Shuru
Apke Nagar Ki App…
భూపాలపల్లిలోని కాళేశ్వరం పంప్‌హౌస్‌లలో మోటార్ల ప్రారంభం..! BHPL: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయత్రి పంప్‌హౌస్‌లలో మోటార్లను ప్రభుత్వం ప్రారంభించింది. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని కేటీఆర్, హరీశ్‌రావు చేసిన డిమాండ్ల ఫలితంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని BRS పేర్కొంది. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా సుమారు 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు వెల్లడించింది.
BOMMAKANTI NAVATH
భూపాలపల్లిలోని కాళేశ్వరం పంప్‌హౌస్‌లలో మోటార్ల ప్రారంభం..! BHPL: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయత్రి పంప్‌హౌస్‌లలో మోటార్లను ప్రభుత్వం ప్రారంభించింది. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని కేటీఆర్, హరీశ్‌రావు చేసిన డిమాండ్ల ఫలితంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని BRS పేర్కొంది. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా సుమారు 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు వెల్లడించింది.
More news from తెలంగాణ and nearby areas
- నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి, ప్రస్తుత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్.. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన తెలంగాణ రక్షణ సేన1
- సీసీ రోడ్డు,మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే యశస్విని జనగామ జిల్లా దేవరుప్పుల మండలం,మన్ పహాడ్ గ్రామంలో గ్రామాభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశశ్విని రెడ్డి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. గ్రామంలో మౌలిక వసతుల విస్తరణతో పాటు మహిళల సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ నిర్మాణ పనులను ప్రారంభించారు.ఈ సందర్భంగా రూ.20 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు,అలాగే రూ.10 లక్షల వ్యయంతో మహిళా సమైక్య భవన నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ నిర్వహించి పనులకు శ్రీకారం చుట్టారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన రహదారులు,మహిళా సంఘాలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడం కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని,ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రతి గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా అమలు చేస్తూ గ్రామాల రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలమ్మ శ్రీనివాస్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దావేర అనిల్ కుమార్,జిల్లా నాయకులు ధర్మారెడ్డి, తోటకూరి పాండుకృష్ణ, మండల యూత్ అధ్యక్షుడు పులిగిల్ల వెంకన్న,నియోజకవర్గ యూత్ ఉపాధ్యక్షుడు ఉప్పుల ప్రకాష్,మండల ఎస్సి మైనార్టీ సెల్ అధ్యక్షులు నాగరాజు, మహ్మద్ రసూల్, NSUI మండల అధ్యక్షుడు ఉమేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు యాకయ్య, మండల గ్రామ నాయకులు,రెడ్డి రమేష్, రవి,మహ్మద్ జాకిర్, మొటికే చంద్రశేఖర్, తోటకూరి రమేష్, లీనారెడ్డి, రాజేందర్, యువజన నాయకులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారులు, మహిళా సంఘాలు, గ్రామస్థులు పాల్గొన్నారు.1
- వాజేడు బొగత జలపాతం సందర్శన బంద్! పర్యాటకులు రావొద్దు..! భారీ వర్షాల కారణంగా వాజేడు మండలం బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి నరేందర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో జలపాతంలో నీరు ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సందర్శన నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటకులు ఎవరు బొగత సందర్శనకు రావద్దని సూచించారు.1
- పోరాట యోధుడు ఎర్ర సత్యం అన్న సాక్షిగా చెబుతున్న దేవరకద్ర కోటపై ఎగిరేది PRP జెండానే : తీన్మార్ మల్లన్న *పోరాట యోధుడు,ఎర్ర సత్యమన్న సాక్షిగా చెప్తున్నా...* ఎన్నాళ్లు సాగుతుంది ఈ రెడ్ల రాజ్యం.? ఎన్నాళ్లు భరిస్తాం ఈ దోపిడీలు.? దేవరకద్రలో దోపిడీదారుల కాలం చెల్లింది... రెడ్ల గుడారాలు కదులుతున్నాయి.! 2028లో దేవరకద్ర కోటపై ఎగిరేది తెలంగాణ రాజ్యాధికార పార్టీ జెండానే... 2028లో గెలవబోయేది మన ముదిరాజ్ బిడ్డే.! *-టీఆర్పీ అధినేత ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న*1
- ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు. రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం ఈరోజు బుధవారం రోజున:29/07/2026:కేంద్రంలోని దయనీయంగా మారిన రహదారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని. మామిడి హరీష్ దళిత మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ డిమాండ్ చేశారు. ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల్లో రహదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల కారణంగా అనేక రహదారులు ధ్వంసమయ్యాయి. అనంతరం వాటి మరమ్మతులు సకాలంలో చేపట్టకపోవడంతో పరిస్థితి మరింత దిగజారింది. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రహదారులపై ఏర్పడిన గుంతల్లో నీరు నిల్వ ఉండి ప్రమాదాలకు కారణమవుతోంది. వాహనదారులు గుంతలను గుర్తించలేక ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా, మురుగునీరు రోడ్లపైకి చేరడం, కాలువలు సరిగా లేకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అనేక గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొనడంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి దెబ్బతిన్న రహదారులను పరిశీలించి, గుంతలను పూడ్చి, అవసరమైన మరమ్మతు పనులు చేపట్టి ప్రజలకు సురక్షిత రవాణా సౌకర్యం కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.1
- గురుపౌర్ణమి వేళ శ్రీ దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పంచామృతాభిషేకం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులు విశేషంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.1
- మంత్రి సీతక్క చొరవతో రామప్ప ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల..! వెంకటాపూర్ (మం) పాలంపేటలోని రామప్ప ఆయకట్టు కింద ఉన్న రైతుల సాగునీటి అవసరాల దృష్ట్యా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, వెంకటాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ తదితర నాయకులు అధికారులతో కలిసి తూము ద్వారా నీటిని విడుదల చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.1
- కరీంనగర్ లో భారీ చోరీ కేసును చేధించిన పోలీసులు...అల్లుడు మనుమడు ప్రధాన నిందితులు....యూపికి చెందిన ముగ్గురు అరెస్ట్ సంచలనం సృష్టించిన కరీంనగర్ లో భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. అల్లుడు మనువడే ప్రధాన నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. చోరీకి పాల్పడ్డ ముఠాలో ముగ్గురిని యూపీలోని మీరట్ లో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ పై కరీంనగర్ కు తరలిస్తున్నారు. వారి నుంచి రెండు లక్షల 9వేల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు అల్లుడు, మనువడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తాలో ఈనెల 21న అర్ధరాత్రి డమ్మీ పిస్టల్, కత్తితో బెదిరించి చేతులు, కాళ్లు కట్టేసి అజ్మత్ అలీ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. అజ్మత్ అలీతోపాటు కుటుంబ సభ్యులపై దాడి చేసి 25 లక్షల నగదు, 53 తులాల బంగారం 30 తులాల వెండి ఆభరణాలు అపహరించారు. పారిపోతూ అజ్మత్ అలీ ఇంట్లో అద్దెకు ఉండే వారి రెండు బైకులను సైతం ఎత్తుకెళ్లారు. రెండు పైకులపై ఐదుగురు పారిపోతుంది డ్యామ్ వద్ద లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని వరంగల్ రూట్లో పారిపోయిన విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఐదుగురు నిందితులు రెండు బైకులపై వెళ్తూ హుజురాబాద్ సమీపంలోని కాకతీయ కెనాల్ వద్ద రెండు బైకులను వదిలేసి మరో వాహనంలో పారిపోయారు. అజ్మత్ అలీ అల్లుడు రాజావుద్దిన్ మనవడు అజీమ్ రజా పై అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రత్యేక పోలీస్ బృందాలు రజావుద్దిన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నిఘా పెట్టగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారని సిపి గౌస్ ఆలం ప్రకటించారు. పట్టుబడ్డ ముగ్గురు సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మహమ్మద్ హాసిన్ లను మీరట్ కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటిపై కరీంనగర్ కు తరలిస్తున్నట్లు సిపి తెలిపారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు నేర చరిత్ర ఉంది. కుటుంబకలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్ లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి స్వస్థలానికి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల 5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. అత్తగారి ఇంట్లో నివసించిన సమయంలో నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి భారీ చోరీకి పథకం రచించాడు. ఈనెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21న అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. ప్రధాన నిందితులు సూత్రధారులు పరారీలో ఉండగా చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురు పట్టుబడ్డారని చెప్పారు. పొరల్లో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారీ చోరీ కేసును వారం రోజుల్లో చేదించిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. ఉత్తర భారత్ చెందిన వారే ఇటీవల కరీంనగర్లో జువెల్లరీ షాపులో తాజాగా బంధువుల ఇంట్లోనే చోరీకి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.2
- తీగలగుట్టపల్లి లో డిప్యూటీ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఇంట్లో భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు...మాజీ ప్రజా ప్రతినిధి భర్త అరెస్ట్ మరొకరు పరార్... పట్టుబడ్డ వ్యక్తి నుంచి 17 లక్షల 60 వేల నగదు కారు స్వాధీనం ఔను వాళ్ళిద్దరిది ఒకే గ్రామం, పైగా ఇద్దరు మిత్రులు. ఒకరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తుంటే, మరొకరు స్థానికంగా రాజకీయ నాయకుడిగా చలామణి అవుతారు. ఎక్కడ చెడిందో తెలియదు కానీ ఆ పారిస్త్ ఆఫీసర్ ఇంట్లో భారీ చోరీ జరిగి, రాజకీయ నాయకుడు నిందితుడుగా మారి కటకటాలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంచలనం సృష్టించిన ఈ చోరీ కరీంనగర్ సమీపంలోని తీగలగుట్టపల్లి లో గత జూన్ లో జరిగింది. కరీంనగర్ రూరల్ పోలీసులు చోరీ కేసును ఛేదించి పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్ పూర్ గ్రామానికి మాజీ జడ్పీటిసి భర్త తగరం శంకర్ లాల్ ను అరెస్టు చేసి అతని నుంచి 17 లక్షల 60 వేల నగదు, స్విఫ్ట్ కారు, మోబైల్ ఫోన్ స్వాధీనం చేసుకుని సిపి గౌస్ ఆలం సమక్షంలో చూపించి వివరాలు వెల్లడించారు. నుంచి అచూపించి వివరాలు వెల్లడించారు. మరొకరు అడెపు రేష్మ పరారీలో ఉన్నారని తెలిపారు. ఎక్లాస్ పూర్ కు చెందిన ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాస్ అద్దెకు ఉండే ఇంట్లోకి స్నేహితుడుగా వెళ్ళిన శంకర్ లాల్ జూన్ లో 26 లక్షలు చోరీ చేశారని తెలిపారు. ఫారెస్ట్ ఆఫీసర్ అద్దెకు ఉండే భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లు గతంలో గుర్తుతెలియని వ్యక్తులు ఒక లాప్టాప్ ను చోరీకి పాల్పడ్డారు. చోరీల విషయం ఫారెస్ట్ ఆఫీసర్ పోలీసులకు పిర్యాదు చేయడంలో జాప్యం వెనుక అనారోగ్యంతో ఉన్న భార్యకు తెలియవద్దని చూశాడని తెలిపారు. చివరకు విధిలేని పరిస్థితిలో ఫారెస్ట్ ఆఫీసర్ పోలీసులకు సమాచారం అందించడంతో సాంకేతికపరమైన ఆధారాలతో విచారణ జరపగా శంకర్ లాల్ పట్టుబడ్డాడని చెప్పారు. ల్యాండ్ అమ్మిన డబ్బులు ఇంట్లో పెట్టగా చోరీ జరిగినట్లు తెలుస్తోందని, అంత మొత్తంలో ఫారెస్ట్ ఆఫీసర్ ఇంట్లో డబ్బు ఉండడంపై విచారణ జరుపుతున్నామని సిపి గౌస్ ఆలం చెప్పారు. కేసును చేదించిన సిఐ నిరంజన్ రెడ్డి కానిస్టేబుళ్ళను అభినందిస్తూ సిపి క్యాష్ అవార్డులు అందజేశారు.4