Shuru
Apke Nagar Ki App…
నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలం పంకెనకు చెందిన వైష్ణవి గడ్డి మందు తాగి.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని తెలిపిన తండ్రి రాజయ్య.
Shareef pasha
నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలం పంకెనకు చెందిన వైష్ణవి గడ్డి మందు తాగి.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని తెలిపిన తండ్రి రాజయ్య.
More news from తెలంగాణ and nearby areas
- ఆర్ఎంపి లు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. ఆర్ఎంపీలు నిబంధనలు అతిక్రమించి వైద్యం చేస్తే చట్టరీత్య కఠిన చర్యలు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్. మహబూబాబాద్ జిల్లా జూలై 29... ఆర్ఎంపీలు నిబంధనలు అతిక్రమించి వైద్యం చెయ్యొద్దని.. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ హెచ్చరించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ జిల్లాలోని మరిపెడ మండలంలో గల కంపాటి రవి బాబు ఆర్ఎంపి ప్రజత క్లినిక్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి క్లినిక్ వారితో ప్రథమ చికిత్స మాత్రమే చేయవలెనని స్థాయికి మించిన (ఇంజక్షన్లు, సెలైన్లు) వైద్యం చేసిన యెడల చట్టరీత్య చర్య తీసుకుంటామని జిల్లాలోని ప్రథమ చికిత్స చేసే ఆర్ఎంపి వైద్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం మనోహర్, కృష్ణ పాల్గొన్నారు.1
- యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి భరోసా కల్పించారు.1
- భూపాలపల్లిలోని కాళేశ్వరం పంప్‌హౌస్‌లలో మోటార్ల ప్రారంభం..! BHPL: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయత్రి పంప్‌హౌస్‌లలో మోటార్లను ప్రభుత్వం ప్రారంభించింది. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని కేటీఆర్, హరీశ్‌రావు చేసిన డిమాండ్ల ఫలితంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని BRS పేర్కొంది. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా సుమారు 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు వెల్లడించింది.1
- రాజాపేటలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలు రాజపేట మండలంలోని శ్రీరామకృష్ణ సాయి మందిరంలో గురు పౌర్ణమి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ శాశ్వత అధ్యక్షులు నంగునూరు చంద్రశేఖర్ గుప్తా, ఆలయ అర్చకులు చలివేదుల వెంకట రామకృష్ణ ప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో పంచామృతాభిషేకం, గురుపాదుక తీర్థ పూజ, పల్లకి సేవ, మహాదాశిర్వచనం నిర్వహించారు. అనంతరం తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.1
- యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో తగ్గిన భక్తుల రద్దీ యాదగిరిగుట్టలో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో బుధవారం భక్తుల రద్దీ తగ్గింది. స్వామివారి దర్శనానికి అరగంట సమయం మాత్రమే పడుతుంది. స్వామివారికి శాస్త్రోక్తంగా నిత్య కైంకర్యాలు కొనసాగుతున్నాయి. భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకుంటున్నారు.1
- సీసీ రోడ్డు,మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం,మన్ పహాడ్ గ్రామంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల విస్తరణతో పాటు మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు,అలాగే రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు,మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తూ గ్రామాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలమ్మ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్,జిల్లా నాయకులు ధర్మారెడ్డి, తోటకూరి పాండుకృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న,నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్,మండల ఎస్సి మైనార్టీ సెల్ అధ్యక్షులు నాగరాజు, మహ్మద్ రసూల్, NSUI మండల అధ్యక్షుడు ఉమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు యాకయ్య, మండల గ్రామ నాయకులు,రెడ్డి రమేష్, రవి,మహ్మద్ జాకిర్, మొటికే చంద్రశేఖర్, తోటకూరి రమేష్, లీనారెడ్డి, రాజేందర్, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాలు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలం పంకెనకు చెందిన వైష్ణవి గడ్డి మందు తాగి.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని తెలిపిన తండ్రి రాజయ్య.1