logo
Shuru
Apke Nagar Ki App…
  • Latest News
  • News
  • Politics
  • Elections
  • Viral
  • Astrology
  • Horoscope in Hindi
  • Horoscope in English
  • Latest Political News
logo
Shuru
Apke Nagar Ki App…

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలు విజయోత్సవాలు కావని, అవి కేవలం వైఫల్యాల సంబరాలని వైఎస్సార్‌సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్ తీవ్రంగా విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, వైద్యం, విద్య, రవాణా వంటి మౌలిక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకుండా కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించిన పరశురామ్, కేవలం ప్రచార కార్యక్రమాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని, ప్రజలు వాస్తవాలను నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

21 hrs ago
user_Nava surya
Nava surya
జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
21 hrs ago

కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలు విజయోత్సవాలు కావని, అవి కేవలం వైఫల్యాల సంబరాలని వైఎస్సార్‌సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్ తీవ్రంగా విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, వైద్యం, విద్య, రవాణా వంటి మౌలిక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకుండా కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించిన పరశురామ్, కేవలం ప్రచార కార్యక్రమాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని, ప్రజలు వాస్తవాలను నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

More news from ఆంధ్రప్రదేశ్ and nearby areas
  • అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గత వారం రోజులుగా కొనసాగుతున్న ఎండ తీవ్రత, ఉక్కపోతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో స్థానికులు ఊరట చెందారు. ఈ వర్షం రాగులు, సామలు, వరి వంటి పంటలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని వర్షాలు కురిస్తే సాగుకు మరింత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    1
    అల్లూరి సీతారామరాజు జిల్లాలోని డుంబ్రిగూడ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో బుధవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. గత వారం రోజులుగా కొనసాగుతున్న ఎండ తీవ్రత, ఉక్కపోతతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ఈ వర్షం కొంత ఉపశమనాన్ని కలిగించింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో స్థానికులు ఊరట చెందారు.

ఈ వర్షం రాగులు, సామలు, వరి వంటి పంటలకు చాలా ప్రయోజనకరంగా ఉంటుందని గిరిజన రైతులు ఆనందం వ్యక్తం చేశారు. మరిన్ని వర్షాలు కురిస్తే సాగుకు మరింత అనుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • రాష్ట్ర హోంమంత్రి వంగళపూడి అనితకు వైసీపీ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలుగు మహిళా పట్టణ అధ్యక్షురాలు కె.లక్ష్మి, మాజీ కౌన్సిలర్లు బర్లి శ్రీదేవి, తెంటు పార్వతి డిమాండ్ చేశారు. బుధవారం బొబ్బిలి కోటలో వారు ఈ మేరకు స్పందించారు. మహిళలను గౌరవించాల్సిన వైసీపీ నాయకులు కించపరిచేలా మాట్లాడడం ఏమాత్రం సరికాదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. హోంమంత్రి అనితపై అసభ్యకరంగా మాట్లాడడం అన్యాయమని తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల గౌరవం ప్రదర్శించాలని వారు డిమాండ్ చేశారు.
    2
    రాష్ట్ర హోంమంత్రి వంగళపూడి అనితకు వైసీపీ మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని తెలుగు మహిళా పట్టణ అధ్యక్షురాలు కె.లక్ష్మి, మాజీ కౌన్సిలర్లు బర్లి శ్రీదేవి, తెంటు పార్వతి డిమాండ్ చేశారు. బుధవారం బొబ్బిలి కోటలో వారు ఈ మేరకు స్పందించారు.

మహిళలను గౌరవించాల్సిన వైసీపీ నాయకులు కించపరిచేలా మాట్లాడడం ఏమాత్రం సరికాదని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. హోంమంత్రి అనితపై అసభ్యకరంగా మాట్లాడడం అన్యాయమని తీవ్రంగా ఖండించారు. మహిళల పట్ల గౌరవం ప్రదర్శించాలని వారు డిమాండ్ చేశారు.
    user_వెంకీ నాయుడు
    వెంకీ నాయుడు
    బొబ్బిలి, విజయనగరం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • విశాఖ నగరంలో యువత ఖరీదైన బైక్‌లపై కంపెనీ అమర్చిన సైలెన్సర్లను తొలగించి, అధిక శబ్దం మరియు పొగను వెదజల్లే సైలెన్సర్లను అమర్చడం, అలాగే కార్లు/ఆటోలకు అనధికారికంగా హై-బీమ్ లైట్లను అమర్చడం, ద్విచక్ర వాహనాలకు మొబైల్ స్టాండ్‌లను అమర్చడం వంటి చర్యల వల్ల మితిమీరిన శబ్ద, వాయు కాలుష్యం మరియు రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ వ్యవహారంపై చాలామంది మహిళలు, వృద్ధులు, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు ఆందోళన వ్యక్తం చేస్తూ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ మరియు అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు జనవరి 01, 2026 నుండి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటివరకు 142 సైలెన్సర్లు, 89 హై-బీమ్ లైట్లు, 290 మొబైల్ స్టాండ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా, బీచ్ మరియు ఇతర రహదారులపై బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టి, దఫాదఫాలుగా 3 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేయమని డిప్యూటీ టఠకాన్పూరక్టర్ కమీషనర్ (DTC), విశాఖపట్నానికి సిఫార్సు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షా వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు: మోడిఫైడ్ సైలెన్సర్లు మరియు హై-బీమ్ లైట్ ఉల్లంఘనలకు మొదటిసారి 3 నెలల జైలు శిక్ష లేదా ₹10,000 జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ జప్తు; రెండవసారి 6 నెలల జైలు శిక్ష లేదా ₹10,000 జరిమానాతో పాటు వాహనం స్వాధీనం మరియు లైసెన్స్ మరో 3 నెలల పాటు జప్తు ఉంటుంది. మొబైల్ స్టాండ్ ఉల్లంఘనకు ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా ₹1,000 నుండి ₹10,000 వరకు జరిమానా, మరియు 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ జప్తు విధించబడుతుంది. కాగా, గౌరవ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారు అందించిన ₹6,75,000 నిధులతో 450 వేసవి కిట్‌లను ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి గౌరవ పోలీస్ కమషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ గారు అందజేశారు. విశాఖపట్నం సిటీ పోలీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, వాహనాల్లో మార్పులు చేసి శబ్ద కాలుష్యం కలిగించే వాహనాల వల్ల పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. హై-బీమ్ లైట్లు మరియు మొబైల్ స్టాండ్‌లు ప్రమాదాలకు కారణమవుతున్నందున, వాహనదారులు అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు.
    1
    విశాఖ నగరంలో యువత ఖరీదైన బైక్‌లపై కంపెనీ అమర్చిన సైలెన్సర్లను తొలగించి, అధిక శబ్దం మరియు పొగను వెదజల్లే సైలెన్సర్లను అమర్చడం, అలాగే కార్లు/ఆటోలకు అనధికారికంగా హై-బీమ్ లైట్లను అమర్చడం, ద్విచక్ర వాహనాలకు మొబైల్ స్టాండ్‌లను అమర్చడం వంటి చర్యల వల్ల మితిమీరిన శబ్ద, వాయు కాలుష్యం మరియు రహదారి ప్రమాదాలకు కారణమవుతున్నారు. ఈ వ్యవహారంపై చాలామంది మహిళలు, వృద్ధులు, హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు ఆందోళన వ్యక్తం చేస్తూ నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన విశాఖపట్నం నగర పోలీస్ కమిషనర్ మరియు అడిషనల్ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు జనవరి 01, 2026 నుండి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ డ్రైవ్‌లో ఇప్పటివరకు 142 సైలెన్సర్లు, 89 హై-బీమ్ లైట్లు, 290 మొబైల్ స్టాండ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

అదేవిధంగా, బీచ్ మరియు ఇతర రహదారులపై బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్న వారిపై చర్యలు చేపట్టి, దఫాదఫాలుగా 3 ద్విచక్ర వాహనాలను అదుపులోకి తీసుకుని, వారిపై కేసులు నమోదు చేశారు. వారి డ్రైవింగ్ లైసెన్స్‌లను సస్పెండ్ చేయమని డిప్యూటీ టఠకాన్పూరక్టర్ కమీషనర్ (DTC), విశాఖపట్నానికి సిఫార్సు చేయడం జరిగింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన శిక్షా వివరాలను కూడా పోలీసులు వెల్లడించారు: మోడిఫైడ్ సైలెన్సర్లు మరియు హై-బీమ్ లైట్ ఉల్లంఘనలకు మొదటిసారి 3 నెలల జైలు శిక్ష లేదా ₹10,000 జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ జప్తు; రెండవసారి 6 నెలల జైలు శిక్ష లేదా ₹10,000 జరిమానాతో పాటు వాహనం స్వాధీనం మరియు లైసెన్స్ మరో 3 నెలల పాటు జప్తు ఉంటుంది. మొబైల్ స్టాండ్ ఉల్లంఘనకు ఒక సంవత్సరం జైలు శిక్ష లేదా ₹1,000 నుండి ₹10,000 వరకు జరిమానా, మరియు 3 నెలలపాటు డ్రైవింగ్ లైసెన్స్ జప్తు విధించబడుతుంది.

కాగా, గౌరవ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ వారు అందించిన ₹6,75,000 నిధులతో 450 వేసవి కిట్‌లను ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి గౌరవ పోలీస్ కమషనర్ శ్రీ శంఖబ్రత బాగ్చి ఐపీఎస్ గారు అందజేశారు. విశాఖపట్నం సిటీ పోలీస్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, వాహనాల్లో మార్పులు చేసి శబ్ద కాలుష్యం కలిగించే వాహనాల వల్ల పిల్లలు, స్త్రీలు, వృద్ధులు, గుండె జబ్బులు ఉన్నవారు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. హై-బీమ్ లైట్లు మరియు మొబైల్ స్టాండ్‌లు ప్రమాదాలకు కారణమవుతున్నందున, వాహనదారులు అందరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని కోరారు.
    user_N.S.R.Guptha
    N.S.R.Guptha
    గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్•
    22 hrs ago
  • శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బుధవారం జోరుగా వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది. అయితే, ఈ వర్షం ఖరీఫ్ వరి సాగు కోసం పొడి దుక్కిలో వేసిన విత్తనాలకు మేలు చేస్తుందని అధికారులు తెలిపారు. దుక్కి పనులకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    1
    శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా బుధవారం జోరుగా వర్షం కురిసింది. ఈదురుగాలుల ధాటికి పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. దీని ప్రభావంతో కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడగా, మామిడి కాయలు రాలిపోవడంతో రైతులకు నష్టం వాటిల్లింది.

అయితే, ఈ వర్షం ఖరీఫ్ వరి సాగు కోసం పొడి దుక్కిలో వేసిన విత్తనాలకు మేలు చేస్తుందని అధికారులు తెలిపారు. దుక్కి పనులకు అనుకూల పరిస్థితులు నెలకొనడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
    user_Bhoomi
    Bhoomi
    Librarian గార, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్•
    3 hrs ago
  • కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో గల కుమ్మరి వారి వీధిలోని టాటా ఇన్నోవేషన్ అబ్ ఆధ్వర్యంలో జూన్ 17న అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా, గ్రామీణ యువత, మహిళలు, రైతులు మరియు సూక్ష్మ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఆర్‌టీఐహెచ్ గ్రామీణ వ్యవస్థాపకత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాజమండ్రి సీఈవో, హెడ్ ఆఫ్ ఇంకూబేషన్ రవి ఈశ్వరపు తెలియజేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, తద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు. టిట్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ కె. చంద్ర ప్రకాష్ మాట్లాడుతూ, ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం జూన్ 17 నుండి 23, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణలో వ్యాపార అవకాశాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, సాంకేతికత ఆధారిత వ్యాపారాల నిర్వహణ, మార్కెట్ మరియు ఆర్థిక వనరుల వినియోగం, ప్రభుత్వ పథకాలపై అవగాహన, అలాగే వ్యాపార కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ ప్లాన్) రూపకల్పన వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జి. పాండురంగ, టి. శ్రీనివాస్, కె. మణికంఠతో పాటు పలువురు మహిళలు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల ఆలోచనలను ప్రపంచ స్థాయి ఆవిష్కరణలుగా మార్చే లక్ష్యంతో టాటా ఇన్నోవేషన్ అబ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
    4
    కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో గల కుమ్మరి వారి వీధిలోని టాటా ఇన్నోవేషన్ అబ్ ఆధ్వర్యంలో జూన్ 17న అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా, గ్రామీణ యువత, మహిళలు, రైతులు మరియు సూక్ష్మ వ్యాపారవేత్తలను లక్ష్యంగా చేసుకుని ఆర్‌టీఐహెచ్ గ్రామీణ వ్యవస్థాపకత శిక్షణ కార్యక్రమాన్ని చేపట్టినట్లు రాజమండ్రి సీఈవో, హెడ్ ఆఫ్ ఇంకూబేషన్ రవి ఈశ్వరపు తెలియజేశారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రత్యేక శిక్షణ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలను పెంపొందించడం, కొత్త వ్యాపారాలను ప్రోత్సహించడం, తద్వారా గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పడటం ప్రధాన లక్ష్యమని ఆయన వివరించారు.

టిట్ ప్రోగ్రామ్ అసోసియేట్స్ కె. చంద్ర ప్రకాష్ మాట్లాడుతూ, ఈ ఉచిత శిక్షణ కార్యక్రమం జూన్ 17 నుండి 23, 2026 వరకు ప్రతిరోజూ ఉదయం 10:00 గంటల నుండి సాయంత్రం 4:00 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఈ శిక్షణలో వ్యాపార అవకాశాల గుర్తింపు, విలువ ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, సాంకేతికత ఆధారిత వ్యాపారాల నిర్వహణ, మార్కెట్ మరియు ఆర్థిక వనరుల వినియోగం, ప్రభుత్వ పథకాలపై అవగాహన, అలాగే వ్యాపార కార్యాచరణ ప్రణాళిక (బిజినెస్ ప్లాన్) రూపకల్పన వంటి అంశాలపై సమగ్ర శిక్షణ అందిస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జి. పాండురంగ, టి. శ్రీనివాస్, కె. మణికంఠతో పాటు పలువురు మహిళలు మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు. గ్రామాల ఆలోచనలను ప్రపంచ స్థాయి ఆవిష్కరణలుగా మార్చే లక్ష్యంతో టాటా ఇన్నోవేషన్ అబ్ ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
    user_Sattibabau dadala
    Sattibabau dadala
    Local News Reporter కొత్తపల్లె, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    36 min ago
  • పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై మంగళవారం ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది జగన్ మోహన్ రెడ్డియేనని ఆయన ఆరోపించారు, అందుకే ప్రజలు ఎన్నికల్లో 163 స్థానాల్లో వైసీపీకి కోలుకోలేని విధంగా కత్తిపోటు పొడిచి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే వైసీపీ నాయకులు కళ్లు మూసుకున్నారా అని వర్మ ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం ప్రజలను ఇబ్బంది పెడితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ₹4,000 పెన్షన్ ఇచ్చి దమ్ము చాటుకుందని ఆయన వివరించారు. ఇటీవల పిఠాపురంలో వైసీపీ నాయకులు చేసిన బైక్ ర్యాలీ సజావుగా సాగడానికి కూటమి ప్రభుత్వం వేసిన నాణ్యమైన రోడ్లే కారణమని వర్మ ఎద్దేవా చేశారు. గత వైసీపీ హయాంలో గుంతల్లో పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకునే వారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం ప్రజల పొట్ట కొడితే, తాము 'అన్న క్యాంటీన్ల' ద్వారా ఆకలి తీరుస్తున్నామని చెప్పారు. వైసీపీలా కాకుండా, కూటమి ప్రభుత్వంలో 'తల్లికి వందనం' పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ న్యాయం చేస్తున్నామని స్పష్టం చేశారు. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, 2029లో కూటమి మళ్లీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని, అప్పుడు వైసీపీకి ఈ 11 సీట్లు కూడా దక్కవని వర్మ హెచ్చరించారు.
    1
    పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.వి.ఎస్.ఎన్. వర్మ కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలపై మంగళవారం ఘాటుగా స్పందించారు. గత ఐదేళ్ల పాలనలో ప్రజలందరికీ వెన్నుపోటు పొడిచింది జగన్ మోహన్ రెడ్డియేనని ఆయన ఆరోపించారు, అందుకే ప్రజలు ఎన్నికల్లో 163 స్థానాల్లో వైసీపీకి కోలుకోలేని విధంగా కత్తిపోటు పొడిచి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నేతృత్వంలో రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు వస్తుంటే వైసీపీ నాయకులు కళ్లు మూసుకున్నారా అని వర్మ ప్రశ్నించారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం ప్రజలను ఇబ్బంది పెడితే, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ₹4,000 పెన్షన్ ఇచ్చి దమ్ము చాటుకుందని ఆయన వివరించారు. ఇటీవల పిఠాపురంలో వైసీపీ నాయకులు చేసిన బైక్ ర్యాలీ సజావుగా సాగడానికి కూటమి ప్రభుత్వం వేసిన నాణ్యమైన రోడ్లే కారణమని వర్మ ఎద్దేవా చేశారు. గత వైసీపీ హయాంలో గుంతల్లో పడి కాళ్లు, చేతులు విరగ్గొట్టుకునే వారని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గత ప్రభుత్వం ప్రజల పొట్ట కొడితే, తాము 'అన్న క్యాంటీన్ల' ద్వారా ఆకలి తీరుస్తున్నామని చెప్పారు. వైసీపీలా కాకుండా, కూటమి ప్రభుత్వంలో 'తల్లికి వందనం' పథకం ద్వారా ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికీ న్యాయం చేస్తున్నామని స్పష్టం చేశారు.

మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా, 2029లో కూటమి మళ్లీ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయమని, అప్పుడు వైసీపీకి ఈ 11 సీట్లు కూడా దక్కవని వర్మ హెచ్చరించారు.
    user_MANIKANTA SUVARNAM
    MANIKANTA SUVARNAM
    Local News Reporter పిఠాపురం, కాకినాడ, ఆంధ్రప్రదేశ్•
    18 hrs ago
  • కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలు విజయోత్సవాలు కావని, అవి కేవలం వైఫల్యాల సంబరాలని వైఎస్సార్‌సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్ తీవ్రంగా విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, వైద్యం, విద్య, రవాణా వంటి మౌలిక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకుండా కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించిన పరశురామ్, కేవలం ప్రచార కార్యక్రమాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని, ప్రజలు వాస్తవాలను నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    1
    కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహిస్తున్న వేడుకలు విజయోత్సవాలు కావని, అవి కేవలం వైఫల్యాల సంబరాలని వైఎస్సార్‌సీపీ డుంబ్రిగుడ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్ తీవ్రంగా విమర్శించారు. గిరిజన ప్రాంతాల్లో తాగునీరు, వైద్యం, విద్య, రవాణా వంటి మౌలిక సమస్యలు ఇప్పటికీ పరిష్కారం కాకుండా కొనసాగుతున్నాయని ఆయన స్పష్టం చేశారు.

ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించిన పరశురామ్, కేవలం ప్రచార కార్యక్రమాలతో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోలేరని, ప్రజలు వాస్తవాలను నిశితంగా గమనిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
    user_Nava surya
    Nava surya
    జర్నలిస్ట్ డుంబ్రిగూడ, అల్లూరి సీతారామ రాజు, ఆంధ్రప్రదేశ్•
    21 hrs ago
  • విశాఖపట్నంలోని జ్ఞానాపురం సత్యప్రకాశ్ మెడికల్ షాప్ సమీపంలో ఉన్న ఫుట్‌పాత్‌పై ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే అవర్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి పిల్లి గోవిందరాజు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతి చెందిన వ్యక్తి కంచరపాలెం హైవే ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీ అని, అధికంగా మద్యం సేవించడం వల్ల అతను మరణించినట్లు వెల్లడైంది. పిల్లి గోవిందరాజు పోలీసుల సమక్షంలో తన సొంత ఖర్చులతో ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు. ఆ అంబులెన్స్ ద్వారా ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యుల స్వస్థలానికి తరలించి, గోవిందరాజు తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
    1
    విశాఖపట్నంలోని జ్ఞానాపురం సత్యప్రకాశ్ మెడికల్ షాప్ సమీపంలో ఉన్న ఫుట్‌పాత్‌పై ఒక వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయం తెలియగానే అవర్ హాండ్స్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి పిల్లి గోవిందరాజు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు.

మృతి చెందిన వ్యక్తి కంచరపాలెం హైవే ప్రాంతానికి చెందిన రోజువారీ కూలీ అని, అధికంగా మద్యం సేవించడం వల్ల అతను మరణించినట్లు వెల్లడైంది. పిల్లి గోవిందరాజు పోలీసుల సమక్షంలో తన సొంత ఖర్చులతో ఒక అంబులెన్స్‌ను ఏర్పాటు చేశారు.

ఆ అంబులెన్స్ ద్వారా ఆ మృతదేహాన్ని కుటుంబ సభ్యుల స్వస్థలానికి తరలించి, గోవిందరాజు తన మానవతా దృక్పథాన్ని చాటుకున్నారు.
    user_Rc Tv Telugu
    Rc Tv Telugu
    Paderu, Alluri Sitharama Raju•
    16 hrs ago
View latest news on Shuru App
Download_Android
  • Terms & Conditions
  • Career
  • Privacy Policy
  • Blogs
Shuru, a product of Close App Private Limited.