ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ఉట్నూర్ గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరయ్యారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవారికి చేరేలా చూడడమే ఈ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల ప్రజా పాలన ప్రణాళిక లో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అధికారుల ద్వారా పర్యవేక్షిస్తున్నాం అన్నారు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా లబ్ధిదారులకు అందించడం అధికారుల బాధ్యత అన్నారు. రెండేండ్లలో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వచించడం జరిగిందని,ప్రజల నుండి ప్రభుత్వానికి మంచి స్పందన లభిస్తుందన్నారు.జూన్ రెండు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుండి మరికొన్ని నూతన పథకాలు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 5లక్షల ఇందిరమ్మ బీమా , ఇంటర్మీడియట్ కళాశాలలో మిడ్ డే మిల్స్ పథకం , తదితర సంక్షేమ పథకాలు అమలులోకి రానున్నాయి. వాటిని ప్రజలు స్వాగతించి ప్రభుత్వానికి అండగా నిలుస్తారని మా నమ్మకం అన్నారు.
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక ఉట్నూర్ గ్రామ సభలో పాల్గొన్న ఎమ్మెల్యే ఉట్నూర్ మేజర్ గ్రామ పంచాయతీ లో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన గ్రామ సభకు ముఖ్య అతిథిగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ హాజరయ్యారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని పేదవారికి చేరేలా చూడడమే ఈ ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల ప్రజా పాలన ప్రణాళిక లో ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి ప్రభుత్వం అందిస్తున్న పథకాలను అధికారుల ద్వారా పర్యవేక్షిస్తున్నాం అన్నారు. ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా లబ్ధిదారులకు అందించడం అధికారుల బాధ్యత అన్నారు. రెండేండ్లలో అనేక ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వచించడం జరిగిందని,ప్రజల నుండి ప్రభుత్వానికి మంచి స్పందన లభిస్తుందన్నారు.జూన్ రెండు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుండి మరికొన్ని నూతన పథకాలు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 5లక్షల ఇందిరమ్మ బీమా , ఇంటర్మీడియట్ కళాశాలలో మిడ్ డే మిల్స్ పథకం , తదితర సంక్షేమ పథకాలు అమలులోకి రానున్నాయి. వాటిని ప్రజలు స్వాగతించి ప్రభుత్వానికి అండగా నిలుస్తారని మా నమ్మకం అన్నారు.
- ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం సరండి గ్రామపంచాయతీలో జరిగిన గ్రామసభ ఉద్రిక్తంగా మారింది. ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల గైర్హాజరు, బోధనలో నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు చదువులో వెనుకబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని గ్రామస్తులు ఆరోపించారు. అర్హులను పక్కనబెట్టి అనర్హులకు ఇళ్లు ఇచ్చారని మండిపడ్డారు. సమస్యలపై అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.1
- బీ.ఆర్.ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా 49వ వార్డు కౌన్సిలర్ వేనగంటి ప్రకాష్ ఎన్నికయ్యారు. ఈ మేరకు శుక్రవారం మాజీమంత్రి జోగురామన్న ఆయనను శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియచేశారు. బీ.ఆర్.ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఆయనను నియమించాలని మున్సిపల్ కమిషనర్ కు, చైర్ పర్సన్ కు లేఖ రాశారు. పట్టణ పరిధిలో నెలకొన్న సమస్యలను మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల దృష్టికి తీసుకెళ్ళడంతో పాటు... కౌన్సిల్ లో అత్యంత కీలక పాత్ర పోషించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయనకు తోటి కౌన్సిలర్లు అభినందనలు తెలియచేశారు. పట్టణాభివృద్దికి గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందని ఈ సందర్భంగా మాజీమంత్రి జోగురామన్న అన్నారు. అదే స్పూర్తితో ప్రస్తుత కౌన్సిల్ లోనూ అభివృద్ధికే బీ.ఆర్.ఎస్ కౌన్సిలర్లు పాటు పడాలని సూచించారు. ప్రజా సమస్యలను ఎప్పటికపుడు పరిష్కరించడంతో పాటు... పట్టణాభివృద్ధికి తీసుకునే కీలక నిర్ణయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తూ సమర్ధవంతంగా విధులు నిర్వర్తించాలని దిశా నిర్దేశం చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ జోగుప్రేమేందర్, అన్నెల వసంత్, ఆత్రం వెంకటేష్, డాక్టర్ గౌస్ , సలీమ్,అనిల్, పర్వీన్ తదితరులు పాల్గొన్నారు..4
- నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని సోన్ పెట్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా గ్రామంలో రూ. 24 లక్షల వ్యయంతో పునర్నిర్మించిన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రారంభోత్సవం విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పాల్గొన్న ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. భక్తిశ్రద్ధలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య సోన్ పెట్ గ్రామంలో నూతనంగా పునర్నిర్మించిన హనుమాన్ దేవాలయ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. సుమారు 24 లక్షల రూపాయల వ్యయంతో గ్రామస్థులు దాతల సహకారంతో ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయంలో ఆంజనేయ స్వామి వారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. ఉదయం నుండే అర్చకులు గణపతి పూజ పుణ్యాహవాచనం హోమాలు ఇతర విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి స్వామి వారిని దర్శించుకుని శంకుస్థాపన ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించి గ్రామ కమిటీని అభినందించారు. హనుమాన్ జయంతి సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక హారతి ఇచ్చి నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతన పెరగడం శుభపరిణామమని, భక్తి మార్గం మనిషికి మానసిక ప్రశాంతతను ఇస్తుందని పేర్కొన్నారు. ఈ వేడుకకు సోన్ పెట్ గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులందరికీ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జై హనుమాన్ నినాదాలతో సోన్ పెట్ గ్రామం మారుమోగింది. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు ఆలయ కమిటీ సభ్యులు భక్తజనులు బీ.ఆర్.ఎస్. నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.1
- రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం పరిధిలో తిప్పాపురంలో ఉన్న గోశాలను ఆలయ ఈవో రమాదేవి ఆకస్మికంగా తనిఖీ చేశారు.గోశాలకు వచ్చే డీసీఎం వాహనంలో లోడ్ చేసి తీసుకువచ్చిన Heritage Bypass Cattle Feed బ్యాగులను పరిశీలించారు. అందులోని కొన్ని బ్యాగులను తెరిపించి, అందులో ఉన్న పశుగ్రాసాన్ని స్వయంగా చేతులతో తీసి కోడెలకు పెట్టి అవి తింటున్నాయా లేదా, ఆహార నాణ్యత ఎలా ఉందో ప్రత్యక్షంగా పరిశీలించారు.కోడెలకు అందించే ఆహారంలో ఎలాంటి లోపాలు ఉండకూడదని, వాటి సంరక్షణలో నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని అధికారులకు, సిబ్బందికి ఈవో సూచనలు చేశారు. గోశాలలోని షెడ్లు, ఇతర సౌకర్యాలు మరియు వివిధ ప్రాంతాలను కూడా పరిశీలించారు.అలాగే కోడెల నుంచి వచ్చే పెండను ఉపయోగించి బయోగ్యాస్ ఉత్పత్తి జరుగుతుందా లేదా అనే విషయాన్ని కూడా ఈవో తెలుసుకున్నారు.ఈ తనిఖీ సందర్భంగా పరివేక్షకులు విజయ్, జూనియర్ అసిస్టెంట్ గొట్టం రవి మరియు గోశాల సిబ్బంది పాల్గొన్నారు.1
- జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలో సిలిండర్ కొరతతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత నెలలో సిలిండర్ కోసం అన్లైన్ లో బుక్ చేసినా ఆ సిలిండర్ ఇప్పటికే తీసుకుంటున్నట్టు చూపిస్తుందని, తమ పేరుతో బుకు చేసుకున్న సిలిండర్ ఇతరులకు అమ్ముకుంటున్నారని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేశారు. పదిహేను రోజులుగా ఆఫీసుకు వస్తున్నా ఇంకా సిలిండర్ తీసుకోలేమని చెపుతున్నారు. ప్రతి రోజు ఉదయం నుండి సిలిండర్ కోసం పడిగాపులు కాయాల్సివస్తుందని గంటల తరబడి లైనులో నిలబడిన సిలిండర్ దొరకటం కష్టంగా మారిందని చెపుతున్నారు. బుక్ చేసుకున్న వాటిని ఇతరులకు విక్రయిస్తున్నారని తెలిపారు.1
- Post by Solanke Ravi1
- పత్రిక ప్రకటన తేది 02.04.202.6. కామారెడ్డి జిల్లా గురువారం ... మొదటి రోజు విజయవంతంగా ప్రారంభమైన గ్రామసభ. .....కామారెడ్డి జిల్లా రామిరెడ్డి మండలం రంగం పేట గ్రామం లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక, 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక లో భాగంగా గురువారం ఉదయం నుండి ప్రారంభమైన గ్రామసభ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. .. ముందుగా జయజయ హే తెలంగాణ రాష్ట్ర గీతంతో గ్రామసభ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి , సంక్షేమ పథకాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశాన్ని సర్పంచ్ వినిపించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక”లో భాగంగా గ్రామ స్థాయిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు గ్రామ సభ నిర్వహించడం జరుగుతుందని ఈ గ్రామ సభలో ప్రభుత్వ సంక్షేమ పథకాల పై చర్చలు జరపడం, లబ్ధిదారుల అభిప్రాయాలను సేకరించడం, గ్రామ అభివృద్ధి అవసరాలను గుర్తించడం, గ్రామ సమస్యలను చర్చించి పరిష్కార మార్గాలను నిర్ణయించడం ప్రధాన ఉద్దేశ్యం అని అన్నారు. ఈ సమావేశంలో రైతు భరోసా పథకం, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి పథకం, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రూ. 500/-కి గ్యాస్ సిలిండర్, గృహ జ్యోతి (200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్), కళ్యాణలక్ష్మి / షాదీ ముబారక్ వంటి ప్రధాన సంక్షేమ పథకాల పై అవగాహన కల్పించబడుతుందని అదేవిధంగా, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం, ఇంటర్మీడియట్ వరకు అల్పాహార పథకం, మధ్యాహ్న భోజన పథకం, దివ్యాంగ విద్యార్థులకు మోటరైజ్డ్ వాహనాల పంపిణీ, కొత్త రేషన్ కార్డులు, వడ్ల కొనుగోలు బోనస్, పెన్షన్లు వంటి కొత్త పథకాల పై కూడా వివరాలు అందించబడతాయని గ్రామ సభలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, వివిధ శాఖల అధికారులు, గ్రామ పెద్దలు, మహిళలు, రైతులు, యువత, స్వయం సహాయక సంఘాల సభ్యులు ,పథకాల లబ్ధిదారులు అందరూ భాగస్వాములు కావాలని, గ్రామ సమస్యలను గుర్తించి వాటికి ప్రాధాన్యత కేటాయించి, సంబంధిత రిజిస్టర్ లో నమోదు చేసి పరిష్కార చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు చేరేలా చేయడం లక్ష్యంగా ప్రభుత్వం కట్టుబడి ఉందని, గ్రామ ప్రజలందరూ ఈ గ్రామ సభలో తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ పథకాల పై పూర్తి సమాచారం తెలుసుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా ప్రజలను కోరారు.1
- సిర్పూర్(టి) గ్రామపంచాయతీలో నిర్వహించిన గ్రామసభ ఉపసర్పంచ్ దుర్గం ప్రశాంత్ ఆందోళనతో అర్ధాంతరంగా ముగిసింది. సమావేశానికి సంబంధిత అధికారులు హాజరు కాకపోవడాన్ని కారణంగా చూపుతూ ఆయన సభను అడ్డుకుని తీవ్రంగా నిలదీశారు. మిషన్ భగీరథ నీటి సరఫరా, పింఛన్లు, ఇతర ప్రజా సమస్యలపై స్పందించాల్సిన అధికారులు లేకుండా గ్రామసభ నిర్వహించడం సరికాదని ప్రశాంత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పరిణామంతో కొంతమంది గ్రామస్తులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. సర్పంచ్ నాగమణి, ఇతరులు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో కోరం లేక గ్రామసభను అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది.2