Shuru
Apke Nagar Ki App…
వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగి తెలంగాణ-ఛత్తీస్ గఢ్ రాకపోకలు బంద్! వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగిపోయింది. దీంతో తెలంగాణ-చత్తీస్ గఢ్ పాటు సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నేటి ఉదయం వాగు ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరద రోడ్డుపైకి చేయడంతో ఒకసారిగా రోడ్డు తెగిపోయింది.
Swathi
వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగి తెలంగాణ-ఛత్తీస్ గఢ్ రాకపోకలు బంద్! వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగిపోయింది. దీంతో తెలంగాణ-చత్తీస్ గఢ్ పాటు సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నేటి ఉదయం వాగు ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరద రోడ్డుపైకి చేయడంతో ఒకసారిగా రోడ్డు తెగిపోయింది.
More news from తెలంగాణ and nearby areas
- భూపాలపల్లిలోని కాళేశ్వరం పంప్‌హౌస్‌లలో మోటార్ల ప్రారంభం..! BHPL: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన నంది మేడారం, గాయత్రి పంప్‌హౌస్‌లలో మోటార్లను ప్రభుత్వం ప్రారంభించింది. కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి నుంచి నీటిని విడుదల చేయాలని కేటీఆర్, హరీశ్‌రావు చేసిన డిమాండ్ల ఫలితంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని BRS పేర్కొంది. ప్రస్తుతం రెండు పంపుల ద్వారా సుమారు 6,300 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నట్లు వెల్లడించింది.1
- యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి భరోసా కల్పించారు.1
- కరీంనగర్ లో భారీ చోరీ కేసును చేధించిన పోలీసులు...అల్లుడు మనుమడు ప్రధాన నిందితులు....యూపికి చెందిన ముగ్గురు అరెస్ట్ సంచలనం సృష్టించిన కరీంనగర్ లో భారీ చోరీ కేసును పోలీసులు చేధించారు. అల్లుడు మనువడే ప్రధాన నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. చోరీకి పాల్పడ్డ ముఠాలో ముగ్గురిని యూపీలోని మీరట్ లో అరెస్టు చేసి ట్రాన్సిట్ వారెంట్ పై కరీంనగర్ కు తరలిస్తున్నారు. వారి నుంచి రెండు లక్షల 9వేల నగదు, 43.67 గ్రాముల బంగారం, 64.98 గ్రాముల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితులు అల్లుడు, మనువడి కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. కరీంనగర్ భగత్ నగర్ చౌరస్తాలో ఈనెల 21న అర్ధరాత్రి డమ్మీ పిస్టల్, కత్తితో బెదిరించి చేతులు, కాళ్లు కట్టేసి అజ్మత్ అలీ ఇంట్లో భారీ చోరీకి పాల్పడ్డారు. అజ్మత్ అలీతోపాటు కుటుంబ సభ్యులపై దాడి చేసి 25 లక్షల నగదు, 53 తులాల బంగారం 30 తులాల వెండి ఆభరణాలు అపహరించారు. పారిపోతూ అజ్మత్ అలీ ఇంట్లో అద్దెకు ఉండే వారి రెండు బైకులను సైతం ఎత్తుకెళ్లారు. రెండు పైకులపై ఐదుగురు పారిపోతుంది డ్యామ్ వద్ద లేక్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకొని వరంగల్ రూట్లో పారిపోయిన విజువల్స్ సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. ఐదుగురు నిందితులు రెండు బైకులపై వెళ్తూ హుజురాబాద్ సమీపంలోని కాకతీయ కెనాల్ వద్ద రెండు బైకులను వదిలేసి మరో వాహనంలో పారిపోయారు. అజ్మత్ అలీ అల్లుడు రాజావుద్దిన్ మనవడు అజీమ్ రజా పై అనుమానాలు కుటుంబ సభ్యులు వ్యక్తం చేయడంతో పోలీసులు ఆ దిశగా విచారణ చేపట్టారు. ప్రత్యేక పోలీస్ బృందాలు రజావుద్దిన్ స్వస్థలం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో నిఘా పెట్టగా ముగ్గురు నిందితులు పట్టుబడ్డారని సిపి గౌస్ ఆలం ప్రకటించారు. పట్టుబడ్డ ముగ్గురు సల్మాన్ అలియాస్ భూరే, సల్మాన్ అలియాస్ విమాన్, మహమ్మద్ హాసిన్ లను మీరట్ కోర్టులో హాజరు పరిచి ట్రాన్సిట్ వారింటిపై కరీంనగర్ కు తరలిస్తున్నట్లు సిపి తెలిపారు. రజావుద్దీన్‌పై గతంలో హత్య కేసు, ఆయుధాల కేసులతో పాటు నేర చరిత్ర ఉంది. కుటుంబకలహాల కారణంగా అతని భార్య గత ఏడాది కరీంనగర్ లోని పుట్టింటికి వచ్చింది. భార్యను తీసుకెళ్లేందుకు వచ్చిన రజావుద్దీన్ విఫలమవడంతో తిరిగి స్వస్థలానికి వెళ్లాడు. అనంతరం మళ్లీ వచ్చి ఆత్మహత్యాయత్నం చేయగా బాధిత కుటుంబ సభ్యులు అతనికి చికిత్స చేయించి తమ ఇంట్లోనే ఉంచుకున్నారు. అనంతరం అతనికి బట్టల వ్యాపారం ప్రారంభించేందుకు ఆర్థిక సహాయం కూడా అందించారు. అయితే వ్యాపారంలో నష్టపోయిన రజావుద్దీన్ తరచూ భార్య, మామ వద్ద డబ్బులు డిమాండ్ చేస్తూ వేధించేవాడు. ఇటీవల 5 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేయగా నిరాకరించడంతో గొడవపడి, మంచిర్యాలలో కొత్త దుకాణం పెడుతున్నట్లు చెప్పి బాధితుడి కారుతో మీరట్ వెళ్లిపోయాడు. అత్తగారి ఇంట్లో నివసించిన సమయంలో నగదు, బంగారు ఆభరణాలపై పూర్తి అవగాహన ఏర్పరుచుకున్న రజావుద్దీన్, తన కుమారుడు అజీమ్ రజా మీరట్‌కు చెందిన మరో ముగ్గురితో కలిసి భారీ చోరీకి పథకం రచించాడు. ఈనెల 20న మీరట్ నుంచి రైలులో రామగుండం చేరుకుని, 21న అర్ధరాత్రి సమయంలో డమ్మీ పిస్టళ్లు, కత్తులతో బాధితుడి ఇంట్లోకి చొరబడి కుటుంబ సభ్యులపై దాడి చేసి దోపిడీకి పాల్పడ్డారని తెలిపారు. ప్రధాన నిందితులు సూత్రధారులు పరారీలో ఉండగా చోరీలో ప్రత్యక్షంగా పాల్గొన్న ముగ్గురు పట్టుబడ్డారని చెప్పారు. పొరల్లో ఉన్న ప్రధాన నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని స్పష్టం చేశారు. భారీ చోరీ కేసును వారం రోజుల్లో చేదించిన పోలీసులను పలువురు అభినందిస్తున్నారు. ఉత్తర భారత్ చెందిన వారే ఇటీవల కరీంనగర్లో జువెల్లరీ షాపులో తాజాగా బంధువుల ఇంట్లోనే చోరీకి పాల్పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.2
- ఆర్ఎంపి లు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలి. ఆర్ఎంపీలు నిబంధనలు అతిక్రమించి వైద్యం చేస్తే చట్టరీత్య కఠిన చర్యలు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్. మహబూబాబాద్ జిల్లా జూలై 29... ఆర్ఎంపీలు నిబంధనలు అతిక్రమించి వైద్యం చెయ్యొద్దని.. ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ హెచ్చరించారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి రవి రాథోడ్ జిల్లాలోని మరిపెడ మండలంలో గల కంపాటి రవి బాబు ఆర్ఎంపి ప్రజత క్లినిక్ ను సీజ్ చేశారు. ఈ సందర్భంగా వైద్యాధికారి క్లినిక్ వారితో ప్రథమ చికిత్స మాత్రమే చేయవలెనని స్థాయికి మించిన (ఇంజక్షన్లు, సెలైన్లు) వైద్యం చేసిన యెడల చట్టరీత్య చర్య తీసుకుంటామని జిల్లాలోని ప్రథమ చికిత్స చేసే ఆర్ఎంపి వైద్యులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైద్య బృందం మనోహర్, కృష్ణ పాల్గొన్నారు.1
- ఇల్లందు.. కొత్తగూడెం ఓపెన్ కాస్ట్ లో వర్షం కారణంగా 3వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు..వర్షం కారణంగా బొగ్గు ఉత్పత్తికి అంతరాయం యాంకర్ వాయిస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎడతెరిపి లేకుండా రాత్రి నుండి కురుస్తున్న వర్షానికి ఇల్లందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా 3 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం వాటిల్లింది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఓబి పనులు ప్రారంభం కాలేదు. ఈ వర్షాకాలంలో ఇప్పుడిప్పుడే కురుస్తున్న వర్షాలతో అధికారులు బొగు రవాణాకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.1
- భారీ వర్షం కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : రామగుండం నగర మేయర్ మహాకాళి స్వామి భారీ వర్షాల కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఏ సమస్య ఉన్న సమాచారం అందించాలని రామగుండం నగరం మహాకాళి స్వామి తెలిపారు . బుధవారం రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కురుస్తున్న ఎడతెరిపిని వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం ఉన్నా నగరపాలక సంస్థ కార్యాలయానికి లేదా తనకు, కమిషనర్ కు ఫోన్ ద్వారా సమాచారం అందించాలని, అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రజల భద్రతే మా లక్ష్యం.. అని ప్రజా సమస్యలు ఏమున్నా పరిష్కారం చేస్తామన్నారు. వర్షం కారణంగా ఎవరు ఇబ్బంది పడద్దని సూచించారు.1
- వాజేడు బొగత జలపాతం సందర్శన బంద్! పర్యాటకులు రావొద్దు..! భారీ వర్షాల కారణంగా వాజేడు మండలం బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి నరేందర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో జలపాతంలో నీరు ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సందర్శన నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటకులు ఎవరు బొగత సందర్శనకు రావద్దని సూచించారు.1
- వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగి తెలంగాణ-ఛత్తీస్ గఢ్ రాకపోకలు బంద్! వాజేడు మండలం చీకుపల్లి వద్ద ఇసుక వాగు భారీగా ఉప్పొంగడంతో తాత్కాలిక డైవర్షన్ రోడ్డు తెగిపోయింది. దీంతో తెలంగాణ-చత్తీస్ గఢ్ పాటు సుమారు 25 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నేటి ఉదయం వాగు ఉద్ధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వరద రోడ్డుపైకి చేయడంతో ఒకసారిగా రోడ్డు తెగిపోయింది.1