logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

ముంచంగిపుట్టులో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభం ముంచంగిపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణను బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్‌చార్జ్ బాకూరు పాండు రాజు ప్రారంభించారు. విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించి, ప్రతిరోజూ గంట సమయం శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు కేటాయించాలని సూచించారు. మూడు నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ట్రైనర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

22 hrs ago
user_Venkatapplanaidu B
Venkatapplanaidu B
అరకు లోయ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
22 hrs ago

ముంచంగిపుట్టులో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభం ముంచంగిపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణను బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్‌చార్జ్ బాకూరు పాండు రాజు ప్రారంభించారు. విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించి, ప్రతిరోజూ గంట సమయం శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు కేటాయించాలని సూచించారు. మూడు నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ట్రైనర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • ముంచంగిపుట్టులో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభం ముంచంగిపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణను బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్‌చార్జ్ బాకూరు పాండు రాజు ప్రారంభించారు. విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించి, ప్రతిరోజూ గంట సమయం శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు కేటాయించాలని సూచించారు. మూడు నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ట్రైనర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
    1
    ముంచంగిపుట్టులో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభం
ముంచంగిపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణను బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్‌చార్జ్ బాకూరు పాండు రాజు ప్రారంభించారు. విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించి, ప్రతిరోజూ గంట సమయం శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు కేటాయించాలని సూచించారు. మూడు నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ట్రైనర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
    user_Venkatapplanaidu B
    Venkatapplanaidu B
    అరకు లోయ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • విజయనగరం జిల్లా దత్తిరాచార్ మండలం కోమటిపల్లి గ్రామంలో దళిత భూములు ఆక్రమణ తగదు.. విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండల పరిధిలో గల కోమటిపల్లి గ్రామంలో, వడ్డా అప్పన్న, s/0 లేటు చిన్నయ్య, ఎస్సీ మాల కులస్తులు పూర్వం నుంచి, తాతల తండ్రుల నుంచి, అనుభవంలో గల ఖాళీ స్థలాన్ని, గత కొంతకాలంగా, ఒక ఆర్మీ ఉద్యోగి రంగు ముద్ర సోంబాబు సన్నాఫ్ గౌర్నాయుడు, బోర్ బిల్లి సన్యాసి అలియాస్ తాత, వారి కుమారులు రామునాయుడు మరియు అప్పలనాయుడు, దౌర్జన్యంగా, ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ వేసి గుంతలు తీస పని ప్రారంభించారు, ఈ క్రమంలో మేము అడ్డుకోవడానికి వెళ్లే ప్రయత్నంలో మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు, పై విషయాలు పరిగణలోకి తీసుకొని, దత్తి రాజేరు మండల తహసిల్దార్ వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
    1
    విజయనగరం జిల్లా దత్తిరాచార్ మండలం కోమటిపల్లి గ్రామంలో దళిత భూములు ఆక్రమణ తగదు..
విజయనగరం జిల్లా దత్తి రాజేరు మండల పరిధిలో గల కోమటిపల్లి గ్రామంలో, వడ్డా అప్పన్న, s/0 లేటు చిన్నయ్య, ఎస్సీ మాల కులస్తులు  పూర్వం నుంచి, తాతల తండ్రుల నుంచి, అనుభవంలో గల ఖాళీ స్థలాన్ని, గత కొంతకాలంగా, ఒక ఆర్మీ ఉద్యోగి రంగు ముద్ర సోంబాబు సన్నాఫ్ గౌర్నాయుడు, బోర్ బిల్లి సన్యాసి అలియాస్ తాత, వారి కుమారులు రామునాయుడు మరియు అప్పలనాయుడు, దౌర్జన్యంగా, ఇల్లు కట్టుకోవడానికి మెటీరియల్ వేసి గుంతలు తీస పని ప్రారంభించారు, ఈ క్రమంలో మేము అడ్డుకోవడానికి వెళ్లే ప్రయత్నంలో మా మీద దౌర్జన్యం చేసి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసినారు, పై విషయాలు పరిగణలోకి తీసుకొని, దత్తి రాజేరు మండల తహసిల్దార్   వారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • విజయనగరంలో పారదర్శకంగా 25 మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి మిగిలిన 25 మద్యం దుకాణాలకు పారదర్శకంగా లాటరీ మిగిలిన 25 మద్యం దుకాణాలకు పారదర్శకంగా లాటరీ 138 మంది దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ఆఫ్‌ లాట్స్‌ లాటరీ ద్వారా ప్రభుత్వానికి రూ.4.14 కోట్ల ఆదాయం విజయనగరం, అక్టోబర్‌ 8: జిల్లాలో మిగిలిన 25 రిటైల్‌ మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను జిల్లా యంత్రాంగం గురువారం పారదర్శకంగా పూర్తి చేసింది. నూతన ఎక్సైజ్‌ పాలసీ నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్‌ ఎస్. రామ్‌ సుందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అర్హత కలిగిన దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ఆఫ్‌ లాట్స్‌ నిర్వహించి దుకాణాలను కేటాయించారు. జిల్లాలో మొత్తం 169 రిటైల్‌ మద్యం దుకాణాలు ఉండగా, నిబంధనల ప్రకారం 139 దుకాణాలు రెన్యువల్‌ అయ్యాయి. రెన్యువల్‌ కాని దుకాణాల్లో 25 షాపుల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానించగా.. మొత్తం 138 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారి సమక్షంలో లాటరీ నిర్వహించారు. లాటరీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ ఎస్. రామ్‌ సుందర్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి.. ఐదు రౌండ్లలో లాటరీ ప్రక్రియను పూర్తి చేశారు. లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారులు ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు పూర్తి చేసిన అనంతరం లైసెన్సులు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. లైసెన్సుదారులు ఎక్సైజ్‌ చట్టాలు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు, దుకాణాల నిర్వహణ సమయాలు, ఇతర నియంత్రణలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేటాయింపు ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.4.14 కోట్ల ఆదాయం సమకూరిందని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి బి. శ్రీనాధుడు తెలిపారు. నూతన ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా రెన్యువల్‌తో పాటు మిగిలిన దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి బి. శ్రీనాధుడు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.
    4
    విజయనగరంలో పారదర్శకంగా 25 మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి 
 

మిగిలిన 25 మద్యం దుకాణాలకు పారదర్శకంగా లాటరీ
మిగిలిన 25 మద్యం దుకాణాలకు పారదర్శకంగా లాటరీ
138 మంది దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ఆఫ్‌ లాట్స్‌
లాటరీ ద్వారా ప్రభుత్వానికి రూ.4.14 కోట్ల ఆదాయం
విజయనగరం, అక్టోబర్‌ 8: జిల్లాలో మిగిలిన 25 రిటైల్‌ మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను జిల్లా యంత్రాంగం గురువారం పారదర్శకంగా పూర్తి చేసింది. నూతన ఎక్సైజ్‌ పాలసీ నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్‌ ఎస్. రామ్‌ సుందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అర్హత కలిగిన దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ఆఫ్‌ లాట్స్‌ నిర్వహించి దుకాణాలను కేటాయించారు.
జిల్లాలో మొత్తం 169 రిటైల్‌ మద్యం దుకాణాలు ఉండగా, నిబంధనల ప్రకారం 139 దుకాణాలు రెన్యువల్‌ అయ్యాయి. రెన్యువల్‌ కాని దుకాణాల్లో 25 షాపుల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానించగా.. మొత్తం 138 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారి సమక్షంలో లాటరీ నిర్వహించారు.
లాటరీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ ఎస్. రామ్‌ సుందర్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి.. ఐదు రౌండ్లలో లాటరీ ప్రక్రియను పూర్తి చేశారు.
లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారులు ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు పూర్తి చేసిన అనంతరం లైసెన్సులు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. లైసెన్సుదారులు ఎక్సైజ్‌ చట్టాలు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు, దుకాణాల నిర్వహణ సమయాలు, ఇతర నియంత్రణలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కేటాయింపు ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.4.14 కోట్ల ఆదాయం సమకూరిందని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి బి. శ్రీనాధుడు తెలిపారు. నూతన ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా రెన్యువల్‌తో పాటు మిగిలిన దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి బి. శ్రీనాధుడు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    6 hrs ago
  • కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అనకాపల్లి జేఏసి. కాంటాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను తక్షణమే అమలు చేయాలని లేకుంటే ధర్నా మరింత ఉధృతం చేస్తామని గురువారం అనకాపల్లి జేఏసీ డిమాండ్ చేసింది. 100%గ్రాస్ శాలరీ మూలవేతనాన్ని ఇవ్వాలని, రెగ్యులరైజేషన్ చేయాలని, ఉజ్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని, తదితర డిమాండ్ లతో చేపట్టిన ధర్నా కార్యక్రమం నేటికీ తారాస్థాయికి చేరి కొనసాగుతోంది.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది.
    3
    కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అనకాపల్లి జేఏసి.
కాంటాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే  నెరవేర్చాలి.
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను తక్షణమే అమలు చేయాలని లేకుంటే ధర్నా మరింత ఉధృతం  చేస్తామని గురువారం అనకాపల్లి జేఏసీ డిమాండ్ చేసింది. 100%గ్రాస్ శాలరీ మూలవేతనాన్ని ఇవ్వాలని, రెగ్యులరైజేషన్ చేయాలని, ఉజ్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని, తదితర డిమాండ్ లతో చేపట్టిన ధర్నా కార్యక్రమం నేటికీ తారాస్థాయికి చేరి కొనసాగుతోంది.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది.
    user_E.A. KONDABABU
    E.A. KONDABABU
    రోలుగుంట, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • స్వర్ణభారతి స్టేడియంలో ఎన్నికల సామగ్రి సిద్ధం......... విశాఖ లోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలకు వేదికగా మారింది. ఎన్నికలకు అవసరమైన సామగ్రిని అధికారులు రంగుల వారీగా వేర్వేరు కట్టలుగా క్రమబద్ధీకరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసి.. సంబంధిత ప్రాంతాలకు పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ.. సామగ్రిని పక్కాగా సిద్ధం చేస్తున్నారు.
    1
    స్వర్ణభారతి స్టేడియంలో ఎన్నికల సామగ్రి సిద్ధం.........
విశాఖ లోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలకు వేదికగా మారింది.
ఎన్నికలకు అవసరమైన సామగ్రిని అధికారులు రంగుల వారీగా వేర్వేరు కట్టలుగా క్రమబద్ధీకరిస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసి.. సంబంధిత ప్రాంతాలకు పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ.. సామగ్రిని పక్కాగా సిద్ధం చేస్తున్నారు.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    13 hrs ago
  • నాతవరం మండలం,డి.ఎర్రవరం హైస్కూల్‌లో అభయ అవగాహన కార్యక్రమం... నాతవరం (సత్య ఆంధ్ర): అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు నాతవరం మండలం డి.ఎర్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అభయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై నేరాలు, వేధింపులు, బాల్య వివాహాల నివారణ, సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసే విధానం, 112 అత్యవసర సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభయ ఫిర్యాదు పెట్టె వినియోగాన్ని వివరించారు.కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 8, 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఐ నాతవరం ఎన్‌సీసీ కిట్లు, డ్రెస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం పద్మావతి, గ్రామ పెద్దలు బెన్నయ్య నాయుడు, ఇనపసప్పల సత్యవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    నాతవరం మండలం,డి.ఎర్రవరం హైస్కూల్‌లో అభయ అవగాహన కార్యక్రమం...
నాతవరం (సత్య ఆంధ్ర): అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు నాతవరం మండలం డి.ఎర్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అభయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై నేరాలు, వేధింపులు, బాల్య వివాహాల నివారణ, సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసే విధానం, 112 అత్యవసర సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభయ ఫిర్యాదు పెట్టె వినియోగాన్ని వివరించారు.కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 8, 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఐ నాతవరం ఎన్‌సీసీ కిట్లు, డ్రెస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం పద్మావతి, గ్రామ పెద్దలు బెన్నయ్య నాయుడు, ఇనపసప్పల సత్యవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_సత్య ఆంధ్ర
    సత్య ఆంధ్ర
    Local News Reporter నాతవరం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • అవుట్సోర్సింగ్ పారామెడికల్ సిబ్బంది సమ్మెకు సిఐటియు మద్దతు శ్రీకాకుళం : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్ పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సమ్మెకు సిఐటియు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని,రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు, ఉపాధ్యక్షులు బి.మురళి, రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు గొంటి.కృష్ణవేణి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని సిఐటియు ప్రతినిధి బృందం గురువారం సందర్శించి మద్దతు తెలిపింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలోని కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది గత 2 నెలలుగా వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహిస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు అన్నారు. రెగ్యులరైజేషన్, గ్రాస్ శాలరీ చెల్లింపు తదితర డిమాండ్ల పై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకు సిఐటియు శ్రీకాకుళం జిల్లా కమిటీ సంపూర్ణమద్దతు తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి సంఘ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు.
    1
    అవుట్సోర్సింగ్ పారామెడికల్ సిబ్బంది సమ్మెకు సిఐటియు మద్దతు
శ్రీకాకుళం : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖలో అవుట్సోర్సింగ్ పారామెడికల్ సిబ్బంది చేస్తున్న సమ్మెకు సిఐటియు తమ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నదని,రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సమస్యలు పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి పి. తేజేశ్వరరావు, జిల్లా అధ్యక్షులు సిహెచ్.అమ్మన్నాయుడు, ఉపాధ్యక్షులు బి.మురళి, రిమ్స్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు గొంటి.కృష్ణవేణి డిమాండ్ చేశారు. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి వద్ద ఉద్యోగులు చేస్తున్న సమ్మె శిబిరాన్ని సిఐటియు ప్రతినిధి బృందం గురువారం సందర్శించి మద్దతు తెలిపింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలోని కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది గత 2 నెలలుగా వివిధ రూపాలలో ఆందోళనలు నిర్వహిస్తున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వారు అన్నారు. రెగ్యులరైజేషన్, గ్రాస్ శాలరీ చెల్లింపు తదితర డిమాండ్ల పై రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మెకు సిఐటియు శ్రీకాకుళం జిల్లా కమిటీ సంపూర్ణమద్దతు తెలిపింది.రాష్ట్ర ప్రభుత్వం వెంటనే వారి సంఘ ప్రతినిధులతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నేతలు డిమాండ్ చేశారు.
    user_Venkata Ramana Murthy K
    Venkata Ramana Murthy K
    Yoga instructor శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • విజయనగరం జిల్లా క్షయ వ్యాధి నిర్మాణంలో యువత భాగస్వామ్యం కీలకం, క్షయ ఓ డుతుంది దేశం గెలుస్తుంది : డిఎం హెచ్ ఓ డాక్టర్ జీవన్ రాణి.. విజయనగరం, అక్టోబర్ 8: దేశం నుంచి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ జీవనరాణి పిలుపునిచ్చారు. “టీబీ ముక్త్ భారత్ అభియాన్ – JOSH” కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించగా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి పాల్గొని సందేశాన్ని అందించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ, దేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ యువతను భాగస్వాములను చేస్తూ JOSH బృందాలను ఏర్పాటు చేసి, క్షయ వ్యాధి నిర్మూలనలో వారిని చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దుతోందన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో కూడా క్షయ వ్యాధి కొనసాగడం ఆందోళనకరమని, దీనిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. 2030 నాటికి క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సమాజంలో TBపై అవగాహన పెంచాలని సూచించారు. క్షయ వ్యాధి నయమయ్యే వ్యాధి అని, వైద్యుల సూచనల మేరకు మందులను క్రమం తప్పకుండా తీసుకోవడంతో పాటు పౌష్టికాహారం తీసుకుంటే పూర్తిగా కోలుకోవచ్చని తెలిపారు. క్షయ వ్యాధి అంటువ్యాధి కావడంతో, వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మక్రిముల ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందన్నారు. అందువల్ల క్షయ లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ నిర్ధారణ పరీక్షలు, చికిత్స, మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. JOSH కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం JOSH కార్యక్రమం ద్వారా యువత సహకారంతో ప్రజల్లో TBపై అవగాహన పెంచి, వ్యాధి కేసులను ముందుగానే గుర్తించి, బాధితులు చికిత్సను పూర్తిగా తీసుకునేలా ప్రోత్సహించడం ద్వారా TB రహిత భారత్ సాధించడమే లక్ష్యమని తెలిపారు. JOSH బృందాల ప్రధాన విధులు ప్రజలకు TB లక్షణాలు, నివారణ, ముందస్తు నిర్ధారణపై అవగాహన కల్పించడం. TB అనుమానం ఉన్న వ్యక్తులు సకాలంలో పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం. TB చికిత్స పొందుతున్న వారు చికిత్సను పూర్తిగా, క్రమం తప్పకుండా తీసుకునేలా అవగాహన కల్పించడం. TBపై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలు, వివక్షను తగ్గించడం. గ్రామాలు, వార్డులు, బ్లాక్ స్థాయిలో సామాజిక భాగస్వామ్యాన్ని పెంచడం. యువతను TB నిర్మూలన కార్యక్రమంలో చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడం. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సందేశం ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా వర్చువల్‌గా మాట్లాడుతూ, ఎన్‌సీసీ క్యాడెట్లు, యువతను భాగస్వాములను చేస్తూ JOSH బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత సహకారంతో దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తామన్నారు. TBపై సమాజంలో విస్తృతంగా చర్చ జరగడం ద్వారా వ్యాధిపై ప్రజల్లో ఉన్న భయం, అపోహలను తొలగించవచ్చని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు, వైద్య సిబ్బంది తదితర అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు. “యువత సహకారంతో ప్రజల్లో TBపై అవగాహన పెంచి, TB కేసులను త్వరగా గుర్తించి, చికిత్స పూర్తిచేయించి, TB రహిత భారత్ సాధించడానికి చేపట్టే కార్యక్రమమే JOSH” అని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రాణి డీఎల్‌ఏటీఓ, డాక్టర్ సంతోష్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జీజీహెచ్, డాక్టర్ శివకుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జీజీహెచ్, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ అర్చన దేవి, రోహిత్ కుమార్, పీడీ, ఎన్‌హెచ్‌ఏఐ తదితరులు పాల్గొన్నారు.
    1
    విజయనగరం జిల్లా క్షయ వ్యాధి నిర్మాణంలో యువత భాగస్వామ్యం కీలకం, క్షయ ఓ డుతుంది దేశం గెలుస్తుంది : డిఎం హెచ్ ఓ  డాక్టర్ జీవన్ రాణి..
విజయనగరం, అక్టోబర్ 8: దేశం నుంచి క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ జీవనరాణి పిలుపునిచ్చారు. “టీబీ ముక్త్ భారత్ అభియాన్ – JOSH” కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని విజయనగరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించగా, డీఎంహెచ్‌ఓ డాక్టర్ జీవనరాణి పాల్గొని సందేశాన్ని అందించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ, దేశంలో క్షయ వ్యాధిని నిర్మూలించేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ యువతను భాగస్వాములను చేస్తూ JOSH బృందాలను ఏర్పాటు చేసి, క్షయ వ్యాధి నిర్మూలనలో వారిని చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దుతోందన్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత కాలంలో కూడా క్షయ వ్యాధి కొనసాగడం ఆందోళనకరమని, దీనిని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలందరూ సహకరించాలని కోరారు. 2030 నాటికి క్షయ వ్యాధి నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలన్నారు. ముఖ్యంగా యువత ఈ కార్యక్రమంలో చురుకుగా పాల్గొని సమాజంలో TBపై అవగాహన పెంచాలని సూచించారు.
క్షయ వ్యాధి నయమయ్యే వ్యాధి అని, వైద్యుల సూచనల మేరకు మందులను క్రమం తప్పకుండా తీసుకోవడంతో పాటు పౌష్టికాహారం తీసుకుంటే పూర్తిగా కోలుకోవచ్చని తెలిపారు. క్షయ వ్యాధి అంటువ్యాధి కావడంతో, వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే సూక్ష్మక్రిముల ద్వారా ఇతరులకు వ్యాపించే అవకాశం ఉందన్నారు. అందువల్ల క్షయ లక్షణాలు ఉన్నవారు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షయ నిర్ధారణ పరీక్షలు, చికిత్స, మందులు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
JOSH కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం
JOSH కార్యక్రమం ద్వారా యువత సహకారంతో ప్రజల్లో TBపై అవగాహన పెంచి, వ్యాధి కేసులను ముందుగానే గుర్తించి, బాధితులు చికిత్సను పూర్తిగా తీసుకునేలా ప్రోత్సహించడం ద్వారా TB రహిత భారత్ సాధించడమే లక్ష్యమని తెలిపారు.
JOSH బృందాల ప్రధాన విధులు
ప్రజలకు TB లక్షణాలు, నివారణ, ముందస్తు నిర్ధారణపై అవగాహన కల్పించడం.
TB అనుమానం ఉన్న వ్యక్తులు సకాలంలో పరీక్షలు చేయించుకునేలా ప్రోత్సహించడం.
TB చికిత్స పొందుతున్న వారు చికిత్సను పూర్తిగా, క్రమం తప్పకుండా తీసుకునేలా అవగాహన కల్పించడం.
TBపై ప్రజల్లో ఉన్న అపోహలు, భయాలు, వివక్షను తగ్గించడం.
గ్రామాలు, వార్డులు, బ్లాక్ స్థాయిలో సామాజిక భాగస్వామ్యాన్ని పెంచడం.
యువతను TB నిర్మూలన కార్యక్రమంలో చురుకైన భాగస్వాములుగా తీర్చిదిద్దడం.
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి సందేశం
ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జగత్ ప్రకాష్ నడ్డా వర్చువల్‌గా మాట్లాడుతూ, ఎన్‌సీసీ క్యాడెట్లు, యువతను భాగస్వాములను చేస్తూ JOSH బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యువత సహకారంతో దేశంలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తామన్నారు.
TBపై సమాజంలో విస్తృతంగా చర్చ జరగడం ద్వారా వ్యాధిపై ప్రజల్లో ఉన్న భయం, అపోహలను తొలగించవచ్చని తెలిపారు. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రభుత్వం మాత్రమే కాకుండా ప్రజలు, యువత, స్వచ్ఛంద సంస్థలు, వైద్య సిబ్బంది తదితర అన్ని వర్గాల భాగస్వామ్యం అవసరమని పేర్కొన్నారు.
“యువత సహకారంతో ప్రజల్లో TBపై అవగాహన పెంచి, TB కేసులను త్వరగా గుర్తించి, చికిత్స పూర్తిచేయించి, TB రహిత భారత్ సాధించడానికి చేపట్టే కార్యక్రమమే JOSH” అని మంత్రి వివరించారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ రాణి డీఎల్‌ఏటీఓ, డాక్టర్ సంతోష్ కుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జీజీహెచ్, డాక్టర్ శివకుమార్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జీజీహెచ్, డాక్టర్ శ్రీనివాసరావు, డాక్టర్ అర్చన దేవి, రోహిత్ కుమార్, పీడీ, ఎన్‌హెచ్‌ఏఐ తదితరులు పాల్గొన్నారు.
    user_Sativada Venkatarao
    Sativada Venkatarao
    గజపతినగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.