logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

బంజారా కులస్తుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం బంజారా కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ హామీ ఇచ్చారు. జన్నారం మండలంలోని హాస్టల్ తండాకు చెందిన లంబాడా హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ మంగళవారం సాయంత్రం ఆయనకు వివిధ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు.

1 day ago
user_P.G. Murthy
P.G. Murthy
జన్నారం, మంచిర్యాల, తెలంగాణ•
1 day ago
91154f4b-ec86-48e1-96a4-411f22a1c632

బంజారా కులస్తుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటాం బంజారా కులస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ హామీ ఇచ్చారు. జన్నారం మండలంలోని హాస్టల్ తండాకు చెందిన లంబాడా హక్కుల పోరాట సమితి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ మంగళవారం సాయంత్రం ఆయనకు వివిధ సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ వారి సమస్యలు పరిష్కరించేలా కృషి చేస్తారని హామీ ఇచ్చారు.

More news from తెలంగాణ and nearby areas
  • బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నినాదాలతో ధర్నా బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. యూనివర్సిటీలో విలీనం చేస్తే ఫీజుల భారం పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    1
    బెల్లంపల్లిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు నినాదాలతో ధర్నా 
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. పాలిటెక్నిక్ కళాశాలలను యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ యూనివర్సిటీలో విలీనం చేయొద్దని నినాదాలు చేశారు. యూనివర్సిటీలో విలీనం చేస్తే ఫీజుల భారం పెరిగి పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. విలీన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    4 hrs ago
  • రాజీవ్ నగర్ లంబాడి తండా భూ సమస్యలను పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్ లంబాడి తండాను భారత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉన్నతాధికారులతో కలిసి తండాలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు, భూములకు సంబంధించిన వివాదాలపై వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి 8 ఇంక్లైన్ కాలనీ పరిధిలో కొన్ని కేసులు కమిషన్ దృష్టికి వచ్చాయని, వాటికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయా కేసులపై మరింత స్పష్టత కోసం నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు. ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించామని, రాజీవ్ నగర్ లంబాడి తండాలో ప్రజలు సుమారు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని తెలిపారు. ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న భూములకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో భూముల పరిస్థితి, ప్రజల సమస్యలు, సంబంధిత అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు చెప్పారు. సింగరేణి సంస్థకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, అవసరం లేకుండా వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. ఈ భూముల సమస్యకు సంబంధించి సింగరేణి సంస్థ సీఎండీకి లేఖ రాసి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు. ఒక ప్రాంతంలో 12 సంవత్సరాలుగా నివాసం ఉంటే హక్కులు పొందే అంశానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి భూముల రికార్డులు, హక్కులు, ఇతర చట్టపరమైన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రాజీవ్ నగర్ లంబాడి తండా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో (అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్) అరుణ శ్రీ జిల్లా, రెవెన్యూ, సింగరేణి,జిల్లా అధికారులు ,తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
    1
    రాజీవ్ నగర్ లంబాడి తండా భూ సమస్యలను పరిశీలించిన జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్
రామగుండం మండలం 8 ఇంక్లైన్ కాలనీలోని రాజీవ్ నగర్ లంబాడి తండాను భారత జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ బుధవారం సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. ఉన్నతాధికారులతో కలిసి తండాలో పర్యటించి అక్కడి ప్రజల సమస్యలు, భూములకు సంబంధించిన వివాదాలపై వివరాలు సేకరించారు.
ఈ సందర్భంగా జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ సింగరేణి 8 ఇంక్లైన్ కాలనీ పరిధిలో కొన్ని కేసులు కమిషన్ దృష్టికి వచ్చాయని, వాటికి సంబంధించి ఇప్పటికే సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఆయా కేసులపై మరింత స్పష్టత కోసం నేడు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించినట్లు పేర్కొన్నారు.
ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించామని, రాజీవ్ నగర్ లంబాడి తండాలో ప్రజలు సుమారు 50 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నారని  తెలిపారు. ప్రస్తుతం వారు నివాసం ఉంటున్న భూములకు సంబంధించి వివాదం నెలకొన్న నేపథ్యంలో భూముల పరిస్థితి, ప్రజల సమస్యలు, సంబంధిత అంశాలను ప్రత్యక్షంగా పరిశీలించినట్లు చెప్పారు.
సింగరేణి సంస్థకు పెద్ద ఎత్తున భూములు ఉన్నాయని, అవసరం లేకుండా వ్యక్తులను ఇబ్బందులకు గురిచేయవద్దని సూచించారు. ఈ భూముల సమస్యకు సంబంధించి సింగరేణి సంస్థ సీఎండీకి లేఖ రాసి, ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు తెలిపారు.
ఒక ప్రాంతంలో 12 సంవత్సరాలుగా నివాసం ఉంటే హక్కులు పొందే అంశానికి సంబంధించి చట్టపరమైన నిబంధనలు ఉన్నాయని  పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించి భూముల రికార్డులు, హక్కులు, ఇతర చట్టపరమైన అంశాలను పరిశీలించి తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.
రాజీవ్ నగర్ లంబాడి తండా ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం, సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు  తెలిపారు.
ఈ పర్యటనలో  (అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్) అరుణ శ్రీ జిల్లా, రెవెన్యూ, సింగరేణి,జిల్లా అధికారులు ,తదితర శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు
    user_Telangana reporter
    Telangana reporter
    Local News Reporter రామగుండం, పెద్దపల్లి, తెలంగాణ•
    3 hrs ago
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని, *సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి..* 🚩బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని, ▪️కానీ గత ప్రభుత్వాలు ఏంఐఎం నాయకులకు లొంగిపోయి, కేవలం ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ వేడుకలను జరపలేదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వంసెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ డిమాండ్ చేసారు. 🔸బుధవారం నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా డిఆర్ఓ రాథోడ్ రమేష్ గారికి బీజేపీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ. 🔸 *1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందితే.. అందులో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వేడుకలు జరుపుకుంటున్నా, ఇక్కడ మాత్రం జరపకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్నే తాకట్టు పెట్టారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.అయితే సెప్టెంబర్ 17న విముక్తి దినం జరపాలని డిమాండ్ చేస్తూ లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు బీజేపీ చేసిన పోరాటం, డిమాండ్ మేరకు.. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చి ఈ వేడుకలను నిర్వహిస్తోందని గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాను సగర్వంగా ఎగురవేద్దామని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిసేమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ బుర్ర,కౌన్సిలర్ ధర్మాజీ గారి ఈశ్వర్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ తోకల అనిల్, నాయకులు విజయ్ కుమార్, దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
    1
    తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని,
*సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి..*        
🚩బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ గారు  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సెప్టెంబర్ 17ను తెలంగాణ విముక్తి దినంగా, ప్రజల నిజమైన స్వాతంత్ర్య దినంగా అధికారికంగా జరపాలని మనం ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు కోరుకున్నామని,
▪️కానీ గత ప్రభుత్వాలు ఏంఐఎం నాయకులకు లొంగిపోయి, కేవలం ఓట్ల కోసం, బుజ్జగింపు రాజకీయాల కోసం ఆ వేడుకలను జరపలేదని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వంసెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రాంనాథ్ డిమాండ్ చేసారు. 
🔸బుధవారం నిర్మల్ జిల్లా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా డిఆర్ఓ రాథోడ్ రమేష్ గారికి బీజేపీ నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.         
🔸 *1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం విముక్తి పొందితే.. అందులో భాగమైన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో వేడుకలు జరుపుకుంటున్నా, ఇక్కడ మాత్రం జరపకపోవడం దురదృష్టకరమన్నారు. ఓట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్నే తాకట్టు పెట్టారని అయన ఆవేదన వ్యక్తం చేశారు.అయితే సెప్టెంబర్ 17న విముక్తి దినం జరపాలని డిమాండ్ చేస్తూ లాఠీ దెబ్బలు తిని, రక్తం చిందించిన పార్టీ భారతీయ జనతా పార్టీ. ఆనాడు బీజేపీ చేసిన పోరాటం, డిమాండ్ మేరకు.. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ముందుకు వచ్చి ఈ వేడుకలను నిర్వహిస్తోందని గుర్తు చేశారు.తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుటాను సగర్వంగా ఎగురవేద్దామని అయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడిసేమ్మె రాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి యాతాళం చిన్నారెడ్డి,బీజేవైఎం జిల్లా అధ్యక్షులు నిరంజన్ రెడ్డి, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ బుర్ర,కౌన్సిలర్ ధర్మాజీ గారి ఈశ్వర్, జిల్లా కౌన్సిల్ మెంబెర్ తోకల అనిల్, నాయకులు విజయ్ కుమార్, దీక్షిత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
    user_Douda karthik
    Douda karthik
    Local News Reporter నిర్మల్ రూరల్, నిర్మల్, తెలంగాణ•
    3 hrs ago
  • *కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేసే ఆందోళన - పోరాటాలపై పెడుతున్న ఆంక్షలు-నిర్భంధాల ఖండిస్తున్నాం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక నిరసన దీక్షలు సందర్భంగా బొమ్మెనసురేష్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి*మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన -పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది సబబు కాదు, 2026 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన అంగన్వాడీ, ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులను సైతం తెల్లవారిఝూము నుండే వేటాడారు, వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు. పోలీసుల ఈ చర్యల మూలంగా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న సిఐటియు నాయకులను సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడమే. రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్భంధం, అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ సెప్టెంబర్ 16 జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరసన దీక్షలు చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక దీక్షలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో, *సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు క్లైమెంటు వెస్లీ,ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు, పి సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ సుగుణ, విజయ,నంద ఇంద్రమాల, మౌనిక, కోశాధికారి లక్ష్మి, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు B.లలిత, జిల్లా ఉపాధ్యక్షులు కవిత, భాగ్య,కళ గంగామణి, వనజ,లావణ్య, మద్దతుగా, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసo.శంభు* తదితరులు పాల్గొన్నారు,
    1
    *కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం చేసే ఆందోళన - పోరాటాలపై పెడుతున్న ఆంక్షలు-నిర్భంధాల ఖండిస్తున్నాం
నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక  నిరసన దీక్షలు సందర్భంగా బొమ్మెనసురేష్ CITU జిల్లా ప్రధాన కార్యదర్శి*మాట్లాడుతూ 
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ కార్మిక వర్గానికి అనేక హమీలు ఇచ్చి అమలు చేస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1,000 రోజులు గడిచినప్పటికీ, కార్మిక వర్గానికి ఇచ్చిన హమీల అమలు పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. దీనితో కార్మిక వర్గం తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన -పోరాటాలు చేస్తుంటే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ పాటు వివిధ జిల్లాల్లో తీవ్ర నిర్భంధాన్ని ప్రయోగిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో కనీసం ధర్నా చేసుకునేందుకు కూడా అనుమతిని నిరాకరిస్తున్నారు. ఇది సబబు కాదు,
2026 సెప్టెంబర్ 8, 9 తేదీల్లో జరిగిన అంగన్వాడీ, ఆశా రెండు సంఘాల "ఛలో హైదరాబాద్" పిలుపులను భగ్నం చేయడానికి కాంగ్రెస్ సర్కార్ పడరాని పాట్లు పడింది. వివిధ జిల్లాల్లో నాయకులను ఇండ్ల వద్దే ముందు రోజు రాత్రే అరెస్టులు చేశారు. సిఐటియు రాష్ట్ర నాయకులను సైతం తెల్లవారిఝూము నుండే వేటాడారు, వందలాది మంది పోలీసులు తమ బలగాలతో వచ్చి అక్రమ ముందస్తు అరెస్ట్లకు పాల్పడుతున్నారు. పోలీసుల ఈ చర్యల మూలంగా ప్రజాస్వామ్యంలో చట్టబద్ధంగా పనిచేస్తున్న సిఐటియు నాయకులను సంఘ వ్యతిరేక శక్తులుగా చిత్రీకరించడమే.
రాష్ట్రంలో కొనసాగుతున్న నిర్భంధం, అప్రజాస్వామిక చర్యలను నిరసిస్తూ సెప్టెంబర్ 16 జిల్లా కేంద్రాల్లో సామూహిక నిరసన దీక్షలు చేయాలని సిఐటియు తెలంగాణ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. అందులో భాగంగా నిర్మల్ ఆర్డీవో కార్యాలయం ముందు సామూహిక దీక్షలు నిర్వహిస్తున్నాం ఈ కార్యక్రమంలో, *సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు క్లైమెంటు వెస్లీ,ఆశా వర్కర్స్ జిల్లా అధ్యక్షురాలు, పి సుజాత, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ సుగుణ, విజయ,నంద ఇంద్రమాల, మౌనిక, కోశాధికారి లక్ష్మి, అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షులు B.లలిత, జిల్లా ఉపాధ్యక్షులు కవిత, భాగ్య,కళ గంగామణి, వనజ,లావణ్య, మద్దతుగా, ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి తొడసo.శంభు* తదితరులు పాల్గొన్నారు,
    user_Venu
    Venu
    Nirmal U, Telangana•
    6 hrs ago
  • రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఇన్ గేట్ నుంచి అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ, మతపరమైన కోణంలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. నిజాం నిరంకుశ పాలన, జాగీర్దారీ వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగం పోరాడిందని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు పాల్గొన్నారని పేర్కొన్నారు. పోరాట ఫలితంగా వేలాది గ్రామాలకు విముక్తి లభించిందని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, డి.నరేష్ పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
    4
    రైతాంగ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి సాయుధ పోరాటాన్ని బీజేపీ వక్రీకరిస్తోంది
సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వార్షికోత్సవాల సందర్భంగా సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బస్టాండ్ ఇన్ గేట్ నుంచి అనభేరి ప్రభాకర్‌రావు విగ్రహం వరకు ఈ ప్రదర్శన కొనసాగింది. అనంతరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నాయకులు కీలక పాత్ర పోషించారని అన్నారు. పోరాటంతో సంబంధం లేని బీజేపీ నేతలు చరిత్రను వక్రీకరిస్తూ, మతపరమైన కోణంలో ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.
నిజాం నిరంకుశ పాలన, జాగీర్దారీ వ్యవస్థ, భూస్వాముల దోపిడీ, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో రైతాంగం పోరాడిందని తెలిపారు. భూమి, భుక్తి, విముక్తి కోసం జరిగిన ఈ పోరాటంలో అనేక మంది కమ్యూనిస్టు యోధులు పాల్గొన్నారని పేర్కొన్నారు.
పోరాట ఫలితంగా వేలాది గ్రామాలకు విముక్తి లభించిందని, లక్షల ఎకరాల భూమి పేదలకు పంపిణీ జరిగిందని తెలిపారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని, సెప్టెంబర్ 17ను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు గిట్ల ముకుందరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి శ్రీనివాస్, ఎడ్ల రమేష్, డి.నరేష్ పటేల్ తదితర నాయకులు పాల్గొన్నారు.
    user_OM NAMSHIVAYA
    OM NAMSHIVAYA
    Karimnagar, Telangana•
    1 hr ago
  • చరిత్ర పురుషుడు అంబేద్కర్ ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అంబేద్కర్ చదివిన చదువులు ఆ కాలంలో ఆసియా ఖండంలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర చెబుతుందని, మనువాద సిద్ధాంతాలతో కోట్ల మందిని బానిసత్వంలోకి నెట్టిన వ్యవస్థ ను మార్చిన చరిత్ర పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు. బుధవారం ప్రజామిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడితులకు , తాడితులకు, మహిళలకు అన్ని రంగాలలో హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి మహా పురుషుడు బి ఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా అతనికి వస్తున్నటువంటి కీర్తిని చూసి ఓర్వలేక ఈ దేశంలో ఉన్న మనువాద శక్తులు ఆడిస్తున్న నాటకమే ఆవారా ప్రసాద్ అంబేద్కర్ పై రచిస్తున్న పుస్తకం. చరిత్ర సృష్టించిన ఇప్పటికీ ఇంకా చరిత్ర సృష్టిస్తున్న భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వాస్తవం. రామాయణం, రాముడు ఒక కాల్పనికం అని అన్నారు. చరిత్ర ఏదో, వాస్తవం ఏదో చరిత్ర వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తే దళిత బహుజనులు, అంబేద్కర్ వాదులు మొత్తం సాయుధ పోరాటానికి సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆవారా ప్రసాద్ ను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో గజ్జల ఆనందరావు,సిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్ లు పాల్గొన్నారు
    1
    చరిత్ర పురుషుడు అంబేద్కర్ 
 ప్రజామిత్ర రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్
అంబేద్కర్ చదివిన చదువులు ఆ కాలంలో  ఆసియా ఖండంలోనే మొదటి వ్యక్తిగా చరిత్ర చెబుతుందని, మనువాద సిద్ధాంతాలతో కోట్ల మందిని బానిసత్వంలోకి నెట్టిన వ్యవస్థ ను మార్చిన చరిత్ర పురుషుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ప్రజామిత్ర ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ రాష్ట్ర అధ్యక్షులు కొరివి వేణుగోపాల్ అన్నారు.
బుధవారం ప్రజామిత కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీడితులకు , తాడితులకు, మహిళలకు అన్ని రంగాలలో హక్కుల కోసం పోరాడి సాధించినటువంటి మహా పురుషుడు బి ఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా అతనికి వస్తున్నటువంటి కీర్తిని చూసి ఓర్వలేక ఈ దేశంలో ఉన్న మనువాద శక్తులు ఆడిస్తున్న నాటకమే ఆవారా ప్రసాద్ అంబేద్కర్ పై రచిస్తున్న  పుస్తకం.
చరిత్ర సృష్టించిన ఇప్పటికీ ఇంకా చరిత్ర సృష్టిస్తున్న భారత దేశ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఒక వాస్తవం. రామాయణం, రాముడు ఒక కాల్పనికం  అని అన్నారు.
చరిత్ర ఏదో, వాస్తవం ఏదో చరిత్ర వాస్తవాలను తప్పుదోవ పట్టిస్తే దళిత బహుజనులు, అంబేద్కర్ వాదులు మొత్తం సాయుధ పోరాటానికి సిద్ధమవుతారన్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలుకొని ఆవారా ప్రసాద్ ను అరెస్ట్ చేసి తగిన శిక్ష విధించాలన్నారు. ఈ మీడియా సమావేశంలో గజ్జల ఆనందరావు,సిగిరి శ్రీధర్, కొంపల్లి రవీందర్, శ్రీరాముల కిషన్  లు పాల్గొన్నారు
    user_శాతవాహన కరీంనగర్
    శాతవాహన కరీంనగర్
    కరీంనగర్ రూరల్, కరీంనగర్, తెలంగాణ•
    2 hrs ago
  • గుర్తుతెలియని వ్యక్తికి అంత్యక్రియలు మానవత్వం చాటిన మానవసేవే మాధవసేవ సంస్థ ఆదిలాబాద్‌: పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లో వారం రోజుల క్రితం మృతిచెందిన గుర్తుతెలియని వ్యక్తికి ‘మానవసేవే మాధవసేవ’ సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. బంధువుల కోసం మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీలో భద్రపరిచారు. టూటౌన్‌ సీఐ ద్వారా సమాచారం తెలుసుకున్న సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి స్థానిక తీర్పెల్లి హిందూ వైకుంఠధామంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ మాజీ జనరల్‌ సెక్రటరీ రామ్‌చందర్‌ మహాత్మే దాతగా నిలిచారు. కార్యక్రమంలో శశికళ, శ్రీపాదవార్‌ శ్రీనివాస్‌, అబ్దుల్‌ అజీజ్‌, సవీన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    1
    గుర్తుతెలియని వ్యక్తికి అంత్యక్రియలు మానవత్వం చాటిన మానవసేవే మాధవసేవ సంస్థ
ఆదిలాబాద్‌: పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లో వారం రోజుల క్రితం మృతిచెందిన గుర్తుతెలియని వ్యక్తికి ‘మానవసేవే మాధవసేవ’ సంస్థ ఆధ్వర్యంలో అంత్యక్రియలు నిర్వహించారు. బంధువుల కోసం మృతదేహాన్ని రిమ్స్‌ మార్చురీలో భద్రపరిచారు. టూటౌన్‌ సీఐ ద్వారా సమాచారం తెలుసుకున్న సంస్థ ప్రతినిధులు ముందుకు వచ్చి స్థానిక తీర్పెల్లి హిందూ వైకుంఠధామంలో హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. రెడ్‌క్రాస్‌ సొసైటీ మాజీ జనరల్‌ సెక్రటరీ రామ్‌చందర్‌ మహాత్మే దాతగా నిలిచారు. కార్యక్రమంలో శశికళ, శ్రీపాదవార్‌ శ్రీనివాస్‌, అబ్దుల్‌ అజీజ్‌, సవీన్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_AlluriMahesh
    AlluriMahesh
    Local News Reporter ఆదిలాబాద్ రూరల్, ఆదిలాబాద్, తెలంగాణ•
    4 hrs ago
  • ముల్కలపేట–రాచర్ల మార్గంలో అప్రోచ్ రోడ్డుకు పగుళ్లు మరమ్మత్తులు చేపట్టాలని సూచన ముల్కలపేట–రాచర్ల గ్రామాల మధ్య మంగలి ఒర్రెపై నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తైన కొద్దికాలానికే రహదారిపై పగుళ్లు కనిపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పగుళ్లకు మరమ్మతులు చేపట్టి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
    1
    ముల్కలపేట–రాచర్ల మార్గంలో అప్రోచ్ రోడ్డుకు పగుళ్లు మరమ్మత్తులు చేపట్టాలని సూచన
ముల్కలపేట–రాచర్ల గ్రామాల మధ్య మంగలి ఒర్రెపై నిర్మించిన బ్రిడ్జికి ఇరువైపులా ఉన్న అప్రోచ్ రోడ్డులో పగుళ్లు ఏర్పడ్డాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తైన కొద్దికాలానికే రహదారిపై పగుళ్లు కనిపించడంతో స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో ప్రతిరోజూ ద్విచక్ర వాహనాలు, ఆటోలు తదితర వాహనాలు రాకపోకలు సాగిస్తుండగా ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి పగుళ్లకు మరమ్మతులు చేపట్టి రహదారిని సురక్షితంగా మార్చాలని ప్రజలు కోరుతున్నారు.
    user_M S SRIDHAR
    M S SRIDHAR
    Local News Reporter దండేపల్లి, మంచిర్యాల, తెలంగాణ•
    5 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.