ఫ్రీజర్లు అందజేశానని గుర్తు చేశారు. ఫ్రీజర్ లు చెడిపోవడంతో మరమ్మతుకు నోచుకోక మూలన పడ్డాయి అన్నారు. ఫలితంగా మెదక్ పట్టణంలో ఎవరైనా చనిపోతే ఫ్రీజర్ దొరకని పరిస్థితి నెలకొందనీ చెప్పారు.పట్టణంలో ఫ్రీజర్లు దొరికాక  ప్రజల ఇబ్బందులను మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, తన్నీరు హరీష్ రావు గారి దృష్టికి తీసుక వెళ్లినట్లు చెప్పారు.  వెంటనే స్పందించిన ఆయన  మెదక్ పట్టణానికి 6 ఫ్రీజర్లు మంజూరు చేశారాని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ఎవరైనా సరే అవసరం ఉన్నవాళ్లు ఫ్రీజర్లు తీసుకువెళ్లి వినియోగించుకోవాలని  కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్ మాట్లాడుతూ.. ఈ పంపిణి ఎన్నికల ప్రయోజనం కోసం కాదు. ప్రజల ఇబ్బందులను గుర్తించి పంపిణి  చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో మండలాల వారిగా కూడా పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు గారికి మాజీ ఎమ్మెల్సీ వారు హుస్సేన్ గారికి  పద్మ దేవేందర్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆరేళ్ల. మల్లికార్జున్ గౌడ్,మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కృష్ణారెడ్డి,పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ళ ఆంజనేయులు,మాజీ కౌన్సిలర్లు వంజరి. జయరాజ్, సోహెల్,ఆర్కే శ్రీనివాస్,జ్యోతి కృష్ణ,నాయకులు సురేందర్ గౌడ్,జుబెర్ అహ్మద్, ఫాజిల్, షాకీర్,సాదిక్,సునీల్, సంతోష్,ఇమాదాడ్, ఇస్మాయిల్, శ్రీనివాస్,ఓమర్ ఫరూక్,మధు, అమీర్,కిరణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
    user_మెదక్ న్యూస్
    మెదక్ న్యూస్
    హవేలీఘనాపూర్, మెదక్, తెలంగాణ•
    10 hrs ago
  • కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పల్లె ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ విలువలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    2
    కేశంపేట మండల పరిధిలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ పల్లె ఆనంద్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ రాజ్యాంగ విలువలు పాటించాల్సిన అవసరాన్ని వివరించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, నాయకులు, విద్యార్థులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_S M S R R
    S M S R R
    కేశంపేట్, రంగారెడ్డి, తెలంగాణ•
    17 hrs ago
  • హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి మేడారం కి జెండా ఊపి బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మేడారం వెళ్తున్న ప్రయాణికులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. మేడారం కి మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు,ఆర్టీసీ డిఎం వెంకన్న , ఆర్ఎం రాజు ,ఇతర ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు..
    1
    హుస్నాబాద్ ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి మేడారం కి జెండా ఊపి బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. అనంతరం మేడారం వెళ్తున్న ప్రయాణికులతో  మంత్రి పొన్నం ప్రభాకర్ ముచ్చటించారు. మేడారం కి  మహిళా ప్రయాణికులు ఉచిత ప్రయాణంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు,ఆర్టీసీ డిఎం వెంకన్న , ఆర్ఎం రాజు ,ఇతర ముఖ్య నేతలు,అధికారులు పాల్గొన్నారు..
    user_RAMESH P
    RAMESH P
    కుశాల్ నగర్, సిద్దిపేట•
    8 hrs ago
  • బాన్సువాడ: విద్యార్థిని మృతి దురదృష్టకరం: పోచారం బొర్లం గురుకుల పాఠశాల ఆటో ప్రమాదంలో విద్యార్థిని సంగీత మృతి చెందడం పట్ల MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశామని, పోలీసు విచారణ వేగవంతం చేసి, బాధ్యులపై FIR నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
    1
    బాన్సువాడ: విద్యార్థిని మృతి దురదృష్టకరం:
పోచారం
బొర్లం గురుకుల పాఠశాల ఆటో ప్రమాదంలో విద్యార్థిని సంగీత మృతి చెందడం పట్ల MLA పోచారం శ్రీనివాస్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని పేర్కొన్నారు. ఇప్పటికే పాఠశాల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేశామని, పోలీసు విచారణ వేగవంతం చేసి, బాధ్యులపై FIR నమోదు చేయాలని ఆదేశించినట్లు తెలిపారు.
    user_Narmala Swapna
    Narmala Swapna
    Tour operator నాగారెడ్డిపేట్, కామారెడ్డి, తెలంగాణ•
    9 hrs ago
  • టీయూడబ్ల్యూజే–ఐజేయు యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాన్ని టీయూడబ్ల్యూజే–ఐజేయు కుత్బుల్లాపూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు గొల్లపల్లి దయాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తి, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ప్రాధాన్యతపై సందేశం ఇచ్చారు. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. మీడియా సమాజానికి మార్గదర్శిగా నిలవాలని, సత్యం, నైతికతతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు, గౌరవ సలహాదారులు గుంటుపల్లి శేఖర్, మాజీ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్‌తో పాటు యూనియన్ సభ్యులు పాల్గొని వేడుకలకు మరింత వైభవం చేకూర్చారు. గణతంత్ర దినోత్సవాన్ని ఐక్యత, దేశభక్తి భావంతో జరుపుకోవాలని పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు.
    1
    టీయూడబ్ల్యూజే–ఐజేయు యూనియన్ ఆధ్వర్యంలో జాతీయ పతాకావిష్కరణ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో గణతంత్ర దినోత్సవాన్ని టీయూడబ్ల్యూజే–ఐజేయు కుత్బుల్లాపూర్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు గొల్లపల్లి దయాకర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి, దేశభక్తి, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య ప్రాధాన్యతపై సందేశం ఇచ్చారు.
భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు గౌరవించాలని ఆయన పిలుపునిచ్చారు. మీడియా సమాజానికి మార్గదర్శిగా నిలవాలని, సత్యం, నైతికతతో కూడిన జర్నలిజాన్ని ప్రోత్సహించాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు, గౌరవ సలహాదారులు గుంటుపల్లి శేఖర్, మాజీ అధ్యక్షులు కోటగడ్డ శ్రీనివాస్‌తో పాటు యూనియన్ సభ్యులు పాల్గొని వేడుకలకు మరింత వైభవం చేకూర్చారు. గణతంత్ర దినోత్సవాన్ని ఐక్యత, దేశభక్తి భావంతో జరుపుకోవాలని పాల్గొన్న నాయకులు పిలుపునిచ్చారు.
    user_NAVEEN Kumar
    NAVEEN Kumar
    Journalist Gandimaisamma Dundigal, Medchal Malkajgiri•
    17 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.