Shuru
Apke Nagar Ki App…
ycp ra puka
Rocky
ycp ra puka
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని ప్రిసిపుల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ కు గురువారం సాయంత్రం బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో పోలీసులు హుటాహుటిన కోర్టు ప్రాంగణం కి చేరుకుని అక్కడివారిని కాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్ సాయంతో కోర్టులో బాంబుని కనిపెట్టే పనిలో పడ్డారు.1
- గుంటూరు/ గుంటూరు కలెక్టరేట్ గుంటూరు కలెక్టరేట్ బంగ్లా ప్రధాన రహదారికి ఎట్టకేలకు మహర్దశ పట్టింది. ఐటీసీ మెడికల్ క్లబ్ సమీపంలో గురువారం తారు రోడ్డు మరమ్మతు పనులు ముమ్మరంగా ప్రారంభమయ్యాయి. గతంలో గుంతల వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డ వాహనదారులు, ఈ పనులపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై వర్షపు నీరు నిలవకుండా డ్రైనేజీ సౌకర్యం కూడా సరిగ్గా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.1
- ఆదానీ స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించడాన్ని తిరస్కరించండి - సిపిఎం ---------------------------------------------------------------- గతంలో వైసిపి ప్రభుత్వం ఆదాని స్మార్ట్ మీటర్లు ఒప్పందాన్ని వ్యతిరేకించండి ఆ స్మార్ట్ మీటర్లు పగలగొట్టండని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన కూటమి ప్రభుత్వం అవే ఆదాని స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు పి. శంకర్రావు అన్నారు. కరెంటు చార్జీలు భారీగా పెరిగే ఈ స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలి అని పిలుపునిచ్చారు. షాపులకి బిగించిన స్మార్ట్ మీటర్లు డబ్బులు పెట్టి రీఛార్జ్ చేసుకుంటే ఎప్పుడు ఆగిపోతాయో తెలియదు, యూనిట్ కి ఎంత రేటు పడుతుందో తెలియదు. ఈ స్మార్ట్ మీటరు ప్రజలకు ఎటువంటి సమాచారం చూపించదు వాడిన కరెంటుకు విపరీతంగా చార్జీలు పెంచి ప్రజలపై మోయలేనిభారం పడుతుందని అన్నారు. షాపులకు బిగించిన స్మార్ట్ మీటర్ల వలన షాపుల యాజమాన్యాలు గగ్గోలు పెడుతున్నారు ఒక్కో స్మార్ట్ మీటరు 10250/- ఆదానికి ప్రజలు కట్టాల్సి ఉంటుంది. ప్రజలకు తీవ్రంగా నష్టం చేసే విద్యుత్తు ప్రైవేటీకరణ ఆదానితో చేసుకున్న ఒప్పందాన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదాని స్మార్ట్ మీటరు బిగించడానికి వస్తున్నారు ప్రజలు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు బలవంతంగా బిగించడానికి ప్రయత్నం చేస్తే సిపిఎం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ ప్రెస్ మీట్ లో సిపిఎం పార్టీ మండల కన్వీనర్ సింగిరెడ్డి గోపాలు పెన్షనర్స్ సంఘం నాయకులు వి. శేషగిరి పాల్గొన్నారు.2
- విశాఖపట్నం గాజువాకలోని ఓం జ్యువలరీ షాపులో జరిగిన ఈ దొంగతనం ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. గాజువాక బి.సి. రోడ్డులోని ఓం జ్యువలరీ షాపులోకి ముగ్గురు మహిళలు కస్టమర్లలా వేషధారణలో వచ్చారు. నగలు చూపిస్తుండగా, షాపు యజమాని కళ్లు గప్పి అత్యంత చాకచక్యంగా బంగారు వస్తువులను తమ జడల్లో (కొప్పులో) దాచుకోవడానికి ప్రయత్నించారు. మహిళల ప్రవర్తనపై అనుమానం వచ్చిన షాపు యజమాని, సిబ్బంది వారిని నిశితంగా గమనించారు. వారు బంగారాన్ని జడలో పెట్టుకోవడం గమనించిన యజమాని వెంటనే అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. నిందితులను సోదా చేయగా దొంగిలించిన బంగారం బయటపడింది. పోలీసుల విచారణలో పట్టుబడిన మహిళలను ఈ క్రింది విధంగా గుర్తించారు: 1.-భోజ నాగమణి 2.-బోజగాని జ్ఞానమ్మ 3.-పొన్నా పద్మ సమాచారం అందుకున్న గాజువాక క్రైమ్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించే ప్రక్రియలో ఉన్నారు వీరు పాత నేరస్తులా? లేక ఇతర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దొంగతనాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. షాపుల్లో సీసీటీవీ కెమెరాలు ఉండటం, యజమాని అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల ఈ భారీ దొంగతనం విఫలమైంది. గాజువాక పరిసరాల్లోని వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.1
- *బాగున్నరా.. అమ్మ.. బాగున్నాము.. బాపు* కాంగ్రెస్ మహిళా మంత్రులకు కేసీఆర్ ఆత్మీయ పలకరింపు ఇంటికి వచ్చిన ఆడ బిడ్డలకు అతిధి మర్యాదలతో, పసుపు కుంకుమలు చీర, తాంబూలాలతో సంప్రదాయ సత్కారం గురువారం ఎర్రవెల్లి నివాసంలో ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్‌ను కలిసిన మంత్రులు కొండా సురేఖ, దనసరి సీతక్క మరికొద్ది రోజుల్లో, మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ప్రారంభం కానున్న సందర్భంగా, జాతరను సందర్శించాల్సిందిగా కోరుతూ కేసీఆర్ గారిని ప్రభుత్వం తరఫున వారు ఆహ్వానించారు..1
- మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ బార్ & రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు చెలరేగడంతో ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని అగ్నిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో భారీ ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం.1
- 🙏🙏1
- గుంటూరు/చుట్టుగుంట గుంటూరులోని చుట్టుగుంట VIP రోడ్డు గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకం చూపిస్తోంది. కేవలం 500 మీటర్లు మాత్రమే రోడ్డు వేసి అధికారులు వదిలేయడంతో, మిగిలిన భాగం అస్తవ్యస్తంగా తయారైందని వాహనదారులు మండిపడుతున్నారు. ఈ అసంపూర్తి పనుల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అధికారులు తక్షణమే స్పందించి రహదారిని బాగు చేయాలని స్థానికులు కోరుతున్నారు1
- 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం స్థల పరిశీలన..... వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రి ఏర్పాటు కోసం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, మాజీ టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి స్థల పరిశీలన చేశారు. వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో టౌన్ సమీపంలో ఆస్పత్రికి అవసరమైన స్థలాన్ని పరిశీలించి సేకరించినట్లు తెలిపారు.1