Shuru
Apke Nagar Ki App…
నిచందనబ్రథర్స్ షాపింగ్ మాల్లో దసరాడబుల్ దమాకాసెల్ నుప్రారంబించినసినినటి పాయల్ రాజ్ పూత్ మెదక్ పట్టణంలోని నిచందనబ్రథర్స్ షాపింగ్ మాల్లో దసరాడబుల్దమాకాసెల్ ను సినినటిపాయల్ రాజ్ పూత్ ప్రారంబించారు. 49రూపాయలు మొదలుకొనిరెండులక్షలరూపాయలు విలువగలవస్రాలు లబిస్తాయని బట్టలు కొనేందుకు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు ఇక్కడే అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయని యాజమాన్యం పేర్కొన్నారు ఈ అవకాశాన్ని దసరా దీపావళి క్రిస్మస్ నూతన సంవత్సరం పెళ్లిళ్లకు వినియోగించుకునే అవకాశం ఉందని వినియోగదారులు సద్వినియోగం చేసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో జికే మీడియా ప్రతినిధి గోపీనాథ్ యాజమాన్యం సురేష్ చంద్రబాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
మెదక్ న్యూస్
నిచందనబ్రథర్స్ షాపింగ్ మాల్లో దసరాడబుల్ దమాకాసెల్ నుప్రారంబించినసినినటి పాయల్ రాజ్ పూత్ మెదక్ పట్టణంలోని నిచందనబ్రథర్స్ షాపింగ్ మాల్లో దసరాడబుల్దమాకాసెల్ ను సినినటిపాయల్ రాజ్ పూత్ ప్రారంబించారు. 49రూపాయలు మొదలుకొనిరెండులక్షలరూపాయలు విలువగలవస్రాలు లబిస్తాయని బట్టలు కొనేందుకు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు ఇక్కడే అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయని యాజమాన్యం పేర్కొన్నారు ఈ అవకాశాన్ని దసరా దీపావళి క్రిస్మస్ నూతన సంవత్సరం పెళ్లిళ్లకు వినియోగించుకునే అవకాశం ఉందని వినియోగదారులు సద్వినియోగం చేసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో జికే మీడియా ప్రతినిధి గోపీనాథ్ యాజమాన్యం సురేష్ చంద్రబాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
More news from Telangana and nearby areas
- పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే కలెక్టర్ ప్రతిమాసింగ్ పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా భూ సర్వే కలెక్టర్ ప్రతిమాసింగ్ భూ రీసర్వే ప్రక్రియలు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పగడ్బందీగా పూర్తిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అధికారులను ఆదేశించారు. హవేలీ ఘనపూర్ మండలం శాలిపేట్ గ్రామంలో భూభారతి భూముల రి సర్వే ను ఏడి సర్వే కిషన్ , తాసిల్దార్ సింధు రేణుక తో కలిసి క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు గ్రామ పరిధిలో మొత్తం .534 ఎకరాల రెండు కుంటల భూమి ఉండగా ఇప్పటివరకు సుమారు ..278 ఎకరాల 27 కుంటల మేర సరిహద్దుల నిర్ధారణ సర్వే పూర్తి చేసినట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ప్రభుత్వ భూమి 341 ఎకరం 5 కుంటలు ఇనామ్ ల్యాండ్ 17 కుంటలు ,అసైన్డ్ ల్యాండ్ 240 ఎకరా లు12 కుంటలు శిఖం ల్యాండ్61 ఎకరాలకు సంబంధించి ఇంతవరకు సర్వే కంప్లీట్ చేయడం జరిగింది మిగిలిన సర్వే ప్రక్రియ రైతు వారి ఆధీనంలో ఉన్న భూములను సర్వే నిర్వహిస్తున్నామని దీనిలో హెచ్చుతగ్గులు ఏమైనా ఉంటే నోటీసులు ఇవ్వడం జరుగుతుందని అభ్యంతరాలు ఉంటే వెంటనే తెలపాలని పునః పరిశీలన పగడ్బందీ మ్యాపులతో డిజిటల్ సర్వే పూర్తవుతున్నారు ఒకరి భూమి మరొకరికి పోయే ఆస్కారం ఉండదని వివరించారు ఆధునిక సాంకేతికతను వినియోగించి, పాత రికార్డులతో సరిపోల్చుతూ భూముల వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు. సరిహద్దుల విషయంలో రైతుల సందేహాలను అక్కడికక్కడే నివృత్తి చేయాలని సూచించారు. రీ-సర్వే తర్వాత రికార్డులు మరింత స్పష్టంగా ఉండి, భవిష్యత్తులో యాజమాన్య సమస్యలు తలెత్తకుండా రెవెన్యూ, సర్వే అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత రెవెన్యూ అధికారులు సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు1
- ఇచ్చిన మాట నిలబెట్టుకోలే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త ప్రభాకర్ రెడ్డి వెల్లడి, ఇక రాదు ప్రజల ఆవేదన దుబ్బాక రైతులకు 18 గంటల కరెంట్ ఇవ్వాల్సిందే ! దుబ్బాక రైతన్నల సాగు అవసరాలను దృష్టిలో పెట్టుకుని రోజుకు 18 గంటల నాణ్యమైన విద్యుత్ అందించాలనే డిమాండ్‌ను ప్రభుత్వం తక్షణమే పరిశీలించాలి. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది! పంటలు పండాలంటే నిరంతర విద్యుత్ అవసరం! రైతన్నల గొంతుకను ప్రభుత్వం వినాలి ! మా డిమాండ్ ఒక్కటే — దుబ్బాక రైతులకు 18 గంటల విద్యుత్ అందించాలి! రైతుల ప్రయోజనాల కోసం ఈ డిమాండ్‌కు ప్రతి ఒక్కరూ మద్దతు తెలపండి.1
- బిక్కనూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు బిక్కనూరు మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో శుక్రవారం బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పలు రకాల పువ్వులతో మహిళ ఉపాధ్యాయులు బతుకమ్మలను తయారు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో బతుకమ్మలను ఉంచి ఆటపాటలతో హంగామా చేశారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భవాని మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలకు బతుకమ్మ పండగ ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ప్రతి ఏడాది బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.1
- విద్యుత్ కోతలపై ప్రజాగ్రహం.. రామారెడ్డిలో రాత్రి రాస్తారోకో పక్క గ్రామాల్లో సరఫరా ఉన్నా.. పట్టణంలో నిత్యం కోతలేంటని నిలదీత రామారెడ్డి: కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో తరచూ విద్యుత్ కోతలు విధించడంపై ఆగ్రహించిన గ్రామస్తులు శుక్రవారం రాత్రి రోడ్డెక్కారు. విద్యుత్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో రాస్తారోకో చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. చుట్టుపక్కల గ్రామాల్లో విద్యుత్ సరఫరా కొనసాగుతున్నప్పటికీ, రామారెడ్డి పట్టణంలో మాత్రం తరచూ విద్యుత్ కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రజలు ప్రశ్నించారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరసనతో రాత్రి వేళ కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విద్యుత్ అధికారులు అక్కడికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేసినట్లు తెలిసింది.1
- వ్యవసాయానికి త్రీఫేజ్ విద్యుత్ సక్రమంగా సరఫరా చేయాలి పిట్లంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా వ్యవసాయ రంగానికి త్రీఫేజ్ విద్యుత్‌ను సక్రమంగా సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హాజరయ్యారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ధర్నాతో రహదారిపై వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.అనంతరం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే మాట్లాడుతూ వ్యవసాయ రంగానికి త్రీఫేస్ కరెంట్ సరఫరా చేయక పంటలు ఎండిపోతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకంగా పరిపాలన చేస్తుందన్నారు. గత బిఆర్ ఎస్ ప్రభుత్వంలో రైతుల సంక్షేమానికి కృషి చేసిందన్నారు. వ్యవసాయ రంగానికి త్రీఫేస్ కరెంట్ ను సక్రమంగా సరఫరా చేసిందని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వ్యవసాయ రంగానికి త్రీఫేస్ కరెంట్ ను సక్రమంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు అన్నారం వెంకట్ రాంరెడ్డి, మాజీ జడ్పిటిసి ప్రతాప్ రెడ్డి, మాజీ ఎంపీపీ రజనీకాంత్ రెడ్డి, నాయకులు హన్మండ్లు,లక్ష్మారెడ్డి, నర్సాగౌడ్,సాయిరెడ్డి, రైతులు తదితరులు పాల్గొన్నారు.1
- విద్యుత్ అంతరాయాలతో ఎండుతున్న పంటలు.. రైతుల రాస్తారోకో వ్యవసాయానికి సక్రమంగా విద్యుత్ సరఫరా కాకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవంచ, రామచంద్రపురం, మాడాపూర్ గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలు ఏర్పడటంతో సాగు పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు నర్సాపూర్–సంగారెడ్డి ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. వ్యవసాయానికి నిరంతరాయంగా విద్యుత్ అందించాలని, పంటలు నష్టపోకుండా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేశారు.1
- ఆరు ఓట్లు తో బాణం విజయం. మచ్చ శ్రీనివాస్ కాంగ్రెస్ అభ్యర్థి దుబ్బాక డిపోలో బాణం విజయకేతనం ఆరు ఓట్ల ఆధిక్యంతో వర్కర్స్ యూనియన్ గెలుపు 32 మంది అమర కార్మికులకు విజయాన్ని అంకితం చేసిన మచ్చ శ్రీనివాస్ - డిపో అభివృద్ధికి కృషి చేస్తాం - అదనంగా పది బస్సులు.. శాశ్వత డిపో మేనేజర్ నియామకానికి కృషి - కార్మికుల సమస్యలకు అండగా ఉంటాం దుబ్బాక, అక్టోబరు 9: కార్మికుల ఐక్యతకు ఎన్నికల ఫలితం అద్దం పట్టింది. హోరాహోరీగా సాగిన పోరులో బాణం గుర్తు విజయాన్ని అందుకుంది. దుబ్బాక ఆర్టీసీ డిపోలో జరిగిన యూనియన్ ఎన్నికల్లో తెలంగాణ వర్కర్స్ యూనియన్ ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందింది. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం ప్రాణాలర్పించిన 32 మంది అమర కార్మికులకు అంకితం చేస్తున్నట్లు దుబ్బాక డిపో గౌరవాధ్యక్షుడు మచ్చ శ్రీనివాస్ ప్రకటించారు.శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు డిపోలో పోలింగ్ నిర్వహించారు. మొత్తం 126 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాణం గుర్తుకు 66 ఓట్లు రాగా, నిచ్చెన గుర్తుకు 60 ఓట్లు పోలయ్యాయి. దీంతో తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్‌పై తెలంగాణ వర్కర్స్ యూనియన్ విజయం సాధించింది. అమరుల త్యాగానికి అంకితం ఈ సందర్భంగా మచ్చ శ్రీనివాస్ మాట్లాడుతూ.. దుబ్బాక డిపో కార్మికులు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని తెలిపారు. అశ్వద్ధామ రెడ్డి నాయకత్వంపై విశ్వాసంతో కార్మికులు బాణం గుర్తుకు ఓటు వేసి యూనియన్‌ను గెలిపించడం సంతోషంగా ఉందన్నారు. ఈ విజయాన్ని ఆర్టీసీ కోసం పోరాడి అమరులైన 32 మంది కార్మికులకు అంకితం చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్మికుల హక్కుల పరిరక్షణతో పాటు వారి సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. డిపో అభివృద్ధికి ప్రత్యేక కృషి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో డిపో అభివృద్ధికి కృషి చేస్తామని మచ్చ శ్రీనివాస్ తెలిపారు. దుబ్బాక డిపోకు అదనంగా మరో పది బస్సులు తీసుకురావడంతో పాటు శాశ్వత డిపో మేనేజర్‌ను నియమించేలా ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు.కార్మికులకు ఏ సమస్య వచ్చినా అండగా నిలిచి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తూ డిపో అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక డిపో అధ్యక్షుడు దొడ్ల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్‌గౌడ్, కార్యదర్శి ఏ. మహేందర్‌రెడ్డి, కోశాధికారి యాదబాబు, ఆర్టీసీ కార్మికులు మంతూరి రమేష్, ఎండీ అజీముద్దీన్, బిక్షపతి, పెంటీ బాలకిషన్, తిరుపతి, ఆశయ్య, పెద్ద ముత్యం, రవి, శ్రీనివాస్, గోపాల్‌రెడ్డి, సిద్ధిరాంరెడ్డి, తిరుపతిరెడ్డి, రాజిరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.1
- నిచందనబ్రథర్స్ షాపింగ్ మాల్లో దసరాడబుల్ దమాకాసెల్ నుప్రారంబించినసినినటి పాయల్ రాజ్ పూత్ మెదక్ పట్టణంలోని నిచందనబ్రథర్స్ షాపింగ్ మాల్లో దసరాడబుల్దమాకాసెల్ ను సినినటిపాయల్ రాజ్ పూత్ ప్రారంబించారు. 49రూపాయలు మొదలుకొనిరెండులక్షలరూపాయలు విలువగలవస్రాలు లబిస్తాయని బట్టలు కొనేందుకు హైదరాబాద్కు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు ఇక్కడే అన్ని రకాల నాణ్యమైన వస్త్రాలు లభిస్తాయని యాజమాన్యం పేర్కొన్నారు ఈ అవకాశాన్ని దసరా దీపావళి క్రిస్మస్ నూతన సంవత్సరం పెళ్లిళ్లకు వినియోగించుకునే అవకాశం ఉందని వినియోగదారులు సద్వినియోగం చేసుకొవాలన్నారు. ఈ కార్యక్రమంలో జికే మీడియా ప్రతినిధి గోపీనాథ్ యాజమాన్యం సురేష్ చంద్రబాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు1