ప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది.. క్షేత్రస్థాయిలో పోలీసింగ్ బలోపేతమే లక్ష్యం.. జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్. మహబూబాబాద్ జిల్లా ఆగస్టు 25 ప్రజల విశ్వాసమే సమర్థవంతమైన పోలీసులకు పునాది అని.... క్షేత్రస్థాయిలో పోలీసులు బలోపేతమే లక్ష్యంగా కృషి చేయాలని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని కిట్‌లను, రికార్డులను, వివిధ గదులను, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. రిసెప్షన్‌ను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలు, స్టేషన్ నిర్వహణ తీరును పరిశీలించారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందితో ఎస్పీ స్వయంగా మాట్లాడి, వారి విధి నిర్వహణ, ఎదురవుతున్న డ్యూటీ సంబంధిత సమస్యలు, వ్యక్తిగత సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే తనతో స్వేచ్ఛగా పంచుకోవచ్చని, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిబ్బందికి అండగా ఉంటుందని భరోసా కల్పించారు. సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, క్రమం తప్పకుండా రొటీన్ హెల్త్ చెకప్‌లు చేయించుకోవాలని సూచించారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన ముఖ్యమైన రికార్డులు, CD Files (Case Diaries), దర్యాప్తు పత్రాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. కేసుల దర్యాప్తు పురోగతి, కేసుల పెండెన్సీ, రికార్డుల నిర్వహణ, CCTNSలో వివరాల నమోదు, అప్‌డేషన్ తదితర అంశాలను సమీక్షించారు. ప్రతి కేసు దర్యాప్తులో క్షేత్రస్థాయిలో పర్యటించి, వాస్తవాలను సేకరించి, శాస్త్రీయ పద్ధతుల్లో దర్యాప్తును ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. SI రాజుతో కేసుల దర్యాప్తు, స్టేషన్ నిర్వహణ, రికార్డుల అప్‌డేషన్, CCTNS నిర్వహణ, VPOల పనితీరు తదితర అంశాలపై ఎస్పీ చర్చించి పలు సలహాలు, సూచనలు చేశారు. పెండింగ్ కేసులను వేగవంతంగా పరిష్కరించి, ప్రతి కేసుకు సంబంధించిన రిపోర్టులు, రికార్డులు, CD Files ను సక్రమంగా నిర్వహించాలని ఆదేశించారు. VPOల పనితీరుపై ఎస్పీ ప్రత్యేకంగా ఆరా తీశారు. ప్రతి VPO తనకు కేటాయించిన గ్రామాన్ని నిరంతరం సందర్శిస్తూ ప్రజలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకోవాలని, ప్రజల సమస్యలను తెలుసుకుని పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. వారానికి కనీసం ఒకసారి గ్రామాలను తప్పనిసరిగా సందర్శించి, ప్రజల్లో పోలీసులపై నమ్మకం మరియు భద్రతా భావన కలిగించే విధంగా పనిచేయాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి, గుడుంబా మరియు ఇతర అక్రమ మత్తు పదార్థాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు. గుడుంబా తయారీ, అక్రమ విక్రయాలు, రవాణాపై నిరంతరం దాడులు నిర్వహిస్తూ కఠినమైన ఎన్‌ఫోర్స్‌మెంట్ చేపట్టాలని, అక్రమ మద్యం తయారీ కేంద్రాలను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గంజాయి అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలు మరియు వినియోగంపై పటిష్టమైన నిఘా కొనసాగించాలని తెలిపారు. పోలీసింగ్ అనేది కేవలం పోలీస్ స్టేషన్‌కు పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో ప్రజలతో నిరంతర అనుసంధానంతో కొనసాగాలని ఎస్పీ తెలిపారు. అధికారులు, సిబ్బంది కేసుల విచారణలో భాగంగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించి, ప్రతి అంశాన్ని స్వయంగా పరిశీలించి దర్యాప్తు నాణ్యతను పెంచాలని సూచించారు. నేరాల నియంత్రణలో ముందస్తు నిఘా, నిరంతర ఫీల్డ్ విజిట్స్ కీలకమని పేర్కొన్నారు. CCTNSలో కేసులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయాలని, రికార్డుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా చూడాలని సూచించారు. పెండింగ్ రిపోర్టులను త్వరితగతిన పూర్తి చేసి, దర్యాప్తు ప్రక్రియలో పారదర్శకత, క్రమశిక్షణ పాటించాలని ఆదేశించారు. ప్రజలకు వేగవంతమైన, నాణ్యమైన పోలీస్ సేవలు అందించడంతో పాటు, సిబ్బంది సంక్షేమం మరియు వృత్తిపరమైన సామర్థ్యాన్ని సమానంగా ప్రోత్సహించాలని ఎస్పీ తెలిపారు. ప్రజలతో మరింత సన్నిహితంగా పనిచేస్తూ, వారి విశ్వాసాన్ని పొందినప్పుడే సమర్థవంతమైన కమ్యూనిటీ పోలీసింగ్ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ తనిఖీ సందర్భంగా CI అంజలి, DSP తిరుపతిరావు, SI రాజు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

- రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలి.. ఆగస్టు 29న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద మహా ధర్నా హనుమకొండ: నగరంలోని బాలసముద్రం ప్రెస్‌క్లబ్‌లో బుధవారం రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆగస్టు 29న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద చేపట్టనున్న మహా ధర్నాకు సంబంధించిన పోస్టర్‌ను నాయకులు ఆవిష్కరించారు. సమావేశంలో వేదిక ప్రతినిధులు మాట్లాడుతూ, వివిధ కేసుల్లో జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించడం, భిన్నాభిప్రాయాలను అణచివేసే చర్యలను నిలిపివేయడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఆగస్టు 29న జరిగే మహా ధర్నాలో ప్రజాసంఘాలు, విద్యార్థి, కార్మిక, రైతు సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని రాజకీయ ఖైదీల విడుదలకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఐక్య వేదిక నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.1
- జనగామ జిల్లా బస్టాండ్లో దొంగల చేతివాటం, పోలీసుల తనిఖీలు జనగామ జిల్లా కేంద్రంలోని బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద రూ.20,600 నగదు అపహరణకు గురైంది. లింగాలఘణపురం మండలం కుందారానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ ఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేయడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.1
- స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధాని మోదీ ఫోటో ముద్రించాలి: తహసీల్దార్‌కు బీజేపీ వినతి హసన్‌పర్తి: తెలంగాణ ప్రభుత్వం నూతనంగా జారీ చేయనున్న స్మార్ట్ రేషన్ కార్డులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాన్ని తప్పనిసరిగా ముద్రించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. హసన్‌పర్తి మండల బీజేపీ అధ్యక్షుడు మారం తిరుపతి ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర నాయకులు, 66వ డివిజన్ మాజీ కార్పొరేటర్ గురుమూర్తి శివకుమార్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు స్థానిక తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గురుమూర్తి శివకుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి నెలా ఉచితంగా 5 కిలోల బియ్యం అందిస్తున్నప్పటికీ, రేషన్ కార్డులపై కేవలం ముఖ్యమంత్రి, పౌరసరఫరాల శాఖ మంత్రి చిత్రాలను మాత్రమే ముద్రించి, ప్రధాని మోదీ ఫోటోను విస్మరించడం సరికాదన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని గుర్తిస్తూ ప్రధాని చిత్రాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. కోట్లాది రూపాయల ప్రజాధనంతో స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ చేపడుతున్నందున, ప్రభుత్వాలు మారినప్పుడల్లా కార్డులపై ఫోటోలు మారుస్తూ నిధులు వృథా చేయవద్దని ఆయన సూచించారు. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు మారపల్లి రామచంద్రారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా నాయకుడు పెద్ది మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ పిట్టల కుమారస్వామి, నాయకులు చల్లగొండ ప్రభాకర్ రెడ్డి, గంట సత్యం, దాసరి రాజు, చకిలం రాజేశ్వరరావు, తాళ్ల శ్యామ్, పెద్దమ్మ నాగరాజు, పెద్దమ్మ శ్రీనివాస్, దాది మధుసూదన్, శీలం బిక్షపతి, దాట్ల సునీల్, ఇమ్మడి కరుణాకర్, కందుకూరి శ్రీకాంత్, మట్టెడ సుమన్, చల్పూరి శంకర్, కోయడ రాజు, ఆర్మీ శ్రీనివాస్, శ్రావణపల్లి రవీంద్ర చారి, కడుపికొండ పట్టాభి, ప్రవీణ్ రెడ్డి, రవీందర్ గౌడ్, సురేష్ గౌడ్, తిప్పన్నా, రవీందర్, కుంబర్కర్ సాయి తదితరులు పాల్గొన్నారు.1
- గొల్లకురుమల జీవనాధారాన్ని కొల్లగొడుతున్న అక్రమార్కులు అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ జనగామ జిల్లా స్టేషన్ ఘణపూర్ మండలం సముద్రాల గ్రామ శివారులో చెట్ల నరికి పంచరాయి భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులు స్పందించి అక్రమాలను అడ్డుకోవాలని గొల్లకురుమల డిమాండ్ చేస్తున్న గ్రామ గొల్ల కురుమలు. గొల్లకురుమల జీవనాధారమైన గొర్రెలు, మేకలకు మేత అందించే భూములతో పాటు గ్రామంలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారని సముద్రాల గ్రామానికి చెందిన గొల్లకురుమలు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామ పరిధిలోని గడ్డిబోడు, ఈదులబోడు, దేవునిబోడు, దొంగలబోడు తదితర ప్రాంతాల్లోని పంచరాయి భూముల్లో చెట్లను అక్రమంగా నరికివేస్తూ, మొరం తవ్వకాలు చేపట్టి మట్టిని తరలిస్తున్నారని ఆరోపించారు. రైతులు కత్తుల రాజు, తాటికొండ కుమారస్వామిలు విలేకరులతో మాట్లాడుతూ.... గ్రామంలోని సర్వే నంబర్లు 189, 212 పరిధిలో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు. గ్రామ ప్రకృతి వనరులను కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం కొల్లగొడుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గొర్రెలు, మేకలకు మేత అందించే భూములే ధ్వంసమైతే తమ జీవనోపాధి ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు.1
- బస్సులో 80 మంది.. ఇద్దరే పురుషులు.. కండక్టర్ వీడియో వైరల్ మంచిర్యాల డిపో బస్సు కండక్టర్ తన ఆవేదనను పంచుకున్న వీడియో వైరల్ అవుతోంది. 'మా బస్సులో 80 మంది ఉండగా అంతా మహిళలే.. ఇద్దరే పురుషులు ఉన్నారు. డిపార్ట్మెంటేమో డబ్బులు తీసుకురావాలని వేధిస్తోంది. ఇలా అయితే డబ్బులు ఎలా తేవాలి? ప్రభుత్వం మహిళల కోసం ఫ్రీ బస్ స్కీమ్ పెట్టింది. అందుకు అనుగుణంగా మేం పని చేస్తున్నాం. టికెట్ డబ్బుల కోసం వేధించవద్దు' అని కోరారు.1
- జనగామ బస్టాండ్లో దొంగల హల్చల్ : ప్రయాణికుడి డబ్బు మాయం జిల్లా కేంద్రమైన జనగామ బస్టాండ్లో రద్దీని ఆసరాగా చేసుకుని ఓ ప్రయాణికుడి వద్ద 20 వేల 6 వందల నగదు అపహరణకు గురైంది. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ పరిధిలోని లింగాల ఘణపురం మండలం కుందారం గ్రామానికి చెందిన ఆంజనేయులు జనగామ నుంచి పాలకుర్తి వెళ్లే బస్సు ఎక్కే సమయంలో ఈ సంఘటన జరిగినట్లు బాధితుడు తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా పోలీసులు బస్సులోని ప్రయాణికులను తనిఖీ చేసిన ఫలితం లేకపోవడంతో పాటు బస్టాండ్లోని సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు.సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.1
- పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనెలు తయారీ. ముదిగొండ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురంలో పశువుల కొవ్వులతో వంట నూనె తయారు చేస్తున్న వారిని గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. గ్రామానికి చెందిన అన్వర్ జానీ అనే వ్యక్తులు పశువుల మాంసం విక్రయిస్తుంటారు.మిగిలిన పశువుల కొవ్వు ఎముకలతో వంట నూనె తయారు చేసి ఇతర ప్రాంతాలకు విక్రయిస్తున్నారు గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు నూనె డబ్బాలను పశువుల మాంసాన్ని ఛీ చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులకు సమాచారం అందించారు గత కొంతకాలంగా పశువుల కొవ్వుతో ఆయిల్ తయారు చేస్తున్నంతో దుర్వాసన వస్తుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.1
- స్టేషన్ ఘనపూర్‌లో పెన్షన్ కోసం వృద్ధుల పడిగాపులు..ఒకే చోట పెన్షన్ ఇవ్వాలని లబ్ధిదారుల విజ్ఞప్తి జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పెన్షన్ కోసం వృద్ధులు, వికలాంగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత మూడు రోజులుగా పెన్షన్ ఎక్కడ పంపిణీ చేస్తారో స్పష్టత లేక లబ్ధిదారులు పలుచోట్లకు తిరుగుతూ గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెన్షన్ కోసం రావడమే కష్టంగా ఉన్న తమను ఇలా తిప్పడం ఇబ్బందిగా ఉందని, ఒకే చోట పెన్షన్ అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.1