Shuru
Apke Nagar Ki App…
తొండి మాటలు మాట్లాడితే నీ లాగులో తొండలిస్తారు విద్యార్థులు *ఏపీలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదు నేను కూడా ఇవ్వను* *ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంశంపై రేవంత్ రెడ్డి తప్పించుకునే ధోరణి* ఆర్.కృష్ణయ్య ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వమని అడగాలి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఏపీలో కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ ఉంది, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇచ్చాక తెలంగాణ బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శించండి అంటున్న రేవంత్.. గాడిద ను గద్దె నెక్కిస్తే గిట్లనే ఉంటది... బుడ్డ బాబు నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి.. *తొండి మాటలు మాట్లాడితే నీ లాగులో తొండలు ఇడుస్తారు విద్యార్థులు*
Bachannapet, Jangoan, Telangan
తొండి మాటలు మాట్లాడితే నీ లాగులో తొండలిస్తారు విద్యార్థులు *ఏపీలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదు నేను కూడా ఇవ్వను* *ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంశంపై రేవంత్ రెడ్డి తప్పించుకునే ధోరణి* ఆర్.కృష్ణయ్య ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వమని అడగాలి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఏపీలో కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ ఉంది, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇచ్చాక తెలంగాణ బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శించండి అంటున్న రేవంత్.. గాడిద ను గద్దె నెక్కిస్తే గిట్లనే ఉంటది... బుడ్డ బాబు నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి.. *తొండి మాటలు మాట్లాడితే నీ లాగులో తొండలు ఇడుస్తారు విద్యార్థులు*
More news from తెలంగాణ and nearby areas
- రాయగిరి: వర్షానికి నేలకొరిగిన చెట్లు.. రాకపోకలకు అంతరాయం భువనగిరి మున్సిపల్ పరిధిలోని రాయగిరి-యాదగిరిగుట్ట రహదారిపై మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలుచెట్లు నేలకొరిగాయి. చెట్లు రోడ్డుకు అడ్డంగా పడటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి విరిగిన చెట్లను తొలగించి రాకపోకలు పునరుద్ధరించాలని వాహనదారులు కోరుతున్నారు.1
- సీసీ రోడ్డు,మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం,మన్ పహాడ్ గ్రామంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల విస్తరణతో పాటు మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు,అలాగే రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు,మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తూ గ్రామాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలమ్మ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్,జిల్లా నాయకులు ధర్మారెడ్డి, తోటకూరి పాండుకృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న,నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్,మండల ఎస్సి మైనార్టీ సెల్ అధ్యక్షులు నాగరాజు, మహ్మద్ రసూల్, NSUI మండల అధ్యక్షుడు ఉమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు యాకయ్య, మండల గ్రామ నాయకులు,రెడ్డి రమేష్, రవి,మహ్మద్ జాకిర్, మొటికే చంద్రశేఖర్, తోటకూరి రమేష్, లీనారెడ్డి, రాజేందర్, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాలు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- గురుపౌర్ణమి వేళ సాయినామస్మరణ.. కిటకిటలాడిన సాయిబాబ ఆలయాలు వరంగల్ నగరంలో గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీ దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పోర్టురోడ్డు శివనగర్‌లోని శ్రీ గణేష్ సాయిబాబా మందిరం, ములుగు రోడ్డులోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం, భద్రకాళి, దేశాయిపేట లక్ష్మీ టౌన్‌షిప్‌లోని శిరిడి సాయిబాబా దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయిబాబాకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.1
- JAI BC ✊ SELF-RESPECT - POWER - Share 🔥 JAI TEENMAAR MALLANNA TRP Flag Unveiling Ceremony by Teenmar Mallanna in Mahabubnagar || Telangana Rajyadhikara Party1
- వర్షంలో సైతం కొనసాగుతున్న బెజ్జంకి బంద్ ఇథనాల్ ఫ్యాక్టరీలను మూసివేయాలని డిమాండ్ వర్షంలోనూ వెనక్కి తగ్గని అఖిలపక్షం.. బెజ్జంకి బంద్ కొనసాగింపు బెజ్జంకి మండలంలో ప్రతిపాదిత ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్షం చేపట్టిన బంద్ మంగళవారం వర్షం కురుస్తున్నప్పటికీ ఉధృతంగా కొనసాగింది. తిమ్మాయపల్లి, నర్సింహులపల్లి పరిసర ప్రాంతాల్లో ఇథనాల్ పరిశ్రమలు ఏర్పాటైతే పర్యావరణ కాలుష్యం పెరగడంతో పాటు భూగర్భ జలాలు, వ్యవసాయంపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన వ్యక్తం చేసిన నాయకులు, ప్రజలు ఫ్యాక్టరీల అనుమతులను వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంద్‌కు ప్రజలు, రైతులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున మద్దతు తెలపడంతో మండల వ్యాప్తంగా దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు అధికారులు తిరుపతి ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. ప్రశాంత వాతావరణంలో బంద్ కొనసాగగా, ఇథనాల్ ఫ్యాక్టరీల అనుమతులు రద్దు అయ్యే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అఖిలపక్ష నాయకులు స్పష్టం చేశారు.4
- ఎంఐఎం నాయకులు ఒత్తిడికి తలంగిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ విధానం దీని వెనుక పెద్ద కుట్ర : మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఎంఐఎం నాయకుల ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 'ఎలక్ట్రానిక్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్' విధానం వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. ఈ సర్టిఫికెట్ల వల్ల ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్వయంగా ప్రభుత్వ జీవోలోనే స్పష్టంగా చెప్పారు. మరి ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు? కేవలం హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతటా ఉన్న బోగస్ ఓటర్లు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, పాకిస్థానీలకు ఓటరు నమోదు (SIR) ప్రక్రియలో దొడ్డిదారిన గుర్తింపు కల్పించి ఓటు హక్కు ఇవ్వడానికే ఈ ప్రయత్నం. ఒక నోటరీ కాగితం మీద పేర్లు రాసిస్తే కేవలం రెండు రోజుల్లోనే సర్టిఫికెట్ ఇచ్చేంత దారుణమైన పరిస్థితి ఇది. దీని వెనుక ఉన్న దురుద్దేశాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ అక్రమ సర్టిఫికెట్లను ఓటరు నమోదు ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని రాష్ట్ర ఎన్నికల అధికారికి (CEO) ఫిర్యాదు చేశాం. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఈ కుట్రను అడ్డుకుంటాం. - శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు1
- రాయగిరి స్వయంభు శ్రీ వెంకటేశ్వర స్వామి గిరిప్రదక్షిణ . పౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని బుధవారం ఉదయం రాయగిరి స్వయంభు శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కొండ చుట్టూ ప్రదక్షిణ ఘనంగా నిర్వహించారు. VHP జిల్లా సత్సంగ్ ప్రముఖ్ పెద్దగాని శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో హరినామ సంకీర్తన చేస్తూ కొండ చుట్టూ ప్రదక్షణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి అభిషేకార్చనలు ధూప దీప నైవేద్యాలు సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములు స్వామీజీ, గడ్డమీది చంద్రయ్య భక్తులు పాల్గొన్నారు.1
- కొండగట్టు జోరు వానలో కొనసాగిన 43వ గిరిప్రదక్షిణ... వర్షంలో తడుస్తూ గిరి ప్రదక్షణ చేసిన రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జోరు వానలో కోరిన కోర్కెలు తీర్చే కొండగట్టు అంజన్న సన్నిధిలో గిరి ప్రదక్షిణ కొనసాగింది. గురు పౌర్ణమి సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 43వ సారి నేడు కొండగట్టులో గిరి ప్రదక్షణ నిర్వహించారు. గిరి ప్రదక్షిణలో రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ ఎస్పి అశోక్ కుమార్ తోపాటు పెద్ద సంఖ్యలో భక్తులు అధికారులు పాల్గొన్నారు. ఎల్ నినో ఎఫెక్ట్ తో వర్షాభావ పరిస్థితుల్లో విస్తారంగా వర్షాలు కురియాలని ప్రత్యేక పూజలు నిర్వహించి వర్షంలో తడుస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. వర్షం కారణంగా భక్తుల సంఖ్య కాస్త తగ్గినప్పటికీ అధికారులు ప్రజాప్రతినిధులు గిరి ప్రదక్షణ చేసి విస్తారంగా వర్షాలు కురియాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆంజనేయస్వామిని వేడుకున్నారు. అంజన్న అనుగ్రహంతో రాబోయే రోజుల్లో గిరిప్రదక్షిణకు మౌలిక సదుపాయాలు కల్పించి కొండగట్టు అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. వరుణుడి కరుణ కోసం గిరి ప్రదక్షణ చేస్తుంటే దేవుడు అనుగ్రహంతో జోరు వాన కురుస్తుందని ఇదేవిధంగా రేపటి నుంచి మూడు రోజులపాటు వేములవాడ రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో వరుణ యాగం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.4
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరు వాన... ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో అన్నదాతల్లో ఆనందం వాయుగుండం ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండడంతో పలుచోట్ల వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా జగిత్యాల జిల్లాలో భారీ వర్షం కురిసింది. సారంగాపూర్ లో 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. బుగ్గారంలో 18, రాయికల్, వెలగటూర్ లో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ లో 14 సెంటీమీటర్లు రామగుండంలో 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. జగిత్యాల, రామగుండం లో పలు కాలనీల్లో ఇళ్ళలోకి వరద నీరు చేరింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. కరీంనగర్, సిరిసిల్ల జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదయింది. గంగాధర రామడుగు చొప్పదండి, ఎల్లారెడ్డిపేట మండలాల్లో 8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షంతో జగిత్యాల మండలం అనంతారం, ధర్మపురి మండలం అక్షయ పల్లి వద్ద జాతీయ రహదారిపై వరద ఉధృతంగా ఉండడంతో జగిత్యాల ధర్మపురి రూట్లో రాకపోకలు నిలిచిపోయాయి. రామగుండం లో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో వరద నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. కరువు తీరా వర్షం కురియడంతో అన్నదాతల్లో ఆనందం నెలకొంది. వర్షంలో తడుస్తూ నృత్యాలు చేస్తూ రైతులు సంతోషం వ్యక్తం చేశారు.4