Shuru
Apke Nagar Ki App…
విమానాశ్రయం భూములకు హద్దులు.. అక్రమాలపై కట్టడికి చర్యలు... వరంగల్ జిల్లా: ఖిల్లా వరంగల్ మండలం మామునూరు విమానాశ్రయ భూములకు హద్దులు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 949.14 ఎకరాలను కేంద్రానికి అప్పగించగా, విమానాశ్రయ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ అంగీకరించింది. పనులు త్వరలో ప్రారంభమయ్యే నేపథ్యంలో భూ రక్షణపై దృష్టి సారించారు. గుంటూరుపల్లె శివారులో జరిగిన అక్రమ తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకుని ఫిర్యాదు చేయగా, అధికారులు విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. త్వరలో హద్దులు నిర్ణయించి తాత్కాలికంగా కందకాలు తవ్వి భూమిని రక్షించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
M D Azizuddin
విమానాశ్రయం భూములకు హద్దులు.. అక్రమాలపై కట్టడికి చర్యలు... వరంగల్ జిల్లా: ఖిల్లా వరంగల్ మండలం మామునూరు విమానాశ్రయ భూములకు హద్దులు ఏర్పాటు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 949.14 ఎకరాలను కేంద్రానికి అప్పగించగా, విమానాశ్రయ అభివృద్ధికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ అంగీకరించింది. పనులు త్వరలో ప్రారంభమయ్యే నేపథ్యంలో భూ రక్షణపై దృష్టి సారించారు. గుంటూరుపల్లె శివారులో జరిగిన అక్రమ తవ్వకాలను గ్రామస్థులు అడ్డుకుని ఫిర్యాదు చేయగా, అధికారులు విచారణ చేపట్టి నివేదిక సమర్పించారు. త్వరలో హద్దులు నిర్ణయించి తాత్కాలికంగా కందకాలు తవ్వి భూమిని రక్షించేందుకు చర్యలు తీసుకోనున్నారు.
More news from తెలంగాణ and nearby areas
- హన్మకొండ జిల్లా కాజీపేట పట్టణంలోని ఈద్గాలో రంజాన్ పర్వదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, తెలంగాణ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, తెలంగాణ స్టేట్ గ్రంథాలయ చైర్మన్ డా. రియాజ్, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అతిథులు ముస్లిం సోదరులతో కలిసి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసి, అలైబలై చేసుకున్నారు. కార్యక్రమంలో 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ శ్రీరజలి, స్థానిక నాయకులు, మైనారిటీ ప్రతినిధులు, ముస్లిం మత పెద్దలు, కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- దళితులకు రూ.12 లక్షలు ఇవ్వాలి దళితులకు అంబేడ్కర్ అభయహస్తం రూ.12 లక్షలు ఇవ్వాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల పరిరక్షణ సమితి (ఎంహెచ్పీఎస్) ఆవిర్భావ దినోత్సవాన్ని వ్యవస్థాపక అధ్యక్షుడు మైస ఉపేందర్ మాదిగ అధ్యక్షతన హనుమకొండ ప్రెస్ క్లబ్లో బుధవారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా తాటికొండ రాజయ్య మాట్లాడుతూ దళితు లకు అంబేడ్కర్ అభయహస్తం పథకం ద్వారా రూ.12 లక్షలు ఇస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోం దని ఆరోపించారు. బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి అభివాదం చేస్తున్న నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఏ ఉద్యమం జరిగినా వరంగల్ ముందుంటుందని చెప్పారు. మైస ఉపేందర్ మాదిగ, వెజ్ బోర్డ్ మాజీ చైర్మన్ జన్ను జకార్య, వీరేందర్, సుంకె ప్రభాకర్, చెన్నం గోపి, విష్ణు, రాంకుమార్ పాల్గొన్నారు.4
- తెలంగాణ ప్రభుత్వం 2026–27 బడ్జెట్‌లో విద్యా రంగానికి భారీ ప్రాధాన్యత ఇస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, విద్యా సంస్థల అభివృద్ధికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది. విద్యాశాఖకు సుమారు ₹26,674 కోట్ల భారీ బడ్జెట్ కేటాయించారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల మెరుగుదలకు ప్రత్యేక నిధులు గురుకులాలు, వసతి గృహాల వంటశాలల ఆధునీకరణకు ₹100 కోట్లు ప్రతిపాదన ప్రీ-ప్రైమరీ నుంచి విద్యను బలోపేతం చేయడానికి కొత్త ప్రణాళికలు రాష్ట్రంలోని వేలాది పాఠశాలల్లో ప్రీ-ప్రైమరీ విభాగాల విస్తరణ ఇక విద్యార్థుల సంక్షేమం కోసం కూడా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది: పాఠశాల విద్యార్థులకు బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభం ఇంటర్ విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం అందించే నిర్ణయం టెక్నాలజీ ఆధారిత విద్య కోసం పాలిటెక్నిక్, ఐటీఐల్లో కొత్త కోర్సులు మొత్తం మీద, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి విద్యా ప్రమాణాలను పెంచడం లక్ష్యంగా ఈ నిధుల విడుదల జరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. 👉 ఇది విద్యా రంగంలో పెద్ద మార్పులకు దారితీసే నిర్ణయంగా భావిస్తున్నారు.1
- వరంగల్ జిల్లా నర్సంపేట మార్కెట్ యార్డ్‌లో తెలంగాణ మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రైతులకు సరైన ధర అందించడంలో కొనుగోలు కేంద్రాలు కీలకమని పేర్కొన్నారు. కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా నిర్వహించడంతో పాటు తేమ శాతం 14% లోపే ఉండాలని సూచించారు. క్వింటాల్‌కు రూ.2400 ధర నిర్ణయించినట్లు తెలిపారు. రైతులు మధ్యవర్తులపై ఆధారపడకుండా నేరుగా కేంద్రాల్లోనే పంటను విక్రయించాలని, చెల్లింపులు సమయానికి జరగాలని అధికారులకు ఆదేశించారు. మార్కెట్ యార్డ్‌లో తాగునీరు, విశ్రాంతి సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.1
- మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా.శబరీష్ చిన్ని గూడూరు పోలీస్ స్టేషన్‌ను అకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలు, కార్యాలయం లోపలి పరిస్థితులను సమగ్రంగా పరిశీలించారు. స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై ప్రవీణ్ మరియు సిబ్బందికి విధి నిర్వహణలో క్రమశిక్షణ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడం పై పలు సూచనలు చేశారు. ముఖ్యంగా అక్రమ కార్యకలాపాలపై ఎలాంటి జోక్యం ఉండకూడదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లేదంటే క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు . అలాగే స్థానిక సర్పంచ్‌లతో పరస్పరం మాట్లాడి, గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు అవసరంపై చర్చించారు. గ్రామ భద్రతలో భాగంగా సీసీ కెమెరాల ఏర్పాటు, నిర్వహణలో సర్పంచ్‌లు పూర్తి బాధ్యత తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా హెల్మెట్ వాడకం పై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని, అవసరమైతే గ్రామాల్లో తమతమ స్థాయిలో ప్రచారం చేపట్టాలని సూచించారు. జిల్లాలో నేరాల నియంత్రణ, రోడ్డు భద్రత మరియు ప్రజల రక్షణ కోసం పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తుందని ఎస్పీ తెలిపారు.1
- హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలోని ముఖ్యనాయకులు కొందరు జమ్మికుంట శివారులో సమావేశమయ్యారు. డిన్నర్ తో కలిసిన ఐదుమండలాల నాయకులు ఎమ్మెల్యే వ్యవహారశైలిపై సుదీర్గంగా చర్చించారు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుతో హుజురాబాద్ నియోజకవర్గ నాయకులం అని చెప్పుకోవడానికే సిగ్గేస్తుందని ఆవేధన వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులను పట్టించుకోకుండా కుటుంబసభ్యులతో కలిసి ప్యాషన్ షోలా తిరుగుతున్నాడని ఆందోళన చెందుతున్నారు. లోపాలను సరిదిద్దుకోవాలని పార్టీ నాయకులం చెప్పేందుకు ప్రయత్నిస్తే చెప్పనివ్వకుండా నీకేం తెల్వదన్నట్లు వ్యవహరిస్తాడట. నాయకులకు సర్పంచ్, ఎంపిటీసి పదవులు తప్ప మండల జిల్లా స్థాయి పదవులు ఉండొద్దనే దోరణితో ఎమ్మెల్యే ఉన్నాడని ఆవేధన చెందుతున్నారు. ఎవరైనా ఎదురుమాట్లాడితే రౌడీషీట్ ఓపెన్ చేయుమని చెప్పే నాయకుడితో ఇక వేగలేం అంటున్నారు. భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు.3
- *ములుగు మంత్రి సీతక్క క్యాంప్ ఆఫీస్ ముట్టడి చేసిన ఆశా వర్కర్లు* ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత నేలకొన్నది సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు కాంగ్రెస్ హామీల అమలు 18 000/- వేతనం కొరకు ఆశా వర్కర్లు భారీగా మోహరించి నినాదాలు చేశారు పోలీసులు మోహరించి కొంతమందిని అరెస్టు చేయగా ఉద్రిక్తత వాతావరణం చెక్కబడింది1
- ములుగు జిల్లా: ములుగు జిల్లా కేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంత్రి సీతక్క క్యాంప్ కార్యాలయాన్ని ఆశా వర్కర్లు ముట్టడించారు. సీఐటీయూ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించి రోడ్డుపై బైఠాయించారు. కాంగ్రెస్ హామీల అమలు, రూ.18,000 వేతనం కోసం ఆశా వర్కర్లు పెద్దఎత్తున నినాదాలు చేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించగా, కొంతమందిని అరెస్టు చేశారు. దీంతో ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.1