Shuru
Apke Nagar Ki App…
పారదర్శకంగా మద్యం దుకాణాల లాటరీ: పోలవరం జిల్లా కలెక్టర్ 2026–27 నూతన మద్యం పాలసీ కింద పోలవరం జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. గురువారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో అడ్డతీగల మద్యం షాపు (నంబర్ 28)కు దరఖాస్తుదారుల సమక్షంలో ఓపెన్ లాటరీ నిర్వహించారు. మొత్తం 7 గురు దరఖాస్తు చేసుకోగా, లాటరీ ద్వారా ఎస్.ఎస్. రెడ్డి అనే అభ్యర్థి దుకాణాన్ని దక్కించుకున్నారు. ఎంపికైన అభ్యర్థి నిబంధనల ప్రకారం రుసుము చెల్లించకపోతే, లాటరీలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి అవకాశం ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, సీఐలు శ్రీధర్, ఇంద్రజిత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
Adapa veerababu
పారదర్శకంగా మద్యం దుకాణాల లాటరీ: పోలవరం జిల్లా కలెక్టర్ 2026–27 నూతన మద్యం పాలసీ కింద పోలవరం జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. గురువారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో అడ్డతీగల మద్యం షాపు (నంబర్ 28)కు దరఖాస్తుదారుల సమక్షంలో ఓపెన్ లాటరీ నిర్వహించారు. మొత్తం 7 గురు దరఖాస్తు చేసుకోగా, లాటరీ ద్వారా ఎస్.ఎస్. రెడ్డి అనే అభ్యర్థి దుకాణాన్ని దక్కించుకున్నారు. ఎంపికైన అభ్యర్థి నిబంధనల ప్రకారం రుసుము చెల్లించకపోతే, లాటరీలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి అవకాశం ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, సీఐలు శ్రీధర్, ఇంద్రజిత్ తదితర అధికారులు పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- మన్యం పర్యటనపై మరోసారి బ్రేక్: పవన్ కళ్యాణ్ పర్యటన మళ్లీ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్! ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన మళ్లీ వాయిదా పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 9న పోలవరం/అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో ఆయన పర్యటించాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ఆ పర్యటనను ఈ నెల 12వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. పదే పదే వాయిదాలు.. జనసేన శ్రేణుల్లో తీవ్ర నిరాశ: పవన్ కళ్యాణ్ పర్యటన ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో మన్యం ప్రజలతో పాటు జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తి, నిరాశకు గురవుతోంది. డిప్యూటీ సీఎం పర్యటన ఖరారైందని భావించి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది రంపచోడవరంలో ఇప్పటికే పూర్తిస్థాయి భద్రతా తనిఖీలు, ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే చివరి నిమిషంలో పర్యటన 12కు మారడంతో స్పెషల్ ఆఫీసర్లు, సెక్యూరిటీ అధికారులు వచ్చిన దారినే వెనుదిరగాల్సి వచ్చింది. 12వ తేదీ షెడ్యూల్: ఈ నెల 12న జరగనున్న పర్యటనలో భాగంగా అధికారులు భారీ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు: కాకవాడ: హెలిప్యాడ్ ఏర్పాటు, భారీ బహిరంగ సభ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు. రాకోట గ్రామం: స్థానిక గిరిజనులు, గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమం. ఈసారి కూడా వాయిదా పడకుండా 12వ తేదీనైనా ఉప ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి రావాలని మన్యం ప్రజలు కోరుకుంటున్నారు.2
- బైక్‌ను దోస్త్ వేన్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలు స్పందించిన దవులూరి దొరబాబు కాకినాడ జిల్లా..... పెద్దాపురం...... పెద్దాపురం లూథరన్ హైస్కూల్ ఎదురుగా గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెద్దాపురం నుంచి సామర్లకోట వైపు వెళ్తున్న బైక్‌ను దోస్త్ వేన్ ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న వ్యక్తికి గాయాలయ్యాయి. అదే సమయంలో అటుగా వెళ్తున్న పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దవులూరి దొరబాబు ప్రమాదాన్ని గమనించారు. వెంటనే స్పందించి గాయపడిన వాహనదారుడిని తన కారులో పెద్దాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో బాధితుడికి వైద్యులు చికిత్స అందించారు. ప్రమాద సమయంలో స్పందించి గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించడంతో స్థానికులు దవులూరి దొరబాబు చర్యను అభినందించారు.1
- నాతవరం మండలం,డి.ఎర్రవరం హైస్కూల్‌లో అభయ అవగాహన కార్యక్రమం... నాతవరం (సత్య ఆంధ్ర): అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు నాతవరం మండలం డి.ఎర్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అభయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై నేరాలు, వేధింపులు, బాల్య వివాహాల నివారణ, సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసే విధానం, 112 అత్యవసర సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభయ ఫిర్యాదు పెట్టె వినియోగాన్ని వివరించారు.కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 8, 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఐ నాతవరం ఎన్‌సీసీ కిట్లు, డ్రెస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం పద్మావతి, గ్రామ పెద్దలు బెన్నయ్య నాయుడు, ఇనపసప్పల సత్యవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- నాయకులు కార్యకర్తల సమక్షంలో మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు వేడుకలు* * కాకినాడ జిల్లా: జగ్గంపేట మండలం స్థానిక జగ్గంపేట గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ మెంబర్ జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు సందర్భంగా, నాయకులు కార్యకర్తలు సమక్షంలో జగ్గంపేటలోని వారి పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కార్యకర్తలతో కలిసి జ్యోతుల రామస్వామి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు తినిపించారు.ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామం మాజీ ఉపసర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ, ప్రజల మనిషి, ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి, జ్యోతుల చంటిబాబు అని, అధికారంలో ఉన్నప్పుడు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేసారని, అలాంటి నాయకుడు మళ్ళీ తమ నియోజకవర్గ ప్రజలకు నాయకత్వం వహించాలని, నిత్యం ప్రజలకు అండగా నిలుస్తూ, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజా మనిషిగా పేరుపొందిన జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఆనందకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంచి లక్ష్మణ్ దొర, దోమల గంగాధర్, అప్పారావు కాపు, పెద్దకాపు, బుద్దిరెడ్డి చెక్కరరావు, నగేష్, సబ్బి శీను , వీధి శ్రీను, కౌశిక్, గౌస్, చిట్టిబాబు, వివేక్, బుజ్జి, తదితర కార్యకర్తలు జ్యోతుల చంటిబాబు అభిమానులు పాల్గొన్నారు...3
- రాజీ మాత్రమే రాజ మార్గం- అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వంశీకృష్ణ అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు వద్ద న్యాయమూర్తి వంశీకృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులు రాజీమార్గంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఉభయపక్షాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం శ్రేయస్కరమన్నారు. దీనివల్ల సమయం, ధనం ఆదా అవ్వడమే కాక ఇరువర్గాల మధ్య సఖ్యత పెరుగుతుందన్నారు. రాజీపడదగిన కేసుల్లో ఈ వేగవంతమైన, చట్టబద్ధమైన పరిష్కారాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.1
- *శ్రీ శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం* *శ్రీ శ్రీ శ్రీ వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం* అనపర్తి:- తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం అనపర్తి పట్టణంలో శ్రీశ్రీశ్రీ వీరుళ్ళమ్మ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. సంఘం నూతన కార్యవర్గ సభ్యులు జిల్లా, మండల స్థాయి నాయకుల సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించగా, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఎం. రాము, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గెల్లా రాజు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారితో పాటు తూర్పుగోదావరి జిల్లా మండల యూనియన్ నాయకులు, అధ్యక్షులు, కార్యదర్శులు పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా నాయకుల సమక్షంలో నిర్వహించిన ప్రమాణ స్వీకార మహోత్సవంలో నూతన కార్యవర్గ సభ్యులు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు. అధ్యక్షులుగా కొవ్వూరి చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శిగా మానేపల్లి మహేష్, గౌరవ అధ్యక్షులుగా వీరభద్రరావు, ఓబులాపురం నరసింహారావు, కోశాధికారిగా ఓబులాపురం నాగలక్ష్మి, ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షులుగా పైల శ్రీహరి, నాతి రవి, సంయుక్త కార్యదర్శిగా నిడదవోలు నరేష్, సంయుక్త కోశాధికారిగా ఎం. సరిత, ప్రజా సంబంధాల అధికారిగా (పీఆర్‌ఓ) సతీష్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వానపల్లి వనజ, టెక్నికల్ ఇన్‌చార్జిగా ఎం. శివ సుబ్రహ్మణ్యం బాధ్యతలు స్వీకరించారు. బోర్డు సభ్యులుగా కొవ్వూరి ఉదయ భాస్కర్ రెడ్డి, సీరం సుబ్రహ్మణ్యం, సురేష్ కుమార్, వి. సుబ్బారావు, దిలీప్ ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కార్యవర్గం సంఘ అభివృద్ధికి, సభ్యుల సంక్షేమానికి సమష్టిగా కృషి చేయాలని ఈ సందర్భంగా జిల్లా నాయకులు ఆకాంక్షించారు. *ఐకమత్యంతో సంఘ బలోపేతానికి కృషి చేయాలి* అనంతరం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా చైర్మన్ ఎం. రాము మాట్లాడుతూ ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వృత్తిలో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు, సభ్యుల సంక్షేమం కోసం సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. సంఘ సభ్యుల మధ్య ఐకమత్యం, పరస్పర సహకారం, సమన్వయంతో ముందుకు సాగితే యూనియన్ మరింత బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు గెల్లా రాజు మాట్లాడుతూ యూనియన్ అభివృద్ధి, సభ్యుల సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. నూతన కార్యవర్గం సమర్థవంతమైన నాయకత్వంతో సంఘాన్ని ప్రగతి పథంలో నడిపించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా గౌరవాధ్యక్షులు పోకల రవి, జిల్లా గౌరవ సలహాదారు గాంధీ, పశ్చిమగోదావరి జిల్లా వ్యవస్థాపకులు భాష, జిల్లా గౌరవాధ్యక్షులు శ్యామ్, నల్లజర్ల యూనియన్ అధ్యక్షులు గోపాలకృష్ణ, తాళ్లపూడి యూనియన్ అధ్యక్షులు ఆశీర్వాదం, నల్లజర్ల యూనియన్ కార్యదర్శి చందర్రావు, కొవ్వూరు యూనియన్‌కు చెందిన శ్రీను, తాళ్లపూడి యూనియన్‌కు చెందిన వెంకటేష్, కొవ్వూరు యూనియన్‌కు చెందిన శశి తదితర ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పాల్గొన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన విందులో జిల్లా, మండల స్థాయి నాయకులు, యూనియన్ ప్రతినిధులు, ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ పాల్గొని నూతన కార్యవర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు.4
- కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అనకాపల్లి జేఏసి. కాంటాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను తక్షణమే అమలు చేయాలని లేకుంటే ధర్నా మరింత ఉధృతం చేస్తామని గురువారం అనకాపల్లి జేఏసీ డిమాండ్ చేసింది. 100%గ్రాస్ శాలరీ మూలవేతనాన్ని ఇవ్వాలని, రెగ్యులరైజేషన్ చేయాలని, ఉజ్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని, తదితర డిమాండ్ లతో చేపట్టిన ధర్నా కార్యక్రమం నేటికీ తారాస్థాయికి చేరి కొనసాగుతోంది.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది.3
- పారదర్శకంగా మద్యం దుకాణాల లాటరీ: పోలవరం జిల్లా కలెక్టర్ 2026–27 నూతన మద్యం పాలసీ కింద పోలవరం జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. గురువారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో అడ్డతీగల మద్యం షాపు (నంబర్ 28)కు దరఖాస్తుదారుల సమక్షంలో ఓపెన్ లాటరీ నిర్వహించారు. మొత్తం 7 గురు దరఖాస్తు చేసుకోగా, లాటరీ ద్వారా ఎస్.ఎస్. రెడ్డి అనే అభ్యర్థి దుకాణాన్ని దక్కించుకున్నారు. ఎంపికైన అభ్యర్థి నిబంధనల ప్రకారం రుసుము చెల్లించకపోతే, లాటరీలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి అవకాశం ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, సీఐలు శ్రీధర్, ఇంద్రజిత్ తదితర అధికారులు పాల్గొన్నారు.2