ప్రజలకు మెరుగైన నిర్ధారణ సేవలు అందించేందుకు చర్యలు.... జిల్లాలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఎమ్మారై (MRI) యంత్రానికిl అవసరమైన గదులు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం పరిశీలించారు. ఎమ్మారై యంత్రం ఏర్పాటు చేయనున్న గదుల విస్తీర్ణం, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సరఫరా, ప్రత్యేక రక్షణ గోడలు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మారై యంత్రం ఏర్పాటు ద్వారా రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ఎమ్మారై సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో వైద్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన నిర్ధారణ సేవలు అందించేందుకు చర్యలు.... జిల్లాలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో త్వరలో ఏర్పాటు చేయనున్న ఎమ్మారై (MRI) యంత్రానికిl అవసరమైన గదులు, మౌలిక వసతులను జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సోమవారం పరిశీలించారు. ఎమ్మారై యంత్రం ఏర్పాటు చేయనున్న గదుల విస్తీర్ణం, భద్రతా ప్రమాణాలు, విద్యుత్ సరఫరా, ప్రత్యేక రక్షణ గోడలు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ చర్చించారు. అవసరమైన ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. ప్రజలకు ఆధునిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ లక్ష్యమని, ఎమ్మారై యంత్రం ఏర్పాటు ద్వారా రోగులకు మెరుగైన నిర్ధారణ సేవలు లభిస్తాయని కలెక్టర్ తెలిపారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేసి ఎమ్మారై సేవలను త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో వైద్య శాఖ అధికారులు, ఇంజినీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలం రెడ్డిపాలెం గ్రామంలోని విద్యా నిలయ స్కూల్‌లో మంగళవారం బాలల భద్రత మరియు మాదకద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హైదరాబాద్ నార్కోటిక్స్ విభాగం డీఎస్పీ రమేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల వల్ల ఆరోగ్యంతో పాటు భవిష్యత్తు కూడా నాశనం అవుతుందని చెప్పారు. బాలల భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్, ఎంఈఓతో పాటు గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ పాల్గొన్నారు. సుమారు 500 మంది విద్యార్థులు ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు.1
- కరీంనగర్ జిల్లా చొప్పదండి పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయస్వామి దేవాలయంలో ఘనంగా భజన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో చేరి, భక్తిపూర్ణ గానం, పూజా విధానాల్లో పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణాన్ని సృష్టించారు.1
- రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ లోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను ఆకస్మికంగా సందర్శించి ఆహారం నాణ్యతను తనిఖీ చేశారు. సోమవారం మెనూ లో ఉన్న వంటకాలు.. విద్యార్థినులకు మధ్యాహ్న భోజనంలో వడ్డిస్తున్నా మెనూ పరిశీలించారు. స్వయంగా మంత్రి ప్లేట్ తీసుకొని క్యూ లైన్ లో నిలబడి వడ్డించుకొని విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. మధ్యాహ్న భోజనం తయారు చేసే కుక్ లతో మాట్లాడి విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించాలని.. విద్యార్థినులు ఆహారం విషయంలో రాజిలేదని ఆదేశించారు. విద్యార్థులకు వడ్డిస్తున్న ఆహారాన్ని ప్రతిరోజూ పరిశీలించాలని ప్రిన్సిపల్ విజయ ను ఆదేశించారు. ప్రభుత్వం రూపొందించిన మెను ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించాలని సూచించారు. పాఠశాల తరగతి గదులను ,పాఠశాల పరిసరాలను పరిశీలించారు.. డ్రింకింగ్ వాటర్ ట్యాంక్స్ పరిశీలించారు.. మెయింటెన్స్ చేయాలని సూచించారు. విద్యా సంవత్సరం ముగింపు కు చేరుకుండడం తో పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు బాగా రాయాలని సూచించారు.ఇతర తరగతులకు సిలబస్ పూర్తయిందని దానిని రివిజన్ చేయాలని సూచించారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఉపాధ్యాయులకు సూచించారు.. టాయిలెట్స్ కి,అదనపు గదికి అవసరమైన షెడ్డు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు.. విద్యార్థులతో ముచ్చటించారు..విద్యార్థులు బాగా చదువుకోవాలని సూచించారు... ఇటీవల జరిగిన సర్వే లో కులం డబ్బు ప్రభావం లేదని ఎక్కడైతే చదువుకున్నారో ఆ కుటుంబాలు మాత్రమే అభివృద్ధి చెందాయని తెలిపారు. హుస్నాబాద్ స్పోర్ట్స్ గ్రౌండ్ లో త్వరలోనే స్విమ్మింగ్ పూల్ అందుబాటులోకి రానుందని దాని ద్వారా అందరూ స్విమ్మింగ్ నేర్చుకోవాలని సూచించారు. విద్యార్థినులు పాటలు ,కథలు చెప్పించారు.. పాటలు పాడి ,కథలు చెప్పిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు సమీపిస్తుండటంతో బాగా రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.. లక్ష్యాన్ని నిర్దేశించుకుని చదవాలని సూచించారు.3
- వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ వినియోగం మరియు పిల్లల భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ అంబటి నర్సయ్య పాల్గొని యువతకు డ్రగ్స్ కు , మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పిల్లల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, సమాజంలో మత్తు పదార్థాల వ్యాప్తిని అరికట్టేందుకు అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ తహసిల్దార్ విజయసాగర్ ఎస్సైలు సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.1
- *टिपर लॉरी में आग लग गई.. देखते ही देखते जलकर खाक हो गई* तेलंगाना: नलगोंडा जिले के चंदूर मंडल के तुम्मलपल्ली गांव में आग लग गई। सड़क बढ़ाने के काम के लिए गांव की ओर जा रही टिपर लॉरी में अचानक आग लग गई। अधिकारियों ने बताया कि आग बिजली के शॉर्ट सर्किट की वजह से लगी। टिपर देखते ही देखते पूरी तरह जलकर खाक हो गया। हादसे में ड्राइवर गंभीर रूप से घायल हो गया। उसे अस्पताल ले जाया गया, जहां डॉक्टरों ने बताया कि उसकी हालत गंभीर है। पुलिस घटना की जांच कर रही है।1
- బెజ్జూర్ గ్రామ సామాజిక ఆసుపత్రిలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కేంద్రాన్ని సర్పంచ్ దుర్గం సరోజ–తిరుపతి, వైద్యుడు శ్రావణ్ శ్రీనివాస్ కలిసి ప్రారంభించారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. మారుతున్న ఆహారపు అలవాట్లతో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకాను ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పారు.1
- లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 13వ వార్డులో దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని స్థానిక వార్డు కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ తెలిపారు. సోమవారం రాత్రి వార్డులోని పలు కాలనీలలో ఫాగింగ్ మిషన్ ద్వారా దోమల నివారణ మందును స్ప్రే చేయించారు. ప్రజలు ఇళ్లు, వార్డు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో 13వ వార్డు అధ్యక్షుడు సయ్యద్ హాజీ, సయ్యద్ హఫీజ్, మోహన్, బిలాల్, తదితరులు పాల్గొన్నారు.1
- వరంగల్ జిల్లా తొగర్రాయి గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని ఓ యువకుడు మృతి చెందిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం నల్లబెల్లి మండలం దస్తగిరిపల్లి గ్రామానికి చెందిన పోతరబోయిన మనోహర్ స్వామి (27) సోమవారం కొమ్మాల జాతరకు వెళ్లినట్లు సమాచారం. అనంతరం అర్థరాత్రి సమయంలో గిర్నిబావి–దుగ్గొండి రహదారి మీదుగా తిరిగి వెళ్తుండగా తొగర్రాయి గ్రామ శివారులోని మూలమలుపు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మనోహర్ స్వామి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని తదుపరి చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.1