భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం సాంబాయిగూడెం నుండి రామానుజవరం వరకు రహదారిపై అడ్డంగా నిలిపిన ఇసుక లారీల కారణంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామానికి చెందిన వంశీ (35) అనే వ్యక్తి పురుగుల మందు తాగి అస్వస్థతకు గురవగా, అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆసుపత్రికి తరలించే మార్గంలో, ఇసుక లారీలు అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వకుండా రహదారిపై అడ్డంగా నిలిచిపోయాయి. దీనితో అంబులెన్స్ ముందుకు కదలలేకపోయింది. చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు వంశీని భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అయితే, ఆసుపత్రికి చేరుకునే సరికి వంశీ ప్రాణాలు కోల్పోయాడు. అరగంట ముందు ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే వంశీ బతికేవాడని వైద్యులు తెలిపారు. ఇసుక లారీలు రోడ్డును దిగ్బంధనం చేయడంతోనే వంశీ మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియా అక్రమాలకు ఒక నిండు ప్రాణం బలైందని వారు ఆరోపిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం సాంబాయిగూడెం నుండి రామానుజవరం వరకు రహదారిపై అడ్డంగా నిలిపిన ఇసుక లారీల కారణంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామానికి చెందిన వంశీ (35) అనే వ్యక్తి పురుగుల మందు తాగి అస్వస్థతకు గురవగా, అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆసుపత్రికి తరలించే మార్గంలో, ఇసుక లారీలు అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వకుండా రహదారిపై అడ్డంగా నిలిచిపోయాయి. దీనితో అంబులెన్స్ ముందుకు కదలలేకపోయింది. చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు వంశీని భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అయితే, ఆసుపత్రికి చేరుకునే సరికి వంశీ ప్రాణాలు కోల్పోయాడు. అరగంట ముందు ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే వంశీ బతికేవాడని వైద్యులు తెలిపారు. ఇసుక లారీలు రోడ్డును దిగ్బంధనం చేయడంతోనే వంశీ మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియా అక్రమాలకు ఒక నిండు ప్రాణం బలైందని వారు ఆరోపిస్తున్నారు.
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మణుగూరు మండలం సాంబాయిగూడెం నుండి రామానుజవరం వరకు రహదారిపై అడ్డంగా నిలిపిన ఇసుక లారీల కారణంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మణుగూరు మండలం దమ్మక్కపేట గ్రామానికి చెందిన వంశీ (35) అనే వ్యక్తి పురుగుల మందు తాగి అస్వస్థతకు గురవగా, అతని కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలిస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ఆసుపత్రికి తరలించే మార్గంలో, ఇసుక లారీలు అంబులెన్స్‌కు కూడా దారి ఇవ్వకుండా రహదారిపై అడ్డంగా నిలిచిపోయాయి. దీనితో అంబులెన్స్ ముందుకు కదలలేకపోయింది. చేసేదేమీ లేక కుటుంబ సభ్యులు వంశీని భుజాలపై మోసుకుంటూ ఆసుపత్రికి వెళ్లాల్సి వచ్చింది. అయితే, ఆసుపత్రికి చేరుకునే సరికి వంశీ ప్రాణాలు కోల్పోయాడు. అరగంట ముందు ఆసుపత్రికి తీసుకొచ్చి ఉంటే వంశీ బతికేవాడని వైద్యులు తెలిపారు. ఇసుక లారీలు రోడ్డును దిగ్బంధనం చేయడంతోనే వంశీ మృతి చెందాడని అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక మాఫియా అక్రమాలకు ఒక నిండు ప్రాణం బలైందని వారు ఆరోపిస్తున్నారు.1
- హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో NEET పరీక్షా కేంద్రం తెలియక కంగారు పడుతున్న ఒక విద్యార్థినికి ఓయూ ఇన్‌స్పెక్టర్ మహేష్ కుమార్ గౌడ్ మానవత్వంతో సహాయం చేశారు. ఇన్‌స్పెక్టర్ తన వాహనంలో ఆ విద్యార్థినిని ఎక్కించుకుని, సరిగ్గా సమయానికి పరీక్షా కేంద్రం లోపలికి చేర్చి పంపించారు.1
- Post by KHADEER REPORTER1
- ఆదివారం జనగామ జిల్లాలో జరిగిన నీట్ పరీక్షకు హాజరైన అశ్విని అనే విద్యార్థిని, జనగామ పట్టణంలోని ఏబీవీ డిగ్రీ కళాశాల సెంటర్‌కు పొరపాటున చేరుకుంది. అయితే, ఆమెకు కేటాయించిన అసలు పరీక్షా కేంద్రం పెంబర్తి గ్రామంలోని ఒక కళాశాలలో ఉంది. హాల్ టికెట్ పరిశీలించిన విధుల్లో ఉన్న పోలీసులు, ఆమె తప్పుడు సెంటర్‌కు వచ్చినట్లు గుర్తించి తెలియజేశారు. ఈ విషయం తెలిసి తీవ్ర కంగారుతో కన్నీటిపర్యంతమైన విద్యార్థినిని చూసి, పోలీసులు వెంటనే స్పందించి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పరిస్థితిని అర్థం చేసుకున్న అధికారులు, ఏమాత్రం ఆలస్యం చేయకుండా విద్యార్థినిని వెంటనే పోలీస్ వాహనంలో అసలు సెంటర్‌కు తరలించాలని ఆదేశించారు. పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో, సదరు విద్యార్థినిని అధికారిక పోలీస్ వాహనంలో ఎక్కించుకొని, జనగామ పట్టణం నుండి పెంబర్తిలోని నీట్ పరీక్షా కేంద్రానికి సైరన్ మోగిస్తూ మెరుపు వేగంతో వెళ్లి, పరీక్ష ప్రారంభానికి 9 నిమిషాల ముందే చేర్చారు. పోలీసుల ఈ వేగవంతమైన, మానవతా దృక్పథంతో కూడిన చర్యకు వారు ప్రజలచే శభాష్ అనిపించుకోగా, విద్యార్థినితో పాటు పలువురు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.1
- ఉప్పల్ డివిజన్ అధ్యక్షులు శ్రీ ఫణీంద్ర ఆదేశాల మేరకు, ఉప్పల్ గిరిజన మోర్చా అధ్యక్షులు బానోత్ రాజు నాయక్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉప్పల్ గాంధీ బొమ్మ పక్కన ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై నిరసన దీక్ష కార్యక్రమం నిర్వహించబడింది. ఈ దీక్షను బీజేపీ ఉప్పల్ డివిజన్ ఆధ్వర్యంలో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, బిజెపి రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి, తాడూరి శ్రీనివాస్ అన్న, ధర్మారెడ్డి జి, బిజెపి ఓబీసీ మోర్చా గీత సెల్ రాష్ట్ర మాజీ కన్వీనర్ పంజాల శ్రవణ్ కుమార్ గౌడ్, మహేష్ జి, విఠల్జి, శైలేష్ రెడ్డి, శ్రీధర్ గుప్తా తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.2
- గజ్వేల్ పట్టణంలోని పిడిచేట్ రోడ్ శివాజీ విగ్రహం వద్ద శ్రీ వారాహి కోల్డ్ ప్రెస్ ఆయిల్ ఆర్గానిక్ షాప్ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి గజ్వేల్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి, షాప్ నిర్వాహకుడు చిట్యాల దినేష్ రెడ్డిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఆర్గానిక్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, పల్లి నూనె, పొద్దు తిరుగుడు నూనె, కుసుమ నూనె, నువ్వుల నూనె, కొబ్బరి నూనె, అలాగే అనేక రకాల పిండి పదార్థాలు, గట్క పదార్థాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలు రసాయనాలు కలిసిన పదార్థాలకు దూరంగా ఉండి, ఆర్గానిక్ వస్తువులను ఉపయోగించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వంటేరు ప్రతాప్ రెడ్డి కోరారు. ఇలాంటి ఆర్గానిక్ షాప్‌ను ప్రారంభించడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ చైర్మన్ గంగిశెట్టి చందన రవీందర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఖాజా విరాసత్ అలీ, కుటుంబ సభ్యులు, తాజా మాజీ ఎంపిటిసి హరిత సంతోష్ రెడ్డి, కౌన్సిలర్లు అత్తేలి శ్రీనివాస్, మామిడి శ్రీధర్, కాముని మురళి, మాజీ కౌన్సిలర్లు ఉప్పల మెట్టయ్య, రహీం, చీర్ల మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, నాయకులు అహ్మద్, హనుమంత్ రెడ్డి, స్వామి చారి, ఉమర్, గడిల సంజయ్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.4
- బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ కాంగ్రెస్ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కేటీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వారి స్థాయికి దిగి జవాబు చెప్పాల్సిన అవసరం లేదని, తాము (బీఆర్ఎస్ నాయకులు) చాలని మన్నె క్రిశాంక్ స్పష్టం చేశారు.1
- Post by KHADEER REPORTER1