*ప్రజా ప్రెస్ క్లబ్, ఏపీడబ్ల్యూజేఎఫ్, ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు* _ప్రజా ప్లస్ క్లబ్ ఆధ్వర్యంలో మజ్జిగ,పులిహోర,పండ్ల పంపిణీతో సేవా కార్యక్రమం_ *ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 14, (గళమ్ న్యూస్ )* డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ప్రజా ప్రెస్ క్లబ్ మరియు ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్‌లో ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు,ఇబ్రహీంపట్నం సీఐ ఏ.సుబ్రహ్మణ్యం,ఆర్‌ఐ కృష్ణ హాజరై అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.సభలో సీఐ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించేందుకు రాజ్యాంగాన్ని రూపొందించారని పేర్కొన్నారు.రాజ్యాంగం వల్లే దేశంలో సమానత్వం సాధ్యమైందని తెలిపారు.ఆర్‌ఐ కృష్ణ మాట్లాడుతూ నిమ్న వర్గాల ప్రజలు రాజ్యాంగం ద్వారా ఉద్యోగాలు,రాజకీయ అవకాశాలు పొందుతున్నారని వివరించారు.ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వాలు రాజ్యాంగానికి అనుగుణంగా పేదలకు హక్కులు కల్పించాలని కోరారు.అనంతరం జయంతి సందర్భంగా నిర్వహించిన సేవా కార్యక్రమాల్లో భాగంగా బాటసారులకు మజ్జిగ,పులిహోర పంపిణీ చేశారు.అలాగే ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు,ఫెర్రీ ప్రాంతంలో నివసిస్తున్న సంచార జాతులకు పండ్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రెస్ క్లబ్ గౌరవ అధ్యక్షుడు ఏ.బాబు,అధ్యక్షుడు అడపా శివ,ప్రధాన కార్యదర్శి రవీంద్ర,కోశాధికారి ఎం.రాఘవులు,ఉపాధ్యక్షుడు టంగుటూరు శ్రీనివాస్,వేముల నాగరాజు, పల్లె నరేష్,దాసి ప్రతాప్,దిలీప్,సభ్యులు బడిపాటి వంశీ శ్రీ రామ్,ఎం.రమేష్,సుశీల్,మనోహర్ తదితరులు పాల్గొన్నారు.మరియు ఏపీడబ్ల్యూజేఎఫ్ మైలవరం నియోజకవర్గ అధ్యక్షుడు షైక్ సల్మాన్,సభ్యులు సిహెచ్ కిషోర్,పేటీటి రమేష్,వెంకట్,కామరాజు,ఎం.ఎస్.పీ రాష్ట్ర నాయకులు కోట దానియేలు,జిల్లా నాయకుడు ఎం.విజయ్,14వ డివిజన్ కౌన్సిలర్ నల్లమోతు లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు, ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గండి కొట్టిన వ్యక్తులపై తగు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే వ్యక్తులను సహించరాదని ప్రయాణికులు హెచ్చరించారు.1
- Post by Veesachandu1
- గుంటూరు లో ఘనంగా అంబేత్కర్ జయంతి గుంటూరు:అంబేద్కర్ జయంతి సందర్భంగా మూవ్ మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ ముస్తఫా గుంటూరు లో దళిత నాయకులతో కోరిట పాడు లోని అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. 'అంటరానితనంతో కులవివక్షకు గురై కూడా ఉన్నత విద్యను అభ్యసించి దేశం గర్వించే అత్యున్నత స్థాయికి ఎదిగిన అంబేద్కర్ ఆదర్శప్రాయులు అని, ప్రపంచంలో బలమైన ప్రజాస్వామ్య దేశంగా మన దేశం నిలుస్తోంది అంటే దానికి కారణం ఆయన మనకు ఇచ్చిన రాజ్యాంగం. సమాన అవకాశాలు, హక్కులు అందించి, ప్రతి పౌరుడికి రాజ్యాంగ రక్షణ కల్పించారు' అని నాయకులు కొనియాడారు.రాజ్యాంగానికి తూట్లు పోవటానికి కొందరు ప్రయత్నిస్తున్న వేళ ఆయన స్ఫూర్తితో పోరాడటానికి అంబేద్కర్ వాదులు ముందుకు రావాలని వారు పిలుపునిచ్చారు.1
- Post by Ramprasad islavath1
- Post by V Ramarao1
- Post by Paramesh Ratnagiri1
- నరసాపురం: పతాక శీర్షిక న్యూస్ *నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపర్చేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు.* పట్టణంలో నెలకొన్న చెత్త నిర్వహణ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు ప్రారంభించామని, త్వరలోనే స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని ఆమె పేర్కొన్నారు. మంగళవారం నరసాపురం రుస్తుంబాద శివారు మండవారి గరువు ప్రాంతంలో ప్రభుత్వ భూములను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి స్వయంగా పరిశీలించారు. ఈ పర్యటనలో రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి స్థలాల పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ స్థలాలను గుర్తించేందుకు అధికారులు వివరాలను సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ పట్టణ పారిశుద్ధ్య సమస్యలను సమర్థవంతంగా పరిష్కరించేందుకు సమన్వయంతో పని చేయాలని అధికారులను ఆదేశించారు. డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు అనుకూలమైన స్థలాన్ని గుర్తించి, నిర్దేశిత విధానాల ప్రకారం పనులు వేగవంతం చేయాలని సూచించారు. మండవారి గరువులో డంపింగ్ యార్డ్ కోసం ఏర్పాటు చేసిన రహదారిని కూడా పరిశీలించారు. అనంతరం పట్టణంలోని టైలర్ హై స్కూల్ మరియు వలందర రేవు సమీప ప్రాంతాల్లో వీధుల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. ఇంటి చెత్తను రోడ్లపై పడేయడం వల్ల సమస్య మరింత తీవ్రమవుతోందని అధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే వీధుల్లోని చెత్తను తొలగించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి రోజూ డోర్ టు డోర్ చెత్త సేకరణను కచ్చితంగా అమలు చేయాలని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. అలాగే ఏటిగట్టు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని కూడా పరిశీలించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, నరసాపురం పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడం ప్రభుత్వ ప్రాధాన్యతగా ఉందని తెలిపారు. డంపింగ్ యార్డ్ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం తగిన స్థలాల పరిశీలన పూర్తవుతోందని, త్వరలోనే తుది నిర్ణయం తీసుకుని అమలు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ దాసిరాజు, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, తహసీల్దార్ ఐతం సత్యనారాయణ, టిపిఓ వెంకటరమణ, మండల సర్వే అధికారి ధనరాజు, మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.1
- అమరావతి (M) దిడుగు-ఏటూరు వెళ్లే పడవ ప్రయాణికులకు దారి కష్టాలు మొదలయ్యాయి. లంక భూముల్లోని ప్రభుత్వ దారికి గుర్తు తెలియని వ్యక్తులు అడ్డంగా గండి కొట్టడంతో రాకపోకలు స్తంభించాయి. ఏప్రిల్ 8న జిల్లా పరిషత్ ఆధ్వర్యంలో పడవ పాటలు నిర్వహించినప్పటికీ, ప్రయాణికుల సౌకర్యాలను మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి దారిని పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.1