Shuru
Apke Nagar Ki App…
వేషం మార్చి నిఘా – పరీక్షా కేంద్రం వద్ద ఆకతాయిల ఆట కట్టించిన మహిళా ఎస్సై జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో మహిళా ఎస్సై అమూల్య వినూత్నంగా వ్యవహరించి ఆకతాయిలకు గట్టి చెక్ పెట్టారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థినులను వేధిస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ఆమె విద్యార్థినిగా వేషం వేసి తనిఖీలు నిర్వహించారు. ఎర్ర దుస్తుల్లో స్టూడెంట్ గెటప్‌లో వచ్చిన ఎస్సై అమూల్య చర్య స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా నిలిచిందని, పోలీసులు ఏ రూపంలోనైనా ప్రజల భద్రత కోసం పనిచేస్తారని స్థానికులు పేర్కొన్నారు.
M D Azizuddin
వేషం మార్చి నిఘా – పరీక్షా కేంద్రం వద్ద ఆకతాయిల ఆట కట్టించిన మహిళా ఎస్సై జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లలో మహిళా ఎస్సై అమూల్య వినూత్నంగా వ్యవహరించి ఆకతాయిలకు గట్టి చెక్ పెట్టారు. పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థినులను వేధిస్తున్న వారిని అదుపులోకి తీసుకునేందుకు ఆమె విద్యార్థినిగా వేషం వేసి తనిఖీలు నిర్వహించారు. ఎర్ర దుస్తుల్లో స్టూడెంట్ గెటప్‌లో వచ్చిన ఎస్సై అమూల్య చర్య స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ ఘటనతో ఆకతాయిలకు గట్టి హెచ్చరికగా నిలిచిందని, పోలీసులు ఏ రూపంలోనైనా ప్రజల భద్రత కోసం పనిచేస్తారని స్థానికులు పేర్కొన్నారు.
More news from తెలంగాణ and nearby areas
- వరంగల్ జిల్లాలో:గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో శనివారం పాము కలకలం రేపింది. జీడబ్ల్యూఎంసీ కౌన్సిల్ హాల్ పక్కనున్న బాత్రూంలో పామును గుర్తించిన ఉద్యోగులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనతో కొంతసేపు కార్యాలయంలో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న స్నాక్ క్యాచర్‌ను అక్కడికి చేరుకొని పామును పట్టుకోవడంతో ఉద్యోగులు ఊపిరిపించుకున్నారు.1
- హైదరాబాద్‌లో ఆశా కార్యకర్తలు చేపట్టిన ధర్నాను పోలీసులు అడ్డుకుని పలువురిని అక్రమంగా అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. తమ న్యాయమైన డిమాండ్ల కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఆశాలపై పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను అణిచివేయలేరని, పోరాటం మరింత ఉద్ధృతం అవుతుందని నాయకులు హెచ్చరించారు.3
- నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అధికారులు ముఖ్య సూచనలు చేశారు. భవన నిర్మాణ కార్మిక శాఖ ద్వారా లభించే క్లెయిమ్ డబ్బుల విషయంలో కార్మికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఎవరికైనా క్లెయిమ్ డబ్బులు రావాల్సి ఉంటే, వారు తప్పనిసరిగా స్వయంగా సమీపంలోని లేబర్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు పేర్కొంటూ, కొంతమంది బ్రోకర్లు క్లెయిమ్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి కార్మికులను మోసం చేసే అవకాశం ఉందని తెలిపారు. “మేము చేస్తేనే డబ్బులు వస్తాయి”, “అధికారులకు డబ్బులు ఇవ్వాలి” వంటి అబద్ధపు మాటలను నమ్మవద్దని స్పష్టం చేశారు. ఇలాంటి బ్రోకర్ల మాటలకు మోసపడి డబ్బులు కోల్పోవద్దని హెచ్చరించారు. అదేవిధంగా, కొన్ని సందర్భాల్లో కార్మికులకు రావాల్సిన డబ్బులను వారి అకౌంట్లలో వేసుకుని, కొంత మాత్రమే ఇవ్వడం జరుగుతుందని సమాచారం ఉందని అధికారులు తెలిపారు. ఇలాంటి మోసాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా బ్రోకర్లు లేదా అధికారులు ఇబ్బందులకు గురి చేస్తే, వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అలాగే అవినీతి నిరోధక శాఖ హెల్ప్‌లైన్ 1064 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.1
- మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ వెంటనే సిద్ధం చేయాలని, స్వామి వారి దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం మంగపేట మండలం మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ సందర్శించి అభివృద్ధి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి దర్శనం కోసం అనేకమంది భక్తులు వస్తుంటారని, వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల వసతులు సౌలభ్యాలు ఆలయ అభివృద్ధి పై వెంటనే మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన ఆర్చి నిర్మాణం, రోడ్డు విస్తరణ, కళ్యాణ కట్ట, కళ్యాణ మండపం, పార్కింగ్ స్థలాల ఏర్పాటు, ఇతర ఆలయ అభివృద్ధి పనులపై త్వరితగతిన నివేదికలు రూపొందించాలని పేర్కొన్నారు. ఆచార సాప్రదాయాలకు ఆటంకం కలగకుండా ఆలయ అభివృద్ధి చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ ఆర్కిటెక్ బృందం, దేవాదాయ శాఖ డి ఈ రమేష్ బాబు, తాసిల్దార్ తోట రవీందర్, ఆలయ ఈవో మహేష్, ఎంపీడీవో బద్రు నాయక్, ఆలయ అర్చకులు, సంబంధిత అధికారులు, స్థానిక గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు2
- కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీలోకి వస్తానంటే స్వాగతిస్తామని ఎమ్మెల్సీ ఎల్. రమణ తెలిపారు. జగిత్యాల లో విలేకరుల సమావేశంలో రమణ మాట్లాడుతు రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని తెలిపారు. గౌరవం ఉన్న చోటే నాయకులు ఉంటారని చెప్పారు. ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న జీవన్ రెడ్డి లాంటి వారు బీఆర్ఎస్ పార్టీ లోకి వస్తే తగిన గౌరవం కల్పిస్తామన్నారు. హైకమాండే సుప్రీం అని, క్రమశిక్షణతో పనిచేస్తానని తెలిపారు. పార్టీ నియమాలకు కట్టుబడి ఉంటామని, పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికీ గౌరవం దక్కుతుందని చెప్పారు. ప్రజల సేవ కోసం పార్టీ వేదికగా ఉంటుందన్నారు. కుటుంబ సంబంధాలు కాదు.. కేవలం కమిట్మెంట్ ఆధారంగానే గుర్తింపు ఉంటుందని తెలిపారు.1
- ఎన్ హెచ్ 164 ఘట్కేసర్ టు కె పాల్ వెళ్లే రహదారిలో పంటలకు కారు దహనం అయినది.....కార్1
- నల్గొండ: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 11వ డివిజన్ లోని కతాల్ గూడలో రహదారి పక్కన ఉన్న బారీ వృక్షం వాహనదారులకు ప్రమాదకరంగా మారింది. నల్గొండ నుంచి దేవరకొండ మార్గంలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు సాగిస్తున్న ఈ ప్రాంతంలో చెట్టు కూలితే భారీ నష్టం జరిగే అవకాశాలున్నాయి. ఏదైనా ప్రమాదం జరగకముందే సంబంధిత అధికారులు స్పందించి వెంటనే రహదారి పక్కన ఉన్న ఎండిన చెట్టును తొలగించాలని ప్రయాణికులు, వాహనదారులు కోరుతున్నారు.1
- ములుగు జిల్లా కోర్టులో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో ఇచ్చిన తీర్పులు సుప్రీంకోర్టు తీర్పుతో సమానమని జిల్లా జడ్జి సూర్య చంద్రకళ తెలిపారు. ఈ సందర్భంగా 4 బెంచ్‌ల ద్వారా మొత్తం 1,117 కేసులను పరిష్కరించారు. పలు కేసుల్లో రూ.1.15 కోట్ల నష్టపరిహారం ఇప్పించారు. దీర్ఘకాలిక వివాదాలను రాజీ ద్వారా పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయని జడ్జి సూచించారు.1