logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

అయినవిల్లి లో మొదలైన కార్తీక శోభ... ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు అయినవిల్లి మండలం లో కార్తీక మాసం సందడి ప్రారంభమైంది. పలు దేవాలయాలలో మంగళవారం ఉదయం భక్తుల సందడితో కార్తీక శోభ సంతరించుకుంది. కె.జగన్నాధపురం శివారు లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఉన్న కాలువ లో పలువురు భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తమలపాకులతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అన్న ప్రసాద ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

6 hrs ago
user_Y.v.ramana
Y.v.ramana
అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
6 hrs ago

అయినవిల్లి లో మొదలైన కార్తీక శోభ... ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు అయినవిల్లి మండలం లో కార్తీక మాసం సందడి ప్రారంభమైంది. పలు దేవాలయాలలో మంగళవారం ఉదయం భక్తుల సందడితో కార్తీక శోభ సంతరించుకుంది. కె.జగన్నాధపురం శివారు లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఉన్న కాలువ లో పలువురు భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తమలపాకులతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అన్న ప్రసాద ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అయినవిల్లి లో మొదలైన కార్తీక శోభ... ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు అయినవిల్లి మండలం లో కార్తీక మాసం సందడి ప్రారంభమైంది. పలు దేవాలయాలలో మంగళవారం ఉదయం భక్తుల సందడితో కార్తీక శోభ సంతరించుకుంది. కె.జగన్నాధపురం శివారు లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఉన్న కాలువ లో పలువురు భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తమలపాకులతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అన్న ప్రసాద ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
    1
    అయినవిల్లి లో మొదలైన కార్తీక శోభ... ఆంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు
అయినవిల్లి మండలం లో కార్తీక మాసం సందడి ప్రారంభమైంది. పలు దేవాలయాలలో మంగళవారం ఉదయం భక్తుల సందడితో కార్తీక శోభ సంతరించుకుంది. కె.జగన్నాధపురం శివారు లో ఉన్న శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం వద్ద ఉన్న కాలువ లో పలువురు భక్తులు స్నానమాచరించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు తమలపాకులతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. అన్న ప్రసాద ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
    user_Y.v.ramana
    Y.v.ramana
    అమలాపురం, కోనసీమ, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • సిద్ధాంతం ఎంపీటీసీ రామలక్ష్మికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఘన సత్కారం పెనుగొండ మండలం, సిద్ధాంతం ఎంపీటీసీ-1 స్థానం నుంచి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆరుమిల్లి రామలక్ష్మిని సిద్ధాంతం హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు. సోమవారం సిద్ధాంతంలోని రామలక్ష్మి స్వగృహానికి వెళ్లిన సమితి సభ్యులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో సభ్యురాలిగా ఉన్న రామలక్ష్మి ఎంపీటీసీగా విజయం సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ ఆరుమిల్లి రామలక్ష్మి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన సిద్ధాంతం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆశీస్సులతో పాటు కూటమి నాయకుల సహకారంతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
    1
    సిద్ధాంతం ఎంపీటీసీ రామలక్ష్మికి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఘన సత్కారం
పెనుగొండ మండలం, సిద్ధాంతం ఎంపీటీసీ-1 స్థానం నుంచి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన ఆరుమిల్లి రామలక్ష్మిని సిద్ధాంతం హిందూ ధర్మ పరిరక్షణ సమితి సభ్యులు ఘనంగా సత్కరించారు.
సోమవారం సిద్ధాంతంలోని రామలక్ష్మి స్వగృహానికి వెళ్లిన సమితి సభ్యులు ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలియజేశారు. హిందూ ధర్మ పరిరక్షణ సమితిలో సభ్యురాలిగా ఉన్న రామలక్ష్మి ఎంపీటీసీగా విజయం సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెను శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా ఎంపీటీసీ ఆరుమిల్లి రామలక్ష్మి మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన సిద్ధాంతం గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆచంట ఎమ్మెల్యే, మాజీ మంత్రి పితాని సత్యనారాయణ ఆశీస్సులతో పాటు కూటమి నాయకుల సహకారంతో గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారానికి అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
    user_R. Sankaram
    R. Sankaram
    Local News Reporter పెనుగొండ, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • కాకినాడ: నత్తగుల్లలపై వివాదాన్ని అటవీ శాఖ పరిష్కరించేనా..? సముద్రంలో దొరికే నత్తగుల్లల కోసం మత్స్య కారులు ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. అయితే ఇది నిషేధమని కొత్తగా అటవీశాఖ చెబుతోంది. తాతలకాలం నుంచి లేని అభ్యంతరం ఇప్పుడు పెట్టడంపై మత్స్యకారులు వేట వదిలేసి ఆందోళనకు దిగారు. ఇది కోరింగ పరిధిలో మాత్రమే ఉందని మిగిలిన చోట ఆంక్షలు లేవని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అటవీశాఖకు ఇది తలనొప్పిగా మారింది.
    1
    కాకినాడ: నత్తగుల్లలపై వివాదాన్ని అటవీ శాఖ పరిష్కరించేనా..?
సముద్రంలో దొరికే నత్తగుల్లల కోసం మత్స్య కారులు ప్రాణాలకు తెగించి వెళ్తున్నారు. అయితే ఇది నిషేధమని కొత్తగా అటవీశాఖ చెబుతోంది. తాతలకాలం నుంచి లేని అభ్యంతరం ఇప్పుడు పెట్టడంపై మత్స్యకారులు వేట వదిలేసి ఆందోళనకు దిగారు. ఇది కోరింగ పరిధిలో మాత్రమే ఉందని మిగిలిన చోట ఆంక్షలు లేవని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో అటవీశాఖకు ఇది తలనొప్పిగా మారింది.
    user_Peddapuram Updates
    Peddapuram Updates
    Photographer పెద్దాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసనికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పద్మనాభం తనయుడు గిరిబాబు తో కలిసి ముద్రగడ పద్మనాభం సమాధికి నివాళులార్పించిన అంబటి రాంబాబు
    4
    కిర్లంపూడి ముద్రగడ నివాసానికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు
కాకినాడ జిల్లా 
జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి 
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం నివాసనికి చేరుకున్న వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు 
పద్మనాభం తనయుడు గిరిబాబు తో కలిసి ముద్రగడ పద్మనాభం సమాధికి నివాళులార్పించిన అంబటి రాంబాబు
    user_S BUJJI
    S BUJJI
    జగ్గంపేట, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • తాడేపల్లిగూడెంలో కార్తీక దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ తాడేపల్లిగూడెం, కార్తీక మాసం పురస్కరించుకొని , రేపటి నుంచి నవంబర్ 10 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు తాడేపల్లిగూడెం ,టూ టౌన్ గల ఎన్ . కే. గ్రౌండ్స్ లో కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందని పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దీపోత్సవం ఉంటుందని, ఈ కార్యక్రమంలో 258 రూపాయలు చెల్లించిన వారికి ఇక్కడే పూజా సామాగ్రి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఈ 30 రోజులు పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు జరిగే దీపోత్సవంతో పాటు సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు విశేషమైన కల్యాణాలు, హోమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో హోమాల్లో పాల్గొనే దంపతులకు 3116 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తాడేపల్లిగూడెం, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న పుర ప్రజలందరూ పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు విరాళాల రూపంలో అందించాలని కోరారు. హరిహర సుధా అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. కార్తీక దీపోత్సవం 15 రోజులు మాత్రమే తెలంగాణ హైదరాబాదులో జరిగిందన్నారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెంలో 30 రోజులు కార్తీక దీపోత్సవం నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని పురప్రజలు, భక్తులు సద్వినియోగపరచుకోవాలని కోరారు.
    3
    తాడేపల్లిగూడెంలో కార్తీక దీపోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ

తాడేపల్లిగూడెం, కార్తీక మాసం పురస్కరించుకొని , రేపటి నుంచి నవంబర్ 10 నుండి డిసెంబర్ 8వ తేదీ వరకు తాడేపల్లిగూడెం ,టూ టౌన్ గల ఎన్ . కే. గ్రౌండ్స్ లో కార్తీక దీపోత్సవం ఏర్పాటు చేయడం జరిగిందని పళ్ళవఝుల శ్రీ రామకృష్ణ శర్మ తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దీపోత్సవం ఉంటుందని, ఈ కార్యక్రమంలో 258 రూపాయలు చెల్లించిన వారికి ఇక్కడే పూజా సామాగ్రి ఇవ్వడం జరుగుతుందన్నారు. అలాగే ఈ 30 రోజులు పాడ్యమి నుంచి అమావాస్య వరకు ప్రతిరోజు జరిగే దీపోత్సవంతో పాటు సాయంత్రం నాలుగు గంటల నుంచి 6 గంటల వరకు విశేషమైన కల్యాణాలు, హోమాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందులో హోమాల్లో పాల్గొనే దంపతులకు 3116 రూపాయలు చెల్లించాలని తెలిపారు. తాడేపల్లిగూడెం, చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఉన్న పుర ప్రజలందరూ పాల్గొని తమ వంతు సహాయ సహకారాలు విరాళాల రూపంలో అందించాలని కోరారు. హరిహర సుధా అయ్యప్ప స్వామి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. కార్తీక దీపోత్సవం 15 రోజులు మాత్రమే తెలంగాణ హైదరాబాదులో జరిగిందన్నారు, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్, తాడేపల్లిగూడెంలో 30 రోజులు కార్తీక దీపోత్సవం నిర్వహించడం  జరుగుతుందని ఈ కార్యక్రమాన్ని పురప్రజలు, భక్తులు సద్వినియోగపరచుకోవాలని కోరారు.
    user_అయితం ప్రసాద్
    అయితం ప్రసాద్
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • సీఎం చంద్రబాబు ఆదేశాలే శిరోధార్యం.. జడ్పీ పీఠంపై అధిష్టానానిదే తుది నిర్ణయం, కూటమి శ్రేణులు, ఎమ్మెల్యే పంతం నానాజీకి హృదయపూర్వక ధన్యవాదాలు కాకినాడ రూరల్, నవంబర్ 9: కాకినాడ రూరల్ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి చరిత్రాత్మక విజయం సాధించారు. ప్రత్యర్థులపై సుమారు 14 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది తమ పట్టును మరోసారి నిరూపించుకున్నారు. ఈ అఖండ విజయం అనంతరం పిల్లి దంపతులు విలేకరులతో మాట్లాడి, తమపై విశ్వాసంతో ఇంతటి భారీ మెజార్టీని కట్టబెట్టిన కాకినాడ రూరల్ ప్రజలకు, ఓటర్లకు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ఐక్యత తెచ్చిన విజయం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను బరిలోకి దిగానని పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. ఈ గెలుపు కూటమి ఐక్యతకు, కార్యకర్తల అవిశ్రాంత శ్రమకు నిదర్శనమని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ అందించిన సంపూర్ణ సహకారానికి, క్షేత్రస్థాయిలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, బూత్ స్థాయి కార్యకర్తలకు ఆమె పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు. సంక్షేమం – అభివృద్ధి మా లక్ష్యం రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోందని పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పే ఈ విజయమని కొనియాడారు. విలీన గ్రామాలపై స్పష్టత.. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం కాకినాడ కార్పొరేషన్‌లో విలీనం కానున్న ఆరు గ్రామాల అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పిల్లి దంపతులు స్పందిస్తూ.. "ముందుగా ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే విలీన ప్రక్రియ చేపట్టాలన్నది స్థానిక ప్రజాభిప్రాయం. అయితే పార్టీ అధిష్టానం దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తిగా కట్టుబడి ఉంటాం" అని తేల్చిచెప్పారు. జడ్పీ చైర్మన్ పదవిపై స్పందన. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం వస్తే స్వీకరిస్తారా అన్న పాత్రికేయుల ప్రశ్నకు పిల్లి అనంతలక్ష్మి స్పష్టమైన సమాధానమిచ్చారు. "నా రాజకీయ ప్రస్థానం గతంలో జడ్పీటీసీగానే మొదలైంది. పార్టీ ఆదేశాలను నేనెప్పుడూ జవదాటలేదు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగాను. ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ పీఠంపై అధిష్టానం పిలుపునిస్తే, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహించి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ సమావేశంలో మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, రూరల్, కరప మండల అధ్యక్షులు కాళ్ళ శ్రీనివాస్, మద్దూరి స్వామి, ఎంపీటీసీ నురుకుర్తి ప్రకాష్, క్లస్టర్ లు ప్రకాష్, తాతపూడి రామకృష్ణ, ఉషారాణి,బీసీ సెల్ అద్యక్షులు కొమిరిశెట్టి నరసింగరావు,తెలుగు యువత ఉపాధ్యక్షులు సందీప్, ప్రధాన కార్యదర్శి లోవ రాజు, చల్మాజీ, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
    2
    సీఎం చంద్రబాబు ఆదేశాలే శిరోధార్యం.. జడ్పీ పీఠంపై అధిష్టానానిదే తుది నిర్ణయం,
కూటమి శ్రేణులు, ఎమ్మెల్యే పంతం నానాజీకి హృదయపూర్వక ధన్యవాదాలు
కాకినాడ రూరల్, నవంబర్ 9:
కాకినాడ రూరల్ జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి చరిత్రాత్మక విజయం సాధించారు. ప్రత్యర్థులపై సుమారు 14 వేల ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొంది తమ పట్టును మరోసారి నిరూపించుకున్నారు. ఈ అఖండ విజయం అనంతరం పిల్లి దంపతులు విలేకరులతో మాట్లాడి, తమపై విశ్వాసంతో ఇంతటి భారీ మెజార్టీని కట్టబెట్టిన కాకినాడ రూరల్ ప్రజలకు, ఓటర్లకు చేతులెత్తి కృతజ్ఞతలు తెలిపారు.
కూటమి ఐక్యత తెచ్చిన విజయం.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాను బరిలోకి దిగానని పిల్లి అనంతలక్ష్మి పేర్కొన్నారు. ఈ గెలుపు కూటమి ఐక్యతకు, కార్యకర్తల అవిశ్రాంత శ్రమకు నిదర్శనమని స్పష్టం చేశారు. నియోజకవర్గ ఎమ్మెల్యే పంతం నానాజీ అందించిన సంపూర్ణ సహకారానికి, క్షేత్రస్థాయిలో అహర్నిశలు కష్టపడి పనిచేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులకు, బూత్ స్థాయి కార్యకర్తలకు ఆమె పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటామని భరోసా ఇచ్చారు.
సంక్షేమం – అభివృద్ధి మా లక్ష్యం
రాష్ట్రంలో సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో కూటమి ప్రభుత్వం 'సూపర్ సిక్స్' పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోందని, ఆంధ్రప్రదేశ్‌ను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తోందని పిల్లి సత్యనారాయణమూర్తి అన్నారు. ప్రభుత్వ ప్రజా సంక్షేమ పాలనకు ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పే ఈ విజయమని కొనియాడారు.
విలీన గ్రామాలపై స్పష్టత.. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యం
కాకినాడ కార్పొరేషన్‌లో విలీనం కానున్న ఆరు గ్రామాల అంశంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు పిల్లి దంపతులు స్పందిస్తూ.. "ముందుగా ఆ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించిన తర్వాతే విలీన ప్రక్రియ చేపట్టాలన్నది స్థానిక ప్రజాభిప్రాయం. అయితే పార్టీ అధిష్టానం దీనిపై ఏ నిర్ణయం తీసుకున్నా మేము పూర్తిగా కట్టుబడి ఉంటాం" అని తేల్చిచెప్పారు.
జడ్పీ చైర్మన్ పదవిపై స్పందన.
జిల్లా పరిషత్ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం వస్తే స్వీకరిస్తారా అన్న పాత్రికేయుల ప్రశ్నకు పిల్లి అనంతలక్ష్మి స్పష్టమైన సమాధానమిచ్చారు.
"నా రాజకీయ ప్రస్థానం గతంలో జడ్పీటీసీగానే మొదలైంది. పార్టీ ఆదేశాలను నేనెప్పుడూ జవదాటలేదు, క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ముందుకు సాగాను. ఇప్పుడు కూడా జిల్లా పరిషత్ పీఠంపై అధిష్టానం పిలుపునిస్తే, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా శిరసావహించి ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాను.
ఈ సమావేశంలో మాజీ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు, రూరల్, కరప మండల అధ్యక్షులు కాళ్ళ శ్రీనివాస్, మద్దూరి స్వామి, ఎంపీటీసీ నురుకుర్తి ప్రకాష్, క్లస్టర్ లు ప్రకాష్, తాతపూడి రామకృష్ణ, ఉషారాణి,బీసీ సెల్ అద్యక్షులు కొమిరిశెట్టి నరసింగరావు,తెలుగు యువత ఉపాధ్యక్షులు సందీప్, ప్రధాన కార్యదర్శి లోవ రాజు, చల్మాజీ, అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
    user_Sarkar express AP
    Sarkar express AP
    Local News Reporter Kakinada (Rural), Andhra Pradesh•
    18 hrs ago
  • రెడీ అత్త ఎంపీటీసీ ఎన్నికల ప్రజాస్వామ్య బద్దంగా నిష్పక్షపాతంగా జరిగాయి... ఈ విషయంపై ఎక్కడ ప్రమాణం చేయడానికి అయినా మేము సిద్ధం కూటమి నాయకుల సవాల్.... కడియద్ద ఎంపీటీసీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాం... మీరు వస్తే ఎక్కడ ప్రమాణం చేయడానికైనా సిద్ధమే. ప్రతిపక్షాల విమర్శలకు సవాల్ విసిరిన కూటమి నాయకులు తాడేపల్లిగూడెం నవంబర్ 9: ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని, అధికారులు, పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో జరిగిన లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఈ విషయంపై ఎక్కడ ప్రమాణం చేయడానికైనా తాము సిద్ధమని కడియద్ద కూటమి నాయకులు సవాల్ విసిరారు. కడియద్ద ఎంపీటీసీ స్థానంలో జనసేన తరఫున దారపురెడ్డి పద్మ ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందిన విషయంపై ప్రతిపక్ష నాయకులు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శలను తిప్పికొడుతూ సోమవారం గ్రామంలో కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. టీడీపీ జడ్పీటీసీ నేకూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎలాంటి అధికార దుర్వినియోగం జరగలేదని, దారపురెడ్డి పద్మకు చెందిన రెండు చెల్లని ఓట్లు గుర్తుపై అస్పష్టంగా స్వస్తిక్ మార్కు లేదని తొలగించారని, వాటిని ఎన్నికల ఎన్నికల అధికారి సూరిబాబు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మాజీ సర్పంచ్ పాకనాటి తాతాజీ మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో మొదట వైసీపీ అభ్యర్థి కొండపల్లి నాగలక్ష్మి ఒక ఓటు మెజారిటీతో గెలిచినట్లు అధికారులు చెప్పారని, చెల్లని ఓట్లపై పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న తాను అభ్యంతరం తెలపగా రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ జరిగిందన్నారు. రెండుసార్లు రీ-కౌంటింగ్ జరిగిన తర్వాత జనసేనకు రెండు ఓట్లు ఎక్కువ రావడంతో జనసేన అభ్యర్థి దారపురెడ్డి పద్మ ఒక ఓటు మెజారిటీతో గెలుపొందారని వివరించారు. పరిమి కిరణ్ మాట్లాడుతూ అయ్యప్ప మాల వేసుకున్న తాను కౌంటింగ్ సందర్భంలో అక్కడే ఉన్నానని, అయ్యప్ప మాలలో అబద్ధం ఆడే అవసరం తమకు లేదని, మాల సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా లెక్కింపు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పరిమి వెంకటేశ్వరరావు, నాయకులు మద్దిపాటి సత్యనారాయణ, వట్టి నాగమాణిక్యాలరావు తదితరులు మాట్లాడారు.
    3
    రెడీ అత్త ఎంపీటీసీ ఎన్నికల ప్రజాస్వామ్య బద్దంగా నిష్పక్షపాతంగా జరిగాయి... ఈ విషయంపై ఎక్కడ ప్రమాణం చేయడానికి అయినా మేము సిద్ధం కూటమి నాయకుల సవాల్....
కడియద్ద ఎంపీటీసీ ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచాం... 
మీరు వస్తే ఎక్కడ ప్రమాణం చేయడానికైనా సిద్ధమే.
ప్రతిపక్షాల విమర్శలకు సవాల్ విసిరిన కూటమి నాయకులు
తాడేపల్లిగూడెం నవంబర్ 9:
ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు అత్యంత ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని, అధికారులు, పోలింగ్ ఏజెంట్లు, అభ్యర్థుల సమక్షంలో జరిగిన లెక్కింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని, ఈ విషయంపై ఎక్కడ ప్రమాణం చేయడానికైనా తాము సిద్ధమని కడియద్ద కూటమి నాయకులు సవాల్ విసిరారు. కడియద్ద ఎంపీటీసీ స్థానంలో జనసేన తరఫున దారపురెడ్డి పద్మ ఒక్క ఓటు మెజారిటీతో గెలుపొందిన విషయంపై ప్రతిపక్ష నాయకులు అర్థంలేని విమర్శలు చేస్తున్నారని, ఆ విమర్శలను తిప్పికొడుతూ సోమవారం గ్రామంలో కూటమి నాయకులు సమావేశం నిర్వహించారు. టీడీపీ జడ్పీటీసీ నేకూరి కిరణ్ కుమార్ మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఎలాంటి అధికార దుర్వినియోగం జరగలేదని, దారపురెడ్డి పద్మకు చెందిన రెండు చెల్లని ఓట్లు గుర్తుపై అస్పష్టంగా స్వస్తిక్ మార్కు లేదని తొలగించారని, వాటిని ఎన్నికల ఎన్నికల అధికారి సూరిబాబు పరిగణనలోకి తీసుకోలేదన్నారు. మాజీ సర్పంచ్ పాకనాటి తాతాజీ మాట్లాడుతూ కౌంటింగ్ సమయంలో మొదట వైసీపీ అభ్యర్థి కొండపల్లి నాగలక్ష్మి ఒక ఓటు మెజారిటీతో గెలిచినట్లు అధికారులు చెప్పారని, చెల్లని ఓట్లపై పోలింగ్ ఏజెంట్‌గా ఉన్న తాను అభ్యంతరం తెలపగా రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్ జరిగిందన్నారు. రెండుసార్లు రీ-కౌంటింగ్ జరిగిన తర్వాత జనసేనకు రెండు ఓట్లు ఎక్కువ రావడంతో జనసేన అభ్యర్థి దారపురెడ్డి పద్మ ఒక ఓటు మెజారిటీతో గెలుపొందారని వివరించారు. పరిమి కిరణ్ మాట్లాడుతూ అయ్యప్ప మాల వేసుకున్న తాను కౌంటింగ్ సందర్భంలో అక్కడే ఉన్నానని, అయ్యప్ప మాలలో అబద్ధం ఆడే అవసరం తమకు లేదని, మాల సాక్షిగా ప్రజాస్వామ్యబద్ధంగా లెక్కింపు జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పరిమి వెంకటేశ్వరరావు, నాయకులు మద్దిపాటి సత్యనారాయణ, వట్టి నాగమాణిక్యాలరావు తదితరులు మాట్లాడారు.
    user_M Ravi Kiran
    M Ravi Kiran
    తాడేపల్లిగూడెం, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    20 hrs ago
  • పెనుగొండ డంపింగ్ యార్డ్ సమస్యపై రైతులు చేపట్టిన ధర్నాపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ. ఎమ్మెల్యే పితాని, తహసీల్దార్ హామీతో ఆందోళన విరమించిన పెనుగొండ రైతులు. డంపింగ్ యార్డ్‌లో తడి, పొడి చెత్తను వేరు చేసి నిర్వహించాలన్న ప్రణాళిక ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయడంతో పాటు వ్యర్థాలను పవర్ ప్లాంట్‌కు తరలించే ఆలోచన కార్యరూపం దాల్చలేదన్న ఎమ్మెల్యే పితాని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డంపింగ్ యార్డ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడి. పెనుగొండ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి ఆరు నెలల క్రితమే రెండు ఎకరాల స్థలం మంజూరు చేశామని స్పష్టం. నెగ్గిపూడిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు 2.45 ఎకరాల స్థలం కేటాయించామని తెలిపిన ఎమ్మెల్యే. డంపింగ్ యార్డ్‌కు రూ.80 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు కూడా పిలిచామని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం బాధాకరమని విమర్శ. కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్పష్టం.
    1
    పెనుగొండ డంపింగ్ యార్డ్ సమస్యపై రైతులు చేపట్టిన ధర్నాపై స్పందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ.
ఎమ్మెల్యే పితాని, తహసీల్దార్ హామీతో ఆందోళన విరమించిన పెనుగొండ రైతులు.
డంపింగ్ యార్డ్‌లో తడి, పొడి చెత్తను వేరు చేసి నిర్వహించాలన్న ప్రణాళిక ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని, తడి, పొడి చెత్తను వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయడంతో పాటు వ్యర్థాలను పవర్ ప్లాంట్‌కు తరలించే ఆలోచన కార్యరూపం దాల్చలేదన్న ఎమ్మెల్యే పితాని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డంపింగ్ యార్డ్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడి. పెనుగొండ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారానికి ఆరు నెలల క్రితమే రెండు ఎకరాల స్థలం మంజూరు చేశామని స్పష్టం. నెగ్గిపూడిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు 2.45 ఎకరాల స్థలం కేటాయించామని తెలిపిన ఎమ్మెల్యే. డంపింగ్ యార్డ్‌కు రూ.80 లక్షలతో రోడ్డు నిర్మాణం చేపట్టేందుకు టెండర్లు కూడా పిలిచామని వెల్లడి. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుంటే ప్రతిపక్షాలు రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం బాధాకరమని విమర్శ.
కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, ప్రజా సమస్యలపై తక్షణమే స్పందించి పరిష్కారానికి కృషి చేస్తుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ స్పష్టం.
    user_R. Sankaram
    R. Sankaram
    Local News Reporter పెనుగొండ, పశ్చిమ గోదావరి, ఆంధ్రప్రదేశ్•
    23 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.