Shuru
Apke Nagar Ki App…
వాజేడు బొగత జలపాతం సందర్శన బంద్! పర్యాటకులు రావొద్దు..! భారీ వర్షాల కారణంగా వాజేడు మండలం బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి నరేందర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో జలపాతంలో నీరు ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సందర్శన నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటకులు ఎవరు బొగత సందర్శనకు రావద్దని సూచించారు.
Swathi
వాజేడు బొగత జలపాతం సందర్శన బంద్! పర్యాటకులు రావొద్దు..! భారీ వర్షాల కారణంగా వాజేడు మండలం బొగత జలపాతం సందర్శన తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అటవీశాఖ రేంజ్ అధికారి నరేందర్ తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వరద వస్తుండటంతో జలపాతంలో నీరు ప్రమాదకర స్థాయికి చేరిందన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సందర్శన నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పర్యాటకులు ఎవరు బొగత సందర్శనకు రావద్దని సూచించారు.
More news from తెలంగాణ and nearby areas
- గురుపౌర్ణమి వేళ సాయినామస్మరణ.. కిటకిటలాడిన సాయిబాబ ఆలయాలు వరంగల్ నగరంలో గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీ దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పోర్టురోడ్డు శివనగర్‌లోని శ్రీ గణేష్ సాయిబాబా మందిరం, ములుగు రోడ్డులోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం, భద్రకాళి, దేశాయిపేట లక్ష్మీ టౌన్‌షిప్‌లోని శిరిడి సాయిబాబా దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయిబాబాకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.1
- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద...సగం నిండిన ప్రాజెక్ట్... ఎల్ఎండి, మిడ్ మానేర్ కు స్వల్పంగా కొనసాగుతున్న వరద అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జగిత్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 66 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం పది టిఎంసీలకు నీరు చేరింది. వరద ఇలానే కొనసాగితే రేపటి వరకు 14 టీఎంసీలు వరకు చేరే అవకాశం ఉంది. ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక కాలేశ్వరం ప్రాజెక్టులోని నంది మేడారంలోని పంపులను ఆన్ చేసి మిడ్ మానేర్ కు నీటిని ఎత్తిపోసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మినహా ఏ ప్రాజెక్టుకు ఆశించని స్థాయిలో వరద వచ్చిన దాఖలాలు లేవు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాంకు స్వల్పంగా 206 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.4 టీఎంసీల నీరు నిలువ ఉంది. అదే విధంగా మిడ్ మానేర్ డ్యామ్ కు 2334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. 27.55 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 7.5 టీఎంసీలను నీరు నిల్వ ఉంది. జగిత్యాల పెద్దపెల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షంతో పలు జలాశయాలకు జలకల సంతరించుకోగా కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని జలాశయాలు వెలవెల బోతున్నాయి.1
- ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందులో వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు: సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదానం ఇల్లందు పట్టణంలోని జగదాంబ సెంటర్ నందు వేంచేసియున్న శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయంలో గురుపౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి కాకడ హారతి, క్షీరాభిషేకం, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, మరియు ప్రత్యేక అలంకరణలు చేపట్టారు. అనంతరం భక్తుల దర్శనార్థం ఆలయ తలుపులు తెరిచారు. గురుపౌర్ణమి సందర్భంగా జగదాంబ సెంటర్ ప్రాంతం "ఓం సాయి రామ్" నామస్మరణతో మారుమోగింది. స్వామివారిని దర్శించుకుని, తారక మంత్రాన్ని జపించేందుకు ఇల్లందు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణంలో సాయిబాబా ప్రత్యేక పూజలు, తీర్థప్రసాద వితరణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో విచ్చేసిన భక్తులందరికీ భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాదిమంది భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు, ఆధ్యాత్మిక వేత్తలు మరియు పెద్ద సంఖ్యలో భక్తజనం పాల్గొన్నారు2
- బిజెపి ఓటర్ సవరణ సర్ ప్రత్యేక కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకురాలు సోమరపు లావణ్య డివిజన్లో ఓటర్ సవరణ సర్ ప్రత్యేక కార్యక్రమంలో బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా అన్ని డివిజన్లో సర్ ప్రక్రియ పై పరిశీలించారు బిజెపి రాష్ట్ర నాయకురాలు సోమరపు లావణ్య..1
- *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు. నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు. నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను. ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.1
- మంత్రి సీతక్క చొరవతో రామప్ప ఆయకట్టు రైతులకు సాగునీరు విడుదల..! వెంకటాపూర్ (మం) పాలంపేటలోని రామప్ప ఆయకట్టు కింద ఉన్న రైతుల సాగునీటి అవసరాల దృష్ట్యా మంత్రి సీతక్క ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, వెంకటాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బండి శ్రీనివాస్ తదితర నాయకులు అధికారులతో కలిసి తూము ద్వారా నీటిని విడుదల చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.1
- గురుపౌర్ణమి వేళ శ్రీ దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పంచామృతాభిషేకం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులు విశేషంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.1
- నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలం పంకెనకు చెందిన వైష్ణవి గడ్డి మందు తాగి.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని తెలిపిన తండ్రి రాజయ్య.1