పుట్టిన బిడ్డకు ముర్రు పాలు తాగిస్తే శ్రేష్టం. పలమనేరు ఆగస్టు 4( ప్రజా ప్రతిభ) పుట్టిన బిడ్డకు వెంటనే ముర్రు బాలు తాగిస్తే శ్రేష్టంగా ఆరోగ్యకరంగా ఉంటుందని ఐ సి డి ఎస్ సూపర్వైజర్ మాధవి లత సోమవారం ప్రకటనలో తెలిపారు. ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంగన్వాడి కేంద్రాల్లో ఆనవాయితీగా యుద్ధ ప్రాతిపదికన ప్రజల అవగాహన కోసం నిర్వహిస్తున్న తల్లిపాలు వారోత్సవాల్లో భాగంగా సోమవారం పలమనేరు రూరల్ మండలం మొరం పంచాయితీ పరిధిలోని అంగన్వాడి కేంద్రాల్లో అంగరంగ వైభవంగా ప్రజలు ఆశ్చర్యపోయే తరహాలో తల్లిపాలు వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సూపర్వైజర్ మాధవి లత అక్కడికి హాజరైన గర్బవతులు బాలింతలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ తల్లి పాలు వారోత్సవాలు ఆగస్టు ఒకటో తేదీ నుండి 7వ తేదీ వరకు వారం రోజులు పాటు జిల్లాలో ఉన్న అన్ని ఐసిడియస్ ప్రాజెక్ట్ పరిధిలోని అంగన్వాడి కేంద్రాల్లో ఈ వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. బిడ్డ పుట్టిన వెంటనే పాలు తాగించడం వలన బిడ్డకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని, ప్రారంభం నుండి ఆరు నెలల వరకు పాలు తాగించాలని అలా చేయడంతో బిడ్డ శారీరకంగా, ఆరోగ్యకరంగా మేధస్సు తిరిగి జ్ఞానోదయం కలుగుతుందన్నారు. అదేవిధంగా బిడ్డకు తల్లిపాలు ఇవ్వడం వలన తల్లికి రొమ్ము క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చని, అలాగే బిడ్డ బిడ్డకి ఎడమ గా ఉంటుందని క్లుప్తంగా వివరించారు. దానివలన తల్లి శారీరకంగానూ మానసికంగానూ ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. అంతరం అక్కడకు హాజరైన వివిధ శాఖల సిబ్బంది, గర్భవతులు బాలింతలు, స్థానికులు కలిసి బ్యానర్లు పట్టుకొని నినాదాలు చేస్తూ పుర వీధుల్లో భారీ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి. అనూష, ఎమ్మెస్ కె .నవనీత, అంగన్వాడి టీచర్ రెడ్డమ్మ, రేవతి, నిర్మల, జ్యోతి అమ్మ, కాంతమ్మ, గర్భవతులు, బాలింతలు పాల్గొన్నారు.

- అంబేద్కర్ భవన స్థలాన్ని వెంటనే పరిష్కరించాలి. ఏఐబిఎస్పి. పలమనేరు డిసెంబర్ 16( ప్రజా ప్రతిభ) గంగవరం మండలంలో వివాదాస్పదంగా మారిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భవనంకు సంబంధించిన స్థలాన్ని అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని ఆల్ ఇండియా బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి డి.వి. మునిరత్నం కోరారు. అందులో భాగంగా మంగళవారం పలమనేరు పట్టణంలో గల మానవ హక్కుల కార్యాలయం నందు మణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డి.వి. మునిరత్నం, అమానుల్లా,వాణి, గుర్రం సుబ్రహ్మణ్యం, నారాయణ శెట్టి, మాట్లాడుతూ గత వారం రోజుల నుండి అంబేద్కర్ భవనానికి సంబంధించిన స్థలాన్ని అక్కడే నివాసముంటున్న శ్రీలంక కాలనీవాసులు ఆక్రమించుకోవాలనే ప్రయత్నాన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. నిత్యం తహసిల్దార్ , ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది ఆ మార్గంలోనే వెళ్తున్నప్పటికీ శ్రీలంక వాసులు ఆక్రమిస్తున్న స్థలం కనపడినా ప్రశ్నించ లేకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీలంక శరణార్థులు రోజుకో దేవాలయం పేరు చెప్పుకొని ఉన్నత అధికారులకు అర్జీలతో పాటు ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే దొంగే దొంగ దొంగ అన్నట్లు ఉంది అన్నారు. అదేవిధంగా అంబేద్కర్ భవన ఆవరణలో శరణార్థులు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతూ ఇతరులకు ఇబ్బంది పెడుతున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా వాటిని నివారించడంలో అధికారులు విఫలమయ్యారని ఆరోపించారు. లంక వాసులు ఆ స్థలములో చేస్తున్న వివిధ రకాల అసాంఘిక కార్యక్రమాలను చూసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులు అంబేద్కర్ జయంతి వర్ధంతులు చేయక చాలా ఏళ్ల నుండి చేతగాని వారిగా మిగిలిపోతున్నారని ఆవేద వ్యక్తం చేశారు. అంబేద్కర్ స్థల వివాదంలో శ్రీలంక వాసులు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పనిని సంబంధిత అధికారులు దృష్టికి తీసుకెళితే, ఓ అధికారి సమన్వయం పాటించండని, ఇంకొక అధికారి శ్రీలంక వాసులు రెచ్చగొట్టిన మీరు రెచ్చిపోవద్దని ఉచిత సలహాలు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. ఇంతవరకు ఆక్రమణదారులను అధికారులు పిలిపించి విచారించకపోవడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు అంబేద్కర్ స్థలాన్ని ఆక్రమించి, విద్వేషాలను రెచ్చగొడుతున్న వ్యక్తులను విచారించి నివారించాలని , అంబేద్కర్ భవనం స్థలాన్ని సర్వే చేసి హద్దులు చూపించాలని కోరారు. మంజునాథ్, సూర శ్రీనివాసులు, శివ, ఆనంద, శాంతమ్మ, మునెయ్య, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.1
- Post by KLakshmi Devi1
- Post by Katravath Hathiram1
- Post by Ravi Poreddy1