కోతీరాంపూర్‌లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తాం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా జరిగాయి. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఘన స్వాగతం.. బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో.. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు
కోతీరాంపూర్‌లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తాం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా జరిగాయి. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఘన స్వాగతం.. బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో.. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు
- కరీంనగర్‌లో ఘనంగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ వార్షికోత్సవం, ఫ్రెషర్స్ పార్టీ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఒకేషనల్ జూనియర్ కాలేజ్ 20వ వార్షికోత్సవ వేడుకలతో పాటు ఫ్రెషర్స్ పార్టీని ఘనంగా నిర్వహించారు. సప్తగిరి కాలనీలోని వసుంధర గార్డెన్స్‌లో జరిగిన ఈ కార్యక్రమాన్ని సరస్వతి మాత చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఒకేషనల్ విద్య ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఎంతోమంది విద్యార్థులు ఒకేషనల్ విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదిగారని తెలిపారు.2
- 27వ డివిజన్‌లో ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ భవనం కూల్చివేతపై తీవ్ర ఆందోళన.బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ డిమాండ్ ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ కూల్చివేత భవనం ముందు ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో ధర్నా చేసిన బాధితులను పారమర్శించిన జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్. - కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలోని 27వ డివిజన్‌లో మున్సిపల్ అధికారులు, భవన యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (AIFB) జిల్లా ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడి 3 అంతస్తుల 'ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్' భవనాన్ని కూల్చివేసే క్రమంలో పక్కనే ఉన్న నివాస గృహాలకు భద్రత కల్పించడంలో సంబంధిత యాజమాన్యం తీవ్ర నిర్లక్ష్యం వహించింది. భవనం కూల్చివేత పనులు ప్రారంభమైన సమయంలోనే పక్కనున్న ఇళ్లపై ఇటుకలు, కాంక్రీట్ ముక్కలు పడుతున్న విషయాన్ని సంబంధిత వారికి తెలియజేసి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించినప్పటికీ ఏమాత్రం పట్టించుకోకుండా పనులు కొనసాగించారు. ఈ రోజు కూల్చివేత సమయంలో పెద్ద ఎత్తున ఇటుకలు, కాంక్రీట్ గోడ భాగాలు పక్కనే ఉన్న ఇంటిపై పడటంతో రేకులు తీవ్రంగా దెబ్బతిని, ఇంట్లోకి శిథిలాలు పడిపోయాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న ఒక మహిళకు ఇటుకలు తగిలి గాయాలయ్యాయి. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం తప్పినప్పటికీ, ఆ కుటుంబానికి భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత కంటే ఏ నిర్మాణ పనులూ ముఖ్యమైనవి కావు. పలుకుబడి లేదా అధికార పరిచయాలు ఉన్నాయనే భావనతో ప్రజల భద్రతను నిర్లక్ష్యం చేయడం ఏమాత్రం సమర్థనీయం కాదు. చట్టాలు – ఉల్లంఘనలు: నేషనల్ బిల్డింగ్ కోడ్ (NBC) & టౌన్ ప్లానింగ్ నిబంధనలు: బహుళ అంతస్తుల భవనాలను కూల్చివేసేటప్పుడు చుట్టుపక్కల ప్రజల రక్షణ కోసం ప్రామాణిక భద్రతా వలయాలు (Safety Nets), బారికేడ్లు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. భారతీయ నైయాయిక సంహిత (BNS) - సెక్షన్ 125 & 324: నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇతరుల ప్రాణాలకు ముప్పు తలపెట్టడం, ఇతరుల ఆస్తికి తీవ్ర నష్టం కలిగించడం చట్టరీత్యా క్రిమినల్ నేరం. మున్సిపల్ యాక్ట్ 2019: ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉంది. అధికారుల బాధ్యతారాహిత్యం: ప్రజల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని గత నెల 27నే మున్సిపల్ కమిషనర్‌కు పిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం శోచనీయం. స్థానిక కార్పొరేటర్ స్వయంగా టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లకు ఫోన్ చేసి పరిస్థితిని వివరించినా స్పందించకపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. సదరు అధికారులు లంచాల మత్తులో తూగుతూ ప్రజాసమస్యలను గాలికొదిలేశారని ఆరోపించారు. AIFB ప్రధాన డిమాండ్లు: 1. అధికారులు వెంటనే ఘటనాస్థలిని పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి బాధితులకు తక్షణ న్యాయం చేయాలి. 2. భద్రతా నిబంధనలు పాటించకుండా కూల్చివేతలు చేపట్టి, మహిళ గాయపడటానికి కారణమైన ఓల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ యాజమాన్యంపై చట్టపరమైన, క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. 3. దెబ్బతిన్న బాధిత కుటుంబ ఇంటిని తక్షణమే హాస్పిటల్ యాజమాన్యంతో ఉచితంగా పునర్నిర్మించి ఇవ్వాలి. 4. ప్రజా ఫిర్యాదులను నిర్లక్ష్యం చేసిన టౌన్ ప్లానింగ్ అధికారులు అశ్విని, శ్రీధర్‌లపై చట్టపరమైన, శాఖాపరమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. ప్రజల భద్రత విషయంలో రాజీపడేది లేదు. 27వ డివిజన్ ప్రజలకు న్యాయం జరిగే వరకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆధ్వర్యంలో బాధ్యతాయుతంగా మా పోరాటం కొనసాగుతుంది. ఈ కార్యక్రంలో డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.2
- మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ను సందర్శించిన జిల్లా ఎస్పీ. మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామ శివారులోని మిడ్ మ్యానేర్ బ్యాక్ వాటర్ ప్రాంతాన్ని ఈరోజు జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పోలీసు అధికారులతో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా బ్యాక్ వాటర్ ప్రాంతంలో పర్యాటకుల భద్రత కోసం చేపడుతున్న చర్యలను పరిశీలించారు.పర్యాటకుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. బ్యాక్ వాటర్ పరిసరాల్లోని ప్రమాదకర ప్రాంతాలను గుర్తించి, పర్యాటకులు ఆయా ప్రాంతాలకు వెళ్లకుండా అవసరమైన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, కుటుంబాలతో వచ్చే పర్యాటకుల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు ఆదేశించారు. పర్యాటకులు పోలీసుల సూచనలు, హెచ్చరికలను తప్పనిసరిగా పాటించాలని, నీటి ప్రాంతాలకు దూరంగా ఉండాలని, ప్రమాదకర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని, సరదా విషాధంగా మారకుండా చూసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సిబ్బంది ఉన్నారు.1
- కరీంనగర్ కిసాన్ నగర్ ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ తో సహా 7 గురు అరెస్టు...శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిక కరీంనగర్ లోని 29 వ డివిజన్ కిసాన్ నగర్ లో రెండు రోజుల క్రితం జరిగిన ఘర్షణ దాడి కేసులో కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ తో సహా ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రాజకీయ కక్షలతో కిసాన్ నగర్ లో గత కొంతకాలంగా బిఆర్ఎస్ బిజెపి కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో ఆదివారం రాత్రి బిజెపికి చెందిన కార్యకర్తలు టిఆర్ఎస్ కు చెందిన శ్రీకాంత్ శేఖర్ ల పై దాడి చేశారు. దాడిలో శ్రీకాంత్ కు రక్త గాయాలు కావడంతో శ్రీకాంత్ తో పాటు శేఖర్ ఫిర్యాదు మేరకు పోలీసులు స్థానిక కార్పొరేటర్ వేణు ప్రసాద్ తోపాటు నాగేందర్, మధు, భానుచందర్, వేణు, శశిధర్ పై హత్నాయత్నంతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఏడుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించామని అడిషనల్ డిసిపి వెంకటరమణ ప్రకటించారు.2
- తల్లిపాలపై అవగాహన కల్పించిన అంగన్వాడీ సిబ్బంది .... వడ్లూరులో తల్లిపాల వారోత్సవాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం వడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. శిశువు పుట్టిన వెంటనే తల్లిపాలు పట్టించడం, తొలి ఆరు నెలలు తల్లిపాలను మాత్రమే అందించడం ద్వారా బిడ్డ ఆరోగ్యంగా ఎదుగుతాడని వివరించారు. తల్లిపాలు శిశువుకు అవసరమైన పోషకాలను అందించడంతో పాటు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయని తెలిపారు. తల్లులు పోషకాహారం తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ పులి రమేష్, గ్రామ కార్యదర్శి పద్మ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, గర్భిణులు, బాలింతలు పాల్గొన్నారు.2
- అధ్వానంగా రోడ్డు..ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు:బీజేపీ నేతలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం నుంచి రూరల్ మండలంలోని జయవరం,మల్లారం,హన్మాజీపేట గ్రామాలకు వెళ్లే బ్రిడ్జి రోడ్డు అధ్వానంగా ఉందని బీజేపీ రూరల్ మండల బీజేపీ అధ్యక్షుడు పరమేశ్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.రోడ్డును బాగు చేయించి, అభివృద్ధి ప్రజలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ప్రధాని మోదీ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ లపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రోడ్డును బాగు చేయించి సమస్యల పరిష్కరించాలన్నారు.1
- భీమేశ్వర ఆలయంలో ఈవో ఆకస్మిక తనిఖీ భక్తుల సౌకర్యాలు, వసతులపై క్షేత్రస్థాయిలో పరిశీలన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం లో ఆలయ ఈవో ఎల్. రమాదేవి వివిధ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయంలో కొబ్బరికాయలు కొట్టే ప్రదేశానికి భక్తుల మాదిరిగా వెళ్లి అక్కడ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. భక్తులను డబ్బులు అడుగుతున్నారనే విషయంపై ఆరా తీసి, అక్కడి పరిస్థితులను భక్తులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా ఆలయంలో దీపాలు విక్రయించే ప్రదేశాన్ని పరిశీలించి, భక్తులకు నాణ్యమైన దీపాలు అందుతున్నాయా లేదా అనే విషయాన్ని పరిశీలించారు. విక్రయ కేంద్రాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. వికలాంగులు, చిన్నారులు, వృద్ధులు సులభంగా స్వామివారి దర్శనం చేసుకుంటున్నారా, వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయా అనే విషయాలను భక్తులను అడిగి తెలుసుకున్నారు. దర్శన ఏర్పాట్లను పరిశీలిస్తూ అవసరమైన సూచనలు చేశారు. ఆలయంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన ఈవో రమాదేవి గారు భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు, ఆలయ పరిసరాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ఈ తనిఖీలో డీఈఓ నవీన్, డి ఈ రామ్ కిషన్ రావు, ఆలయ పర్యవేక్షకులు శ్రీనివాస్ శర్మ, నరేందర్, ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.2
- కోతీరాంపూర్‌లో ఘనంగా మైసమ్మ తల్లి బోనాలు దసరా నాటికి నూతన ఆలయం నిర్మిస్తాం: ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కోతీరాంపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పక్కన వెలిసిన మైసమ్మ తల్లి బోనాల వేడుకలు మంగళవారం కన్నులపండువగా జరిగాయి. సరస్వతి నగర్, గిద్దె పెరుమాండ్ల కాలనీవాసులు, స్థానిక మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఘన స్వాగతం.. బోనం ఎత్తుకున్న ఎమ్మెల్యే బోనాల వేడుకకు విచ్చేసిన ఎమ్మెల్యే గంగులకు స్థానిక కాలనీవాసులు ఘనంగా స్వాగతం పలికారు. భక్తులు ఆయనకు నుదుటిన తిలకం దిద్ది, మంగళహారతి ఇచ్చి, శాలువాతో సత్కరించారు. అనంతరం అమ్మవారి బోనం ఎత్తుకున్న గంగుల.. ఆలయం వరకు నడుచుకుంటూ వెళ్లి కొబ్బరికాయ కొట్టి మొక్కులు చెల్లించారు. శివశక్తుల పూనకాల మధ్య సాగిన ఈ వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో కోలాహలంగా సాగాయి. అమ్మవారి పూనకం వచ్చిన మహిళా భక్తురాలు అక్కడ శాశ్వత ప్రాతిపదికన ఆలయం నిర్మించాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్.. వచ్చే దసరా పండుగ నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయాన్ని నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఎల్లమ్మ తల్లి కలలో వచ్చి స్థానిక పెంట కుప్పలో వెలిశానని తెలపడంతో.. కాలనీవాసులందరూ కలిసి అమ్మవారిని ప్రతిష్టించుకున్నట్లు తెలిపారు. ఈ వేడుకల్లో భాగంగా భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి, యాట పిల్లలతో తమ మొక్కులను చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి అనూప్ కుమార్ పాల్గొన్నారు. వీరితో పాటు బీఆర్ఎస్ నాయకులు మిడిదొడ్డి నవీన్, పబ్బతి శ్రీనివాస్ రెడ్డి, జీపీ స్వామి, స్థానిక కాలనీవాసులు ఎల్లయ్య, బాల్ రెడ్డి, శేఖర్, సుధాకర్, మల్లయ్య తదితరులు పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు1