Shuru
Apke Nagar Ki App…
నాతవరం మండలం,డి.ఎర్రవరం హైస్కూల్‌లో అభయ అవగాహన కార్యక్రమం... నాతవరం (సత్య ఆంధ్ర): అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు నాతవరం మండలం డి.ఎర్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అభయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై నేరాలు, వేధింపులు, బాల్య వివాహాల నివారణ, సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసే విధానం, 112 అత్యవసర సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభయ ఫిర్యాదు పెట్టె వినియోగాన్ని వివరించారు.కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 8, 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఐ నాతవరం ఎన్‌సీసీ కిట్లు, డ్రెస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం పద్మావతి, గ్రామ పెద్దలు బెన్నయ్య నాయుడు, ఇనపసప్పల సత్యవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
సత్య ఆంధ్ర
నాతవరం మండలం,డి.ఎర్రవరం హైస్కూల్‌లో అభయ అవగాహన కార్యక్రమం... నాతవరం (సత్య ఆంధ్ర): అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు నాతవరం మండలం డి.ఎర్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అభయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై నేరాలు, వేధింపులు, బాల్య వివాహాల నివారణ, సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసే విధానం, 112 అత్యవసర సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభయ ఫిర్యాదు పెట్టె వినియోగాన్ని వివరించారు.కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 8, 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఐ నాతవరం ఎన్‌సీసీ కిట్లు, డ్రెస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం పద్మావతి, గ్రామ పెద్దలు బెన్నయ్య నాయుడు, ఇనపసప్పల సత్యవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
- నాతవరం మండలం,డి.ఎర్రవరం హైస్కూల్‌లో అభయ అవగాహన కార్యక్రమం... నాతవరం (సత్య ఆంధ్ర): అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు నాతవరం మండలం డి.ఎర్రవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం అభయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, బాలికలపై నేరాలు, వేధింపులు, బాల్య వివాహాల నివారణ, సమస్యలు ఎదురైనప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేసే విధానం, 112 అత్యవసర సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. పాఠశాలలో ఏర్పాటు చేసిన అభయ ఫిర్యాదు పెట్టె వినియోగాన్ని వివరించారు.కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా 8, 9వ తరగతి విద్యార్థులకు ఎస్‌ఐ నాతవరం ఎన్‌సీసీ కిట్లు, డ్రెస్సులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి హెచ్‌ఎం పద్మావతి, గ్రామ పెద్దలు బెన్నయ్య నాయుడు, ఇనపసప్పల సత్యవతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.1
- కాంట్రాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి అనకాపల్లి జేఏసి. కాంటాక్ట్ ఉద్యోగుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలి. కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలను తక్షణమే అమలు చేయాలని లేకుంటే ధర్నా మరింత ఉధృతం చేస్తామని గురువారం అనకాపల్లి జేఏసీ డిమాండ్ చేసింది. 100%గ్రాస్ శాలరీ మూలవేతనాన్ని ఇవ్వాలని, రెగ్యులరైజేషన్ చేయాలని, ఉజ్యోగ భద్రత కల్పించాలని, హెల్త్ కార్డ్స్ మంజూరు చేయాలని, మృతి చెందిన కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని, తదితర డిమాండ్ లతో చేపట్టిన ధర్నా కార్యక్రమం నేటికీ తారాస్థాయికి చేరి కొనసాగుతోంది.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంటాక్ట్ ఉద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తుంది.3
- మన్యం పర్యటనపై మరోసారి బ్రేక్: పవన్ కళ్యాణ్ పర్యటన మళ్లీ వాయిదా.. నిరాశలో ఫ్యాన్స్! ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మన్యం పర్యటన మళ్లీ వాయిదా పడటం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ నెల 9న పోలవరం/అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలో ఆయన పర్యటించాల్సి ఉండగా, అనివార్య కారణాలతో ఆ పర్యటనను ఈ నెల 12వ తేదీకి రీషెడ్యూల్ చేసినట్లు అధికారులు ధ్రువీకరించారు. పదే పదే వాయిదాలు.. జనసేన శ్రేణుల్లో తీవ్ర నిరాశ: పవన్ కళ్యాణ్ పర్యటన ఇప్పటికే పలుమార్లు వాయిదా పడుతూ వస్తుండటంతో మన్యం ప్రజలతో పాటు జనసేన కేడర్ తీవ్ర అసంతృప్తి, నిరాశకు గురవుతోంది. డిప్యూటీ సీఎం పర్యటన ఖరారైందని భావించి అధికారులు, సెక్యూరిటీ సిబ్బంది రంపచోడవరంలో ఇప్పటికే పూర్తిస్థాయి భద్రతా తనిఖీలు, ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే చివరి నిమిషంలో పర్యటన 12కు మారడంతో స్పెషల్ ఆఫీసర్లు, సెక్యూరిటీ అధికారులు వచ్చిన దారినే వెనుదిరగాల్సి వచ్చింది. 12వ తేదీ షెడ్యూల్: ఈ నెల 12న జరగనున్న పర్యటనలో భాగంగా అధికారులు భారీ ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు: కాకవాడ: హెలిప్యాడ్ ఏర్పాటు, భారీ బహిరంగ సభ, అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు. రాకోట గ్రామం: స్థానిక గిరిజనులు, గ్రామస్థుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు రచ్చబండ కార్యక్రమం. ఈసారి కూడా వాయిదా పడకుండా 12వ తేదీనైనా ఉప ముఖ్యమంత్రి తమ ప్రాంతానికి రావాలని మన్యం ప్రజలు కోరుకుంటున్నారు.2
- నాయకులు కార్యకర్తల సమక్షంలో మాజీ శాసనసభ్యులు జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు వేడుకలు* * కాకినాడ జిల్లా: జగ్గంపేట మండలం స్థానిక జగ్గంపేట గ్రామంలో జగ్గంపేట నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు మరియు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీఈసీ మెంబర్ జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు సందర్భంగా, నాయకులు కార్యకర్తలు సమక్షంలో జగ్గంపేటలోని వారి పార్టీ కార్యాలయంలో అత్యంత ఘనంగా పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా కార్యకర్తలతో కలిసి జ్యోతుల రామస్వామి ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి కార్యకర్తలకు తినిపించారు.ఈ సందర్భంగా జగ్గంపేట గ్రామం మాజీ ఉపసర్పంచ్ బండారు రాజా మాట్లాడుతూ, ప్రజల మనిషి, ప్రజల కోసం నిరంతరం శ్రమించే వ్యక్తి, జ్యోతుల చంటిబాబు అని, అధికారంలో ఉన్నప్పుడు జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కోసం పనిచేసారని, అలాంటి నాయకుడు మళ్ళీ తమ నియోజకవర్గ ప్రజలకు నాయకత్వం వహించాలని, నిత్యం ప్రజలకు అండగా నిలుస్తూ, ప్రజలతో మమేకమై వారి సమస్యలను తెలుసుకుంటూ, ప్రజా మనిషిగా పేరుపొందిన జ్యోతుల చంటిబాబు పుట్టినరోజు సందర్భంగా కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఆయన పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం ఆనందకరమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంచి లక్ష్మణ్ దొర, దోమల గంగాధర్, అప్పారావు కాపు, పెద్దకాపు, బుద్దిరెడ్డి చెక్కరరావు, నగేష్, సబ్బి శీను , వీధి శ్రీను, కౌశిక్, గౌస్, చిట్టిబాబు, వివేక్, బుజ్జి, తదితర కార్యకర్తలు జ్యోతుల చంటిబాబు అభిమానులు పాల్గొన్నారు...3
- అత్యంత ఘనంగా పిఠాపురం ఆర్ఆర్బీ హెచ్ ఆర్ విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. కాకినాడ జిల్లా...పిఠాపురం ఆర్ఆర్బి హెచ్ఆర్ జూనియర్ కళాశాల మరియు హైస్కూల్‌లో చదువుకున్న అన్ని గ్రూపుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రీయూనియన్ అత్యంత ఘనంగా నిర్వహించారు.ప్రముఖులు బొజ్జ వీరవెంకట అప్పారావు ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమం వారి జ్ఞాపకానులు గుర్తు చేసుకుంటూ మరుపురాని రోజులుగా పాత జ్ఞాపకాలను తలుచుకుంటూ ఒకరినొకరు ఆత్మీయంగా కలుసుకొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురం మహారాజా వారి కోటలో గల రెడ్డి రాజాకళ్యాణ మండపంలో హైస్కూల్ మరియు ఇంటర్మీడియట్ చదివిన పూర్వ విద్యార్థులందరూ ఈ ఆత్మీయ సమ్మేళనం పిఠాపురం ఆర్ఆర్బి హెచ్ఆర్ జూనియర్ కళాశాల మరియు హైస్కూల్‌లో చదువుకున్న అన్ని గ్రూపుల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం రీయూనియన్ లో సుమారు 180 మంది చేశారని,పిఠాపురం ఆర్ఆర్బీ హెచ్ ఆర్ విద్యాసంస్థల పూర్వ విద్యార్థుల నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ బొజ్జ వీరవెంకట అప్పారావు,వైస్ ప్రెసిడెంట్ పైడా సత్యనారాయణ, సెక్రటరీ చక్రవర్తుల సూర్యారావు, కోశాధికారి తోట ఏడుకొండలు, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చెక్క రామకృష్ణ, కే.శ్రీనివాస్ రెడ్డి, పెండ్యాల సుదర్శనరావు, కొత్తేం రాంబాబు,పైండా శ్రీనివాసరావు, తాటికొండ సత్యనారాయణ, రెడ్డెం సత్యనారాయణమూర్తి, చక్రవర్తుల జగన్నాథరావు,పేకేటి రమేష్,కొట్టెం మోహన్ రావు, బాలెం నూకరాజు, దూల కృష్ణ, పట్టణ ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.1
- స్వర్ణభారతి స్టేడియంలో ఎన్నికల సామగ్రి సిద్ధం......... విశాఖ లోని స్వర్ణభారతి ఇండోర్ స్టేడియం స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాలకు వేదికగా మారింది. ఎన్నికలకు అవసరమైన సామగ్రిని అధికారులు రంగుల వారీగా వేర్వేరు కట్టలుగా క్రమబద్ధీకరిస్తున్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు అవసరమైన సామగ్రిని సిద్ధం చేసి.. సంబంధిత ప్రాంతాలకు పంపించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులు, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ.. సామగ్రిని పక్కాగా సిద్ధం చేస్తున్నారు.1
- రాజీ మాత్రమే రాజ మార్గం- అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి వంశీకృష్ణ అనపర్తి జూనియర్ సివిల్ కోర్టు వద్ద న్యాయమూర్తి వంశీకృష్ణ ఆధ్వర్యంలో న్యాయవాదులు రాజీమార్గంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఉభయపక్షాలు మధ్యవర్తిత్వం ద్వారా వివాదాలు పరిష్కరించుకోవడం శ్రేయస్కరమన్నారు. దీనివల్ల సమయం, ధనం ఆదా అవ్వడమే కాక ఇరువర్గాల మధ్య సఖ్యత పెరుగుతుందన్నారు. రాజీపడదగిన కేసుల్లో ఈ వేగవంతమైన, చట్టబద్ధమైన పరిష్కారాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.1
- పారదర్శకంగా మద్యం దుకాణాల లాటరీ: పోలవరం జిల్లా కలెక్టర్ 2026–27 నూతన మద్యం పాలసీ కింద పోలవరం జిల్లాలో మద్యం దుకాణాల కేటాయింపును పూర్తిగా పారదర్శకంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ తెలిపారు. గురువారం రంపచోడవరం ఐటీడీఏ సమావేశ మందిరంలో అడ్డతీగల మద్యం షాపు (నంబర్ 28)కు దరఖాస్తుదారుల సమక్షంలో ఓపెన్ లాటరీ నిర్వహించారు. మొత్తం 7 గురు దరఖాస్తు చేసుకోగా, లాటరీ ద్వారా ఎస్.ఎస్. రెడ్డి అనే అభ్యర్థి దుకాణాన్ని దక్కించుకున్నారు. ఎంపికైన అభ్యర్థి నిబంధనల ప్రకారం రుసుము చెల్లించకపోతే, లాటరీలో రెండో స్థానంలో నిలిచిన వ్యక్తికి అవకాశం ఇస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సుబ్రమణ్యం, సీఐలు శ్రీధర్, ఇంద్రజిత్ తదితర అధికారులు పాల్గొన్నారు.2