logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

తిమ్మాజిపేట : కిశోర బాలికల రక్షణకు సీ-టీం అండ: ఎస్సై విజయలక్ష్మి తిమ్మాజీపేట: బాలికలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదని, సీ-టీంను సంప్రదిస్తే తక్షణ రక్షణతో పాటు న్యాయం చేకూరుస్తామని జిల్లా సీ-టీం ఎస్సై విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ శక్తి భవనంలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకోవద్దని, బాలికలు లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సాయం కోసం 8712657676 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.ఏపీఎం బి. నిరంజన్ మాట్లాడుతూ, మే 2 నుంచి జూన్ 10 వరకు గ్రామ పంచాయతీల పరిధిలో స్నేహ (SNEHA- సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్, అడోలెసెంట్స్) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. బాలికలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, రక్తహీనతను నివారించేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్, ఏపీఎం నిరంజన్, మహిళా సమాఖ్య కార్యదర్శి అనిత, హెల్త్ సూపర్వైజర్ నరేందర్, ఏఎన్ఎం చంద్రకళ, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు.

2 hrs ago
user_MALLIKARJUN T
MALLIKARJUN T
Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
2 hrs ago

తిమ్మాజిపేట : కిశోర బాలికల రక్షణకు సీ-టీం అండ: ఎస్సై విజయలక్ష్మి తిమ్మాజీపేట: బాలికలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే భయపడాల్సిన అవసరం లేదని, సీ-టీంను సంప్రదిస్తే తక్షణ రక్షణతో పాటు న్యాయం చేకూరుస్తామని జిల్లా సీ-టీం ఎస్సై విజయలక్ష్మి భరోసా ఇచ్చారు. శుక్రవారం స్థానిక శ్రీ శక్తి భవనంలో మండల స్థాయి సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతరలు, రద్దీ ప్రాంతాల్లో మహిళలను వేధించినా, అసభ్యంగా ప్రవర్తించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అపరిచిత వ్యక్తులతో సామాజిక మాధ్యమాల ద్వారా పరిచయాలు పెంచుకోవద్దని, బాలికలు లక్ష్యంపై దృష్టి సారించాలని సూచించారు. ఏదైనా అత్యవసర సాయం కోసం 8712657676 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.ఏపీఎం బి. నిరంజన్ మాట్లాడుతూ, మే 2 నుంచి జూన్ 10 వరకు గ్రామ పంచాయతీల పరిధిలో స్నేహ (SNEHA- సేఫ్టీ, న్యూట్రిషన్, ఎంపవర్మెంట్, హెల్త్, అడోలెసెంట్స్) అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ పద్మ మాట్లాడుతూ.. బాలికలకు పౌష్టికాహారం ఎంతో అవసరమని, రక్తహీనతను నివారించేందుకు మంచి ఆహారం తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మండల కన్వీనర్, ఏపీఎం నిరంజన్, మహిళా సమాఖ్య కార్యదర్శి అనిత, హెల్త్ సూపర్వైజర్ నరేందర్, ఏఎన్ఎం చంద్రకళ, వీవోఏలు, సీసీలు పాల్గొన్నారు.

More news from తెలంగాణ and nearby areas
  • పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్లతో పాటు వివిధ రకాల శస్త్ర చికిత్సలు ప్లాస్టిక్ సర్జరీలు సైతం జరుగుతున్నాయని ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలంటూ ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కొండా శ్రీధర్ తెలిపారు
    1
    పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన ఆపరేషన్లతో పాటు వివిధ రకాల శస్త్ర చికిత్సలు ప్లాస్టిక్ సర్జరీలు సైతం జరుగుతున్నాయని ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలంటూ ప్రభుత్వాసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ కొండా శ్రీధర్ తెలిపారు
    user_Thiru goud
    Thiru goud
    పెద్దపల్లె, పెద్దపల్లి, తెలంగాణ•
    4 hrs ago
  • ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం మోడీకి అలవాటు: కేటీఆర్
    1
    ఎన్నికల తర్వాత గ్యాస్ సిలిండర్ల ధరను పెంచడం మోడీకి అలవాటు: కేటీఆర్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    4 hrs ago
  • _వెలిమినేడు నోచ్‌ ల్యాబ్స్‌లో రియాక్టర్‌ పేలుడు కలకలం.!_ మూడో నెంబర్‌ రియాక్టర్‌ ఒక్కసారిగా పేలి కార్మికుడికి తీవ్ర గాయాలు... గాయపడిన కార్మికుడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు... నెల రోజుల వ్యవధిలోనే ఇదే పరిశ్రమలో రెండో ప్రమాదం.. వరుస ఘటనలతో కార్మికుల్లో భయం, ఆందోళన పెరుగుదల “పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో భయం” – కార్మికుల ఆవేదన... భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం నిర్లక్ష్యం ఆరోపణలు.. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు, ఆగ్రహావేశాలు పెద్ద ప్రమాదానికి ముందు హెచ్చరికగా మారుతున్న ఘటనలు... వెంటనే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
    1
    _వెలిమినేడు నోచ్‌ ల్యాబ్స్‌లో రియాక్టర్‌ పేలుడు కలకలం.!_
మూడో నెంబర్‌ రియాక్టర్‌ ఒక్కసారిగా పేలి కార్మికుడికి తీవ్ర గాయాలు...
గాయపడిన కార్మికుడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు...
నెల రోజుల వ్యవధిలోనే ఇదే పరిశ్రమలో రెండో ప్రమాదం..
వరుస ఘటనలతో కార్మికుల్లో భయం, ఆందోళన పెరుగుదల
“పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదో భయం” – కార్మికుల ఆవేదన...
భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం నిర్లక్ష్యం ఆరోపణలు..
ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు, ఆగ్రహావేశాలు
పెద్ద ప్రమాదానికి ముందు హెచ్చరికగా మారుతున్న ఘటనలు...
వెంటనే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్..
    user_Journalist pk
    Journalist pk
    Journalist గుండ్ల పల్లె, నల్గొండ, తెలంగాణ•
    31 min ago
  • కేవలం బిఆర్ఎస్ కు పేరు వస్తుందని ఉద్దేశంతో స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత ప్రభుత్వంలో నిర్మించిన వాటిని నిరుపయోగంగా మార్చాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మేడే వేడుకలలో పాల్గొని మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నిర్మించిన ఐటీ పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిరూప యోగంగా మార్చారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆటో కార్మికులను రోడ్డున పడేసారని విమర్శించారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
    1
    కేవలం బిఆర్ఎస్ కు పేరు వస్తుందని ఉద్దేశంతో స్థానిక మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గత ప్రభుత్వంలో నిర్మించిన వాటిని నిరుపయోగంగా మార్చాలని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన మేడే వేడుకలలో పాల్గొని మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నిర్మించిన ఐటీ పార్క్, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లను నిరూప యోగంగా మార్చారని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని మండిపడ్డారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఆటో కార్మికులను రోడ్డున పడేసారని విమర్శించారు. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    5 hrs ago
  • అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుందని సీపీఎం రాష్ట్ర నేత చుక్కా రాములు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనివల్ల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
    1
    అమెరికా- ఇరాన్ యుద్ధ ప్రభావం భారత్‌పై తీవ్రంగా ఉంటుందని సీపీఎం రాష్ట్ర నేత చుక్కా రాములు ఆందోళన వ్యక్తం చేశారు. సంగారెడ్డిలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. యుద్ధం కారణంగా పెట్రోల్, గ్యాస్ కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీనివల్ల నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
    user_Praveen
    Praveen
    మున్‌పల్లె, సంగారెడ్డి, తెలంగాణ•
    1 hr ago
  • గద్వాలలో పరిగెల భాస్కర్ సన్మానం కార్యక్రమంలో – యస్ దేవసహాయం, కదిరికోట ఆదెన్న, జి ఆనంద్ చైతన్య మాదిగ పాల్గొన్నారు
    1
    గద్వాలలో పరిగెల భాస్కర్ సన్మానం కార్యక్రమంలో – యస్ దేవసహాయం, కదిరికోట ఆదెన్న, జి ఆనంద్ చైతన్య మాదిగ పాల్గొన్నారు
    user_K AMPAIAH ACHARI
    K AMPAIAH ACHARI
    Local News Reporter ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • బిజినేపల్లి: మండల పరిధిలోని పోలేపల్లి గ్రామం నేలగడ్డ తండాకు చెందిన ఎం. కావేరి వైద్య విద్యను పూర్తి చేసుకుని పట్టభద్రురాలైంది. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఆమె ఈ ఘనత సాధించింది. ​కావేరి తల్లిదండ్రులు ఎం. హన్మయ్య, శాంతి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసింది. వైద్యురాలిగా మారిన కావేరిని గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొంది. నాగర్ కర్నూల్ జిల్లా గిరిజన సంఘం నాయకులు మూడవ గోవిందు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
    1
    బిజినేపల్లి: మండల పరిధిలోని పోలేపల్లి గ్రామం నేలగడ్డ తండాకు చెందిన ఎం. కావేరి వైద్య విద్యను పూర్తి చేసుకుని పట్టభద్రురాలైంది. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుంచి ఆమె ఈ ఘనత సాధించింది.
​కావేరి తల్లిదండ్రులు ఎం. హన్మయ్య, శాంతి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆమె వైద్య విద్యను విజయవంతంగా పూర్తి చేసింది. వైద్యురాలిగా మారిన కావేరిని గ్రామస్తులు, స్నేహితులు అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందించడమే తన లక్ష్యమని పేర్కొంది. నాగర్ కర్నూల్ జిల్లా గిరిజన సంఘం నాయకులు మూడవ గోవిందు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు
    user_MALLIKARJUN T
    MALLIKARJUN T
    Insurance Agent బిజినపల్లె, నాగర్‌కర్నూల్, తెలంగాణ•
    7 hrs ago
  • సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు, రూ. 20 వేలు తీసుకుంటూ పట్టుబడిన బిల్ కలెక్టర్, మీడియాతో వివరాలు వెళ్లండి ఇచ్చిన ఏసీబీ డిఎస్పి సుదర్శన్
    1
    సదాశివపేట మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల ఆకస్మిక దాడులు, రూ. 20 వేలు తీసుకుంటూ పట్టుబడిన బిల్ కలెక్టర్, మీడియాతో వివరాలు వెళ్లండి ఇచ్చిన ఏసీబీ డిఎస్పి సుదర్శన్
    user_Sangareddy News
    Sangareddy News
    జర్నలిస్ట్ Saidabad, Hyderabad•
    21 hrs ago
  • కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ను పురస్కరించుకొని నల్గొండ జిల్లా సిపిఎం కార్యాలయంలో ఎర్రజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వామపక్ష భావజాలాన్ని రూపుమాపేందుకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక హక్కుల కోసం సిపిఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండి సలీం, పాలడుగు నాగార్జున, దండంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
    1
    కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తుందని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఆరోపించారు. శుక్రవారం ప్రపంచ కార్మికుల దినోత్సవం మే డే ను పురస్కరించుకొని నల్గొండ జిల్లా సిపిఎం కార్యాలయంలో ఎర్రజెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని రద్దుచేసి 12 గంటల పని విధానాన్ని తెచ్చేందుకు ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. వామపక్ష భావజాలాన్ని రూపుమాపేందుకు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక హక్కుల కోసం సిపిఎం నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, పుచ్చకాయల నర్సిరెడ్డి, ఎండి సలీం, పాలడుగు నాగార్జున, దండంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.
    user_T Shankar Public News Reporter Nalgonda
    T Shankar Public News Reporter Nalgonda
    రిపోర్టర్ Nalgonda, Telangana•
    7 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.