ఎంఐఎం నాయకులు ఒత్తిడికి తలంగిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన ఎలక్ట్రానిక్ ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ విధానం దీని వెనుక పెద్ద కుట్ర : మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఎంఐఎం నాయకుల ఒత్తిడికి తలొగ్గి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా తెచ్చిన 'ఎలక్ట్రానిక్ తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్' విధానం వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. ఈ సర్టిఫికెట్ల వల్ల ప్రభుత్వ పథకాలకు ఎలాంటి ప్రయోజనం ఉండదని స్వయంగా ప్రభుత్వ జీవోలోనే స్పష్టంగా చెప్పారు. మరి ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు? కేవలం హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతటా ఉన్న బోగస్ ఓటర్లు, బంగ్లాదేశీయులు, రోహింగ్యాలు, పాకిస్థానీలకు ఓటరు నమోదు (SIR) ప్రక్రియలో దొడ్డిదారిన గుర్తింపు కల్పించి ఓటు హక్కు ఇవ్వడానికే ఈ ప్రయత్నం. ఒక నోటరీ కాగితం మీద పేర్లు రాసిస్తే కేవలం రెండు రోజుల్లోనే సర్టిఫికెట్ ఇచ్చేంత దారుణమైన పరిస్థితి ఇది. దీని వెనుక ఉన్న దురుద్దేశాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ అక్రమ సర్టిఫికెట్లను ఓటరు నమోదు ప్రక్రియలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్వీకరించవద్దని రాష్ట్ర ఎన్నికల అధికారికి (CEO) ఫిర్యాదు చేశాం. ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కలిసి ఈ కుట్రను అడ్డుకుంటాం. - శ్రీ మర్రి శశిధర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు

- ఇక అబద్ధం చెప్పను అందుకే రాజీనామా చేశాను: ఢిల్లీ DCP సుమిత్ జా *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు. నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు. నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను. ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.1
- రాజాపేటలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు రాజపేట మండలంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత అధ్యక్షులు నంగునూరు చంద్రశేఖర్ గుప్తా, ఆలయ అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, గురుపాదుక తీర్థ పూజ, పల్లకి సేవ, మహాదాశిర్వచనం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.1
- కోర్టులను గౌరవిస్తూ హైదరాబాద్‌ను కాపాడే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయ హంగామా కబ్జాదారులను కాపాడలేనని కోర్టులను గౌరవిస్తూ, హైదరాబాద్‌ను కాపాడే విధంగా కొనసాగే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తగ్గిన భక్తుల రద్దీ యాదగిరిగుట్టలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.1
- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద...సగం నిండిన ప్రాజెక్ట్... ఎల్ఎండి, మిడ్ మానేర్ కు స్వల్పంగా కొనసాగుతున్న వరద అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జగిత్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 66 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం పది టిఎంసీలకు నీరు చేరింది. వరద ఇలానే కొనసాగితే రేపటి వరకు 14 టీఎంసీలు వరకు చేరే అవకాశం ఉంది. ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక కాలేశ్వరం ప్రాజెక్టులోని నంది మేడారంలోని పంపులను ఆన్ చేసి మిడ్ మానేర్ కు నీటిని ఎత్తిపోసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మినహా ఏ ప్రాజెక్టుకు ఆశించని స్థాయిలో వరద వచ్చిన దాఖలాలు లేవు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాంకు స్వల్పంగా 206 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.4 టీఎంసీల నీరు నిలువ ఉంది. అదే విధంగా మిడ్ మానేర్ డ్యామ్ కు 2334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. 27.55 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 7.5 టీఎంసీలను నీరు నిల్వ ఉంది. జగిత్యాల పెద్దపెల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షంతో పలు జలాశయాలకు జలకల సంతరించుకోగా కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని జలాశయాలు వెలవెల బోతున్నాయి.1
- యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి భరోసా కల్పించారు.1
- తొండి మాటలు మాట్లాడితే నీ లాగులో తొండలిస్తారు విద్యార్థులు *ఏపీలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వడంలేదు నేను కూడా ఇవ్వను* *ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంశంపై రేవంత్ రెడ్డి తప్పించుకునే ధోరణి* ఆర్.కృష్ణయ్య ఏపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇవ్వమని అడగాలి ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఏపీలో కూడా ఫీజ్ రీయింబర్స్‌మెంట్ పెండింగ్ ఉంది, ముందు అక్కడ ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఇచ్చాక తెలంగాణ బీజేపీ నాయకులు మమ్మల్ని విమర్శించండి అంటున్న రేవంత్.. గాడిద ను గద్దె నెక్కిస్తే గిట్లనే ఉంటది... బుడ్డ బాబు నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి.. *తొండి మాటలు మాట్లాడితే నీ లాగులో తొండలు ఇడుస్తారు విద్యార్థులు*1
- నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలం పంకెనకు చెందిన వైష్ణవి గడ్డి మందు తాగి.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని తెలిపిన తండ్రి రాజయ్య.1