logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

రఘుదేవపురంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.. అన్న సమారాధనలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి రఘుదేవపురంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.. అన్న సమారాధనలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి *సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో - ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు పాల్గొన్నారు.* *పెందుర్తి హనుమంతు గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆమె, ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డన చేశారు.* *ఈ సందర్భంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు మాట్లాడుతూ "గ్రామాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటారని, ఆ భగవంతుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను."* ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, గ్రామస్తులు మరియు కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

1 hr ago
user_Surisetti Rambabu
Surisetti Rambabu
కొరుకొండ, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

రఘుదేవపురంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.. అన్న సమారాధనలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి రఘుదేవపురంలో ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం.. అన్న సమారాధనలో పాల్గొన్న శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి *సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామంలో అత్యంత వైభవంగా జరుగుతున్న శ్రీ ప్రసన్నాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమంలో రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారి సతీమణి జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు రాష్ట్ర కమిటీ కో - ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు పాల్గొన్నారు.* *పెందుర్తి హనుమంతు గారి ప్రత్యేక ఆహ్వానం మేరకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆమె, ముందుగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు స్వయంగా వడ్డన చేశారు.* *ఈ సందర్భంగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు మాట్లాడుతూ "గ్రామాల్లో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజలందరూ ఐకమత్యంగా ఉంటారని, ఆ భగవంతుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని కోరుకుంటున్నాను."* ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బిజెపి పార్టీ నాయకులు, గ్రామస్తులు మరియు కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరుగురు బాధితులకు రూ. 8.52 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. వైసీపీ హయాంలో నిర్వీర్యం చేయబడిన ఈ పథకం పేదల వైద్యానికి తిరిగి భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు.
    1
    అనపర్తిలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరుగురు బాధితులకు రూ. 8.52 లక్షల ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. వైసీపీ హయాంలో నిర్వీర్యం చేయబడిన ఈ పథకం పేదల వైద్యానికి తిరిగి భరోసా కల్పిస్తుందని ఆయన తెలిపారు.
    user_Tri
    Tri
    Journalist అనపర్తి, తూర్పు గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    10 hrs ago
  • బసివి రెడ్డి గారి విగ్రహ ఏర్పాటుపై కుట్రలు తగవు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త, మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు గొల్లల మామిడాడలో ఏర్పాటు చేసిన ప్రముఖ దాత బసివి రెడ్డి గారి విగ్రహావిష్కరణ ఉదంతంపై స్పందించారు. వేలాది మంది పేదలకు నివాస స్థలాలు ఇప్పించి, అనేక దేవాలయాల నిర్మాణానికి సహకరించిన అపర దానకర్ణుడు బసివి రెడ్డి గారి విగ్రహాన్ని చింత దొరబాబు మరియు వారి మిత్రబృందం కలిసి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ క్రమంలో అధికార పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఒక ప్రైవేట్ స్థలంలో, యజమాని అనుమతితో ఏర్పాటు చేసిన విగ్రహం విషయంలో పంచాయతీ కార్యదర్శిని పంపి అభ్యంతరాలు వ్యక్తం చేయించడం, విగ్రహాన్ని తొలగించాలని ఒత్తిడి తీసుకురావడం అత్యంత దారుణమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రభుత్వ స్థలంలో కాకుండా సొంత స్థలంలో విగ్రహాన్ని పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకపోవడం వెనుక నియోజకవర్గ ముఖ్య నేత ప్రోత్సాహం ఉందనేది స్పష్టమవుతోందని", ఇలాంటి కుట్రలు చేసే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. బసివి రెడ్డి గారికి అనపర్తి గ్రామానికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, ఇక్కడ కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూర్యనారాయణ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అనపర్తిలోని రెడ్డి సంఘం నాయకులు ఎవరైనా ముందుకు వచ్చి స్థలాన్ని కేటాయిస్తే, తన సొంత ఖర్చులతో విగ్రహాన్ని అందిస్తానని ఆయన ప్రకటించారు. ఉభయ గోదావరి జిల్లాల్లో మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి సేవా మూర్తుల విగ్రహాలను నెలకొల్పడం ద్వారా భావితరాలకు వారి గొప్పతనం మరియు సేవా తత్పరత తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహనీయుడైన బసివి రెడ్డి గారి విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించాలని నియోజకవర్గ ప్రజలను కోరుతూ, ఈ అడ్డంకులను అధిగమించి ఆ మహనీయుడిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తాను కూడా విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించబోతున్నట్లు ఆయన తెలియజేశారు.
    1
    బసివి రెడ్డి గారి విగ్రహ ఏర్పాటుపై కుట్రలు తగవు: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు
అనపర్తి నియోజకవర్గ వైయస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త,  మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు గొల్లల మామిడాడలో ఏర్పాటు చేసిన ప్రముఖ దాత బసివి రెడ్డి గారి విగ్రహావిష్కరణ ఉదంతంపై స్పందించారు. వేలాది మంది పేదలకు నివాస స్థలాలు ఇప్పించి, అనేక దేవాలయాల నిర్మాణానికి సహకరించిన అపర దానకర్ణుడు బసివి రెడ్డి గారి విగ్రహాన్ని చింత దొరబాబు మరియు వారి మిత్రబృందం కలిసి ఏర్పాటు చేయడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. 
అయితే ఈ క్రమంలో అధికార పార్టీ నాయకత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు. ఒక ప్రైవేట్ స్థలంలో, యజమాని అనుమతితో ఏర్పాటు చేసిన విగ్రహం విషయంలో పంచాయతీ కార్యదర్శిని పంపి అభ్యంతరాలు వ్యక్తం చేయించడం, విగ్రహాన్ని తొలగించాలని ఒత్తిడి తీసుకురావడం అత్యంత దారుణమైన చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "ప్రభుత్వ స్థలంలో కాకుండా సొంత స్థలంలో విగ్రహాన్ని పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేకపోవడం వెనుక నియోజకవర్గ ముఖ్య నేత ప్రోత్సాహం ఉందనేది స్పష్టమవుతోందని", ఇలాంటి కుట్రలు చేసే వారు చరిత్రహీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు.
బసివి రెడ్డి గారికి అనపర్తి గ్రామానికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తు చేస్తూ, ఇక్కడ కూడా ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సూర్యనారాయణ రెడ్డి గారు పిలుపునిచ్చారు. అనపర్తిలోని రెడ్డి సంఘం నాయకులు ఎవరైనా ముందుకు వచ్చి స్థలాన్ని కేటాయిస్తే, తన సొంత ఖర్చులతో విగ్రహాన్ని అందిస్తానని ఆయన ప్రకటించారు. 
ఉభయ గోదావరి జిల్లాల్లో మరిన్ని ప్రాంతాల్లో ఇలాంటి సేవా మూర్తుల విగ్రహాలను నెలకొల్పడం ద్వారా భావితరాలకు వారి గొప్పతనం మరియు సేవా తత్పరత తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. మహనీయుడైన బసివి రెడ్డి గారి విగ్రహం వద్ద ఘన నివాళులు అర్పించాలని నియోజకవర్గ ప్రజలను కోరుతూ, ఈ అడ్డంకులను అధిగమించి ఆ మహనీయుడిని గౌరవించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తాను కూడా విగ్రహం వద్దకు వెళ్లి నివాళులర్పించబోతున్నట్లు ఆయన తెలియజేశారు.
    user_Apsv9 News channel
    Apsv9 News channel
    Media company Yeleswaram, Kakinada•
    35 min ago
  • ఏలూరు జిల్లాలో భారీ అక్రమ రేషన్ మాఫియా బట్టబయలు టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, పోలీసు అధికారులు అండగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలువంగర సాయి దత్తు, గరిమెళ్ళ చలపతి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ – ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఎస్పీ ఆదేశాలు ఏలూరులో బహిర్గతమైన అక్రమ PDS మాఫియా..? టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, అధికారులపై సంచలన ఆరోపణలు ఏలూరు, మే 11 (ప్రత్యేక ప్రతినిధి): ఏలూరు జిల్లాలో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ PDS (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) రేషన్ బియ్యం దందాపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాకు రాజకీయ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారులు అండగా ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది. సోమవారం ఏలూరులో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంటా సాయి కృష్ణ జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన పలు కీలక ఆరోపణలు చేశారు. చింతలపూడి ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో వంగర సాయి దత్తు అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం మాఫియాను నడుపుతున్నాడని, ఈ వ్యవహారానికి టీడీపీ లింగపాలెం మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతి, ధర్మాజీగూడెం ఎస్సై సహా పలువురు అధికారులు, రాజకీయ నేతలు సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు, ఇతర శాఖల అధికారులను ప్రభావితం చేసి అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయని గంటా సాయి కృష్ణ తెలిపారు. ఇటీవల తన ఇంటి వద్ద రేషన్ మాఫియా వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చినా “రేషన్ బియ్యం ఏమైనా డ్రగ్సా?” అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు. అక్రమ రేషన్ వ్యాపారంలో నిందితుడిగా ఉన్న వంగర సాయి దత్తు నుంచి గరిమెళ్ళ చలపతికి భారీ ఎత్తున నగదు, ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు. అదేవిధంగా, అక్రమాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతలపూడి ప్రాంతంలో కొనసాగుతున్న రేషన్ మాఫియాను పూర్తిగా అరికట్టాలని, తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
    2
    ఏలూరు జిల్లాలో భారీ అక్రమ రేషన్ మాఫియా బట్టబయలు
టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, పోలీసు అధికారులు అండగా ఉన్నారంటూ సంచలన ఆరోపణలువంగర సాయి దత్తు, గరిమెళ్ళ చలపతి ఆర్థిక లావాదేవీలపై విచారణ జరపాలని డిమాండ్ – ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఎస్పీ ఆదేశాలు
ఏలూరులో బహిర్గతమైన అక్రమ PDS మాఫియా..?
టీడీపీ నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు – కూటమి నేతలు, అధికారులపై సంచలన ఆరోపణలు
ఏలూరు, మే 11 (ప్రత్యేక ప్రతినిధి):
ఏలూరు జిల్లాలో భారీ స్థాయిలో జరుగుతున్న అక్రమ PDS (పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్) రేషన్ బియ్యం దందాపై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. చింతలపూడి నియోజకవర్గంలోని చింతలపూడి, లింగపాలెం మండలాల్లో చాలా కాలంగా కొనసాగుతున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాకు రాజకీయ నాయకులు, కొందరు ప్రభుత్వ అధికారులు అండగా ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జిల్లాలో కలకలం రేపుతోంది.
సోమవారం ఏలూరులో నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమంలో లింగపాలెం మండలం మఠంగూడెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంటా సాయి కృష్ణ జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులో ఆయన పలు కీలక ఆరోపణలు చేశారు.
చింతలపూడి ప్రాంతంలో పెద్దిరెడ్డి రామచంద్రరావు ఆధ్వర్యంలో వంగర సాయి దత్తు అనే వ్యక్తి అక్రమ రేషన్ బియ్యం మాఫియాను నడుపుతున్నాడని, ఈ వ్యవహారానికి టీడీపీ లింగపాలెం మండల అధ్యక్షుడు గరిమెళ్ళ చలపతి, ధర్మాజీగూడెం ఎస్సై సహా పలువురు అధికారులు, రాజకీయ నేతలు సహకరిస్తున్నారని ఆరోపించారు. అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ పోలీసు, ఇతర శాఖల అధికారులను ప్రభావితం చేసి అక్రమ రవాణాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ అక్రమాలపై ప్రశ్నించినందుకు తనపై ఒత్తిళ్లు, బెదిరింపులు వస్తున్నాయని గంటా సాయి కృష్ణ తెలిపారు. ఇటీవల తన ఇంటి వద్ద రేషన్ మాఫియా వ్యక్తులు రెక్కీ నిర్వహించారని, తన ప్రాణాలకు ముప్పు ఉందని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. స్థానిక ఎస్సైకు సమాచారం ఇచ్చినా “రేషన్ బియ్యం ఏమైనా డ్రగ్సా?” అంటూ నిర్లక్ష్యంగా స్పందించారని ఆరోపించారు.
అక్రమ రేషన్ వ్యాపారంలో నిందితుడిగా ఉన్న వంగర సాయి దత్తు నుంచి గరిమెళ్ళ చలపతికి భారీ ఎత్తున నగదు, ఆన్‌లైన్ లావాదేవీలు జరిగినట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపడితే అసలు నిజాలు బయటపడతాయని అన్నారు.
అదేవిధంగా, అక్రమాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, ఇతర శాఖల అధికారుల పాత్రపై కూడా విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చింతలపూడి ప్రాంతంలో కొనసాగుతున్న రేషన్ మాఫియాను పూర్తిగా అరికట్టాలని, తనకు భద్రత కల్పించాలని ఎస్పీని కోరారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివ కిషోర్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించినట్లు సమాచారం. ఈ వ్యవహారం రాజకీయ, అధికార వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
    user_Ashok
    Ashok
    Local News Reporter జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    4 hrs ago
  • బండి భగీరథ్‌ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు. పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు. తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    1
    బండి భగీరథ్‌ ను వెంటనే అరెస్ట్ చేయాలి ... మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 

పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య డిమాండ్ చేశారు.

పోక్సో కేసు నమోదు అయినప్పటికీ ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.కేంద్ర మంత్రి కుమారుడికి ఒక న్యాయం, సామాన్య ప్రజలకు మరో న్యాయమా అని ప్రశ్నించారు.మధ్యతరగతి కుటుంబానికి చెందిన మైనర్ బాలికను మోసం చేసి, మద్యం తాగించి పలుమార్లు అత్యాచారం చేశారనే ఆరోపణలు ఉన్నప్పటికీ, పోలీసులు తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించారని ఆరోపించారు.బాధిత కుటుంబ సభ్యులు మోదీ సభలో ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన తర్వాతే కేసు నమోదు చేశారని తెలిపారు.బండి భగీరథ్‌ను కాపాడేందుకు ప్రయత్నించడం ద్వారా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉన్న ఫెవికాల్ బంధం బయటపడుతోందని విమర్శించారు.

తక్షణమే బండి భగీరథ్‌ను అరెస్ట్ చేసి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
    user_V Ramarao
    V Ramarao
    సత్తుపల్లి, ఖమ్మం, తెలంగాణ•
    4 hrs ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
    2
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో లారీ యార్డ్ వద్ద జరిగిన ఘర్షణలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఇతర రాష్ట్రానికి చెందినవాడని పోలీసులు గుర్తించగా, పూర్తి వివరాల కోసం దర్యాప్తు కొనసాగుతోంది.
    user_Shivaram
    Shivaram
    Apprenticeship Centre బుర్గుంపహాడ్, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
  • 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨............. 🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨 *డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు* *🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం* 🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37 క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్‌వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్‌బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్‌.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్‌.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు, మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు. నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది. 👉 ప్రజలకు సూచన: బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. –కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు
    1
    🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨.............

🚨 *అంతర్ జిల్లా ఘరానా మోసగాడి అరెస్టు*🚨
*డ్వాక్రా మహిళలను, వృద్ధాప్య పింఛన్లు తీసుకునే మహిళలను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి డబ్బులు కాజేసే మోసగాడిని అరెస్ట్ చేసిన తిరువూరు పోలీసులు*
*🔶ముద్దాయి వివరాలు- నాగూర్ మీరా వలి అలియాస్ అభి, తండ్రి పేరు లేటు బాబ్జి, వయసు 35 సంవత్సరాలు, సొంత ఊరు -పసివేదల కొవ్వూరు రూరల్ మండలం, ప్రస్తుత నివాసం -ఇందిరా కాలనీ కొవ్వూరు పట్టణం*
🔶ముద్దాయి అంతర్ జిల్లా నేరస్తుడు ఇతనిపై గతంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లలో 37  క్రిమినల్ కేసులు నమోదయి ఉన్నాయి
విజయవాడ పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్‌వీ రాజశేఖర్ బాబు గారి ఆదేశాల మేరకు, డీసీపీ శ్రీ లక్ష్మీనారాయణ గారు, మైలవరం ఏసీపీ శ్రీ ప్రసాదరావు గారి పర్యవేక్షణలో, తిరువూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ K. గిరిబాబు గారి ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి తిరువూరు పోలీస్ స్టేషన్ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
తేదీ 05-05-2026 న తిరువూరు పట్టణంలోని ఎస్‌బీఐ (ADB) బ్యాంక్ – రాజుపేట శాఖకు డ్వాక్రా మహిళలు రుణ వాయిదాలు మరియు పొదుపు నగదు జమ చేయడానికి వచ్చిన సమయంలో, షేక్ నాగూర్ మీరా వలి అలియాస్ అభి అనే వ్యక్తి తనను బ్యాంకు ఉద్యోగిగా పరిచయం చేసుకొని మహిళలను నమ్మబలికాడు. వారి అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని నగదు తీసుకుని ఖాతాల్లో జమ చేస్తానని చెప్పి, నకిలీ డిపాజిట్ స్లిప్పులు, నకిలీ సీల్స్ మరియు సంతకాలు ఉపయోగించి మొత్తం రూ.93,000/- నగదును మోసం చేసినట్లు విచారణలో వెల్లడైంది.
ఫిర్యాదు అందుకున్న వెంటనే తిరువూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో భాగంగా తిరువూరు టౌన్ ఎస్‌.ఐ శ్రీ వైవి శాతకర్ణి గారు మరియు ఎస్‌.ఐ శ్రీ కె. రాజు గారు ప్రత్యేక బృందాలతో కలిసి పలు ప్రాంతాలలోని సీసీ కెమెరాలు, బ్యాంకులు మరియు ఇతర కేంద్రాలలో ఫుటేజీలను పరిశీలించారు.
సీసీటీవీ ఫుటేజీలు, సాక్షుల వాంగ్మూలాలు మరియు బ్యాంకు రికార్డులను విశ్లేషించి నిందితుడి ఆచూకీని గుర్తించిన పోలీసులు, ఈ రోజు తిరువూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో నిందితుడిని అరెస్ట్ చేశారు. అతని వద్ద నుండి రూ.1,52,000/- నగదు స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో నిందితుడు గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో 38 కేసులు,  మోసం మరియు ఆస్తి సంబంధిత కేసుల్లో పాల్గొన్న హ్యాబిచువల్ ఆఫెండర్ అని గుర్తించారు.
నిందితుడిని గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, ఈ నెల 25వ తేదీ వరకు రిమాండ్ విధించబడింది.
👉 ప్రజలకు సూచన:
బ్యాంకు లావాదేవీల సమయంలో అపరిచిత వ్యక్తులకు నగదు ఇవ్వవద్దు. కేవలం అధికారిక బ్యాంకు కౌంటర్ వద్ద మాత్రమే డబ్బులు జమ చేయాలి. అనుమానాస్పద వ్యక్తులు గమనించిన వెంటనే సమీప పోలీసులకు సమాచారం ఇవ్వగలరు.
–కె.గిరిబాబు, సి. ఐ, తిరువూరు
    user_Ravi Reporter
    Ravi Reporter
    Local News Reporter తిరువూరు, ఎన్టీఆర్, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • జిల్లాలో ధాన్యం, మొక్కజొన్నను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సీపీఎం పార్టీ కలెక్టరేట్ ధర్నా జిల్లాలో రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, వాటిలో ముఖ్యంగా వరి ధాన్యం, మొక్కజొన్న ను త్వరగతిన కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ల ఎదుట రైతుల ధర్నా లో భాగంగా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ... రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దానిలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో అరకొర సౌకర్యాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ, తాలు పేరుతో కోతలు విధిస్తున్నారని, వెంటనే ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలలో దళారుల దందాను అరికట్టి మొక్కజొన్నకు 2400 రూపాయల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీపీఎం నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    1
    జిల్లాలో ధాన్యం, మొక్కజొన్నను ఎలాంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని సీపీఎం పార్టీ కలెక్టరేట్ ధర్నా
జిల్లాలో రైతులు పండించిన అన్ని రకాల ధాన్యాన్ని ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా కొనుగోలు చేయాలని, వాటిలో ముఖ్యంగా వరి ధాన్యం, మొక్కజొన్న ను త్వరగతిన కొనుగోలు చేయాలని  డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ల ఎదుట రైతుల ధర్నా లో భాగంగా కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శి మచ్చ వెంకటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ... రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే దానిలో ప్రభుత్వం తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తుందని అన్నారు. కొనుగోలు కేంద్రాలలో అరకొర సౌకర్యాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తేమ, తాలు పేరుతో కోతలు విధిస్తున్నారని, వెంటనే ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. మొక్కజొన్న కొనుగోలలో దళారుల దందాను అరికట్టి మొక్కజొన్నకు 2400 రూపాయల మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో సీపీఎం నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    1 hr ago
  • భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    1
    భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు లక్ష్మీపురం లారీ యార్డు వద్ద ఒక వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో బీహార్‌కు చెందిన కుందన్ సింగ్‌ను బండరాయితో కొట్టి చంపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
    user_VANAMA SRINIVAS RAO
    VANAMA SRINIVAS RAO
    జర్నలిస్ట్ కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెం, తెలంగాణ•
    13 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.