logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

చెన్నై కొత్తపల్లి లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు చెన్నేకొత్తపల్లి ::జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నేకొత్తపల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెన్నేకొత్తపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు . తదుపరి జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ సాకే పవన్ కుమార్ , జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ నారాయణస్వామి , చెన్నేకొత్తపల్లి మండల కన్వీనర్ శ్రీ ఇటికోటి క్రాంతికుమార్ , కనగానపల్లి మండల కన్వీనర్ శ్రీ నాగేంద్ర , అనంతపురం మండల కన్వీనర్ శ్రీ రామాంజనేయులు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు.

3 hrs ago
user_పుట్టపర్తి మల్లికార్జున
పుట్టపర్తి మల్లికార్జున
చెన్నెకొత్తపల్లె, శ్రీ సత్య సాయి, ఆంధ్రప్రదేశ్•
3 hrs ago

చెన్నై కొత్తపల్లి లో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరుపుకున్నారు చెన్నేకొత్తపల్లి ::జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం చెన్నేకొత్తపల్లిలో ఘనంగా వేడుకలు నిర్వహించడం జరిగింది. ముందుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలహారం వేసి నివాళులు అర్పించారు. అనంతరం చెన్నేకొత్తపల్లి గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు . తదుపరి జనసేన పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసే సంబరాలు జరుపుకున్నారు. అనంతరం భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాప్తాడు నియోజకవర్గ అధ్యక్షులు శ్రీ సాకే పవన్ కుమార్ , జిల్లా సంయుక్త కార్యదర్శి శ్రీ నారాయణస్వామి , చెన్నేకొత్తపల్లి మండల కన్వీనర్ శ్రీ ఇటికోటి క్రాంతికుమార్ , కనగానపల్లి మండల కన్వీనర్ శ్రీ నాగేంద్ర , అనంతపురం మండల కన్వీనర్ శ్రీ రామాంజనేయులు తదితర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, యువత మరియు అభిమానులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటాం: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందులలోని తన నివాసంలో జగన్ను అంబటి సురేశ్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కమలాపురంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్తో కలిసి వివరించారు. అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.
    1
    అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటాం: వైసీపీ అధినేత వైఎస్ జగన్
పులివెందులలోని తన నివాసంలో జగన్ను అంబటి సురేశ్ కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా కమలాపురంలో తనపై జరిగిన దాడి ఘటనకు సంబంధించిన వివరాలను మాజీ మంత్రి వెల్లంపల్లి
శ్రీనివాస్తో కలిసి వివరించారు. అంబటి సురేశ్ కుటుంబానికి అండగా ఉంటామని జగన్ హామీ ఇచ్చారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు. ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు సిద్ధవటం,సెప్టెంబర్ 02 సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
    1
    ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

 సిద్ధవటం,సెప్టెంబర్ 02 

సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి
చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
ఉప్పరపల్లిలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
సిద్ధవటం,సెప్టెంబర్ 02 
సిద్ధవటం మండలం ఉప్పరపల్లెలోని ఎస్టీ కాలనీలో పేదల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం కాలనీలోని మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా రాటాల రామయ్య మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి
చేస్తున్నారని అన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదలకు సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.
    user_Ponna Eswaraiah
    Ponna Eswaraiah
    Local News Reporter కడప, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    7 hrs ago
  • ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేసిన పాఠశాల విద్యార్థులు.. పాలసముద్రంమండలంలో వెంగళరాజుకుప్పం ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలో,ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ బావి చాలాకాలంగా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.పాఠశాల ఆవరణలో చిన్నారులు నిత్యం తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు.ముఖ్యంగా పాఠశాల వెనుక భాగంలో ఉన్న బావి చుట్టూ తగిన రక్షణ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి తోడు పాఠశాల వెనుక భాగంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రహరి గోడ సైతం కూలిపోవడంతో పాఠశాలకు రక్షణ లేకుండా పోయింది. పాఠశాల పరిసరాల్లోకి చిన్నారులు,ఇతరులు సులభంగా వెళ్లే పరిస్థితి ఏర్పడటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యపై ఎమ్మెల్యే స్పందించి,విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరంగా ఉన్న బావిని వెంటనే పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి బావిని పూడ్చివేసే చర్యలు చేపట్టారు.ఎంపీడీవో సతీష్ రాజ్,ఎస్సై రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ శ్యామల సహకారంతో, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు,టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వాసు నాయుడు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యను పరిష్కరించారు.ప్రమాదకర బావిని పూడ్చివేయడంతో పాఠశాల ఆవరణలో విద్యార్థులకు భద్రత మరింత మెరుగుపడిందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారుల భద్రతకు సంబంధించిన సమస్యను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.బావిని పూడ్చివేసినప్పటికీ పాఠశాల వెనుక భాగంలో కూలిపోయిన ప్రహరి గోడ సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ప్రధాన రహదారి పక్కనే పాఠశాల ఉండటంతో ప్రహరి గోడ లేకపోవడం వల్ల చిన్నారుల భద్రతపై ఆందోళన నెలకొంటోందని తెలిపారు.పాఠశాలకు పూర్తిస్థాయి ప్రహరి గోడ నిర్మించి,విద్యార్థులు భయాందోళన లేకుండా చదువుకునేలా సురక్షిత వాతావరణం కల్పించాలని వారు కోరారు. బావి సమస్యను పరిష్కరించిన విధంగానే కూలిన ప్రహరి గోడను కూడా త్వరగా పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.చిన్నారుల భద్రత విషయంలో స్పందించి ప్రమాదకర బావిని పూడ్చివేయించిన ఎమ్మెల్యేకు,సహకరించిన ప్రజాప్రతినిధులు,అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రుల ధన్యవాదాలు తెలిపారు.
    1
    ఎమ్మెల్యే కి ధన్యవాదాలు తెలియజేసిన పాఠశాల విద్యార్థులు..
పాలసముద్రంమండలంలో వెంగళరాజుకుప్పం ప్రాథమిక పాఠశాల వెనుక భాగంలో,ప్రధాన రహదారికి ఆనుకుని ఉన్న ఈ బావి చాలాకాలంగా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నట్లు స్థానికులు తెలిపారు.పాఠశాల ఆవరణలో చిన్నారులు నిత్యం తిరుగుతుండటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందేవారు.ముఖ్యంగా పాఠశాల వెనుక భాగంలో ఉన్న బావి చుట్టూ తగిన రక్షణ లేకపోవడంతో ప్రమాదం పొంచి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.దీనికి తోడు పాఠశాల వెనుక భాగంలో ప్రధాన రహదారి పక్కన ఉన్న ప్రహరి గోడ సైతం కూలిపోవడంతో పాఠశాలకు రక్షణ లేకుండా పోయింది. పాఠశాల పరిసరాల్లోకి చిన్నారులు,ఇతరులు సులభంగా వెళ్లే పరిస్థితి ఏర్పడటంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో సమస్యపై ఎమ్మెల్యే స్పందించి,విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రమాదకరంగా ఉన్న బావిని వెంటనే పూడ్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి బావిని పూడ్చివేసే చర్యలు చేపట్టారు.ఎంపీడీవో సతీష్ రాజ్,ఎస్సై రాజశేఖర్ రెడ్డి, ఎంపీపీ శ్యామల సహకారంతో, టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి భీమినేని చిట్టిబాబు నాయుడు,టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు వాసు నాయుడు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యను పరిష్కరించారు.ప్రమాదకర బావిని పూడ్చివేయడంతో పాఠశాల ఆవరణలో విద్యార్థులకు భద్రత మరింత మెరుగుపడిందని తల్లిదండ్రులు తెలిపారు. చిన్నారుల భద్రతకు సంబంధించిన సమస్యను వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవడం అభినందనీయమని వారు పేర్కొన్నారు.బావిని పూడ్చివేసినప్పటికీ పాఠశాల వెనుక భాగంలో కూలిపోయిన ప్రహరి గోడ సమస్యను కూడా త్వరితగతిన పరిష్కరించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.ప్రధాన రహదారి పక్కనే పాఠశాల ఉండటంతో ప్రహరి గోడ లేకపోవడం వల్ల చిన్నారుల భద్రతపై ఆందోళన నెలకొంటోందని తెలిపారు.పాఠశాలకు పూర్తిస్థాయి ప్రహరి గోడ నిర్మించి,విద్యార్థులు భయాందోళన లేకుండా చదువుకునేలా సురక్షిత వాతావరణం కల్పించాలని వారు కోరారు. బావి సమస్యను పరిష్కరించిన విధంగానే కూలిన ప్రహరి గోడను కూడా త్వరగా పునర్నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.చిన్నారుల భద్రత విషయంలో స్పందించి ప్రమాదకర బావిని పూడ్చివేయించిన ఎమ్మెల్యేకు,సహకరించిన ప్రజాప్రతినిధులు,అధికారులకు విద్యార్థుల తల్లిదండ్రుల ధన్యవాదాలు తెలిపారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • జనసేన పార్టీ నాయకులతో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.... అన్నమయ్య జిల్లా.. పుంగనూరు. 500 మంది జనసైనికులతో బైక్ ర్యాలీ.. పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయం నుండి ట్రావెల్స్ బంగ్లా వరకు జనసేన నాయకులు 500 మంది జనసేన కార్యకర్తలతో కలసి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్బంగా బాణాసంచా కాలుస్తూ కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా ట్రావెల్స్ బంగ్లా వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటుచేసి జనసైనికులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిన్న రాయల్, సింగల్ విండో చైర్మన్ పగడాల రమణ, జనసేన నాయకులు కోలాసోమ శేఖర్,గాజుల నరేష్, చైతన్య, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
    4
    జనసేన పార్టీ నాయకులతో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు....
అన్నమయ్య జిల్లా..
పుంగనూరు.
500 మంది జనసైనికులతో బైక్ ర్యాలీ..
పుంగనూరు జనసేన పార్టీ కార్యాలయం నుండి ట్రావెల్స్ బంగ్లా వరకు జనసేన నాయకులు 500 మంది జనసేన కార్యకర్తలతో కలసి భారీగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ సర్కిల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్బంగా బాణాసంచా కాలుస్తూ కేక్ కటింగ్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా ట్రావెల్స్ బంగ్లా వద్ద ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటుచేసి జనసైనికులతో సమావేశాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ చిన్న రాయల్, సింగల్ విండో చైర్మన్ పగడాల రమణ, జనసేన నాయకులు కోలాసోమ శేఖర్,గాజుల నరేష్, చైతన్య, వీర మహిళలు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
    user_S Reddy Raghavendra Raju
    S Reddy Raghavendra Raju
    Photographer Punganur, Chittoor•
    5 hrs ago
  • మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ భాకరాపేటలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ అని వైఎస్ఆర్సీ నేతలు కొనియాడారు. సిద్దవటం మండలంలోని భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ఉప మండలాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, కన్వినర్ నీలకంఠా రెడ్డి, సుబ్బరామిరెడ్డి లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, ఏకుల రామ చంద్రారెడ్డి, మండల యూత్ కన్వినర్ ఆలం కృష్ణ చైతన్య, మాచనూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    2
    మరపురాని మహానేత డా. వైఎస్ఆర్

భాకరాపేటలో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి వేడుకలు
మరపురాని మహానేత డా. వైఎస్ఆర్ అని వైఎస్ఆర్సీ  నేతలు కొనియాడారు. సిద్దవటం మండలంలోని భాకరాపేట  మూడు రోడ్ల కూడలిలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహం వద్ద బుధవారం ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా వైఎస్ఆర్ విగ్రహానికి వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు శ్రీకాంత్ రెడ్డి, ఉప మండలాధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి, కన్వినర్ నీలకంఠా రెడ్డి, సుబ్బరామిరెడ్డి లు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు చంద్రశేఖర్ రెడ్డి, ఏకుల రామ చంద్రారెడ్డి, మండల యూత్ కన్వినర్ ఆలం కృష్ణ చైతన్య, మాచనూరు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
    user_Patan Kwajamainuddin
    Patan Kwajamainuddin
    Local News Reporter సిధౌట్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    9 hrs ago
  • పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పీలేరు పట్టణంలో ర్యాలీ అనంతరం అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనం పీలేరు: అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు. పీలేరులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలుజరిగాయి. భారీ బైక్ ర్యాలీ ,ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పీలేరు జనసేన పార్టీ ఇంచార్జ్ బెజవాడ దినేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పీలేరులో జనసేన కార్యకర్తలు ఉదయం 6 గంటలకు ఆలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ పేరున ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. అనంతరం పీలేరు HP పెట్రోల్ బంక్ నుండి యల్లమంద cross వరకు జనసేనకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ యార్డులో ప్రత్యకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి TV లో PAC చైర్మన్ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన జై కొట్టు (యువజన విభాగ) ఆవిష్కరణ కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ కలిసి వీక్షించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో కలప రవి, బాటసారి జిల్లా కార్యదర్శి, మోహనకృష్ణ పీలేరు మండల అధ్యక్షులు, గురు మోహన్ పీలేరు మండల ఉపాధ్యక్షులు, గజేంద్ర పీలేరు మండల ప్రధాన కార్యదర్శి, ధన శేఖర్ ప్రధాన కార్యదర్శి, మున్నా, రాజేష్, షఫీ, కామిశెట్టి సుధాకర్, నరేష్, మోకాటి సుబ్బయ్య, గాలి మహేష్, నక్కా గోపి, కోల్ కోల్ విజయ్ కుమార్, బెజవాడ భాస్కర ,తోట బాలాజీ, మున్నా, రాఘవ, వాయల్పాడు ఎంసీ డైరెక్టర్ దీపాని ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
    1
    పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా పీలేరు పట్టణంలో ర్యాలీ అనంతరం అన్న క్యాంటీన్లో పేదలకు ఉచిత భోజనం
పీలేరు: అంగరంగ వైభవంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలు.   
పీలేరులో  ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలుజరిగాయి.
భారీ బైక్ ర్యాలీ ,ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేశారు. 
జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు పీలేరు జనసేన పార్టీ ఇంచార్జ్ బెజవాడ దినేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 
పీలేరులో జనసేన కార్యకర్తలు ఉదయం 6 గంటలకు ఆలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్  పేరున ప్రత్యేక పూజలు అర్చనలు చేశారు. అనంతరం పీలేరు HP పెట్రోల్ బంక్ నుండి  యల్లమంద cross  వరకు జనసేనకులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. 
అనంతరం మార్కెట్ యార్డులో ప్రత్యకంగా ఏర్పాటు చేసిన  ఎల్ఈడి TV  లో PAC చైర్మన్ మరియు పౌరసరఫరాల శాఖ మంత్రి ఆధ్వర్యంలో జరిగిన జై కొట్టు (యువజన విభాగ) ఆవిష్కరణ కార్యక్రమాన్ని కార్యకర్తలు అందరూ కలిసి వీక్షించారు.
అనంతరం కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకొని  పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసి అక్కడే అన్నదాన కార్యక్రమం కూడా చేయటం జరిగింది.   
ఈ కార్యక్రమంలో కలప రవి, బాటసారి జిల్లా కార్యదర్శి, మోహనకృష్ణ పీలేరు మండల అధ్యక్షులు, గురు మోహన్ పీలేరు మండల ఉపాధ్యక్షులు, గజేంద్ర పీలేరు మండల ప్రధాన కార్యదర్శి, ధన శేఖర్ ప్రధాన కార్యదర్శి, మున్నా, రాజేష్, షఫీ,  కామిశెట్టి సుధాకర్, నరేష్, మోకాటి సుబ్బయ్య, గాలి మహేష్, నక్కా గోపి, కోల్ కోల్ విజయ్ కుమార్, బెజవాడ భాస్కర ,తోట బాలాజీ, మున్నా, రాఘవ, వాయల్పాడు ఎంసీ డైరెక్టర్ దీపాని ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
    user_SK masthan saheb
    SK masthan saheb
    పీలేరు, అన్నమయ్య, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • పులివెందుల లో కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మ దహనం పులివెందుల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మంగళవారం బీజేపీ నాయకులు భాను ప్రకాశ్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటం, బీజేపీ జెండాను దగ్ధం చేశారన్నారు. అందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
    1
    పులివెందుల లో కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి బొమ్మ దహనం
పులివెందుల పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట మంగళవారం బీజేపీ నాయకులు భాను ప్రకాశ్ కార్యకర్తలతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల దిష్టి
బొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలంగాణలో బీజేపీ నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు
ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటం, బీజేపీ జెండాను దగ్ధం చేశారన్నారు. అందుకు నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.
    user_LAKKU SIVA SANKAR reddy
    LAKKU SIVA SANKAR reddy
    Court reporter పులివెందుల, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • చిత్తూరు పట్టణము నందు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెస్సార్ కూడలి నుండి గంగినేని చెరువు పార్క్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్నపెదయ్య జిల్లా ఎస్పీ తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ .వెంకటనారాయణ ఆధ్వర్యంలో, “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ,చిత్తూరు 1 టౌన్ ఎస్.ఐ శివశంకర్ గారితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయగలమని సీఐ శ్రీ చిన్న పెద్దయ్య గారు తెలిపారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ లో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
    1
    చిత్తూరు పట్టణము నందు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ పోలీసులు
సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా ఎమ్మెస్సార్  కూడలి నుండి గంగినేని చెరువు పార్క్ వరకు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ చిన్నపెదయ్య
జిల్లా ఎస్పీ  తుషార్ డూడి, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్-డివిజన్ డి.ఎస్పీ .వెంకటనారాయణ  ఆధ్వర్యంలో, “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ,చిత్తూరు 1 టౌన్ ఎస్.ఐ  శివశంకర్ గారితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించి ప్రజలకు భద్రతా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్  మాట్లాడుతూ, ప్రజల భద్రతే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని తెలిపారు. నేరాల నివారణలో పోలీసులతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో కీలకమని పేర్కొన్నారు. తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు, గుర్తు తెలియని వస్తువులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలు కనిపించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.అలాగే మహిళలు, చిన్నారుల భద్రతకు సంబంధించిన అంశాలపై అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల బారిన పడకుండా అపరిచితుల ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు మరియు బ్యాంకు వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని ప్రజలకు అవగాహన కల్పించారు.రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొంటూ, వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీటుబెల్ట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వినియోగాన్ని పూర్తిగా నివారించాలని సూచించారు. ప్రజల సహకారంతోనే నేరాలను సమర్థవంతంగా అరికట్టడంతో పాటు, పోలీసు-ప్రజల మధ్య సాన్నిహిత్యాన్ని మరింత బలోపేతం చేసి “సురక్షిత చిత్తూరు – మీ భద్రత మా బాధ్యత” లక్ష్యాన్ని విజయవంతంగా అమలు చేయగలమని సీఐ శ్రీ చిన్న పెద్దయ్య గారు తెలిపారు. ఈ ఫుట్ పెట్రోలింగ్ లో చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది మరియు ప్రజలు పాల్గొన్నారు.
    user_Reporter Pen Ppwer
    Reporter Pen Ppwer
    చౌడేపల్లె, చిత్తూరు, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • బద్వేలులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. బద్వేలు, సెప్టెంబర్ 02: బద్వేలులో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు మురళి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    1
    బద్వేలులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు.
బద్వేలు, సెప్టెంబర్ 02:  బద్వేలులో జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను జనసేన నాయకులు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకుడు మురళి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం భారీ కేక్ కటింగ్ చేసి, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
    user_జీ.మౌలాలి.
    జీ.మౌలాలి.
    Photographer బద్వేల్, వై.ఎస్.ఆర్., ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.