*తుర్కపల్లి పోలీస్ స్టేషన్ పత్రికా ప్రకటన* తేది: 01.04.2026 నాడు అయిదుగురు వ్యక్తులు మాదాపూర్ గ్రామా శివారు లో అక్రమంగా గంజాయి ని కలిగి ఉన్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు, తుర్కపల్లి SI తన సిబ్బందితో కలిసి మాదాపూర్ గ్రామ శివారులోని ఎల్లమ్మ గుడి దగ్గర అయిదుగురు అనుమనితులని అదుపు లోకి తీసుకొని విచారించగా, వారి వద్ద సుమారు 200 గ్రాముల గంజాయి దొరికింది. సదరు నిందుతులు అట్టి గంజాయిని కలకత్తా నుండి కొనగోలు చేసి మాదాపూర్ కి తరలించి అమ్ముతున్నారు. *నిందితుల వివరాలు* A-1) ఒగ్గు బాబు, S/o చంద్రయ్య A-2) జూకంటి సత్యం,S/o బాలరాజు A-3 ఒగ్గు నవీన్ కుమార్, S/o ఐలయ్య A-4) జూకంటి శివ కుమార్, S/o రమేష్ నలుగురిది మాదాపూర్ గ్రామం తుర్కపల్లి మండలం A-5) ధీరావత్ దేవేందర్, S/o రాజు R/o వాలు తండ బొమ్మలరామారం మండలం. *స్వాదీనం చేసుకున్నవి* 1) 200 గ్రాముల గంజాయి 2) ఫ్యాషన్ మోటార్ సైకిల్ 3) 4 మొబైలు ఫోన్లు *ఈ సందర్బంగా తుర్కపల్లి SI గారు మాట్లాడుతూ గంజాయి తాగేవారి పట్ల, అమ్మే వారిపట్ల కఠినంగా వ్యవహరిస్తాము, అని యువత గంజాయి కి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.* ఈ కేసు,శ్రీ అక్షాంశ్ యాదవ్, IPS,ఎస్పి యాదాద్రి భువనగిరి జోన్, మరియు శ్రీ పి. శ్రీనివాస్ నాయుడు, డిఎస్పీ యాదాద్రి, శ్రీ ఎం. శంకర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, యాదగిరిగుట్ట రూరల్ గారి పర్యవేక్షణ లో, మహమ్మద్ తఖియుద్దీన్ SIP,తుర్కపల్లి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

- Post by Tagore1
- సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.శ్రీగిరిపల్లి గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిమ్మి రెడ్డి, నెంటూరి కుమార్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్రామ ఉపసర్పంచ్ పాండవుల బాలరాజ్ ముదిరాజ్, మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో చైతన్యం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణ ముదిరాజ్, వెంకట్ ముదిరాజ్, భాస్కర్ యాదవ్, హరీష్ గౌడ్, పెద్దోళ్ళ బాలయ్య, ఏముల రాములు, పొట్ట మల్లేష్, కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు దాసరి వెంకటేష్, చిత్ర ఆర్ట్స్ నర్సింలు. పొట్ట రాజు చేబర్తి వెంకటేష్ పొట్ట కరుణాకర్ పాపయ్య, తిమ్మకపల్లి రవి, తదితరులు పాల్గొన్నారు.అలాగే శ్రీగిరిపల్లి గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు మరియు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు4
- నల్గొండ: నల్గొండ నుంచి దేవరకొండ వెళ్లే మార్గంలో రోడ్డు పక్కన ఉన్న ఎండిన చెట్లు వాహనదారులకు, పాదచారులకు ప్రమాదకరంగా మారాయి. ఈ మార్గంలో నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఎండిన చెట్ల కొమ్మలు విరిగి పడతాయనే భయంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కతాల్ గూడ నుంచి నల్గొండ వైపు వెళ్లే మార్గంలో కూడా ఇలాంటి ఎండిన చెట్లు ఉన్నాయని, ఏదైనా ప్రమాదం జరగకముందే అధికారులు స్పందించి వాడిని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై పడితేనే.. పట్టించుకుంటారా..! అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.1
- నల్లగొండ బ్రేకింగ్: నల్లగొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో *సాయి నైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం..* ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన రాష్ట్రమంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి... మంత్రి మాట్లాడుతూ.. నల్లగొండ పట్టణం వైద్యరంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్ష... లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలి... పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలి... డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి.. అంటూ డాక్టర్లకు సూచన... అత్యాధునిక సదుపాయాలతో ఆస్పత్రి ఏర్పాటుపై హర్షం వ్యక్తం... అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి... గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలి... ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుంది... కార్యక్రమంలో మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి,కార్పొరేటర్ అబ్బగోని కవిత రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు..1
- పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యులు మల్లా రాజిరెడ్డి 46 ఏళ్ళ తర్వాత స్వస్థలానికి చేరారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ తో ఇటీవల అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసిన మల్లా రాజిరెడ్డి మంథనికి చేరుకుని కుటుంబసభ్యులు, బంధుమిత్రులను కలుసుకున్నారు. ఆత్మీయ పలకరింపులతో ఆనందంగా గడిపిన మల్లా రాజిరెడ్డి చాలాకాలం విప్లవోద్యమంలో పనిచేశానని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతిస్తే చట్టబద్దంగా సామాజిక సేవ చేస్తానని తెలిపారు. రాజకీయ పార్టీ పెట్టాలనే ఆలోచన లేదని స్పష్టం చేశారు.2
- ములుగు జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు మెరుగైన నెట్వర్క్ సేవలు అందించాలంటూ కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. జిల్లా టెలికాం కమిటీ సమావేశంలో అండర్గ్రౌండ్ కేబుల్స్ రక్షణ కోసం ‘కాల్ బిఫోర్ యు డిగ్’ యాప్ వినియోగాన్ని ప్రోత్సహించారు. టీ-ఫైబర్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పెండింగ్ అనుమతులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. టవర్ అనుమతులు, విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు.1
- ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను అందజేత పేదోడి సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకం తెచ్చామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు. చిన్నశంకరంపేట రైతు వేదికలో శనివారం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 88 మంది లబ్ధిదారులకు ఆయన ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వం అండగా ఉంటుందని, సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.*సొంతింటి కల నెరవేర్చేందుకే ఇందిరమ్మ ఇళ్ల మంజూరు* ఇల్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు గాను ప్రభుత్వం ప్రజలకు అండగా నిలిచిందనిమెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. శనివారం చిన్న శంకరంపేట రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 88 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే రోహిత్ రావు అందజేశారు. అలాగే నార్సింగ్ మండలం కళ్యాణ లక్ష్మి చెక్కులు20, చిన్నశంకరంపేట మండలంకు సీఎంఆర్ ఎఫ్ చెక్కులు 50 మందికి, నార్సింగి మండలంకు చెందిన 20 కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఇల్లు లేని పేదవాడికి ఇల్లు నిర్మించుకునే విధంగా కృషి చేస్తుందని అన్నారు. అర్హత కలిగిన వారికి ఎవరికైనా ఇల్లు రానిక రాలేక పోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, విడుతల వారీగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేసేందుకు గాను ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పేదలకు సొంతింటి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే రోహిత్ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- Post by Tagore3