యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలు పూల మాలలు వేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం నిర్వహించగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, బీసీ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారికంగా విశ్వకర్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, విరాట్ విశ్వకర్మ దైవ రూపంగా, ఆధ్యాత్మికతో, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజన్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, విశ్వకర్మ కుల సంఘ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలు పూల మాలలు వేసిన ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్ యజ్ఞ మహోత్సవ్ విరాట్ విశ్వకర్మ ఉత్సవ వేడుకలను జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో గురువారం నిర్వహించగా, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, బీసీ కుల సంఘాల నాయకులు, జిల్లా అధికారులు సిబ్బందితో కలిసి విశ్వకర్మ చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి, పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా
ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ .. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో అధికారికంగా విశ్వకర్మ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, విరాట్ విశ్వకర్మ దైవ రూపంగా, ఆధ్యాత్మికతో, భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, అదనపు కలెక్టర్ గడ్డం నగేష్, జిల్లా రెవెన్యూ అధికారి జయశ్రీ, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజన్య, జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, విశ్వకర్మ కుల సంఘ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
- కరీంనగర్ లో ఈనెల 23న గణేష్ నిమజ్జనోత్సవం...ఏర్పాట్లను పరిశీలించిన కేంద్రమంత్రి బండి సంజయ్ కరీంనగర్ లో గణేష్ నిమజ్జనోత్సవానికి పకడ్బందీగా విస్తృత ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు. మానకొండూరు, చింతకుంట, కొత్తపల్లిలో వినాయక నిమజ్జనానికి సంబంధించి ఏర్పాట్లను మేయర్ శ్రీనివాస్, కలెక్టర్ చిత్రా మిశ్రా సిపి గౌస్ ఆలం తో కలిసి బండి సంజయ్ పరిశీలించారు. కరీంనగర్ లో ఈ నెల 23న నిర్వహించనున్న వినాయక నిమజ్జనోత్సవాన్ని బ్రహ్మాండంగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గతంలో నిమజ్జన సమయంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈసారి ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆదేశించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, విద్యుత్, లైటింగ్, భారీ క్రేన్లు, పారిశుధ్యం, ట్రాఫిక్ నియంత్రణ తదితర సౌకర్యాలను ముందుగానే సిద్ధం చేయాలని సూచించారు. మానకొండూరు చెరువుతో పాటు చింతకుంట కాకతీయ కెనాల్, కొత్తపల్లి ప్రాంతాల్లో నిమజ్జనానికి అవసరమైన నీటిని విడుదల చేయాలని సాగునీటి శాఖ మంత్రి, ఉన్నతాధికారులను కోరినట్లు ఆయన చెప్పారు. నిమజ్జనోత్సవ సమయానికి అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఇరిగేషన్ అధికారులు ఇందుకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. కరీంనగర్‌లోని సుమారు 50 శాతం వినాయక విగ్రహాలు మానకొండూరు చెరువు వద్ద నిమజ్జనం కానున్నందున అక్కడ ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని చెప్పారు.1
- జగిత్యాల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి పూజ, అన్నదానం.. కార్యక్రమంలో పాల్గొన్న : మున్సిపల్ చైర్ పర్సన్ సమిల్లా వాణి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్1
- ధర్మపురి పట్టణంలో ఘనంగా విశ్వకర్మ జయంతి ప్రత్యేక పూజలు జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని గోదావరి తీరంలో గల విశ్వబ్రాహ్మణ సంఘ భవనంలో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈనెల 15న స్థానిక విశ్వబ్రాహ్మణ స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ప్రారంభమైన విశ్వకర్మ జయంతి ఉత్సవాలు చివరి రోజు స్థాపిత మండపారాధన... విశ్వకర్మ హోమం... పూర్ణాహుతి కార్యక్రమాలను వేదమంత్రాల మధ్య శాస్త్రోక్తంగా నిర్వహించారు.శ్రీ లలిత సహస్రనామ దేవి ఖడ్గమాల సహిత కుంకుమార్చన కార్యక్రమాన్ని మహిళలు సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం విశ్వకర్మ భగవానుని విగ్రహాన్ని పురవీధుల్లో శోభాయాత్రగా తీసుకొని వెళ్లి స్థానిక గోదావరి నదిలో నిమజ్జనం చేయడంతో ఉత్సవాలు ముగుస్తాయి. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.1
- దండేపల్లి: మంచిర్యాల - అదిలాబాద్ ప్రధాన రహదారి పై గుంతతో వాహనదారుల ఇబ్బందులు దండేపల్లి మండల కేంద్రంలోని మంచిర్యాల -అదిలాబాద్ ప్రధాన రహదారిపై ఏర్పడిన గుంతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుంతను తప్పించే క్రమంలో ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రాత్రివేళల్లో గుంత కనిపించక మరింత ప్రమాదకరంగా మారుతోందని వాహనదారులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చి రోడ్డుకు మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.1
- ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బాలాజీ మందిరంలో ఆశీర్వాద దీపాలు వెలిగించిన బిజెపి నాయకులు మాజీ జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినోత్సవం సందర్భంగా మెదక్ పట్టణంలో బాలాజీ ఆలయంలో నరేంద్ర మోడీ గారు నిండు నూరేళ్లు జీవించి దేశ ప్రధానిగా ఉండి వికసిత్ భారత లక్ష్యం చేరుకొని విశ్వ గురువుగా మారాలని ఆయన ఆయురారోగ్యాలు బాగుండాలని ఆశీర్వాద దీపం కార్యక్రమం పేరుమీద దీపాలు వెలిగించి దేవుని కోరుకోనిప్రత్యేకపూజలోపాల్గోన్నబిజేపి మెదక్ జిల్లా మాజీ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు నాయిని ప్రసాద్, మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు పట్లోల్ల మల్లిక ధార్మిక సెల్ కన్వీనర్ రాజేశ్వరి, బిజేపి ధార్మిక సెల్ జయంతి కన్వీనర్ కృష్ణ, 21 వార్డ్ కౌన్సిలర్ పబ్బా రాజమణి లక్ష్మణ్ 28 వార్డ్ కౌన్సిలర్ అఖిలభారత్, సౌజన్య ప్రభాకర్ అంకం శ్రీను మైనార్టీ మోర్చా అధ్యక్షుడు గ్యాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు1
- తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరుల స్ఫూర్తితో ఉద్యమిస్తాo సుంకరి సంపత్ అల్ ఇండియా అగ్రికల్చర్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించినారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం, భూస్వామ్య విధానానికి, జామిందార్లకు, జాగిర్దారులకు, వ్యతిరేకంగా సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాడు 10 లక్షల ఎకరాల భూమిని పంచిందని, పదివేల గ్రామాలకు విస్తరించి నాలుగు వేల గ్రామ రాజ్యలను ఏర్పాటు చేసింది . ప్రపంచ చరిత్రలో గుర్తింపు పొందిన ఈ పోరాటాన్ని వక్రీకరించాలని బిజెపి ఆర్ఎస్ఎస్ కుట్రలు చేస్తుంది. ఈ పోరాటానికి సంబంధం లేని సంస్థలు రాజకీయ పార్టీలు ఈ పోరాటాన్ని విశ్లేషిస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చరిత్రను వక్రీకరిస్తున్నారు. ఆంధ్ర మహాసభ పేరుతో ఏర్పడ సంస్థ భాష సంస్కృతిక రంగాలకు విస్తరించి నాటి నిజాం ప్రభుత్వం యొక్క నిరంకుషానికి వ్యతిరేకంగా సంఘం పెట్టి ఎర్రజెండా నాయకత్వన వీరోచితమైనటువంటి పోరాటాన్ని చేసింది ఈ పోరాటంలో 4000 మంది కమ్యూనిస్టు కార్యకర్తలు తమ ప్రాణాల్ని అర్పించారని పేదల రాజ్యం రావాలని భూస్వాముల పెట్టుబడిదారుల గుండెల్లో గుణపాలు దింపింది ఈ పోరాటం అని గుర్తు చేశారు. దీని స్ఫూర్తితో దేశంలో అనేక రాష్ట్రాలలో రైతులు కార్మికులు సంస్థలు అనేక ప్రజా ఉద్యమాల్ని నడిపాయని గుర్తు చేశారు. ఈ పోరాటాన్ని తట్టుకోలేక నిజాం ప్రభువు ఇండియన్ యూనియన్ ప్రభుత్వంతో చేతులు కలిపి హైదరాబాద్ సంస్థనాన్ని ఇండియన్ యూనియన్ గవర్నమెంట్ లో విలీనం చేశారు. ఈ విలీనం అనంతరం కమ్యూనిస్టు పార్టీలపైన సాయుధ పోరాటం నడిపిన కార్యకర్తల పైన రెండు సంవత్సరాల పాటు నెహ్రు సైన్యాలు నిర్బంధాన్ని ప్రయోగించి వేలాది మందిని జైల్లో పెట్టింది. కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను గ్రామాలలో ఎక్కడికక్కడ కాల్పులు జరిపి చంపించారని గుర్తు చేశారు. ఇంత వీరోచితంగా స్థాయినటువంటి ఈ పోరాటాన్ని బిజెపి ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లిం వ్యతిరేక పోరాటంగా మార్చి రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తుంది. నిజాం ప్రభువు ముస్లిం, గ్రామాలలో జమీందారులుగా జాగిర్ధాలుగా విసునూరు రామచంద్రారెడ్డి లాంటి నరహంతకులు ప్రజలను హింసించారు. ఈ పోరాటంలో జమీందారులకు జాగిర్దారులకు వ్యతిరేకంగా షేక్ బంధకి, మొగ్ధం మోయినవుద్దీన్, అశ్వవుల్లా ఖాన్, సోయబుల్లాఖాన్, భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం, అనభేరి ప్రభాకర్ రావు సింగిరెడ్డి భూపతి రెడ్డి బద్దం ఎల్లారెడ్డి చాకలి ఐలమ్మ దొడ్డి కొమురయ్య తాను నాయక్, ఆరుట్ల కమలాదేవి. లాంటి ఎందరో వీరులు కులానికి, మతానికి ప్రాంతానికి ,వ్యతిరేకంగా భూస్వామ్య విధానానికి వ్యతిరేకంగా సాగిన ఒక వర్గ పోరాటం అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో రానున్న కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ జిల్లాలో పేద ప్రజలందరికీ ఇండ్లు ఇళ్లస్థలాల కోసం , నిరుపేదలకు భూములు పంచాలని డిమాండ్ తో రానున్న కాలంలో ఉద్యమాలు కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షులు రాయి కంటి శ్రీనివాస్ సంఘం నాయకులు ఈ వెంకటేష్, బాలరాజు, సాగర్ రాజు ,తదితరులు పాల్గొన్నారు...2
- తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామ రక్షా... కాంగ్రెస్ పాలన నైజామ్ ను తలపిస్తుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి విమర్శ పదేళ్ళు తెలంగాణ లో కెసిఆర్ బంగారు పాలన సాగిస్తే, రేవంత్ రెడ్డి పాలన నిజాం పాలనను తలపిస్తుందని మాజీ మంత్రి బిఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి విమర్శించారు. జగిత్యాల తెలంగాణ భవన్ లో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ను జీవన్ రెడ్డి ఆవిష్కరించి తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి.. నివాళులు అర్పించారు. ఆంధ్ర ప్రాంతానికి తాకట్టు పెట్టిన తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగించిన తెలంగాణ ప్రదాత కెసిఆర్ అని కొనియాడారు. పదవులు తృణ ప్రాయంగా త్యాగం చేసి, తన ప్రాణాన్ని ఫణంగా పెట్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, గిరిజనులకు 6 నుండి 10 శాతానికి రిజర్వేషన్ కల్పించారని తెలిపారు. తెలంగాణ్ రాష్ట్ర భవిషత్ కేసీఆర్ అని, కెసిఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష అని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం స్పూర్తి తో కేసీఆర్ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేసి,తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని సాధించుకున్న తెలంగాణ పరుల పాలు కాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరు ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.2
- వార్డులో పర్యటించి వార్డులో కొనసాగుతున్న పారిశుధ్య పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన : జగిత్యాల మున్సిపల్ చైర్‌పర్సన్ సమీండ్ల వాణి1
- యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్‌ఆర్ చౌరస్తాలో నడిరోడ్డుపై హరిబాబును కారులో వచ్చి కత్తితో నరికి చంపిన దుండగుడు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గతంలో అదనపు కట్నం విషయంలో 4 నెలల గర్భిణీగా ఉన్న వైష్ణవిని చంపిన భర్త హరిబాబు1