32వ ప్రపంచ ఆదివాసి (గిరిజన) దినోత్సవం గిరిజన హక్కుల పరిరక్షణకు పిలుపు నంగారా భేరి లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఏర్పాటు 32వ ప్రపంచ ఆదివాసి (గిరిజన) దినోత్సవ సభలో లంబాడి హక్కుల పోరాట సమితి మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ 1994 ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం గా అధికారికంగా ప్రకటించారు మహబూబాబాద్ జిల్లా అధ్యక్షుడు బోడ రమేష్ నాయక్ మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గిరిజన ఆదివాసీ ప్రజల హక్కులను కాపాడడం వారి సంస్కృతి సంప్రదాయాలు భాష జీవన విధానాలను పరిరక్షించడం వారి సామాజిక–ఆర్థిక అభివృద్ధికి ప్రా ధాన్యత కల్పించడం కోసం ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 1982లో గిరిజనులపై చర్చలు ప్రారంభమయ్యాయి అనంతరం 1994 ఆగస్టు 9వ తేదీని అంతర్జాతీయ ఆదివాసీ ప్రజల దినోత్సవం గా అధికారికంగా ప్రకటించారు అయితే ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని కేవలం ఉత్సవంగా జరుపుకోవడం మాత్రమే కాకుండా ఈ రోజు మనం మన రాజ్యాం గబద్ధమైన హక్కులు చట్టపరమైన రక్షణలు వాటి అమలు పరిస్థితి గురించి ఆలోచిం చాల్సిన అవసరం ఉంది భారత రాజ్యాంగం గిరిజనుల హక్కుల రక్షణ కోసం ప్రత్యేకమైన రాజ్యాంగ పరిరక్షణలను కల్పించింది ముఖ్యంగా రాజ్యాంగంలోని ఫిఫ్త్ షెడ్యూల్ ద్వారా షెడ్యూల్డ్ ఏరియాల్లో నివసించే గిరిజనుల భూమి జీవన విధానం సంప్రదా యాలు మరియు పరిపాలనా హక్కులను రక్షించేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది అదేవిధంగా PESA Act, 1996 ద్వారా షెడ్యూల్డ్ ఏరియాల్లో గ్రామసభకు ప్రత్యేక అధికారాలు కల్పించబడ్డాయి గ్రామసభ అభిప్రాయం అనుమతి మరియు భాగస్వామ్యానికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనేక అంశాలు ఉన్నప్పటికీ అనేక ప్రాంతా ల్లో గ్రామసభ అధికారాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది తెలంగాణలో షెడ్యూల్డ్ ఏరియాల్లో అమలు లో ఉన్న ఆంధ్ర ప్రదేశ్ షెడ్యూల్డ్ ఏరియాస్ లండ్ ట్రాన్స్ఫర్ రెగ్యులేషన్ 1959 – రెగ్యులే షన్ 1 of 1970 (1/70 రెగ్యులేషన్ ) గిరిజ నుల భూములను గిరిజనేతరులకు అక్రమం గా బదలాయింపులు జరగకుండా రక్షించ డానికి అత్యంత ముఖ్యమైన చట్టపరమైన రక్షణ ఈ చట్టం ఉద్దేశం గిరిజన భూములు గిరిజనుల చేతుల్లోనే ఉండేలా చూడడం అలాగే Forest Rights Act, 2006 ద్వారా అటవీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తూ అటవీపై ఆధారపడి జీవిస్తున్న అర్హులైన గిరిజనులు మరియు ఇతర సంప్ర దాయ అటవీ నివాసుల హక్కులను గుర్తిం చేందుకు చట్టపరమైన అవకాశం కల్పించ బడిందిఅదేవిధంగా రాజ్యాంగంలోని Article 46 రాష్ట్రం షెడ్యూల్డ్ తెగల విద్యా ఆర్థిక ప్రయోజనా లను ప్రత్యేక శ్రద్ధతో ప్రోత్సహించాలని సామాజిక అన్యాయం మరియు అన్ని రకాల దోపిడీ నుంచి వారిని రక్షించాలని నిర్దేశిస్తుంది Articles 330, 332 ద్వారా రాజకీయ ప్రాతినిధ్యానికి Article 338A ద్వారా జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్‌కు ప్రత్యేక రాజ్యాంగ పరిరక్ష ణ కల్పించబడింది అందువల్ల గిరిజనుల హక్కులు అనేవి ఎవరో రాజకీయ నాయకు లు ఇచ్చే దానం కాదు అవి భారత రాజ్యాం గం మరియు చట్టాలు కల్పించిన హక్కులు కానీ నేటి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వా లు గిరిజనుల ఓట్లను ఎన్నికల సమయంలో ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం గిరిజనుల హక్కులు గిరిజన భూముల రక్షణ Fifth Schedule అమలు PESA గ్రామసభ అధికారాలు 1/70 చట్టం పకడ్బందీ అమలు అటవీ హక్కుల చట్టం అమలు వంటి అసలు సమస్యలకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆందోళన గిరిజన సమాజంలో ఉంది గిరిజనుల ఓట్లు ఎన్నికల సమయంలో మాత్రమే గుర్తుకు రావడం కాదు గిరిజనుల హక్కులు ప్రతిరో జూ గుర్తుండాలి రాజకీయ పార్టీలు మార వచ్చు ప్రభుత్వాలు మారవచ్చు నాయకులు మారవచ్చు కానీ గిరిజనుల భూమి హక్కు లు అస్తిత్వం సంస్కృతి మరియు భవిష్యత్తు తరాల ప్రయోజనాలు శాశ్వతమైనవి రాబో యే రోజుల్లో కూడా మనలను కేవలం ఓటు బ్యాంకుగా ఉపయోగించుకుని ఎన్నికల తరువాత పార్టీ ప్రయోజనాలు మరియు పార్టీ ఎజెండాలకే పరిమితమయ్యే రాజకీ యాలను గిరిజన సమాజం ప్రశ్నించాలి మనకు కావాల్సింది హామీలు కాదు చట్టాల పకడ్బందీ అమలు మనకు కావాల్సింది ఓట్ల కోసం ఇచ్చే మాటలు కాదు రాజ్యాంగం కల్పించిన హక్కులకు రక్షణ మనకు కావా ల్సింది రాజకీయ ప్రయోజనాల కోసం చేసే సభలు కాదు గిరిజనుల భూమి అడవి జలాలు సంస్కృతి ఆత్మగౌరవాన్ని కాపాడే పాలన ఫిఫ్త్ షెడ్యూల్ రక్షణలు పకడ్బందీగా అమలు కావాలి PESA చట్టం ద్వారా గ్రామ సభకు కల్పించిన అధికారాలు అమలు కావాలి 1/70 భూ బదలాయింపు నియంత్ర ణ చట్టం కఠినంగా అమలు కావాలి ఫారెస్ట్ రైట్స్ యాక్టు ద్వారా అర్హులైన గిరిజనులకు హక్కులు కల్పించాలి గిరిజనులపై జరిగే సామాజిక ఆర్థిక భూ దోపిడీని అరికట్టాలి ఇది ఏ ఒక్క రాజకీయ పార్టీకి వ్యతిరేకమైన పోరాటం కాదు ఇది రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవడానికి గిరిజనుల అస్తిత్వాన్ని రక్షించుకోవడానికి భవిష్యత్ తరాలకు న్యాయం చేయడానికి జరిగే ప్రజాస్వామ్య పోరాటం గిరిజనుల హక్కులు రక్షించబడాలి చట్టాలు పకడ్బందీగా అమలు కావాలి గ్రామసభలకు అధికారం రావాలి గిరిజనుల భూమి అడవి జలాలు మరియు అస్తిత్వం కాపాడబడాలి జై ఆదివాసీ జై లంబాడి జై రాజ్యాంగం బాదావత్ నరేష్ LSPS లంబాడి హక్కుల పోరాట సమితి బయ్యారం మండల ప్రెసిడెంట్

- హనుమకొండ జిల్లాలోని కాకతీయ కేడీసీ డిగ్రీ కాలేజ్ లో బంజారా తేజ్ పండుగ మన సంస్కృతి హనుమకొండ జిల్లాలోని కాకతీయ కేడీసీ డిగ్రీ కాలేజ్ లో బంజారా తేజ్ పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలు తేజ్ మూడో రోజు ఉత్సవాల్లో భాగంగా కాకతీయ కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు లెక్చలర్ చిన్న సార్ గారు స్టూడెంట్స్ ఆహ్వానం మేరకు ముఖ్యఅతిథిగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మన జాతి ఐక్యత సంస్కృతి సాంప్రదాయలు అంకిత భావాన్ని తెలియపరిచే ఈ పండగ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది ఈ కళాశాలలో ఉన్న సోదరీ సోదరులకు మన జాతి సంస్కృతి సంప్రదాయాన్ని చాటి చెప్పడం నాకెంతో గర్వంగా ఉంది ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యం కోసం చదవాలి మీ తల్లి తండ్రులు కష్ట పడి చదివిస్తున్నారు మీ తల్లి తండ్రుల పేరు నిలబెట్టే బాధ్యత మీరే తీసుకోవాలి నేను మీ లోక్ నాయక్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు1
- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత నర్సంపేట: దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన గద్దెను మున్సిపల్ అధికారులు కూల్చివేయడం నర్సంపేటలో వివాదానికి దారితీసింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఎదురుగా ఉన్న ప్రైవేట్ స్థలంలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు గద్దె నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవంటూ మున్సిపల్ అధికారులు రాత్రి సమయంలో గద్దెను కూల్చివేశారని వారు ఆరోపించారు. ప్రైవేట్ స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నప్పటికీ అనుమతి లేదనే కారణంతో అధికారులు చర్యలు తీసుకోవడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన అభిమానులు, అనుచరులు విగ్రహం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గద్దె కూల్చివేతపై బీఆర్ఎస్ శ్రేణులు, పెద్ది అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- మావోయిజం అంతం.. లొంగిపోయిన వారి సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: డీజీపీ సీవీ ఆనంద్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ పర్యటించారు. భూపాలపల్లి, ములుగు జిల్లాల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ, రాష్ట్ర వ్యాప్తంగా మావోయిజం అంతమైందని, ప్రధాన క్యాడర్ మొత్తం లొంగిపోయిందని తెలిపారు. లొంగిపోయిన వారి సంక్షేమానికి ప్రభుత్వం, పోలీస్ శాఖ కట్టుబడి ఉందన్నారు. గ్రామస్థాయిలో మాదకద్రవ్యాల వినియోగం పెరుగుతోందని, వాటి నిర్మూలనకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పట్టణాల్లో హైవేలపై ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపడతామని తెలిపారు. పోలీస్ కుటుంబాల రక్షణకు కట్టుబడి ఉన్నామని, సిబ్బందికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తామని డీజీపీ స్పష్టం చేశారు. అత్యవసర సమయాల్లో 100కు బదులుగా �112కు డయల్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.1
- తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామర్శించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ప్రకటించిన విధంగా.. పెద్ది సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు కేసిఆర్ చెరొక కోటి రూపాయలు, తల్లికి 25 లక్షల రూపాయల చెక్కులు అందజేశారు. కేసీఆర్ వెంట పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.2
- బొగత జలపాతం వద్ద తగ్గిన వరద ఉద్ధృతి.. పర్యాటకుల సందడి.. ములుగు జిల్లా వాజేడు మండలంలోని బొగత జలపాతం వద్ద వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో గత కొన్ని రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన జలపాతం ప్రస్తుతం కొంత శాంతించింది. జలపాతం అందాలను వీక్షించేందుకు పర్యాటకులు తరలివస్తుండగా, ప్రవాహం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.1
- అభివృద్ధి కార్యక్రమాల చిత్రాలతో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి గొడుగులు జనగాం జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన సోషల్ మీడియా కోఆర్డినేటర్ లోడంగి అశోక్ సొంత ఖర్చులతో 500 గొడుగులను తయారు చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి చిత్రాలు, నియోజకవర్గ అభివృద్ధి పనుల ఫొటోలతో ప్రత్యేక గొడుగులు సిద్ధమయ్యాయి.వినూత్న డిజైన్‌తో రూపొందించిన ఈ గొడుగులు ఆకర్షణగా నిలుస్తున్నాయి.1
- ఈరోజు సికింద్రాబాద్ చిలకలగూడలోని శ్రీ కట్టమైసమ్మ–పోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల సందర్భంగా రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. బోనాల జాతరకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఆలయ కమిటీ సభ్యులు, అధికారులు, పూజారులు ఘనస్వాగతం పలికారు అనంతరం నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో మంత్రిగ పొంగులేటి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రిగారు “అమ్మవారి కృపాకటాక్షాలు, ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా కళకళలాడాలని వేడుకున్నారు1
- మాజీ ఎమ్మెల్యే విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో ధర్నాకు దిగిన మాజీ మంత్రి వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో ఉద్రిక్తత. పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం కోసం ఏర్పాటు చేసిన గద్దెను కాంగ్రెస్ ప్రభుత్వం కూల్చివేయడంతో, ధర్నాకు దిగిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇతర బీఆర్ఎస్ శ్రేణులు.ఎర్రబెల్లి దయాకర్ రావును పోలీసులు అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.1