Shuru
Apke Nagar Ki App…
మంత్రి సీతక్క చొరవతో రామప్ప ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల..! వెంకటాపూర్ (మం) పాలంపేటలోని రామప్ప ఆయకట్టు కింద ఉన్న రైతుల సాగునీటి అవసరాల దృష్ట్యా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, వెంకటాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ తదితర నాయకులు అధికారులతో కలిసి తూము ద్వారా నీటిని విడుదల చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Swathi
మంత్రి సీతక్క చొరవతో రామప్ప ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల..! వెంకటాపూర్ (మం) పాలంపేటలోని రామప్ప ఆయకట్టు కింద ఉన్న రైతుల సాగునీటి అవసరాల దృష్ట్యా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, వెంకటాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ తదితర నాయకులు అధికారులతో కలిసి తూము ద్వారా నీటిని విడుదల చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
More news from తెలంగాణ and nearby areas
- యశోద ఆస్పత్రిలో పెద్ది ని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని పరామర్శించిన తెలంగాణ రక్షణ సేన అధ్యక్షులు కల్వకుంట్ల కవిత ఆయనకు అందిస్తున్న వైద్యం గురించి, ప్రస్తుత ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్న టీఆర్ఎస్ చీఫ్.. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి గారి భార్య, ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పిన తెలంగాణ రక్షణ సేన చీఫ్1
- భూపాలపల్లిలోని కాళేశ్వరం పంప్‌హౌస్‌లలో మోటార్ల ప్రారంభం..! BHPL: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయత్రి పంప్‌హౌస్‌లలో మోటార్లను ప్రభుత్వం ప్రారంభించింది. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని కేటీఆర్, హరీశ్‌రావు చేసిన డిమాండ్ల ఫలితంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని BRS పేర్కొంది. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా సుమారు 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు వెల్లడించింది.1
- యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి భరోసా కల్పించారు.1
- భారీ వర్షాలపై వరద ప్రభావిత ప్రాంతంలో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా క్షేత్రస్థాయి పరిశీలన రామగుండం కమిషనరేట్ పరిధిలో భారీ వర్షాల కారణంగా పలు ఏరియాలలో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పరిశీలించారు. రామగుండం వెలువల కర్మాగారం ప్రాంతంలోని వీర్లపల్లి గ్రామంలోకి డ్రైనేజీ నీరు కాలువల ద్వారా గ్రామంలోకి చేరడంతో సిపి పరిశీలించారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.1
- వాజేడు బొగత జలపాతం సందర్శన బంద్! పర్యాటకులు రావొద్దు..! భారీ వర్షాల కారణంగా వాజేడు మండలం బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి నరేందర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో జలపాతంలో నీరు ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సందర్శన నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటకులు ఎవరు బొగత సందర్శనకు రావద్దని సూచించారు.1
- వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగి తెలంగాణ-ఛత్తీస్ గఢ్ రాకపోకలు బంద్! వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగిపోయింది. దీంతో తెలంగాణ-చత్తీస్ గఢ్ పాటు సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నేటి ఉదయం వాగు ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరద రోడ్డుపైకి చేయడంతో ఒకసారిగా రోడ్డు తెగిపోయింది.1