Shuru
Apke Nagar Ki App…
What If Comfort Became a Wave? 🌊☁️ MGM Cotton Comfort Imagine comfort moving like a wave… 🌊 Pure cotton softness transformed into a beautiful CGI experience. MGM — Comfort, Made from Cotton. 👕✨ Hashtags: #MGM #Cotton #Comfort #MGMVests #Vizianagaram
M G M Hosiery Works.
What If Comfort Became a Wave? 🌊☁️ MGM Cotton Comfort Imagine comfort moving like a wave… 🌊 Pure cotton softness transformed into a beautiful CGI experience. MGM — Comfort, Made from Cotton. 👕✨ Hashtags: #MGM #Cotton #Comfort #MGMVests #Vizianagaram
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- What If Comfort Became a Wave? 🌊☁️ MGM Cotton Comfort Imagine comfort moving like a wave… 🌊 Pure cotton softness transformed into a beautiful CGI experience. MGM — Comfort, Made from Cotton. 👕✨ Hashtags: #MGM #Cotton #Comfort #MGMVests #Vizianagaram1
- విజయనగరంలో పారదర్శకంగా 25 మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి మిగిలిన 25 మద్యం దుకాణాలకు పారదర్శకంగా లాటరీ మిగిలిన 25 మద్యం దుకాణాలకు పారదర్శకంగా లాటరీ 138 మంది దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ లాటరీ ద్వారా ప్రభుత్వానికి రూ.4.14 కోట్ల ఆదాయం విజయనగరం, అక్టోబర్ 8: జిల్లాలో మిగిలిన 25 రిటైల్ మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను జిల్లా యంత్రాంగం గురువారం పారదర్శకంగా పూర్తి చేసింది. నూతన ఎక్సైజ్ పాలసీ నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి ఆధ్వర్యంలో అర్హత కలిగిన దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ఆఫ్ లాట్స్ నిర్వహించి దుకాణాలను కేటాయించారు. జిల్లాలో మొత్తం 169 రిటైల్ మద్యం దుకాణాలు ఉండగా, నిబంధనల ప్రకారం 139 దుకాణాలు రెన్యువల్ అయ్యాయి. రెన్యువల్ కాని దుకాణాల్లో 25 షాపుల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానించగా.. మొత్తం 138 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారి సమక్షంలో లాటరీ నిర్వహించారు. లాటరీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించినట్లు కలెక్టర్ ఎస్. రామ్ సుందర్ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి.. ఐదు రౌండ్లలో లాటరీ ప్రక్రియను పూర్తి చేశారు. లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారులు ప్రభుత్వం, ఎక్సైజ్ శాఖ నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు పూర్తి చేసిన అనంతరం లైసెన్సులు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. లైసెన్సుదారులు ఎక్సైజ్ చట్టాలు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు, దుకాణాల నిర్వహణ సమయాలు, ఇతర నియంత్రణలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేటాయింపు ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.4.14 కోట్ల ఆదాయం సమకూరిందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి. శ్రీనాధుడు తెలిపారు. నూతన ఎక్సైజ్ పాలసీలో భాగంగా రెన్యువల్‌తో పాటు మిగిలిన దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి బి. శ్రీనాధుడు, ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.4
- విజయనగరం జిల్లా దత్తిరాచార్ మండలం కోమటిపల్లి గ్రామంలో దళిత భూములు ఆక్రమణ తగదు.. విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండల పరిధిలో గల కోమటిపల్లి గ్రామంలో, వడ్డా అప్పన్న, s/0 లేటు చిన్నయ్య, ఎస్సీ మాల కులస్తులు పూర్వం నుంచి, తాతల తండ్రుల నుంచి, అనుభవంలో గల ఖాళీ స్థలాన్ని, గత కొంతకాలంగా, ఒక ఆర్మీ ఉద్యోగి రంగు ముద్ర సోంబాబు సన్నాఫ్ గౌర్నాయుడు, బోర్ బిల్లి సన్యాసి అలియాస్ తాత, వారి కుమారులు రామునాయుడు మరియు అప్పలనాయుడు, దౌర్జన్యంగా, ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ వేసి గుంతలు తీస పని ప్రారంభించారు, ఈ క్రమంలో మేము అడ్డుకోవడానికి వెళ్లే ప్రయత్నంలో మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు, పై విషయాలు పరిగణలోకి తీసుకొని, దత్తి రాజేరు మండల తహసిల్దార్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.1
- మక్కువ MRO ఆఫీస్ లో “మీభూమి మీహక్కు' కార్యక్రమంలో పాసుపుస్తకాలు పంపిణీ చేసిన మంత్రి సంధ్యారాణి గారు. పార్వతిపురం మన్యం జిల్లా మక్కువ మండలంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు నుండి 7361 పట్టాదారు పాసుపుస్తకాలు అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశాం. భూ వివాదాలు లేకుండా స్పష్టమైన భూహక్కులు కల్పించడమే కూటమి ప్రభుత్వం ప్రధాన లక్ష్యం. గత ప్రభుత్వంలో అడ్డగోలుగా జరిపిన ఆక్రమణ భూమి సమస్యలను పరిష్కరించి రాజముద్రతో కూడిన పాస పుస్తకాలు పంపిణీ చేస్తున్నాం ఇది రైతులకు వరం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ రద్దు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిదే. గత ప్రభుత్వంలో సర్వే రాళ్లపై ఫోటోలకు 700 కోట్లు ప్రజాధనం దుర్వినియోగం చేసింది.గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆస్తులను తాకట్టుపెట్టి జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు.మక్కువ మెయిన్ రోడ్, కాలవలు రూ.9 కోట్లతో అభివృద్ధి.మీరందరూ కోరిన విధంగా బైరసాగరం చెరువు బాగు చేసి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తాం.మక్కువ మండలంలో 100 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం.గత ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసి, శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైంది.. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో శంకుస్థాపనలు చేసి, నిధులు తెచ్చి ప్రారంభోత్సవాలు కూడా చేస్తున్నాం.నాకు ఓటు వేసి గెలిపించిన కన్నవారి మండలమైన మక్కువ మండలన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రుణం తీర్చుకుంటాను: మంత్రి సంధ్యారాణి.3
- స్వర్ణభారతి స్టేడియంలో ఎన్నికల సామగ్రి సిద్ధం......... విశాఖ లోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలకు వేదికగా మారింది. ఎన్నికలకు అవసరమైన సామగ్రిని అధికారులు రంగుల వారీగా వేర్వేరు కట్టలుగా క్రమబద్ధీకరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసి.. సంబంధిత ప్రాంతాలకు పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ.. సామగ్రిని పక్కాగా సిద్ధం చేస్తున్నారు.1
- అవుట్సోర్సింగ్ పారామెడికల్ సిబ్బంది సమ్మెకు సిఐటియు మద్దతు శ్రీకాకుళం : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్ పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సమ్మెకు సిఐటియు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని,రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు, ఉపాధ్యక్షులు బి.మురళి, రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు గొంటి.కృష్ణవేణి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని సిఐటియు ప్రతినిధి బృందం గురువారం సందర్శించి మద్దతు తెలిపింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలోని కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది గత 2 నెలలుగా వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహిస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు అన్నారు. రెగ్యులరైజేషన్, గ్రాస్ శాలరీ చెల్లింపు తదితర డిమాండ్ల పై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకు సిఐటియు శ్రీకాకుళం జిల్లా కమిటీ సంపూర్ణమద్దతు తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి సంఘ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు.1
- ముంచంగిపుట్టులో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభం ముంచంగిపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణను బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్‌చార్జ్ బాకూరు పాండు రాజు ప్రారంభించారు. విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించి, ప్రతిరోజూ గంట సమయం శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు కేటాయించాలని సూచించారు. మూడు నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ట్రైనర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.1
- సేవా జ్యోతి యాత్రకు బీజేపీ శ్రేణులు తరలిరావాలి సేవా జ్యోతి యాత్ర కన్వీనర్ ఇమంది సుధీర్ విజయనగరం, అక్టోబర్ 7: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతమాత సేవలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ జాతీయ పార్టీ పిలుపు మేరకు సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో భాగంగా విజయనగరంలో సేవా జ్యోతి యాత్ర నిర్వహించారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు రింగ్‌రోడ్డులోని వెంకటేశ్వరస్వామి వారి ఆర్చ్ నుంచి జిల్లా బీజేపీ కార్యాలయం వరకు సేవా జ్యోతి యాత్ర ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉదయం 10.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యక్ష ప్రసంగ కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు వీక్షించారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా పదాధికారులు, మండల అధ్యక్షులు, మండల పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా సేవా సంకల్ప అభియాన్ కన్వీనర్ వేమకోటి గిరిబాబు, సేవా జ్యోతి యాత్ర కన్వీనర్ ఇమంది సుధీర్ కోరారు.1