పంటలను పరిశీలించిన వాస్సర్ ల్యాబ్ విజయవాడ బృందం.వంద శాతం ల్యాండ్ పార్సెల్ బుకింగ్ చేయాలి బండి ఆత్మకూరు మండల పరిధిలోని అయ్యవారి కోడూరు, పరమటూరు, భోజనం, ఈర్నపాడు గ్రామాల్లో విజయవాడకు చెందిన వాస్సర్ లాబ్స్ ఎపి ఎఐఏంఎస్ సాంకేతిక నిపుణులు సోమవారం క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. ఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతులకు అందిస్తున్న వాతావరణ సూచనలు తుఫాను మరియు కరువు హెచ్చరికలు యాప్ పనితీరు వాసర్ ల్యాబ్ సాంకేతిక సిబ్బంది సాయి చరణ్, తిరుపతి, సమన్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట సాగు విస్తీర్ణం పంట ఆరోగ్య స్థితి మరియు యాజమాన్య పద్ధతులపై సమాచారము రైతులకు యాప్ ద్వారా పొందవచ్చని వారు తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల సాగు చేసిన పంట పొలాలు యొక్క ఆరోగ్య స్థితి యాప్ లో అప్రమతంగా వచ్చిన పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ శాఖ ద్వారా వస్తున్న వాతావరణ సందేశాలు మరియు పంట స్తితి గతులు రైతులకు అవగాహన కల్పించి వెంటనే చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను పంపుతున్నామని వారు తెలిపారు. యాప్ ద్వారా క్షేత్ర స్థాయిలో తీసుకున్న వాస్తవాలను మరియు అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేస్తామని వారు తెలిపారు. వంద శాతం ల్యాండ్ పార్సెల్ బుకింగ్ చేయాలి ఈ ఖరీఫ్ 2026న రైతులు సాగుచేసిన పంట పొలాలతో పాటు బీడు భూములు కలిగిన ల్యాండ్ పార్సెల్ ను ఈ పంట యాప్ లో బుకింగ్ చేయాలని సిబ్బందిని ఏఓ పవన్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఏఈఓ లక్ష్మయ్య, వ్యవసాయ విస్తరణ సిబ్బంది శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ,అంజలి పలువురు రైతులు పాల్గొన్నారు.
పంటలను పరిశీలించిన వాస్సర్ ల్యాబ్ విజయవాడ బృందం.వంద శాతం ల్యాండ్ పార్సెల్ బుకింగ్ చేయాలి బండి ఆత్మకూరు మండల పరిధిలోని అయ్యవారి కోడూరు, పరమటూరు, భోజనం, ఈర్నపాడు గ్రామాల్లో విజయవాడకు చెందిన వాస్సర్ లాబ్స్ ఎపి ఎఐఏంఎస్ సాంకేతిక నిపుణులు సోమవారం క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించారు. ఏఐఎంఎస్ యాప్ ద్వారా రైతులకు అందిస్తున్న వాతావరణ సూచనలు తుఫాను మరియు కరువు హెచ్చరికలు యాప్ పనితీరు వాసర్ ల్యాబ్ సాంకేతిక సిబ్బంది సాయి చరణ్, తిరుపతి, సమన్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట సాగు విస్తీర్ణం పంట ఆరోగ్య స్థితి మరియు యాజమాన్య పద్ధతులపై సమాచారము రైతులకు యాప్ ద్వారా పొందవచ్చని వారు తెలిపారు. ఈ ఖరీఫ్ సీజన్లో రైతుల సాగు చేసిన పంట పొలాలు యొక్క ఆరోగ్య
స్థితి యాప్ లో అప్రమతంగా వచ్చిన పొలాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. వ్యవసాయ శాఖ ద్వారా వస్తున్న వాతావరణ సందేశాలు మరియు పంట స్తితి గతులు రైతులకు అవగాహన కల్పించి వెంటనే చేపట్టాల్సిన యాజమాన్య పద్ధతులను పంపుతున్నామని వారు తెలిపారు. యాప్ ద్వారా క్షేత్ర స్థాయిలో తీసుకున్న వాస్తవాలను మరియు అభిప్రాయాలను ప్రభుత్వానికి చేరవేస్తామని వారు తెలిపారు. వంద శాతం ల్యాండ్ పార్సెల్ బుకింగ్ చేయాలి ఈ ఖరీఫ్ 2026న రైతులు సాగుచేసిన పంట పొలాలతో పాటు బీడు భూములు కలిగిన ల్యాండ్ పార్సెల్ ను ఈ పంట యాప్ లో బుకింగ్ చేయాలని సిబ్బందిని ఏఓ పవన్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో వారితో పాటు ఏఈఓ లక్ష్మయ్య, వ్యవసాయ విస్తరణ సిబ్బంది శ్రీనివాసరెడ్డి, రామకృష్ణ,అంజలి పలువురు రైతులు పాల్గొన్నారు.
- కీసీ కెనాల్ రైతుల సమస్యల పరిష్కారానికి గ్రామబాట....... కడప జిల్లా కీసీ కెనాల్, తెలుగు గంగ ఆయకట్టు రైతుల సమస్యల పరిష్కారం కోసం రైతు సేవాసమితి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 1 నుంచి 26వ తేదీ వరకు గ్రామబాట కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమితి ప్రతినిధులు తెలిపారు. కీసీ కెనాల్‌కు ఈ ఖరీఫ్ సీజన్‌లో తగినంత నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కీసీ కెనాల్‌పై ఆధారపడే వేలాది మంది రైతులకు నీటి సమస్య లేకుండా ఉండేందుకు రాజోలి 2.95 టీఎంసీల ప్రాజెక్టును పూర్తి చేయాలని, జొలదరాసి ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు గంగ ప్రాజెక్టులోని ఎస్‌ఆర్-1, ఎస్‌ఆర్-2, బ్రహ్మసాగర్ పరిధిలో నీరు ఉన్నప్పటికీ పంట, పిల్ల కాలువల సమస్యల కారణంగా ఆయకట్టు రైతులకు సాగునీరు అందడం లేదని తెలిపారు. ఈ ఏడాది కీసీ కెనాల్ రైతులకు పంటలు సాగు చేసుకునే అవకాశం లేకపోవడంతో ప్రతి రైతు కుటుంబానికి రూ.30 వేల ఆర్థిక సహాయం అందించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ మూడు ప్రధాన సమస్యల పరిష్కారం కోసం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పిస్తూ ప్రజాసంఘాలతో కలిసి గ్రామబాట నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న రాయలసీమ రైతు నాయకులతో కలిసి ప్రత్యేక సదస్సు నిర్వహించి కడప జిల్లా రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నట్లు రైతు సేవాసమితి వెల్లడించింది. రైతులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని గ్రామబాట, సదస్సును విజయవంతం చేయాలని సమితి విజ్ఞప్తి చేసింది.1
- నెట్టెంపాడు కాలువల కింది రైతుల భూములకు సాగునీరు అందించి రైతులను ఆదుకోవాలి జోగులాంబ గద్వాల జిల్లాలోని నెట్టంపాడు ఎత్తిపోతల పథకంలో అత్యంత కీలకమైన 99, 100, 106 ప్యాకేజీల కాలువ పనులు దశాబ్దాలు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంతో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. నెట్టంపాడు ప్రాజెక్టు ద్వారా ఇటిక్యాల, మానవపాడు, వడ్డేపల్లి, రాజోళి తదితర మండలాల జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు అసంపూర్తిగా ఉన్న 99, 100, 106 ప్యాకేజీల పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి త్వరగా కాలువల నిర్మాణం పూర్తిచేసి చివరి ఆయకట్టు వరకు మీరు అందించి రైతుల కళ్ళలో ఆనందాలు నింపాలని రైతులు వేడుకుంటున్నారు.2
- బద్వేలు పట్టణంలో ప్రయాణ బస్సుల ఇష్టారాజ్యం...వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం. బద్వేలు, ఆగస్టు 25: బద్వేలు పట్టణంలో నాలుగు రోడ్ల కూడలిలో ప్రయాణ సంస్థల బస్సులను రోడ్లకు అడ్డంగా నిలుపుతుండటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిత్యం రద్దీగా ఉండే ఈ కూడలిలో బస్సులు ఆపడంతో తరచూ వాహనాలు నిలిచిపోతున్నాయని, స్థానికులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో నియమాలు పాటించకుండా వాహనాలు నడుపుతుండటంతో ప్రమాదాల భయం నెలకొందన్నారు. రోడ్లకు అడ్డంగా బస్సులు నిలిపే వారిపై చర్యలు తీసుకొని, వాహనాల రద్దీ సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరుతున్నారు.1
- స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవం జరిగితే.. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా ఇంచార్జ్ నెక్స్ట్ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పై ఆశలు వదిలేసుకోవాలి....! ప్రతిచోటా పోటీ చేయాల్సిందే.. ఎన్నికలు తర్వాత రిపోర్ట్ తెప్పించుకుంటాను తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే/ నియోజకవర్గ ఇంచార్జ్ ల మీటింగ్ లో వైయస్ జగన్ గారు అల్టిమేటం1
- NGKL:హామీలు అమలు చేయకపోతే ఉద్యమం తప్పదు: సీఐటీయూ హెచ్చరిక ఆర్టీసీ యాజమాన్యం చర్చల వేదికగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కార్మికులను వంచిస్తోందని ఎస్‌డబ్ల్యూఎఫ్ ఉపాధ్యక్షులు పి.చింతలయ్య ధ్వజమెత్తారు. మంగళవారం నాగర్‌కర్నూల్ ఆర్టీసీ డిపో వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో చేపట్టిన ఒకరోజు నిరాహార దీక్షలకు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమాన్ని గౌరవాధ్యక్షులు ఆర్. శ్రీనివాసులు ప్రారంభించగా, టీజేఎంయూ నాయకుడు డీవీ నాయక్ మద్దతు పలికారు. రూట్ సర్వేలు చేయకుండానే ఏకపక్షంగా రన్నింగ్ టైమ్స్ మారుస్తున్నారని చింతలయ్య విమర్శించారు. మోటారు వాహనాల చట్టం-2019 ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలని, 2017 వేతన బకాయిలు, ఆర్పీఎస్-2021 అరియర్స్ వెంటనే చెల్లించాలని, 2019 నాటి పోలీసు కేసులను ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ప్రతినిధులు నందీశ్వర్, లింగయ్య, అర్జున్, వెంకట వర్ధనమ్మ పాల్గొన్నారు.3
- కౌతాళం: ఉరుకుంద దేవస్థానం హుండీ ఆదాయం రూ.92.46 లక్షలు..! కౌతాలం మండలం ఉరుకుంద శ్రీలక్ష్మీ నరసింహ, ఎర్రన్నస్వామి దేవస్థానంలో శ్రావణమాసం ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల హుండీ లెక్కింపు చేపట్టగా రూ.92,46,685 ఆదాయం సమకూరింది. హుండీలో 21.5 గ్రాముల బంగారం, 15.2 కిలోల వెండి లభించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. డిప్యూటీ కమిషనర్, ఈఓ కె.వాణి ఆధ్వర్యంలో, పాలకమండలి చైర్మన్ టి.జి. పాండురంగ శెట్టి, సభ్యుల సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. దేవస్థాన సిబ్బంది, ఉరుకుంద యూనియన్ బ్యాంక్ సిబ్బంది1
- తుమ్మలచెరువు గ్రామంలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ మార్కాపురం జిల్లా తర్లపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో మంచినీటి సమస్యతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ మహబూబ్ వలి కలెక్టర్ విజయ సునీతకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీటి కోసం ఏర్పాటు చేసిన రింగులు పగిలిపోయి రజక వీధిలోని ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంచినీటి ట్యాంకర్ ను ఏర్పాటు చేసి శ్వాశిత పరిష్కారం చూపాలన్నారు. పలు గ్రామాలలో కూడా ఇదే పరిస్థితి ఉన్నదని అధికారులు స్పందించాలని కోరారు.1
- పట్టణ అభివృద్ధికై స్లమ్ ఏరియాల్లో సర్వే - సెప్టెంబర్ 28 చలో ఆర్డీఓ - సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్. బద్వేలు,ఆగస్టు 25: బద్వేలు స్థానిక పుచ్చలపల్లి సుందరయ్య భవన్‌లో మంగళవారం సీపీఎం పట్టణ కమిటీ సమావేశం పి.చాంద్ భాషా అధ్యక్షతన జరిగింది. జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడారు. బద్వేలు జనాభా లక్షా 50 వేలు దాటిందని, వలసలు, ప్లైవుడ్ పరిశ్రమతో స్లమ్ ఏరియాల్లో పేదలు పెరుగుతున్నా మౌలిక సౌకర్యాలు కల్పించడం లేదని విమర్శించారు. ఆగస్టు 28 నుండి సెప్టెంబర్ 28 వరకు మున్సిపాలిటీలో ప్రజా సమస్యలపై సర్వే చేసి, సెప్టెంబర్ 28న "చలో ఆర్డీఓ ఆఫీస్" కార్యక్రమం చేపడతామన్నారు. వామపక్షాల పోరాటంతో వచ్చిన ఉపాధి హామీ చట్టాన్ని ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని, ప్రజల సామాజిక, ఆర్థిక హక్కులను హరిస్తున్నాయని ఆరోపించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి కె.శ్రీను, సుబ్బరాయుడు, రాయప్ప తదితరులు పాల్గొన్నారు.1
- జాతీయ రహదారిపై ప్రైవేటు బస్సును ఢీకొన్న ఎద్దులు......... ఖాజీపేట మండలం చౌటపల్లి గ్రామానికి చెందిన అబ్దుల్ ఖాదర్‌కు చెందిన ఎద్దులు భూమయ్యపల్లి సమీపంలోని జాతీయ రహదారిపైకి రావడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఎద్దులకు నైపుణ్యం నేర్పించే క్రమంలో వాటిని రోడ్డుపైకి తీసుకువచ్చిన సమయంలో ప్రైవేటు బస్సును ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎద్దులకు గాయాలయ్యాయి. ప్రమాదంతో కొద్దిసేపు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.1