Shuru
Apke Nagar Ki App…
గురుపౌర్ణమి వేళ శ్రీ దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పంచామృతాభిషేకం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులు విశేషంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
M D Azizuddin
గురుపౌర్ణమి వేళ శ్రీ దత్తాత్రేయ స్వామికి విశేష పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించిన పంచామృతాభిషేకం.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థాన అనుబంధ శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గురుపౌర్ణమిని పురస్కరించుకుని శ్రీ దత్తాత్రేయ స్వామివారిని సర్వాంగ సుందరంగా అలంకరించారు. అనంతరం స్వామివారికి పంచామృతాభిషేకం, ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించి భక్తులు విశేషంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.
More news from తెలంగాణ and nearby areas
- యశోద ఆస్పత్రిలో పెద్ది సుదర్శన్ రెడ్డిని పరామర్శించిన కల్వకుంట్ల కవిత సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఆయనకు అందుతున్న వైద్యం, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పెద్ది సుదర్శన్ రెడ్డి సతీమణి, ఇతర కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ వారికి భరోసా కల్పించారు.1
- పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించిన - రాణా ప్రతాప్ రెడ్డి నర్సంపేట నియోజకవర్గం, తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న నర్సంపేట మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ని ఈరోజు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి లో పరామర్శించి, వారి యోగ క్షేమాల గురించి తెలుసుకొని , వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,వారిని మనో దైర్యంతో ఉండాలని కోరిన భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి2
- కోర్టులను గౌరవిస్తూ హైదరాబాద్‌ను కాపాడే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు : సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో రాజకీయ హంగామా కబ్జాదారులను కాపాడలేనని కోర్టులను గౌరవిస్తూ, హైదరాబాద్‌ను కాపాడే విధంగా కొనసాగే హైడ్రా పోరాటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.1
- ఇక అబద్ధం చెప్పను అందుకే రాజీనామా చేశాను: ఢిల్లీ DCP సుమిత్ జా *ఢిల్లీ DCP సుమిత్ జా మాట్లాడుతూ: ఇక అబద్ధం చెప్పలేను, అందుకే రాజీనామా ఇచ్చేశాను* ప్రభుత్వం నేను ప్రెస్ ముందుకు వచ్చి, వీధుల్లో తమ హక్కుల కోసం అడుగుతున్న విద్యార్థుల గురించి పచ్చి అబద్ధాలు చెప్పాలని వత్తిడి చేస్తుంది వాళ్ళను నేరస్థులుగా రుజువు చేయమని నాకు చెప్పారు. నిజం చెప్పకుండా నన్ను ఆపీ , అమాయక విద్యార్థులను ఇరికించమని బలవంతం చేసే ఏ వ్యవస్థలోనూ నేను భాగం కాలేను. ఈ విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. వీరు మన దేశ భవిష్యత్తు. నేను పోలీస్ ఉద్యోగం ఎంచుకుంది నిజానికి తోడుగా నిలవడానికి. అబద్ధాలు అమ్మడానికి కాదు. ప్రభుత్వం చేస్తున్న ఈ పనికి నేను భాగస్వామిని కాలేను. ఈ రోజు నుండి నేను ప్రభుత్వంతో కాదు, ఈ విద్యార్థులతో ఉన్నాను.1
- ఎల్లంపల్లి ప్రాజెక్టుకు పోటెత్తిన వరద...సగం నిండిన ప్రాజెక్ట్... ఎల్ఎండి, మిడ్ మానేర్ కు స్వల్పంగా కొనసాగుతున్న వరద అల్పపీడన ప్రభావంతో కురిసిన భారీ వర్షంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా జగిత్యాల జిల్లాలో కురిసిన భారీ వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 66 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిలువ సామర్థ్యం 20.175 టీఎంసీలు కాగా ప్రస్తుతం పది టిఎంసీలకు నీరు చేరింది. వరద ఇలానే కొనసాగితే రేపటి వరకు 14 టీఎంసీలు వరకు చేరే అవకాశం ఉంది. ఎల్లంపల్లికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఇక కాలేశ్వరం ప్రాజెక్టులోని నంది మేడారంలోని పంపులను ఆన్ చేసి మిడ్ మానేర్ కు నీటిని ఎత్తిపోసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. రాత్రి నుండి కురుస్తున్న వర్షంతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు మినహా ఏ ప్రాజెక్టుకు ఆశించని స్థాయిలో వరద వచ్చిన దాఖలాలు లేవు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేర్ డ్యాంకు స్వల్పంగా 206 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. ఎల్ఎండి పూర్తిస్థాయి నీటి నిలువ సామర్థ్యం 24 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.4 టీఎంసీల నీరు నిలువ ఉంది. అదే విధంగా మిడ్ మానేర్ డ్యామ్ కు 2334 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. 27.55 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం గల మిడ్ మానేర్ లో ప్రస్తుతం 7.5 టీఎంసీలను నీరు నిల్వ ఉంది. జగిత్యాల పెద్దపెల్లి జిల్లాలో కురిసిన భారీ వర్షంతో పలు జలాశయాలకు జలకల సంతరించుకోగా కరీంనగర్ సిరిసిల్ల జిల్లాలోని జలాశయాలు వెలవెల బోతున్నాయి.1
- గురుపౌర్ణమి వేళ సాయినామస్మరణ.. కిటకిటలాడిన సాయిబాబ ఆలయాలు వరంగల్ నగరంలో గురుపౌర్ణమి సందర్భంగా బుధవారం శ్రీ దత్తాత్రేయ, సాయిబాబా ఆలయాలు భక్తులతో కిక్కిరిశాయి. పోర్టురోడ్డు శివనగర్‌లోని శ్రీ గణేష్ సాయిబాబా మందిరం, ములుగు రోడ్డులోని శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం, భద్రకాళి, దేశాయిపేట లక్ష్మీ టౌన్‌షిప్‌లోని శిరిడి సాయిబాబా దేవాలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. సాయిబాబాకు పంచామృతాభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గురుపౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది.1
- నీట్ పరీక్షలో ర్యాంకు రాలేదని మనస్తాపానికి గురై విద్యార్థిని ఆత్మహత్య భూపాలపల్లి జిల్లాలో పలిమెల మండలం పంకెనకు చెందిన వైష్ణవి గడ్డి మందు తాగి.. నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి.నీట్ పరీక్షలో తక్కువ మార్కులు రావడం, ర్యాంకు రాకపోవడంతో మనస్తాపానికి గురై సూసైడ్ చేసుకుందని తెలిపిన తండ్రి రాజయ్య.1