logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అనకాపల్లి జేఏసి. కాంటాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను తక్షణమే అమలు చేయాలని లేకుంటే ధర్నా మరింత ఉధృతం చేస్తామని గురువారం అనకాపల్లి జేఏసీ డిమాండ్ చేసింది. 100%గ్రాస్ శాలరీ మూలవేతనాన్ని ఇవ్వాలని, రెగ్యులరైజేషన్ చేయాలని, ఉజ్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని, తదితర డిమాండ్ లతో చేపట్టిన ధర్నా కార్యక్రమం నేటికీ తారాస్థాయికి చేరి కొనసాగుతోంది.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది.

1 hr ago
user_E.A. KONDABABU
E.A. KONDABABU
రోలుగుంట, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
1 hr ago

కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అనకాపల్లి జేఏసి. కాంటాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను తక్షణమే అమలు చేయాలని లేకుంటే ధర్నా మరింత ఉధృతం చేస్తామని గురువారం అనకాపల్లి జేఏసీ డిమాండ్ చేసింది. 100%గ్రాస్ శాలరీ మూలవేతనాన్ని ఇవ్వాలని, రెగ్యులరైజేషన్ చేయాలని, ఉజ్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని, తదితర డిమాండ్ లతో చేపట్టిన ధర్నా కార్యక్రమం నేటికీ తారాస్థాయికి చేరి కొనసాగుతోంది.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అనకాపల్లి జేఏసి. కాంటాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను తక్షణమే అమలు చేయాలని లేకుంటే ధర్నా మరింత ఉధృతం చేస్తామని గురువారం అనకాపల్లి జేఏసీ డిమాండ్ చేసింది. 100%గ్రాస్ శాలరీ మూలవేతనాన్ని ఇవ్వాలని, రెగ్యులరైజేషన్ చేయాలని, ఉజ్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని, తదితర డిమాండ్ లతో చేపట్టిన ధర్నా కార్యక్రమం నేటికీ తారాస్థాయికి చేరి కొనసాగుతోంది.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది.
    3
    కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అనకాపల్లి జేఏసి.
కాంటాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే  నెరవేర్చాలి.
కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను తక్షణమే అమలు చేయాలని లేకుంటే ధర్నా మరింత ఉధృతం  చేస్తామని గురువారం అనకాపల్లి జేఏసీ డిమాండ్ చేసింది. 100%గ్రాస్ శాలరీ మూలవేతనాన్ని ఇవ్వాలని, రెగ్యులరైజేషన్ చేయాలని, ఉజ్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని, తదితర డిమాండ్ లతో చేపట్టిన ధర్నా కార్యక్రమం నేటికీ తారాస్థాయికి చేరి కొనసాగుతోంది.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది.
    user_E.A. KONDABABU
    E.A. KONDABABU
    రోలుగుంట, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • నాతవరం మండలం,డి.ఎర్రవరం హైస్కూల్‌లో అభయ అవగాహన కార్యక్రమం... నాతవరం (సత్య ఆంధ్ర): అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు నాతవరం మండలం డి.ఎర్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అభయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై నేరాలు, వేధింపులు, బాల్య వివాహాల నివారణ, సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసే విధానం, 112 అత్యవసర సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభయ ఫిర్యాదు పెట్టె వినియోగాన్ని వివరించారు.కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 8, 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఐ నాతవరం ఎన్‌సీసీ కిట్లు, డ్రెస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం పద్మావతి, గ్రామ పెద్దలు బెన్నయ్య నాయుడు, ఇనపసప్పల సత్యవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    1
    నాతవరం మండలం,డి.ఎర్రవరం హైస్కూల్‌లో అభయ అవగాహన కార్యక్రమం...
నాతవరం (సత్య ఆంధ్ర): అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు నాతవరం మండలం డి.ఎర్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అభయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై నేరాలు, వేధింపులు, బాల్య వివాహాల నివారణ, సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసే విధానం, 112 అత్యవసర సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభయ ఫిర్యాదు పెట్టె వినియోగాన్ని వివరించారు.కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 8, 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఐ నాతవరం ఎన్‌సీసీ కిట్లు, డ్రెస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం పద్మావతి, గ్రామ పెద్దలు బెన్నయ్య నాయుడు, ఇనపసప్పల సత్యవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
    user_సత్య ఆంధ్ర
    సత్య ఆంధ్ర
    Local News Reporter నాతవరం, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్•
    2 hrs ago
  • స్వర్ణభారతి స్టేడియంలో ఎన్నికల సామగ్రి సిద్ధం......... విశాఖ లోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలకు వేదికగా మారింది. ఎన్నికలకు అవసరమైన సామగ్రిని అధికారులు రంగుల వారీగా వేర్వేరు కట్టలుగా క్రమబద్ధీకరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసి.. సంబంధిత ప్రాంతాలకు పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ.. సామగ్రిని పక్కాగా సిద్ధం చేస్తున్నారు.
    1
    స్వర్ణభారతి స్టేడియంలో ఎన్నికల సామగ్రి సిద్ధం.........
విశాఖ లోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలకు వేదికగా మారింది.
ఎన్నికలకు అవసరమైన సామగ్రిని అధికారులు రంగుల వారీగా వేర్వేరు కట్టలుగా క్రమబద్ధీకరిస్తున్నారు.
ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసి.. సంబంధిత ప్రాంతాలకు పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ.. సామగ్రిని పక్కాగా సిద్ధం చేస్తున్నారు.
    user_Y.S.RAJ KUMAR PATNAIK
    Y.S.RAJ KUMAR PATNAIK
    Marketing Executive మహారాణిపేట, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    12 hrs ago
  • మన్యం పర్యటనపై మరోసారి బ్రేక్: పవన్ కళ్యాణ్ పర్యటన మళ్లీ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్! ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన మళ్లీ వాయిదా పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 9న పోలవరం/అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో ఆయన పర్యటించాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ఆ పర్యటనను ఈ నెల 12వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. ​పదే పదే వాయిదాలు.. జనసేన శ్రేణుల్లో తీవ్ర నిరాశ: పవన్ కళ్యాణ్ పర్యటన ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో మన్యం ప్రజలతో పాటు జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తి, నిరాశకు గురవుతోంది. డిప్యూటీ సీఎం పర్యటన ఖరారైందని భావించి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది రంపచోడవరంలో ఇప్పటికే పూర్తిస్థాయి భద్రతా తనిఖీలు, ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే చివరి నిమిషంలో పర్యటన 12కు మారడంతో స్పెషల్ ఆఫీసర్లు, సెక్యూరిటీ అధికారులు వచ్చిన దారినే వెనుదిరగాల్సి వచ్చింది. ​12వ తేదీ షెడ్యూల్: ఈ నెల 12న జరగనున్న పర్యటనలో భాగంగా అధికారులు భారీ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు: ​కాకవాడ: హెలిప్యాడ్ ఏర్పాటు, భారీ బహిరంగ సభ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు. ​రాకోట గ్రామం: స్థానిక గిరిజనులు, గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమం. ​ఈసారి కూడా వాయిదా పడకుండా 12వ తేదీనైనా ఉప ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి రావాలని మన్యం ప్రజలు కోరుకుంటున్నారు.
    2
    మన్యం పర్యటనపై మరోసారి బ్రేక్: పవన్ కళ్యాణ్ పర్యటన మళ్లీ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన మళ్లీ వాయిదా పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 9న పోలవరం/అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో ఆయన పర్యటించాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ఆ పర్యటనను ఈ నెల 12వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు.
​పదే పదే వాయిదాలు.. జనసేన శ్రేణుల్లో తీవ్ర నిరాశ:
పవన్ కళ్యాణ్ పర్యటన ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో మన్యం ప్రజలతో పాటు జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తి, నిరాశకు గురవుతోంది. డిప్యూటీ సీఎం పర్యటన ఖరారైందని భావించి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది రంపచోడవరంలో ఇప్పటికే పూర్తిస్థాయి భద్రతా తనిఖీలు, ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే చివరి నిమిషంలో పర్యటన 12కు మారడంతో స్పెషల్ ఆఫీసర్లు, సెక్యూరిటీ అధికారులు వచ్చిన దారినే వెనుదిరగాల్సి వచ్చింది.
​12వ తేదీ షెడ్యూల్:
ఈ నెల 12న జరగనున్న పర్యటనలో భాగంగా అధికారులు భారీ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు:
​కాకవాడ: హెలిప్యాడ్ ఏర్పాటు, భారీ బహిరంగ సభ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు.
​రాకోట గ్రామం: స్థానిక గిరిజనులు, గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమం.
​ఈసారి కూడా వాయిదా పడకుండా 12వ తేదీనైనా ఉప ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి రావాలని మన్యం ప్రజలు కోరుకుంటున్నారు.
    user_Adapa veerababu
    Adapa veerababu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
  • ముంచంగిపుట్టులో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభం ముంచంగిపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణను బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్‌చార్జ్ బాకూరు పాండు రాజు ప్రారంభించారు. విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించి, ప్రతిరోజూ గంట సమయం శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు కేటాయించాలని సూచించారు. మూడు నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ట్రైనర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
    1
    ముంచంగిపుట్టులో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణ ప్రారంభం
ముంచంగిపుట్టు బాలికల ఆశ్రమ పాఠశాలలో రాణీ లక్ష్మీబాయి ఆత్మరక్షణ శిక్షణను బండి మార్షల్ ఆర్ట్స్ జిల్లా ఇన్‌చార్జ్ బాకూరు పాండు రాజు ప్రారంభించారు. విద్యార్థినులకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించి, ప్రతిరోజూ గంట సమయం శారీరక దారుఢ్యం, ఆత్మరక్షణకు కేటాయించాలని సూచించారు. మూడు నెలలపాటు శిక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ట్రైనర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
    user_Venkatapplanaidu B
    Venkatapplanaidu B
    అరకు లోయ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • విజయనగరంలో పారదర్శకంగా 25 మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి మిగిలిన 25 మద్యం దుకాణాలకు పారదర్శకంగా లాటరీ మిగిలిన 25 మద్యం దుకాణాలకు పారదర్శకంగా లాటరీ 138 మంది దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ఆఫ్‌ లాట్స్‌ లాటరీ ద్వారా ప్రభుత్వానికి రూ.4.14 కోట్ల ఆదాయం విజయనగరం, అక్టోబర్‌ 8: జిల్లాలో మిగిలిన 25 రిటైల్‌ మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను జిల్లా యంత్రాంగం గురువారం పారదర్శకంగా పూర్తి చేసింది. నూతన ఎక్సైజ్‌ పాలసీ నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్‌ ఎస్. రామ్‌ సుందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అర్హత కలిగిన దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ఆఫ్‌ లాట్స్‌ నిర్వహించి దుకాణాలను కేటాయించారు. జిల్లాలో మొత్తం 169 రిటైల్‌ మద్యం దుకాణాలు ఉండగా, నిబంధనల ప్రకారం 139 దుకాణాలు రెన్యువల్‌ అయ్యాయి. రెన్యువల్‌ కాని దుకాణాల్లో 25 షాపుల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానించగా.. మొత్తం 138 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారి సమక్షంలో లాటరీ నిర్వహించారు. లాటరీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ ఎస్. రామ్‌ సుందర్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి.. ఐదు రౌండ్లలో లాటరీ ప్రక్రియను పూర్తి చేశారు. లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారులు ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు పూర్తి చేసిన అనంతరం లైసెన్సులు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. లైసెన్సుదారులు ఎక్సైజ్‌ చట్టాలు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు, దుకాణాల నిర్వహణ సమయాలు, ఇతర నియంత్రణలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కేటాయింపు ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.4.14 కోట్ల ఆదాయం సమకూరిందని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి బి. శ్రీనాధుడు తెలిపారు. నూతన ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా రెన్యువల్‌తో పాటు మిగిలిన దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి బి. శ్రీనాధుడు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.
    4
    విజయనగరంలో పారదర్శకంగా 25 మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా కలెక్టర్ ఎస్.రామ్ సుందర్ రెడ్డి 
 

మిగిలిన 25 మద్యం దుకాణాలకు పారదర్శకంగా లాటరీ
మిగిలిన 25 మద్యం దుకాణాలకు పారదర్శకంగా లాటరీ
138 మంది దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ఆఫ్‌ లాట్స్‌
లాటరీ ద్వారా ప్రభుత్వానికి రూ.4.14 కోట్ల ఆదాయం
విజయనగరం, అక్టోబర్‌ 8: జిల్లాలో మిగిలిన 25 రిటైల్‌ మద్యం దుకాణాల కేటాయింపు ప్రక్రియను జిల్లా యంత్రాంగం గురువారం పారదర్శకంగా పూర్తి చేసింది. నూతన ఎక్సైజ్‌ పాలసీ నిబంధనల మేరకు జిల్లా కలెక్టర్‌ ఎస్. రామ్‌ సుందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో అర్హత కలిగిన దరఖాస్తుదారుల సమక్షంలో డ్రా ఆఫ్‌ లాట్స్‌ నిర్వహించి దుకాణాలను కేటాయించారు.
జిల్లాలో మొత్తం 169 రిటైల్‌ మద్యం దుకాణాలు ఉండగా, నిబంధనల ప్రకారం 139 దుకాణాలు రెన్యువల్‌ అయ్యాయి. రెన్యువల్‌ కాని దుకాణాల్లో 25 షాపుల కేటాయింపునకు దరఖాస్తులు ఆహ్వానించగా.. మొత్తం 138 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల పరిశీలన అనంతరం అర్హులైన వారి సమక్షంలో లాటరీ నిర్వహించారు.
లాటరీ ప్రక్రియను ఎలాంటి అవకతవకలకు తావులేకుండా ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ ఎస్. రామ్‌ సుందర్‌ రెడ్డి తెలిపారు. ఇందుకోసం ఐదు కౌంటర్లు ఏర్పాటు చేసి.. ఐదు రౌండ్లలో లాటరీ ప్రక్రియను పూర్తి చేశారు.
లాటరీలో ఎంపికైన దరఖాస్తుదారులు ప్రభుత్వం, ఎక్సైజ్‌ శాఖ నిర్దేశించిన అర్హతలు, నిబంధనలు పూర్తి చేసిన అనంతరం లైసెన్సులు పొందాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. లైసెన్సుదారులు ఎక్సైజ్‌ చట్టాలు, ప్రభుత్వం నిర్ణయించిన ధరలు, దుకాణాల నిర్వహణ సమయాలు, ఇతర నియంత్రణలను తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కేటాయింపు ప్రక్రియ ద్వారా ప్రభుత్వానికి రూ.4.14 కోట్ల ఆదాయం సమకూరిందని జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి బి. శ్రీనాధుడు తెలిపారు. నూతన ఎక్సైజ్‌ పాలసీలో భాగంగా రెన్యువల్‌తో పాటు మిగిలిన దుకాణాల కేటాయింపు ప్రక్రియను నిబంధనల మేరకు పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్. సత్తిబాబు, జిల్లా ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ అధికారి బి. శ్రీనాధుడు, ఎక్సైజ్‌ శాఖ అధికారులు, సిబ్బంది, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.
    user_Giridhar singh
    Giridhar singh
    Real Estate Agent విజయనగరం, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    5 hrs ago
  • బైక్‌ను దోస్త్ వేన్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు స్పందించిన దవులూరి దొరబాబు కాకినాడ జిల్లా..... పెద్దాపురం...... పెద్దాపురం లూథరన్ హైస్కూల్ ఎదురుగా గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దాపురం నుంచి సామర్లకోట వైపు వెళ్తున్న బైక్‌ను దోస్త్ వేన్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దవులూరి దొరబాబు ప్రమాదాన్ని గమనించారు. వెంటనే స్పందించి గాయపడిన వాహనదారుడిని తన కారులో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితుడికి వైద్యులు చికిత్స అందించారు. ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో స్థానికులు దవులూరి దొరబాబు చర్యను అభినందించారు.
    1
    బైక్‌ను దోస్త్ వేన్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు స్పందించిన  దవులూరి దొరబాబు
కాకినాడ జిల్లా.....
పెద్దాపురం......
పెద్దాపురం లూథరన్ హైస్కూల్ ఎదురుగా గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దాపురం నుంచి సామర్లకోట వైపు వెళ్తున్న బైక్‌ను దోస్త్ వేన్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దవులూరి దొరబాబు ప్రమాదాన్ని గమనించారు. వెంటనే స్పందించి గాయపడిన వాహనదారుడిని తన కారులో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితుడికి వైద్యులు చికిత్స అందించారు.
ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో స్థానికులు దవులూరి దొరబాబు చర్యను అభినందించారు.
    user_MDV channel
    MDV channel
    Local News Reporter Kakinada (Rural), Andhra Pradesh•
    31 min ago
  • పారదర్శకంగా మద్యం దుకాణాల లాటరీ: పోలవరం జిల్లా కలెక్టర్ 2026–27 నూతన మద్యం పాలసీ కింద పోలవరం జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. గురువారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో అడ్డతీగల మద్యం షాపు (నంబర్ 28)కు దరఖాస్తుదారుల సమక్షంలో ఓపెన్ లాటరీ నిర్వహించారు. మొత్తం 7 గురు దరఖాస్తు చేసుకోగా, లాటరీ ద్వారా ఎస్.ఎస్. రెడ్డి అనే అభ్యర్థి దుకాణాన్ని దక్కించుకున్నారు. ఎంపికైన అభ్యర్థి నిబంధనల ప్రకారం రుసుము చెల్లించకపోతే, లాటరీలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి అవకాశం ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, సీఐలు శ్రీధర్, ఇంద్రజిత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
    2
    పారదర్శకంగా మద్యం దుకాణాల లాటరీ: పోలవరం జిల్లా కలెక్టర్

2026–27 నూతన మద్యం పాలసీ కింద పోలవరం జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. గురువారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో అడ్డతీగల మద్యం షాపు (నంబర్ 28)కు దరఖాస్తుదారుల సమక్షంలో ఓపెన్ లాటరీ నిర్వహించారు.
మొత్తం 7 గురు దరఖాస్తు చేసుకోగా, లాటరీ ద్వారా ఎస్.ఎస్. రెడ్డి అనే అభ్యర్థి దుకాణాన్ని దక్కించుకున్నారు. ఎంపికైన అభ్యర్థి నిబంధనల ప్రకారం రుసుము చెల్లించకపోతే, లాటరీలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి అవకాశం ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, సీఐలు శ్రీధర్, ఇంద్రజిత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
    user_Adapa veerababu
    Adapa veerababu
    అడ్డతీగల, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    1 hr ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.